Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

CM Jagan Bus Yatra: వైసిపి మేమంత సిద్దం ఎన్నికల ప్రచారం


Vijay

Recommended Posts

YS Jagan on Chandrababu: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే: సీఎం జగన్ తీవ్ర విమర్శలు

09-05-2024 Thu 17:34 | Andhra

టీడీపీ అధినేత గత చరిత్ర ఇదేనని విమర్శించిన వైసీపీ అధినేత

2014లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారని విమర్శలు

ప్రధానమంత్రితో సభలు నిర్వహించి కనీసం ప్రత్యేక హోదా ప్రకటన కూడా చేయలేకపోయారని మండిపాటు

cr-20240509tn663cbbc0d61b2.jpg

చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనని ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదేనని, అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థమని, మోసపోవద్దని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 ప్రచారంలో భాగంగా రాజంపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

విమర్శించిన నోటితోనే పొగిడిపోయారు.. ప్రధానిపై జగన్ విమర్శలు
ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో చంద్రబాబు ఉమ్మడి సభలు పెట్టిస్తున్నారని, ఏమైనా ప్రకటన చేస్తారేమోనని ప్రజలు ఎదురుచూశారని, కానీ ప్రత్యేక హోదా ప్రకటన కూడా చేయలేదని వైఎస్ జగన్ విమర్శించారు. పెత్తందారుల సభలతో ప్రజలకు నిరాశే మిగిలిందని, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు.  ‘‘చంద్రబాబుకు ఏం కావాలి, దత్తపుత్రుడికి ఏం కావాలి, వదినమ్మకు ఏం కావాలి, దుష్టచతుష్టయానికి ఏం కావాలి. అన్నీ వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడారు. మన మీద నాలుగు రాళ్లు వేశారు. మొన్నటి దాకా చంద్రబాబు అంత అవినీతిపరుడు దేశంలో ఎవరూ ఉండరన్న మోదీ... ఇప్పుడు వాళ్ల కూటమిలో చేరారు, అదే నోటితో పొగిడారు’’ అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎందుకు పిలుస్తున్నారు?
‘‘ఎన్డీయే ఏపీ అజెండాతో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి లాభం జరిగింది? ఇదే నాయకులు 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు. కూటమి, డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ మాటలు చెబుతున్నారు. మరి 2014లో ప్రకటించిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎందుకు పిలుస్తున్నారు’’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. మరోవైపు ఐదేళ్లక్రితం ఇచ్చిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేసిన తాను ఉన్నానని, ఇంటింటికీ పథకాలు ఇచ్చి తాను ఆశీర్వాదం కోరుతున్నానని అన్నారు. 

సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించబోయే ఎన్నికలు ఇవి అన్ని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, ప్రతి ఇల్లూ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు అని జగన్ అన్నారు. ఏపీ ప్రజలందరూ మళ్లీ మోసపోతారని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Jagan on kootami and the poor: ఎన్డీఏ కూటమితో పేదలకు నష్టం: సీఎం జగన్

09-05-2024 Thu 16:18 | Andhra

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమని ధ్వజం

సంక్షేమ పథకాలకు డబ్బులు చెల్లించనివ్వకుండా ఈసీపై ఎన్డీఏ ఒత్తిడి చేసిందని మండిపాటు

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిదేనని స్పష్టీకరణ

cr-20240509tn663caa119acbe.jpg

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎలా జతకడతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుది ఉసరవెల్లి రాజకీయమని, మైనార్టీల ఓట్ల కోసం వారిపై కపట ప్రేమ కురిపిస్తున్నాడని జగన్ ధ్వజమెత్తారు. ముస్లింలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం లో గురువారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు. రైతులు, మహిళలు, విద్యార్థులకు డబ్బులు చెల్లించనివ్వకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కుట్ర పన్నాయని ఆరోపించారు.

సుమారు రూ.14,165 కోట్ల చెల్లింపులకు ఎన్నికల కమిషన్ అనుమతినివ్వలేదని జగన్ చెప్పారు. ఓ వైపు తెలంగాణలో రైతులకు డబ్బులు చెల్లించేందుకు అనుమతులిచ్చిన ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి కుట్రలు చేసి ఒత్తిడి చేయడంతోనే ఎన్నికల కమిషన్ తమకు అనుమతినివ్వలేదని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి అమలులో ఉన్న సంక్షేమ పథకాల చెల్లింపునకు ఎన్నికల కమిషన్ అనుమతినివ్వకపోవడానికి ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలే కారణమని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే మరో ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ఓటు వేయకుంటే నవరత్నాల పేరుతో ఉన్న సంక్షేమ పథకాలను చంద్రబాబు ఆపేస్తారని జగన్ చెప్పారు. మేనిఫెస్టో విశ్వసనీయతకు అర్థం చెప్పింది వైసీపీ ప్రభుత్వమేనని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో నాడు నేడు ద్వారా మౌలిక వసతుల కల్పించామని, ఇంగ్లిషు మీడియంలో బోధన తీసుకొచ్చామని తెలిపారు. మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. ఇంటివద్దకే పౌర సేవలు అందించేలా ఈ ఐదేళ్ల కాలం పాలించామని చెప్పారు.

చంద్రబాబు తను ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో చెప్పుకోదగ్గ పనులు లేకే ఇతర పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్తున్నారని జగన్ విమర్శించారు. 2014లో రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుదని తెలిపారు. ఏనాడు పేదవారికి సెంటు స్థలం కూడా ఇవ్వని చంద్రబాబు...ఇప్పుడు పేదలకు జగన్ భూములు, ఇళ్లు ఇస్తుంటే ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు.

...

Complete article

AP CM YS Jagan Public Meeting at Kalyanadurgam | AP Elections 2024 | Anantapur District@SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

CM Jagan on taking money from TDP and voting for YCP: చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోండి, ఓటు నాకే వేయండి - జగన్

AP Elections 2024: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఎప్పటిలాగే విమర్శలు, ఆరోపణలు చేశారు.

21533f02bd2c33627eb7151f0b51818f17152593

CM Jagan Comments: టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు ఇచ్చే రూ.వెయ్యి, రూ.2 వేలకు ప్రజలు మోసపోవద్దని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోరారు. మీ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే ఉంటుందని చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఎప్పటిలాగే విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రబాబు డబ్బులు పంచితే తీసుకోవాలని.. ఓటు మాత్రం జగన్ కే వేయాలని కోరారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని.. చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ అని జగన్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు తాను దోచుకున్న సోమ్ముతో ప్రతి ఎన్నికలకు నోట్లు ఇచ్చి ఓట్లు కొనాలని ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. ఆయన ఇచ్చే వెయ్యి, రెండు వేలకు ప్రజలు మోసపోవద్దని పిలుపు ఇచ్చారు. మీ బిడ్డ జగన్ మళ్ళీ అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం ఏ నెల ఏయే పథకాలు వస్తాయో, దేనికి డబ్బులు అందుతాయో తెలియజేస్తూ క్యాలెండర్ అందిస్తామని చెప్పారు. గుర్తుపెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే.. ఉంటుందని అన్నారు. ఆ పథకాలన్నీ కొనసాగాలంటే జగనే రావాలని పిలుపు ఇచ్చారు.

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రతి ఇంటికి తన సంతకంతో మేనిఫెస్టో పంపారని జగన్ గుర్తు చేశారు. ఆ హామీల్లో ఒక్కటి కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలికినట్లే అవుతుందని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా సభల్లో ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన తేవడం లేదని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్లకు కావాల్సినవి మాత్రమే మాట్లాడారని జగన్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నారని.. ఆరునూరైనా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. 

2019 ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పథకం డబ్బులు వేయడానికి అనుమతిచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు నిరాకరించిందని జగన్ విమర్శించారు. కూటమి పార్టీల ఒత్తిడి, ఫిర్యాదుల వల్లే ఈ డబ్బులు పేదలను చేరకుండా ఈసీ అడ్డుకుందని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

ఊరూరా జగన్ కు అపూర్వ నీరాజనం | CM YS Jagan bus tour | AP Elections 2024 - TV9

 

Link to comment
Share on other sites

CM YS Jagan Powerful Speech At Mangalagiri Public Meeting | AP Elections 2024 |@SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

CM YS Jagan High Voltage Speech | Chandrababu | YS Avinash Reddy | Kadapa | @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

AP CM YS Jagan Public Meeting at Kadapa | AP Elections 2024 | YSR Kadapa District@SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

YS Jagan: పద్మవ్యూహంలో బలవ్వడానికి ఇక్కడున్నది అభిమన్యుడు కాదు... అర్జునుడు: సీఎం జగన్ ట్వీట్

11-05-2024 Sat 20:11 | Andhra

ఏపీలో మే 13న పోలింగ్

ఎన్నికల మహా సంగ్రామంలో విజయం మనదే అంటూ సీఎం జగన్ ధీమా

కృష్ణుడి వంటి ప్రజలు తన వెంట ఉన్నారంటూ ట్వీట్

cr-20240511tn663f841033293.jpg

ఏపీ సీఎం జగన్ ఎల్లుండి (మే 13) పోలింగ్ నేపథ్యంలో తన సమర సన్నద్ధతను చాటారు. తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్నారు. ఎన్నికల మహా సంగ్రామంలో పచ్చ మంద పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు... అర్జునుడు అని స్పష్టం చేశారు. ఈ అర్జునుడికి కృష్ణుడి వంటి నా ప్రజలు తోడుగా ఉన్నారు... ఈ యుద్ధంలో విజయం మనదే అని ఉద్ఘాటించారు. 

"వారి వ్యూహాల్లో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాల్లో, మోసపూరిత వాగ్దానాల్లో... వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది. కానీ, ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు... ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి ప్రజల అండ, దేవుడి దయ తోడుగా ఉన్నాయి. అందుకే మీ బిడ్డ ఇలాంటి పద్మవ్యూహాలకు భయపడడు. మీ అండదండలు ఉన్నంతకాలం మీ బిడ్డ తొణకడు" అంటూ ఓ సభలో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా సీఎం జగన్ పంచుకున్నారు.

...

Complete article

మీ అర్జునుడు! ఎన్నికల మహాసంగ్రామంలో పచ్చమంద పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకి బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి నా ప్రజలు తోడుగా ఉన్నారు. ఈ యుద్ధంలో విజయం మనదే!

 

Link to comment
Share on other sites

YS Jagan: పిఠాపురంలో గెలిస్తే... వంగా గీతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సీఎం జగన్

11-05-2024 Sat 18:26 | Andhra

కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ ఎన్నికల ప్రచార సభ

హాజరైన సీఎం జగన్

దత్తపుత్రుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైనం

కార్లను మార్చినట్టు భార్యలను మార్చే వ్యక్తి అంటూ విమర్శలు

దత్తపుత్రుడు గెలిచినా పిఠాపురంలో ఉండడని వెల్లడి

ఆమెను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తా... ఇదే నా మాట!

cr-20240511tn663f6aff00dff.jpg

కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ, దత్తపుత్రుడు అంటూ ధ్వజమెత్తారు.

మేనిఫెస్టోలో ఇచ్చింది అడ్డగోలు హామీలు అని తెలిసి కూడా, రైతన్నలను పొడవండి, పిల్లలను పొడవండి, అక్కచెల్లెమ్మలను పొడవండి, అవ్వాతాతలను పొడవండి అంటూ చంద్రబాబుకు దత్తపుత్రుడు కత్తి అందిస్తున్నాడని విమర్శించారు. ఇలాంటి మనిషి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తాడు? ఎవరికి మేలు చేస్తాడు? అని ప్రశ్నించారు. 

"ఈ దత్తపుత్రుడ్ని నా అక్కచెల్లెమ్మలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఐదేళ్లకోసారి కార్లను మార్చినట్టు భార్యలను మార్చే ఈ మనిషి గురించి అందరూ ఆలోచించాలి. ఒకసారి జరిగితే పొరపాటు... రెండోసారి జరిగితే గ్రహపాటు... అదే మూడోసారి, నాలుగోసారి జరిగితే అలవాటు కాదా? 

ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే రేపు ఏ అక్కచెల్లెమ్మ అయినా పని నిమిత్తం దత్తపుత్రుడ్ని కలిసే పరిస్థితి ఉంటుందా? ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి వద్దకు ఎవరైనా వెళ్లి ఏ మహిళ అయినా పని అడగ్గలరా? 

ఈ దత్తపుత్రుడి గురించి ఇంకో విషయం కూడా చెబుతున్నా. ఈ దత్తపుత్రుడికి ఓటేసి గెలిపిస్తే, అతడు పిఠాపురంలో ఉంటాడా? ఈ దత్తపుత్రుడికి ఈ మధ్యనే జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ పెద్దమనిషికి ఇప్పటికే గాజువాక అయిపోయింది, ఇప్పటికే భీమవరం అయిపోయింది... ఇప్పుడు పిఠాపురం!

ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే న్యాయం జరుగుతుందా? మరో పక్క నా తల్లి (వంగా గీత) ఇక్కడుంది. నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెబుతున్నా... మా తల్లిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి... ఆమెను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తా... ఇదే నా మాట! 

చివరగా మరొక్క మాట... చంద్రబాబు ప్రలోభాలకు మీరెవరూ మోసపోవద్దు. ఐదేళ్లు మీ బిడ్డ పాలన చూశారు. ఏ నెలలో అమ్మ ఒడి ఇస్తాను, ఏ నెలలో రైతు భరోసా ఇస్తాను, ఏ నెలలో చేయూత ఇస్తాను అని క్యాలెండర్ ఇచ్చి మరీ అమలు చేశాను. 

చంద్రబాబు మాటలు నమ్మి వచ్చే ఐదేళ్లలో జరిగే మంచిని పోగొట్టుకోవద్దు. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే అందాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మా అక్కచెల్లెమ్మలకు అందాలన్నా, పేదల భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే... ఫ్యాన్ గుర్తుకే మీరు ఓటేయాలి.

ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు... ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదు.... అందరూ సిద్ధమేనా?" అంటూ సీఎం జగన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.

...

Complete article

Link to comment
Share on other sites

59 minutes ago, TELUGU said:

YS Jagan: పిఠాపురంలో గెలిస్తే... వంగా గీతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సీఎం జగన్

ఆమెను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తా... ఇదే నా మాట!

ఈ దత్తపుత్రుడికి ఓటేసి గెలిపిస్తే, అతడు పిఠాపురంలో ఉంటాడా? ఈ దత్తపుత్రుడికి ఈ మధ్యనే జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ పెద్దమనిషికి ఇప్పటికే గాజువాక అయిపోయింది, ఇప్పటికే భీమవరం అయిపోయింది... ఇప్పుడు పిఠాపురం! ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే రేపు ఏ అక్కచెల్లెమ్మ అయినా పని నిమిత్తం దత్తపుత్రుడ్ని కలిసే పరిస్థితి ఉంటుందా? ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి వద్దకు ఎవరైనా వెళ్లి ఏ మహిళ అయినా పని అడగ్గలరా?

Wow! Deputy CM is a rod to poonakam kalyan 🤣

kootami candidates are non-local/non-resident andhrites (NRA) including fitness star and cbn

Link to comment
Share on other sites

Jagan on reservations to Muslims

ముస్లిం సోదరసోదరీమణులందరూ ఆలోచించండి!

ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఉండితీరాల్సిందే. ఇదీ మీ జగన్ మాట.. ఇదీ వైయస్ఆర్‌ బిడ్డ మాట. మరి మోడీ గారి సమక్షంలో చంద్రబాబుకి ఈ మాట చెప్పే ధైర్యముందా?

 

Link to comment
Share on other sites

సిద్ధం అవ్వండి!

నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ సిద్ధం అవ్వండి. ఈ యుద్ధంలో మీరు వేయబోయే ఓటు మీ బిడ్డల భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోతోంది.

#YSRCPWinning #VoteForFan #RejectTDPSaveAP

 

Link to comment
Share on other sites

THINK TWICE BEFORE YOU VOTE!!

2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా విజ్ఞప్తి.

My message to the people of Andhra Pradesh for the upcoming Assembly and General elections 2024

#VoteForFan

 

Link to comment
Share on other sites

idem mass ra mama?

no, it's not vfx

వైఎస్ జగన్ బస్సు యాత్రకు జన సముద్రం

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...