Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 1

Anant Ambani's wedding


TELUGU

Question

జులైలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం

మార్చి 1 నుంచి మూడు రోజులపాటు ముందస్తు పెళ్లి వేడుకలు

అతిథుల కోసం సకల సదుపాయాలతో అల్ట్రా-లగ్జరీ టెంట్‌ల ఏర్పాటు

అతిథుల్లో అన్ని రంగాల ప్రముఖులు

cr-20240226tn65dc1988e7dee.jpg

ముకేశ్ అంబానీ-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో వేరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ దంపతుల చిన్న కుమార్తె రాధికా మర్చంట్ వివాహం జులైలో జరగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజులపాటు ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. జామ్‌నగర్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లు లేకపోవడంతో వేడుకల కోసం అల్ట్రా-లగ్జరీ టెంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో అతిథుల కోసం బాత్రూములు సహా సకల సదుపాయాలు ఉంటాయి.

ముందస్తు పెళ్లి వేడుకకు హాజరయ్యే అతిథులు వీరే
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ నటులు, క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, బిల్‌గేట్స్, సుందర్ పిచాయ్, శంతను నారాయణ్, వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, గౌతం అదానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, నందన్ నీలేకని, సంజీవ్ గోయెంకా, రిషద్ ప్రేమ్‌జీ, ఉదయ్ కోటక్ తదితరులు హాజరుకానున్నారు. వేడుకల్లో హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నాతోపాటు, దిల్జీత్ దోసాన్జ్, ఇతర గాయకులు ప్రదర్శనలిస్తారు. అతిథుల కోసం ఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • Answers 34
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • TELUGU

    13

  • Sanjiv

    12

  • Vijay

    10

Top Posters For This Question

Recommended Posts

  • 0

Anant Radhika Wedding Card: Check Out Anant Ambani-Radhika Merchant’s Extravagant Wedding Card

 

Link to comment
Share on other sites

  • 0

Anant Ambani-Radhika Wedding schedule: అనంత్‌ అంబానీ-రాధికల 3 రోజుల గ్రాండ్‌ వెడ్డింగ్‌.. షెడ్యూల్ ఇదే!

ప్రీ వెడ్డింగ్ వేడుకలు, 'సామూహిక వివాహ' తర్వాత, అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోనున్నారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహ వేడుక జరగనుంది. మేలో వార్తా సంస్థ ANI తన అధికారిక హ్యాండిల్‌లో అనంత్ - రాధికల వివాహ ఆహ్వాన కార్డు చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఇప్పుడు 12 నుండి 14 వరకు ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ..

Anant Ambani Radhika

anant-ambani-radhika.jpg?w=1280

ప్రీ వెడ్డింగ్ వేడుకలు, ‘సామూహిక వివాహ’ తర్వాత, అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోనున్నారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహ వేడుక జరగనుంది. మేలో వార్తా సంస్థ ANI తన అధికారిక హ్యాండిల్‌లో అనంత్ – రాధికల వివాహ ఆహ్వాన కార్డు చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఇప్పుడు 12 నుండి 14 వరకు ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ, మొత్తం వివాహ ప్రోగ్రామ్ షెడ్యూల్ తెలుసుకోండి.

అనంత్-రాధిక వివాహ షెడ్యూల్:

అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ పెళ్లి షెడ్యూల్ బయటకు వచ్చింది. ఈ కార్యక్రమం మొత్తం 12 నుంచి 14వ తేదీ వరకు జరగనుంది.

  1. జూలై 12: ఈ రోజు అనంత్ రాధిక వివాహ వేడుక. ఈ రోజున ఇద్దరూ ఆచారాలతో వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే రోజు ప్రధాన వివాహ వేడుకకు అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించనున్నారు.
     
  2. జూలై 13: శుభ అస్బర్వాద్ లేదా దైవిక ఆశీర్వాద కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భారతీయ దుస్తులు కోడ్ అధికారికంగా ఉంటుంది.
     
  3. జూలై 14: మంగళ్ ఉత్సవ్ అంటే వివాహ రిసెప్షన్ ఈ రోజున ఉంటుంది. దీనికి చిక్ థీమ్ డ్రెస్ కోడ్ ఫిక్స్ చేయబడింది.

మామెర వేడుక:

ముఖేష్‌ – నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ను జూలై 12, 2024న ముంబైలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు. వివాహ వేడుకలు జూన్‌లో అంబానీ కుటుంబ ఇంటి అయిన యాంటిలియాలో కుటుంబ పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. అనంత్-రాధికల వ్యవహారం నిన్నటితో నిండిపోయింది.

అడెలె, డ్రేక్, లానా డెల్ రే, జస్టిన్ బీబర్ ప్రదర్శన ఇస్తారా?

జామ్‌నగర్‌లో జరిగిన వివాహానికి ముందు జరిగిన ఉత్సవాల్లో రిహన్న, ఎకాన్ ప్రదర్శనలు ఇచ్చారు. అయితే బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్, పిట్‌బుల్, ఇటాలియన్ ఒపెరా సింగర్ ఆండ్రియా బోసెల్లి వంటి గాయకులు క్రూయిజ్ వేడుకలో తమ మంత్రముగ్దులను చేసే ప్రదర్శనలతో అతిథులను అలరించారు. అడెలె, డ్రేక్, లానా డెల్ రే వంటి గాయకులు పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తాజా నివేదిక వెల్లడించింది. వివాహ వేడుకలో ఈ కళాకారుల ప్రదర్శన తేదీలను ఫిక్స్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. దీనితో పాటు జస్టిన్ బీబర్ కూడా ముంబైకి చేరుకున్నారు.

Link to comment
Share on other sites

  • 0

Justin Bieber Headlines Ambani Wedding Festivities with $10 Million Gig

Justin Bieber is going to play at Anant Ambani and Radhika Merchant's wedding on Friday. Pictures and videos of the artist arriving in Mumbai were going around social media. July 12 at the Jio World Convention Centre in Bandra Kurla Complex (BKC), Mumbai, the pair will tie the knot.

justin040724_1.jpg

Justin's automobile could be seen in Mumbai in a video posted by a paparazzo. Other musicians including Adele, Drake, and Lana Del Rey are also under negotiations to perform at the wedding celebrations, according to reports from India Today.

A Portuguese portal claims that Justin Bieber's performance is earning the Ambani family $10 million. The Ambani family recently held a grand mameru ceremony, a Gujarati custom whereby the bride's maternal uncle sends sweets and gifts. Attending the ceremony were Mukesh Ambani, Nita Ambani, Akash Ambani with wife Shloka, Anant and Radhika, and Isha Ambani with husband Anand Piramal.

justin040724_3.jpg

Golden lights and crimson, pink, orange flowers tastefully adorned the Ambani house. Comprising caricatures of Anant and Radhika, a digital screen displayed a message saying, "All the best."

One particularly noteworthy feature of the wedding preparations is a chaat stand from the renowned Kashi Chaat Bhandaar in Varanasi. Following a visit last month to the Kashi Vishwanath Temple, Nita Ambani personally invited Rakesh Keshari, the proprietor of the shop.

justin040724_2.jpg

Apart from their celebration of marriage, the Ambani family planned a mass wedding for the less fortunate on July 2 in Swami Vivekanand Vidyamandir in Palghar. Starting the Shubh Vivah (wedding celebration) on July 12, the primary ceremonies will then start at Shubh Aashirwad on July 13, and finish with Mangal Utsav, the wedding reception, on July 14.

Link to comment
Share on other sites

  • 0

50 marriages for poor couples: అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ రాధికా మర్చెంట్‌ పెళ్లి సందడి మొదలైంది. వేడుకల్లో భాగంగా మంగళవారం పేద కుటుంబాల్లోని 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. ముంబయి సమీపంలోని రిలయన్స్‌ కార్పొరేట్ పార్క్‌ ఇందుకు వేదికైంది. దీనికి ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్‌, కోడలు శ్లోక, కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్‌ హాజరయ్యారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ రాధికా మర్చెంట్‌ పెళ్లి సందడి మొదలైంది. వేడుకల్లో భాగంగా మంగళవారం పేద కుటుంబాల్లోని 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. ముంబయి సమీపంలోని రిలయన్స్‌ కార్పొరేట్ పార్క్‌ ఇందుకు వేదికైంది. దీనికి ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్‌, కోడలు శ్లోక, కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్‌ హాజరయ్యారు. అలాగే కొత్త జంటల తరఫున కొందరు బంధువులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రాబోయే రోజుల్లో ఇలా మరిన్ని వివాహాలు జరిపిస్తామని ముకేశ్‌ కుటుంబం పేర్కొంది.

ఈ సందర్భంగా కొత్త జంటలకు భారీగా కానుకలు అందాయి. బంగారు మంగళసూత్రం, వివాహ ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెకు స్త్రీ ధనం కింద రూ.1.01 లక్షల చెక్‌ అందించారు. అంతేగాకుండా ఒక ఏడాదికి సరిపడా సరకులు అందజేశారు. గ్యాస్‌ స్టవ్, మిక్సీ, ఫ్యాన్‌, పరుపులు, దిండ్లు, గిన్నెలు కూడా ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అతిథులందరికి భారీ విందు ఏర్పాటుచేశారు. నూతన దంపతులు ముకేశ్‌-నీతా వద్ద ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Link to comment
Share on other sites

  • 0

Anant-Radhika: అనంత్-రాధిక కచేరీలో బాలీవుడ్ తారలు.. ఫోటోలకు పోజులిచ్చిన స్టార్స్‌

శుక్రవారం రాత్రి అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ కచేరీ జరిగింది. ఇందులో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ కలిసి చాలా అందంగా కనిపించారు. సంగీత్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వారు మొదట ఛాయాచిత్రకారుల కోసం పోజులిచ్చారు.

bollywood-stars-1.jpg?w=1280&enlarge=tru

శుక్రవారం రాత్రి అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ కచేరీ జరిగింది. ఇందులో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ కలిసి చాలా అందంగా కనిపించారు. సంగీత్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వారు మొదట ఛాయాచిత్రకారుల కోసం పోజులిచ్చారు.

bollywood-stars-2.jpg

ఈ సంగీత్ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ అందరూ మరోసారి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ బ్లాక్ సూట్‌లో వచ్చాడు. సల్మాన్ ఖాన్ సంగీతంలో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.

bollywood-stars-3.jpg

మాధురీ దీక్షిత్ తన భర్త రామ్ నేనేతో కలిసి అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ కచేరీకి హాజరయ్యారు.

bollywood-stars-4.jpg

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ కచేరీకి షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ కూడా వచ్చారు. మీరా రాజ్‌పుత్ అబ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతని ఫిట్‌నెస్ గురించి సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.

bollywood-stars-5.jpg

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ సంగీత వేడుకకు రితీష్ దేశ్‌ముఖ్‌తో పాటు భార్య జెనీలియా హాజరయ్యారు. ఈ జోడీ అందరికి ఇష్టమైనది.

bollywood-stars-6.jpg

భర్త రణబీర్ కపూర్, సోదరి షాహీన్ భట్‌తో కలిసి అలియా భట్ వచ్చింది. అతనితో పాటు ఆదిత్య రాయ్ కపూర్ కూడా కనిపించాడు.

bollywood-stars-7.jpg

విద్యాబాలన్ భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో కలిసి అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ సంగీత కచేరీకి వచ్చారు.

bollywood-stars-8.jpg

ఈ సంగీత వేడుకలో జాన్వీ కపూర్ హాజరయ్యారు. దీనితో పాటు, అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ సంగీత వేడుకలో సోదరి ఖుషీ కపూర్ ఈ శైలిలో హృదయాలను గెలుచుకుంది.

bollywood-stars-9.jpg

మౌని రాయ్, దిశా పటానీ ఈ సంగీత వేడుకకు చేతులు పట్టుకుని వచ్చారు. మౌని రాయ్ చాలా గ్లామర్‌గా కనిపించింది. అందరి కళ్ళు ఆమెపైనే ఉన్నాయి.

bollywood-stars-10.jpg

రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఈ సంగీత వేడుకకు ఈ వేడుకలో బాలీవుడ్‌ స్టార్స్‌ అందరిని ఆకట్టుకున్నారు.

Link to comment
Share on other sites

  • 0

Anant Ambani Wedding: గ్రాండ్‌గా అనంత్ అంబానీ- రాధికల సంగీత్.. సందడి చేసిన అందాల తారలు.. ఫొటోస్ చూశారా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ల వివాహానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా సాగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

anant-ambani-wedinng-1.jpg?w=1280&enlarg

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ల వివాహానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా సాగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి

anant-ambani-wedinng-2.jpg

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి ముందు జరిగిన సంగీత్ వేడుకలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సీనియర నటి కాజల్ మొదలుకుని నుంచి ఆలియా భట్ వరకు అందరూ కలర ఫుల్ డ్రెస్సుల్లో కనిపించారు.

anant-ambani-wedinng-3.jpg

అనంత్ అంబానీ- రాధికల సంగీత్ వేడుకలకు హాజరైన వారిలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, ఖుషి కపూర్, సారా అలీఖాన్, అనన్యా పాండే తదితరులు ఉన్నారు

anant-ambani-wedinng-4.jpg

ఇక రితేశ్ దేశ్ ముఖ్- జెనీలియా, రకుల్- జాకీ భగ్నానీ, సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ, రణ్ బీర్ కపూర- అలియాలు సతీ సమేతంగా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నారు.

anant-ambani-wedinng-5.jpg

ఇక టాలీవుడ్ నుంచి కాజల్ అగర్వాల్, భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఈ సంగీత్ పార్టీకి వచ్చింది. అలాగే చాలా రోజుల తర్వాత క్రికెటర్ కేఎల్ రాహుల్, అతని భార్య, బాలీవుడ్ నటి అతియా శెట్టి ఓ వేడుకలో కనిపించారు.

anant-ambani-wedinng-6.jpg

సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, ఆదిత్య రాయ్ కపూర్ తదితర సినిమా సెలబ్రిటీలతో పాటు పలువురు క్రికెటర్లు ఈ సంగీత్ వేడుకలో సందడి చేశారు.

Link to comment
Share on other sites

  • 0

Ambani wedding: పది కాలాలు కాదు.. అనంత కాలాలు గుర్తుండేలా అంబానీ ఇంట పెళ్లి వేడుకలు

అపర కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి సందడి అంటే మామూలుగా ఉండదు. ప్రతిదీ అట్టహాసంగా జరుగుతుంది. ప్రపంచమంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి అన్నట్టుగా... అంబానీ ఇంట్లో పెళ్లి సందడి జరుగుతోంది. ఆ వేడుకకు సంబంధించిన ప్రతి చిన్న విషయం చర్చనీయాంశంగా మారుతుంది. ఎంతమందిని పిలిచారు? ఎన్ని కోట్లు ఖర్చు అయింది? ఎన్ని వందల రకాల వంటలు వండారు? నూతన వధూవరులు ఎలాంటి వెడ్డింగ్ డ్రెస్ వేసుకున్నారు. అబ్బో ప్రతీది హాట్టాపికే.

Anant Ambani with his fiancée Radhika Merchant

anant-ambani-wedding.jpg?w=1280

రాధిక-అనంత్‌ల కల్యాణం.. కనులకు వైభోగం!.  ప్రస్తుతం ప్రపంచమంతా ‘జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’ వైపే చూస్తోంది. ఎందుకంటే అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్ల పెళ్లి వేదిక ఇది. పెళ్లంటే పది కాలాల పాటు గుర్తుంచుకునేలా ఘనంగా జరిపించాలంటారు పెద్దలు. పది కాలాలు కాదు.. అనంత కాలాల పాటు గుర్తుంచుకునేలా అనంత్‌-రాధికల పెళ్లి వేడుక జరుగుతోంది. భూలోక స్వర్గాన్ని తలపించేలా ఏర్పాట్లు… అతిథులకు విందు, వినోదం!.  ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న అతిరథ మహారథులు!

అపర కుబేరుడు అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మాటలా.! ప్రీ వెడ్డింగ్‌ వేడుకలే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట వేసినట్టుగా సాగుతున్నాయి. అనంత్‌ అంబానీ తన చిరకాల ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముహూర్తం సమీపిస్తుండటంతో పెళ్లి వేడుకలోని కీలక ఘట్టాలు ఒక్కొక్కటీ వైభవంగా మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా అనంత్ అంబానీ పెళ్లి గురించే మాట్లాడుతోంది. గుజరాతీ వివాహాల్లో తొలుతగా నిర్వహించే ఆచారాలను ఇరు కుటుంబాలు పాటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ముంబైలోని యాంటిలియాలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల మామేరు వేడుక ఘనంగా జరిగింది. వరుడి మేనమామలు, వారి కుటుంబ సభ్యులు కలిసి కాబోయే వధూవరులకు కానుకలిచ్చి వారిని ఆశీర్వదించే వేడుకే ఇది!

నీతా అంబానీ పుట్టింటి వారు ‘మామెరు’ వేడుకలో ముఖ్యపాత్ర పోషించారు. నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె చెల్లి మమతా దలాల్ వరుడి ఇంటికి వచ్చి బహుమతులు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే వధువు రాధికా మర్చంట్ మేనమామ కుటుంబ సభ్యులు కూడా కాబోయే దంపతులను ఆశీర్వదించి సంప్రదాయ బహుమతులను అందజేశారు. అనంత్, రాధిక ‘మామెరు’ వేడుక కోసం అంబానీ నివాస భవనం యాంటిలియాను అందంగా తీర్చిదిద్దారు. ఎరుపు, గులాబీ, నారింజ పూలతో అలంకరించారు. దీని అందాన్ని మరింత పెంచేందుకు బంగారు దీపాలు కూడా ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలో అంబానీ ఫ్యామిలీ మొత్తం గుజరాతీ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. మామేరు వేడుకలో రాధిక తన స్టయిలిష్‌ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంది. ఇషా అంబానీ ఫ్యామిలీ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇషా- ఆనంద్‌ జంట తమ పిల్లలతో ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఇక అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా కూడా అందంగా ముస్తాబై అందరినీ ఆకర్షించింది. ఇక సాధారణంగానే అంబానీ ఇంట పండగైనా, పూజైనా.. తారలంతా ఇక్కడ వాలిపోతారు. అలాంటిది పెళ్లంటే.. వాళ్లు చేసే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా నిర్వహించిన ‘సంగీత్‌ వేడుక’లో ఇదే రిపీటైంది. కొత్త జంటతో కలిసి అంబానీ ఫ్యామిలీ.. ‘ఓమ్‌ శాంతి ఓమ్’ సినిమాలోని ‘దీవాంగీ దీవాంగీ’ అనే పాటకు డ్యాన్స్‌ చేసి అదరగొట్టింది.

అంబానీ ఫ్యామిలీ అంతా డ్యాన్స్‌ చేయడం ఈ వేడుకలో అన్నింటికన్నా హైలైట్‌గా నిలిచింది. అనంత్‌ బాలీవుడ్‌ స్టార్స్‌తో స్టెప్పులేయడం కొసమెరుపు. ఇక గ్లోబల్‌ పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌ పెర్ఫార్మెన్స్‌ కూడా ఈ వేడుకలో హైలైట్‌గా నిలిచింది. బీబ‌ర్ మైక్ అందుకుని పాట‌లు పాడుతూ డాన్సులు చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ స్పాట్ లైట్ న‌డుమ ఓ ఊపు ఊపేసాడు. బాలీవుడ్ సెల‌బ్రిటీలైతే బీబ‌ర్ పెర్పార్మెన్స్ కి ఫిదా అయిపోయారు. బాలీవుడ్‌ సింగర్‌ బాద్‌షా తన పాటలతో అతిథుల్లో జోష్‌ నింపాడు. వారితో మమేకమై పాటలు ఆలపించాడు. ఇక ఈ వేడుకలో థీమ్‌కు తగినట్లే మోడ్రన్‌ దుస్తుల్లో మెరిసిపోయారు కాబోయే వధూవరులు, వారి కుటుంబ సభ్యులు. మరోవైపు అతిథులూ స్టైలిష్‌ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.

ఈ సంగీత్ వేడుకలో ముంబై ఇండియన్స్ క్రికెటర్లు సందడి చేశారు. టీ20 ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ముగ్గురిపై అంబానీ ఫ్యామిలీ ప్రశంసల వర్షం కురిపించింది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ కోసం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ ముగ్గురికి గుమ్మడికాయపై కర్పూరం వెలిగించి దిష్టితీశారు. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యను సాదరంగా వేదికపైకి ఆహ్వానించిన నీతా అంబానీ.. ఆత్మీయంగా హత్తుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇక ఇప్పటివరకు అనంత్-రాధిక వివాహానికి సంబంధించిన ప్రతి వేడుకలోనూ దేశ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రతి వేడుక ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. అనంత్- రాధిక వివాహ కార్యక్రమంలో భాగంగా ఈనెల 2న పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించింది. ఈ కొత్త జంటలకు భారీగా కానుకలు అందాయి. బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెకు రూ.1.01 లక్షల చెక్‌ ను అందించారు.

జులై 12న శుభ్‌ వివాహ్‌తో అనంత్‌ అంబానీ, రాధిక మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి పెళ్లిపీటలపై అనంత్- రాధిక కూర్చోనున్నారు. జులై 13న శుభ్ ఆశీర్వాద్‌ వేడుక జరగనుంది. జులై 14న వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు హాజరయ్యే అతిథులందరూ ఇండియన్ చిక్ దుస్తులను ధరించనున్నారు. ఈ వివాహ వేడుకకు సినీ తారలు, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. అనంత్-రాధిక సంగీత్ కార్యక్రమంలో వారి ప్రేమ కథను వర్ణించే నృత్య ప్రదర్శనను చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సంగీత్ కార్యక్రమంలో అనంత్-రాధిక స్నేహితుల నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక ముచ్చట్లు చూస్తున్నా, ఎంత వింటున్నా.. తనివి తీరడం లేదు. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికే కాదు.. ఆహ్వాన పత్రిక కూడా హైలేటే. వీళ్ల పెళ్లికి అంబానీ కుటుంబం ఓ స్పెషల్ వెడ్డింగ్ కార్డును తయారుచేయించారు. అందులో వెండితో చేసిన చిన్న గుడి, అందులో బంగారు విగ్రహం కనిపిస్తున్నాయి. పెళ్లి కార్డుకు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాక్ గ్రౌండ్‌లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపించేలా ఏర్పాటు చేశారు. ఆలయంలో కాకుండా ఇతర బాక్సుల్లోనే బంగారంతో చేసిన దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. పెళ్లి కార్డులో వినాయకుడు, శ్రీవిష్ణువు, లక్ష్మీదేవి, రాధా- కృష్ణ, దుర్గాదేవి వంటి దేవుళ్ల చిత్రాలు కనిపిస్తున్నాయి. ఎరుపు, బంగారు వర్ణంలో రూపొందించిన వెడ్డింగ్‌ కార్డు ఆకట్టుకుంటుంది. ఇటీవల ఈ వెడ్డింగ్ కార్డును కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు నీతా అంబానీ. ఆ తర్వాత సన్నిహితులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఆహ్వాన పత్రికలు అందిస్తూ పెళ్లికి పిలుస్తోంది అంబానీ కుటుంబం.

5M likes on Justin Beiber's insta

https://www.instagram.com/p/C9GAOBRoO00

Link to comment
Share on other sites

  • 0

A wedding costing 5000 crore rupees or $600M is enough to host 10 Oscar ceremonies in the US!

Anant Ambani and Radhika Merchant’s wedding is a multi-day, mega-million affair — and super star-studded.

Kim Kardashian, Priyanka Chopra and more A-listers traveled to India to watch the son of Asia’s richest man tie the knot on Friday.

The couple, who got engaged in December 2023, have been celebrating for months, starting with a pre-wedding party in March attended by 1,200 guests, including Ivanka Trump and Mark Zuckerberg.

Flying in Justin Bieber to sing at the couple’s “sangeet” allegedly cost $10 million alone, with Rihanna paid $6 million to perform at their March bash.

Businessmen aren’t foolish to spend that kind of money without getting anything in return. Everything is an investment and a promotion to expand their empire.

Mukesh, 67, has already gifted the couple with an $80 million, 10-bedroom villa on Palm Jumeriah in Dubai, which boasts a private beach.

While an expense of ₹5,000 crore ($600M) could seem overwhelming, the Ambani family is spending a lesser percentage of their net worth than the average Indian family does for their children’s weddings. Any Indian family spends around 5% to 15% of their total wealth, while the Anant Ambani-Radhika Merchant wedding was only around 0.5% of Ambani family's net worth estimated at $123.3 billion, this probably just feels like pocket change.

If the Ambanis spend 3 crores (yes 3 crores) every day, their wealth will last them 962 years!

Anant Ambani, Radhika Merchant Wedding LIVE | ఏడునెలల వేడుక.. ఐదువేల కోట్లు ఖర్చు!.. - TV9

 

Link to comment
Share on other sites

  • 0

Nita Ambani's diamonds

देखिए Nita Ambani ने मीडिया को अपने Family के सात किया बेटे Anant -Radhika के Wedding पर आमंत्रण 🙏🎉🎊

 

Link to comment
Share on other sites

  • 0

Isha Ambani Bejeweled blouse by Abu Jani Sandeep Khosla for her brother's pre-wedding event

 

Link to comment
Share on other sites

  • 0

All of Nita Ambani’s looks from Anant & Radhika’s wedding festivities make our hearts skip a beat🤌🏻

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...