Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

Jaahnavi Kandula's Death Case: జాహ్నవి కందుల మృతి కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు, ఆ పోలీస్‌పై ఎలాంటి చర్యలు ఉండబోవని వెల్లడి, భారత్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన కేటీఆర్


TELUGU

Question

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన సియాటిల్ పోలీసు అధికారి "తగినంత" సాక్ష్యాలు లేని కారణంగా ఎటువంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని (Will Not Face Criminal Charges) అధికారులు తెలిపారు.

Indian Student Jaahnavi Kandula Died by Police Patrol Car this Year

Indian-Student-Jaahnavi-Kandula-Died-by-

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో గతేడాది మృతి (Jaahnavi Kandula's Death Case) చెందిన సంగతి విదితమే. రోడ్డు దాటుతున్న ఆమెను.. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి (Seattle Police Officer) కెవిన్ డేవ్‌ చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్‌.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది.

ఇదిలా ఉంటే భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన సియాటిల్ పోలీసు అధికారి "తగినంత" సాక్ష్యాలు లేని కారణంగా ఎటువంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని (Will Not Face Criminal Charges) అధికారులు తెలిపారు.బుధవారం, కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం సీటెల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్‌పై నేరారోపణలతో ముందుకు సాగబోమని FOX13 సీటెల్ నివేదించింది.

బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ, "కందుల మరణం హృదయ విదారకంగా ఉంది మరియు కింగ్ కౌంటీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలను ప్రభావితం చేసింది.కందుల, 23, జనవరి 23న సీటెల్‌లోని ఒక వీధిని దాటుతున్నప్పుడు ఆఫీసర్ డేవ్ నడుపుతున్న పోలీసు వాహనం ఢీకొట్టింది. అతను డ్రగ్ ఓవర్ డోస్ కాల్ రిపోర్ట్‌కి వెళ్లే మార్గంలో 74 mph (119 kmh కంటే ఎక్కువ) డ్రైవ్ చేస్తున్నాడు. వేగంగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో కందుల 100 అడుగుల మేర కిందపడిపోయింది.

సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన బాడీక్యామ్ ఫుటేజ్‌లో, అధికారి డేనియల్ ఆడెరర్ ఘోరమైన క్రాష్ గురించి నవ్వుతూ డేవ్ తప్పు చేసి ఉండవచ్చు లేదా నేర పరిశోధన అవసరమని తోసిపుచ్చారు.కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ లీసా మానియన్ మాట్లాడుతూ, ఒక క్రిమినల్ కేసును సహేతుకమైన సందేహానికి మించి రుజువు చేయడానికి తమ వద్ద ఆధారాలు లేవని తాను నమ్ముతున్నట్లు నివేదిక జోడించింది.

ఈ క్రమంలో అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు కామెంట్స్‌ను కేటీఆర్‌ ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు వ్యాఖ్యలు చేసింది. అతడిపై ఎలాంటి చర్యలు ఉండబోవని తెలిపింది. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి.

...

Complete article

Link to comment
Share on other sites

8 answers to this question

Recommended Posts

  • 0

Jahnavi USA: అమెరికాలో జాహ్నవి మృతి కేసు తీర్పుపై కేటీఆర్ స్పందన.. జయశంకర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

రోడ్డు దాటుతుండగా జాహ్నవిని ఢీకొన్న పోలీసు వాహనం

అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన జాహ్నవి

ఢీకొట్టిన పోలీసు అధికారిపై సరైన ఆధారాలు లేవన్న అమెరికా కోర్టు

cr-20240222tn65d767dc1f9eb.jpg

కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) అమెరికా సియాటెల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది రోడ్డు దాటుతున్న ఆమెను పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి కెవిన్ డేవ్ చులకనగా మాట్లాడటం అమెరికాలో కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై భారత ప్రభుత్వం సీరియస్ గా ప్రతిస్పందించింది. సదరు అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీస్ వాహనం బలంగా ఢీకొనడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయిందని సియాటెల్ పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. 

అయితే జాహ్నవిని ఢీకొట్టి చంపిన పోలీసు అధికారిపై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆయనపై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ... ఈ అంశంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ వెంటనే జోక్యం చేసుకుని... అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి... ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jahnavi Kandula: జాహ్నవి కందుల కేసుపై రివ్యూ కోరిన భారత్

సాక్ష్యాల్లేవంటూ పోలీస్ అధికారిని తప్పించడంపై అసంతృప్తి

జాహ్నవి కుటుంబ సభ్యులతో రాయబార కార్యాలయం సంప్రదింపులు

సియాటెల్ పోలీస్ ఉన్నతాధికారులతోనూ చర్చలు

cr-20240224tn65d981476b5de.jpg

జాహ్నవి కందుల మరణానికి కారణమైన పోలీస్ ఆఫీసర్ ను క్రిమినల్ చర్యల నుంచి తప్పించడంపై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. సియాటెల్ సిటీ అటార్నీ తీర్పుపై రివ్యూ కోరింది. కౌంటీ అటార్నీ రివ్యూ తర్వాత అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ప్రమాదంపై మరింత లోతుగా విచారించాలంటూ సియాటెల్ పోలీస్ ఉన్నతాధికారులను కోరినట్లు రాయబార కార్యాలయం సిబ్బంది తెలిపారు. జాహ్నవి కుటుంబ సభ్యులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ఈమేరకు రాయబార కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

అమెరికాలోని సియాటెల్ లో మాస్టర్స్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ యువతి జాహ్నవి కందుల గతేడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోల్ కారు వేగంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ నిర్లక్ష్యం, కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది. అయితే, ఈ ప్రమాదంలో కెవిన్ డేవ్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని, అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోలేమని అక్కడి కోర్టు తీర్పు వెలువరించింది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

New body cam footage captures moments when officer hit and killed pedestrian | FOX 13 Seattle

 

Link to comment
Share on other sites

  • 0

No charges for Seattle Police officer who hit, killed woman in 2023 | FOX 13 Seattle

 

Link to comment
Share on other sites

  • 0

Cops don’t become psychopaths - psychopaths become cops!

The cop who mocked student's death was investigated 18 times!

Racism, Assault, Abuse: History of Seattle Cop Who Mocked Indian Student's Death | The Quin

 

Link to comment
Share on other sites

  • 0

US Police fired: భారత విద్యార్థిని జాహ్నవి మృతిపై ఎగతాళిగా మాట్లాడి, నవ్విన US పోలీసు.. ఊడిన ఉద్యోగం

ఆడెరర్ మాటలు కుటుంబానికి కలిగించాయి.. ఆ మాటలు తాము చెరిపివేయలేము. అయితే ఒకరి చావుని ఎగతాళి చేస్తూ మాట్లాడిన పోలీసు అధికారి చర్యలు సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కు మాత్రమే కాదు మొత్తం పోలీసు వృత్తికే అవమానం కలిగించాయని.. ఈ వ్యాఖ్యలు ప్రతి పోలీసు అధికారి పనిని మరింత కష్టతరం చేసిందని రహర్ పేర్కొన్నారు.

us-cop-fired.jpg?w=1280

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థి కందుల జాహ్నవి మృతి తర్వాత అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీసు అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ వ్యక్తుల జీవితం జీవితం కాదన్నట్లు ఆడెరర్ చేసిన వ్యాఖ్యలు.. నవ్విన నవ్వు మృతురాలి కుటుంబ సభ్యులను మాత్రమే కాదు ప్రతి ఒక్కరి మనసుని గాయపరిచేలా ఉన్నాయని సియాటెల్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ సూ రహర్ పేర్కొన్నారు. ఆడెరర్ మాటలు కుటుంబానికి కలిగించాయి.. ఆ మాటలు తాము చెరిపివేయలేము. అయితే ఒకరి చావుని ఎగతాళి చేస్తూ మాట్లాడిన పోలీసు అధికారి చర్యలు సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కు మాత్రమే కాదు మొత్తం పోలీసు వృత్తికే అవమానం కలిగించాయని.. ఈ వ్యాఖ్యలు ప్రతి పోలీసు అధికారి పనిని మరింత కష్టతరం చేసిందని రహర్ పేర్కొన్నారు.

అసలు ఏమి జరిగిందంటే..

2023 జనవరి 23న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి వీధి దాటుతుండగా సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీ కొట్టింది. వేగంగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో జాహ్నవి 100 అడుగుల మేర కిందపడిపోయింది. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ స్పందిస్తూ జాహ్నవి మరణంపై చాలా హేళనగా మాట్లాడడమే కాదు నవ్విన వీడియో ఒకటి ఆ మధ్య వైరల్‌ అయ్యింది. జాహ్నవి ఓ సాధారణ వ్యక్తి.. అసలు మరణానికి విలువలేదు’ అని అడెరెర్‌ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. అప్పుడు ఆ పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్‌ చేసింది. వెంటనే అడెరెర్‌ ను అప్పుడు సస్పెండ్‌ చేయగా.. తాజాగా అతనిపై తుది చర్యలు తీసుకున్నారు.

పోలీసులకే అగౌరవం..

జాహ్నవి మృతిపై తమ డిపార్ట్మెంట్ అధికారి అడెరెర్‌ చేసిన వ్యాఖ్యలు మృతురాలి కుటుంబాన్ని తీవ్రంగా గాయపరచడమే కాదు సియాటెల్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు మాయని మచ్చగా మారాయని పోలీసు డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ సూ రహర్ చెప్పారు. ప్రజల కోసం పోలీసు అధికారులు అని.. వారి విశ్వాసం కోల్పోకూడదని చెప్పారు. కనుక తప్పని సరిగా పోలీసులు ఉన్నత ప్రమాణాలను పాటించాలి.. ఈ నేపథ్యంలో అడెరెర్‌ను పోలీసు అధికారిగా విధుల్లో కొనసాగించడం డిపార్ట్‌మెంట్‌కే అగౌరవమని చెప్పారు. అందుకే ఆయన్ని ఉద్యోగంలో నుంచి తొలగించి నట్లు ఆయన స్పష్టం చేశారు.

Just in: Seattle Police officer, Daniel Auderer who was caught on body camera last year laughing about the death of an Indian Student, Jaahnavi Kandula has been terminated, says US media.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...