Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

Chandrababu Praja Galam: టీడీపీ ప్రజాగళం ఎన్నికల ప్రచారం


TELUGU

Question

Chandrababu: నాలాగా జగన్ మండుటెండలో మూడు సభల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా?: చంద్రబాబు సవాల్

సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు రిప్లయ్

జగన్ ను పిల్లకాకితో పోల్చిన టీడీపీ అధినేత

జగన్ పనిదొంగ అంటూ విమర్శలు

cr-20240329tn6606b615205a5.jpg

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. జగన్ నా వయసు గురించి మాట్లాడతాడు... నా మాదిరిగా మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని, సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా ఈ జగన్? అని ఎద్దేవా చేశారు. 

"ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడని అడుగుతాడు... తెలుగు రాష్ట్రాల్లో  పిల్లలను అడిగినా చెబుతారు నేను ఏం చేశానో. అతనికి తెలియకపోతే ఆ అజ్ఞానానికి ఎవరేం చేయగలం?" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

అంతేకాదు, బనగానపల్లెలో తాను జగన్ పై చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా చంద్రబాబు పంచుకున్నారు. జగన్ ను పిల్లకాకితో పోల్చారు. నాలాగా రెండ్రోజులు మధ్యాహ్నం ఒంటిగంటకు మంచి ఎండలో మీటింగ్ లు పెట్టగలవా? అని సవాల్ విసిరారు. పనిదొంగ, దోపిడీదారుడు ఈ జగన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0
On 4/18/2024 at 1:05 AM, TELUGU said:

Chandrababu on electricity: నీకు చేతకాకపోతే రాజీనామా చెయ్... నీ సభలకు నేను కరెంట్ ఇస్తా: చంద్రబాబు

మచిలీపట్నంలో వారాహి విజయభేరి సభ

హాజరైన పవన్ కల్యాణ్, చంద్రబాబు

ఇక్కడొక నీతుల నాని ఉన్నాడంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు

cr-20240417tn661ff77da93d7.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు. కృష్ణా జిల్లా సాహిత్య, సాంస్కృతిక రంగాలకు వేదిక అని అభివర్ణించారు. తాము ప్రజల కోసమే కూటమి కట్టామని అన్నారు. తమ కలయిక స్వార్థం కోసం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 

గతంలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నానీలు ఈ జిల్లాకు చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఒకడు బూతుల నాని, మరొకడు నీతుల నాని అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉండే నీతుల నాని... మాట్లాడితే రెండు చెప్పులు తీసుకుని కథలు కథలుగా చూపిస్తుంటాడని అన్నారు. నీతుల నానీ... నీకు పదవి ఇచ్చింది పవన్ కల్యాణ్ ను, నన్ను తిట్టడానికా? అని ప్రశ్నించారు. 

నీతుల నానీ...  బందరులో ఏం అభివృద్ధి చేశారో చెప్పే దమ్ము నీకు ఉందా? అని ప్రశ్నించారు. ఈ సైకో జగన్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో సైకోను తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు కానీ... మేం బుల్లెట్లకే భయపడలేదు ఈ సైకోలకు భయపడతామా? అంటూ వ్యాఖ్యానించారు. 

బందరు బైపాస్ రోడ్డులో నితీశ్ అనే వ్యక్తి రూ.150 కోట్లతో మాల్ కడుతుంటే ఎన్ఓసీ ఇవ్వకుండా ఈ నీతుల నాని అడ్డుపడ్డాడని చంద్రబాబు ఆరోపించారు. 

"వైసీపీకి ఓటేస్తే ఏం చేస్తారు? అవినాశ్ రెడ్డిని అరెస్ట్ నుంచి తప్పించేందుకు ఆ అధికారాన్ని ఉపయోగిస్తారు. జగన్ మోహన్ రెడ్డీ... బాబాయ్ పై గొడ్డలి వేటు ఎవరేశారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ఆ తర్వాత ఓటు అడుగు... చెప్పే ధైర్యం నీకు ఉందా? ఆయన కన్న కూతురు, నీ చెల్లెలు మొత్తం వాస్తవాలన్నీ చెప్పింది. 

ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి పోటు అంశాన్ని మాపై వేశారు... ఆ తర్వాత కోడికత్తి డ్రామా... నిన్న చూస్తే గులకరాయి డ్రామా. గులకరాయి ఎవడో వేస్తే నేను, పవన్ కల్యాణ్ వచ్చి హత్యాయత్నం చేశామంట. డిపార్ట్ మెంట్ నీది... కరెంట్ పోతే మేం కారణమా? నీకు చేతకాకపోతే రాజీనామా చెయ్... నువ్వు మీటింగు పెట్టుకో... నీకు కూడా మేం కరెంట్ ఇస్తాం... ఎక్కడా కరెంట్ ఆఫ్ కాదు. 

ఒక దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. దళితులకు శిరోముండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నాడు... నిన్ననే అతడు దోషి అని తేలింది. జడ్జిలపై వ్యాఖ్యలు చేసిన ఒక ఎన్నారైని పక్కనబెట్టుకుని తిరుగుతున్నాడు ఈ జగన్" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

...

Complete article

lol, Jagan resigning is the ONLY way cbn can become the cm (nice try cbn but in your dreams...! thanks for asking but no thanks. we feel your desperation and defeated humiliation at the hands of young Jagan and no chance to defeat him)

otherwise cbn will retire as Katakataala Chandrayya 🤣

Link to comment
Share on other sites

  • 0

It would be funny to watch and recorded in the history forever Pappu's defeat at the hands of a woman opponent LOL. Nice setting up the stage, Jagan anna

మహిళా చేతిలో ఓడిపోబోతున్నాడు పప్పు..!

:emoji-lol:

#VoteForFan #MemanthaSiddham #CMYSJagan #YSJaganAgain #YSJaganVSALL #MuruguduLavanya #Mangalagiri #NaraLokesh #PappuLokesh #EndOfTDP

 

  • Haha 1
Link to comment
Share on other sites

  • 0
35 minutes ago, Vijay said:

It would be funny to watch and recorded in the history forever Pappu's defeat at the hands of a woman opponent LOL. Nice setting up the stage, Jagan anna

మహిళా చేతిలో ఓడిపోబోతున్నాడు పప్పు..!

:emoji-lol:

#VoteForFan #MemanthaSiddham #CMYSJagan #YSJaganAgain #YSJaganVSALL #MuruguduLavanya #Mangalagiri #NaraLokesh #PappuLokesh #EndOfTDP

 

 

yeah, ammalakkalu andaru chemma chekkalu aadukuntar with pappu and pawala defeats!

:emoji-lol:

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ఇవాళ కూడా పవన్ కల్యాణ్ ను ఇష్టానుసారం తిట్టాడు: చంద్రబాబు

రాయదుర్గంలో టీడీపీ ప్రజాగళం సభ

సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

తనకే తెలివి ఉందనుకుంటున్నాడా అంటూ ఆగ్రహం

అబద్ధాలు చెప్పడం అతడికి పుట్టుకతో వచ్చిన విద్య అని విమర్శలు

cr-20240419tn66229eedf3b61.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. తన ప్రసంగంలో ఆయన సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జనాలకు తెలివి లేదనుకుంటున్నాడా? జగన్ ఒక్కడికే తెలివి ఉందనుకుంటున్నాడా? అని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన దాని కంటే ప్రజలపై మోపిన అప్పులే ఎక్కువని, ఇచ్చిన దాని కంటే దోచుకున్నదే ఎక్కువని అన్నారు. మోసం చేయడంలో జగన్ మోహన్ రెడ్డి దిట్ట అని చంద్రబాబు విమర్శించారు. అబద్ధాలు చెప్పడం అతడికి పుట్టుకతో వచ్చిన విద్య అని అన్నారు. 

నిన్ను తిట్టాలంటే నాకు నిమిషం పని

ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? ఇవాళ కూడా పవన్ కల్యాణ్ ను ఇష్టానుసారం తిట్టాడు. నా మీద నోరు పారేసుకున్నాడు. నిన్ను బూతులు తిట్టాలంటే నాకు ఒక్క నిమిషం పని... ఇతడి వల్ల తన ముఖ్యమంత్రి పదవి పోతుందని తండ్రి ఇతడిని బెంగళూరుకు తరిమేశాడు. తల్లిదండ్రులకు భారమైన కొడుకు ఇతను. భూమికి, సమాజానికి కూడా భారం. ఈ ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయింది. ఈయన పరిపాలన విధ్వంసంతోనే ప్రారంభమైంది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి, అమరావతిని కూడా నాశనం చేశాడు.

ఈసారి ప్రజాగ్రహానికి వైసీపీ మసైపోవడం ఖాయం

ఐదేళ్ల సైకో పాలనలో మీరు ఏం నష్టపోయారో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి ఆ పార్టీ మసైపోవటం ఖాయం. వైసీపీ పాలనలో మీ పొలాలకు నీళ్లోచ్చాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? నీళ్లు ఉంటే వ్యవసాయం అభివృద్ది చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి. టీడీపీ హయాంలో ఇచ్చిన నీళ్లు తప్ప ఇప్పుడు చుక్క నీళ్లిచ్చారా? 

ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతికి ఉంది. మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రయోజకులవుతారు. స్కూళ్లకు రంగులు పూస్తే పిల్లలకు చదువులు రావు. టీచర్లను నియమించి స్కూళ్లలో కనీస సదుపాయాలు కల్పించాలి. నేడు 3 కి.మీ దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లలేక బాలికలు చదువు మానేస్తున్నారు. 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు. 

రాయలసీమకు జగన్ చేసిందేంటి? 

గత ఎన్నికల్లో సీమలో 52 సీట్లకు గానూ 49 సీట్లలో వైసీపీని గెలిపించారు. మీరు ఎందుకలా చేశారో నాకు అర్థం కాదు. కానీ, మీకు జగన్ ఏం చేశాడు? ఐదేళ్లలో మీ జీవితాల్లో మార్పులేమైనా వచ్చాయా? ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? టీడీపీ హయాంలో ఏం అభివృద్ది చేశామో నేను చెబుతా...జగన్ ఏం చేశాడో చెప్పగలడా అని సవాల్ విసురుతున్నా? 

రాయలసీమలో ప్రాజెక్టుల కోసం నేను రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ ఖర్చు చేసింది కేవలం రూ. 2500 కోట్లు మాత్రమే. రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకురావాలని ఎన్టీఆర్ హంద్రీనీవా ప్రారంభించారు. నేను హంద్రీ నీవా కోసం 5 ఏళ్లలో రూ.4500 కోట్లు ఖర్చు చేశా. తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా హెచ్ఎన్సీ పూడిపోతే కర్ణాటక సీఎంతో మాట్లాడి దాన్ని ఆధునికీకరణ చేశాం. నేడు దాన్ని అటకెక్కించారు. 

జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేశాం. అనంతపురంకు కియా తెచ్చాం. నేడు 12 లక్షల కార్లు ఏపీ నుంచి ఉత్పత్తి అయ్యాయి. ఇది మనకు గర్వకారణం. మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని జగన్ అంటున్నారు. నన్ను చూస్తే అడుగడుగునా నేను చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. జగన్ ని చూస్తే గుర్తొచ్చేది విధ్వంసం. బైరవాని తిప్ప ప్రాజెక్టు పూర్తి చేశాం. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఏడాదిలో నీళ్లు వచ్చేవి. 

రేపు ఓట్ల కోసం వైసీపీ దొంగలు వస్తారు? ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చొక్కా పట్టుకుని నిలదీయండి. మళ్లీ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే వైసీపీ పోవాలి, ఎన్డీయే ప్రభుత్వం రావాలి.  

ఇదిగో సూపర్ సిక్స్
 
సూపర్ సిక్స్ తో పాటు ప్రధాని మోదీ ప్రకటించిన సంకల్ప్ పత్ర ప్రజలకు ఉపయోగపడేలా విజన్ తయారు చేసుకుంటాం. సంపద సృష్టించి ఆదాయం ప్రజలకు పంచుతాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమిదే. 

మహాశక్తి కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా... ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. 

అన్నదాత కింద రైతుకు ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాం. యువగళం కింద యువతకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.  

అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపైనే పెడతా. నేను, ఎన్టీఆర్ 11 సార్లు డీఎస్సీ నిర్వహించి లక్షలాదిమందిని టీచర్లుగా నియమించాం. జగన్ ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. 25 వేల పోలీసులు ఉద్యోగాలు భర్తీ చేస్తాన్నన్నాడు... చేశాడా? నేను రాగానే పోలీసు డిపార్ట్ మెంట్ లో ఖాళీలు భర్తీ చేస్తా. 

గ్రూప్-1లో అక్రమాలకు పాల్పడ్డారు. కమీషన్ల కోసం పరిశ్రమలు తరిమేశారు. మన పిల్లల భవిష్యత్తు కోసం పరిశ్రమలు తెస్తా. వర్క్ ప్రమ్ హోం విధానం తెస్తాం. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. రైతులకు  గిట్టు భాటు ధర కల్పిస్తాం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. 90 శాతం సబ్సిడితో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. అనంతపురం జిల్లాలో 10 లక్షల పంట కుంటలు తవ్వించాం. వాలంటీర్లు రాజీనామా చేయెద్దు, వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే నెలకు రూ. 10 వేలు వేతనం ఇస్తాం... అని చంద్రబాబు హామీలు ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ఇక్కడ పులి అంటాడు... ఢిల్లీలో పిల్లిలా ఉంటాడు: చంద్రబాబు

కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగళం సభ

హాజరైన చంద్రబాబు

కార్యకర్తలు కసిగా పనిచేయాలని పిలుపు

cr-20240419tn6622824f97e1e.jpg

ఏపీ చరిత్రను, ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలివి అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ ఆయన కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. నా ప్రాణ సమానమైన కార్యకర్తలు కసిగా పనిచేయాలి... దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని పిలుపునిచ్చారు. సైకో రెడ్డి రాష్ట్రం నుంచి మీ ఓటుతో తరిమికొట్టండి... తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం... సాధారణ కార్యకర్త వీరభ్రద గౌడ్ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని వివరించారు. 

"ఒక ఎంపీటీసీని... ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాం. కురబ కులస్తుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళతాడని మీరు ఊహించారా? వీరిద్దరినీ గెలిపించడం అనేది ప్రజాస్వామ్యానికి మీరిచ్చే గౌరవం అవుతుంది. వీరిద్దరినీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. ఆలూరు ప్రజలు అదరగొడుతున్నారు. ఎన్నికలకు సై అంటూ కర్నూలు జిల్లా కదం తొక్కుతోంది. ముస్లింలకు న్యాయం చేసేది టీడీపీనే" అని స్పష్టం చేశారు.

జనసేన, బీజేపీ కార్యకర్తలు సైతం ముందుకు రావాలి

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు అండగా నిలబడాలని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలనే ఉద్దేశంతో పొత్తుకు ముందుకొచ్చాం. మేము సైతం పనిచేస్తామని జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు ముందుకు రావాలి. కేంద్రంలో రాబోయేది ఎన్డీఏనే. 

మన రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ సహకారం ఎంతో అవసరం. అందుకే జట్టు కట్టాం.  మైనారిటీ సోదరులందరూ ముందుకొచ్చి కూటమి గెలుపుకు కృషిచేయాలి. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. అధికారంలోకి వచ్చాక ముస్లింలకు అండగా నిలబడతాం.  ఆర్థికంగా ఆదుకుంటాం. 

గెలిపిస్తే ఏం చేశాడు?... రాష్ట్రాన్ని గాలికొదిలేశాడు

ముఖ్యమంత్రిగా గెలిపిస్తే జగన్ రెడ్డి ఏం చేశాడు? ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నాడు. ఇక్కడ పులి అంటాడు...ఢిల్లీలో పిల్లిలా ఉంటాడు. రాష్ట్రాన్ని గాలికొదిలేశాడు. 13 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. కేంద్రం సహకారంతో భవిష్యత్ లో అందరి జీవితాల్లో వెలుగులు తెస్తాం. వెనుకబడిన కర్నూలు జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా. 

అధికార మదంతో విర్రవీగుతున్న జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి. జగన్ రెడ్డికి జే గన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నాను. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తిని ఇలా కాక మరేలా పిలుస్తాం. నిన్నటి వరకూ పరదాలు కట్టుకుని తిరిగాడు. నేడు నెత్తిన చేయిపెడుతున్నాడు. 

సీమలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా జగన్

నేను సాగునీటి ప్రాజెక్టులకు రూ. 12 వేల కోట్లు ఖర్చు చేశా. ఈ ఐదేళ్లలో రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు ఇచ్చాడా. సాగు, తాగునీరు ఇచ్చాడా అని అడుగున్నా. దమ్ముంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సీమకు ఒక్క పరిశ్రమ తెచ్చాడా. ఉద్యోగం ఇచ్చాడా, డీఎస్సీ తెచ్చాడా? వాలంటీర్ ఉద్యోగం ఇస్తే ఉపాధి కల్పించినట్టేనా? 

జగన్ రెడ్డి మాత్రమే పెత్తనం చేస్తుంటాడు... మనమంతా బానిసలుగా ఉండాలి. మీ జీవితాలు బాగుపడ్డాయా, మీ ఆదాయాలు పెరిగాయా, మీ కష్టాలు తీరాయా? వరి టమాటా, మిరప, పత్తి, రైతులు బాగున్నారా? రైతు భరోసా కేంద్రాలు కాదు... రైతు దగా కేంద్రాలు అవి. 

నీరిస్తే పొలాలు బంగారం పండుతాయి. కానీ దుర్మార్గుడు నీరివ్వకుండా ప్రగల్భాలు పలుకుతున్నాడు. స్కూలుకు రంగులు కొడితే నాణ్యత పెరుగుతుందని ఆలోచించే దుర్మార్గుడు జగన్ రెడ్డి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం: ఆలూరులో చంద్రబాబు

కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగళం

దుర్మార్గపు పాలన అంతమొందించడానికే మూడు పార్టీలు కలిశాయన్న చంద్రబాబు

ఏపీలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టే తరుణం ఇదేనని వ్యాఖ్యలు

cr-20240419tn66226f436623d.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి మూడు పార్టీలు కలిశాయని అన్నారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమని స్పష్టం చేశారు. ఏపీలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టే తరుణం ఇదేనని, రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి అని చంద్రబాబు అభివర్ణించారు. 

కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని, ఏపీలో అభివృద్ధి జరగాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. బీజేపీతో తాము జట్టు కట్టడానికి కారణం అదేనని వివరించారు. జగన్ ఐదేళ్ల పాలలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు. 

అధికారం ఇస్తే అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని, వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ప్రజల ఆదాయం పెరగలేదు కానీ, జగన్ మాత్రం సంపన్నుడు అయ్యారని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Nara Bhuvaneswari: చంద్ర‌బాబు త‌ర‌ఫున భువ‌నేశ్వ‌రి నామినేష‌న్‌

కుప్పంలో నామినేష‌న్ దాఖ‌లు చేసిన నారా భువ‌నేశ్వ‌రి

కుప్పం రిట‌ర్నింగ్ అధికారి (ఆర్ఓ) కి నామినేష‌న్ ప‌త్రాల అంద‌జేత‌

అంత‌కుముందు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ శ్రేణుల‌తో క‌లిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాల‌యానికి భువ‌నేశ్వ‌రి

cr-20240419tn662233cdeaf0f.jpg

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌ర‌ఫున కుప్పంలో ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కుప్పంలో రిట‌ర్నింగ్ అధికారి (ఆర్ఓ) కి నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆమె అంద‌జేశారు.  అంత‌కుముందు ఆమె టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ శ్రేణుల‌తో క‌లిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాల‌యానికి చేరుకున్నారు.

కాగా, నామినేష‌న్ దాఖ‌లుకు ముందు భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం ఉద‌యం ఆల‌యం, మ‌సీదు, చ‌ర్చిలో నామినేష‌న్ ప‌త్రాలతో ప్ర‌త్యేక పూజ‌లు, ప్రార్థ‌న‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను ఉంచి భువనేశ్వరి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలో ఉన్న మసీదు ఆవరణలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబూనగర్ లో ఉన్న చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

ఒక్క చాన్సే చివరి చాన్స్‌ కావాలి! జగన్‌ నైజం దోపిడీ, విధ్వంసమే: చంద్రబాబు

జలగన్న జగన్‌కు ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్‌ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్‌ నైజమని మండిపడ్డారు.

- ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచాడు

- విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు

- ప్రజాగళంలో టీడీపీ అధినేత బాబు

- ఆలూరు, కణేకల్లులో భారీ సభలు

cbn_bba6a02607_V_jpg--799x414-4g.webp

జలగన్న జగన్‌కు ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్‌ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్‌ నైజమని మండిపడ్డారు. అధికారం కట్టబెడితే వ్యవస్థలను నాశనం చేశాడన్నారు. గత ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచుకున్నాడని.. దోపిడీ సొమ్మంతా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడని ఆరోపించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లులో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్‌రెడ్డి శవ రాజకీయాలు చేస్తూ లాభపడాలని చూస్తున్నాడన్నారు. ‘గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడు.. ఇప్పుడేమో గులకరాయి డ్రామా ఆడుతున్నాడు. గులకరాయితో ఎవరైనా హత్య చేస్తారా..? జన్మనిచ్చిన తల్లికే భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కాడా? తండ్రిలేని బిడ్డ అన్నాడు. ఒక్క చాన్స్‌ అన్నాడు. ముద్దులు పెట్టాడు. తల నిమిరాడు. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఐదేళ్ల పాలనలో మీలో ఎవరైనా బాగుపడ్డారా’ అని ప్రశ్నించారు. అధికార మదంతో విర్రవీగుతున్నాడని.. అందుకే ఆయనకు ‘జే గన్‌రెడ్డి’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తిని ఇలా కాకపోతే మరెలా పిలుస్తారని ప్రశ్నించారు. ఆయన్ను గెలిపిస్తే.. ఢిల్లీకి వెళ్లి ఫైరవీలు చేసుకున్నాడని.. రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశాడని.. అన్ని రంగాలను సర్వనాశనం చేశాడని విమర్శించారు. రూ.13 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దైన్య పరిస్థితి తీసుకొచ్చాడని దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ ఐదుగురు బాగుపడితే.. రాష్ట్రం బాగుపడినట్లా అని నిలదీశారు. మోసం చేయడంలో జగన్‌ దిట్టని.. అబద్ధాలు చెప్పడం ఆయనకు పుట్టుకతో వచ్చిన విద్యని విమర్శించారు. ఆయన తమపై నోరు పారేసుకుంటున్నాడని, తామూ బూతులు తిట్టాలంటే ఒక్క నిమిషం పట్టదని అన్నారు. మీకు భవిష్యత్‌ కావాలా..? అరాచక పాలనలోనే ఉంటారా అని ప్రజలను అడిగారు. రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని తరిమేయాలని పిలుపిచ్చారు. జరుగనున్న కురుక్షేత్రంలో ధర్మానిదే విజయమని.. జగన్‌ ఇంటికి పోవడం తథ్యమన్నారు. రాబోయే ప్రజా ప్రభుత్వంలో పేదలను లక్షాధికారులుగా మార్చే బాధ్యత తనదని చెప్పారు.

...

Complete article

  • Haha 1
Link to comment
Share on other sites

  • 0

WOW, THIS IS THE BEST OF ALL PUBLIC REACTION VIDEOS!!

If yellow pulkas have any shame left, they should convert into jaffas after watching this...

కుర్రాడి మాటలకు ఫిదా అవుతారు 🔥👌| Who Is Next CM | AP Public Talk | Praja Galam

 

Link to comment
Share on other sites

  • 0

Pawan Kalyan: మా అన్న చిరంజీవి జోలికొస్తే తాట తీస్తా.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

Untitled_4_ff54f01929_V_jpg--799x414-4g.

పస్తులు లేని ఏపీని నిర్మించడమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తనకు నరసాపురం, మొగల్తూరు రెండు తీపి జ్ఞాపకాలని అన్నారు. ఆదివారం నాడు నరసాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

పశ్చిమగోదావరి: పస్తులు లేని ఏపీని నిర్మించడమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తనకు నరసాపురం, మొగల్తూరు రెండు తీపి జ్ఞాపకాలని అన్నారు. ఆదివారం నాడు నరసాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దం పాటు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని జనసేన ఎదిగిందని తెలిపారు. డబ్బు బలుపు, అహంకారంతో వైసీపీ ఎదిగిందని మండిపడ్డారు. అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలని ప్రశ్నించారు.

సగటు మనిషిని తానని.. దశాబ్దకాలం పాటు దెబ్బలు తిన్నానని చెప్పారు. దానికి కారణం చెక్కు చెదరని మీ ప్రేమ, అభిమానమేనని అన్నారు. మీ బంగారు భవిష్యత్తు కోసం తాను అండగా నిలబడ్డానని చెప్పారు. తన మీద కేసులే లేవని.. జగన్ లాగా 32 కేసులు అసలే లేవని అన్నారు.

5 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం నిలబడాలని బీజేపీ కేంద్ర నాయకులను అడిగితే తనతో కలిసి వచ్చారని అన్నారు. జనసేన- తెలుగుదేశం - బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల్లో ఎలాంటి కోత ఉండదని మాటిచ్చారు. ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.

వెర్రికొర్రి వేషాలు వేయొద్దు...

‘‘జగన్ పేపర్లు లీక్ చేస్తుంటే, తాను చెగువీరా గురించి చదివాను. నన్ను బూతులు తిట్టిస్తారు. నేను చాలా తెగించిన వాడిని. నేను తలుచుకుంటే జగన్ తట్టుకోలేవ్ జాగ్రత్త. నేను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను. జగన్ గొడుగు కిందకు ఎవరైనా వెళ్తే అందరూ రౌడీలుగా మారతారు. నేను బయటకు రాగానే జగన్ కాపలా కుక్కలు తిడుతున్నాయి. వారికి డబ్బులు, అధికారం, అహంకారం ఎక్కువైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏపీకి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుని మెచ్చుకుంటే, ఆయనను సజ్జల రామకృష్ణారెడ్డి తిడతారు. మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు.. మీరు సింహాలా.. సింహం ఎలా వస్తుందో తెలుసా. సజ్జల పులివెందుల నుంచి వచ్చారో, ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చారో తెలీదు. కానీ ఒక విప్లవ కారుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. వైసీపీ గుండా బ్యాచ్‌లు, రౌడీ మూకలను హెచ్చరిస్తున్నా. ఎన్నికల సమయంలో వెర్రికొర్రి వేషాలు వేస్తే తాట తీస్తా. నా మీద సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినా సహించను’’ అని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

చిరంజీవిని బెదిరిస్తున్నారు..

‘‘మా అన్న చిరంజీవిని సజ్జల ఏమైనా అంటే సహించేది లేదు. ఆయన అజాత శత్రువు. ఆయన జోలికి గానీ, శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గం జోలికి వస్తే చూస్తూ ఊరుకోను.. సజ్జల నీకు నా సంగతి తెలీదు.. ఇప్పటి వరకు బూతుల అసెంబ్లీ చూశారు. ఇంట్లో నుంచి బయటకు రాని ఆడబిడ్డలను సైతం తిట్టిన బ్యాచ్ మీది. చిరంజీవిని బెదిరిస్తున్నారు.. ఆయన ఒక మాజీ మంత్రి. ఆయనను బెదిరిస్తే చూస్తూ ఊరుకోను. మీరు నోరు జారండి, తప్పు చేయండి.. మిమ్మల్ని రోడ్డు మీద మోకాళ్ల మీద నడిపిస్తా. ఏమనుకుంటున్నావు.. జగన్ నీ గురించి.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీరు కలుగుల్లో పందికొక్కులు..ఎలుకల సమూహం.. మీరు సింహాలు కాదు’’ అని పవన్ కళ్యాణ్ సెటైర్లు గుప్పించారు.

అన్న క్యాంటీన్లను నిర్వహిస్తాం...

పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు భారీ ఎత్తులో నిర్వహిస్తామని మాటిచ్చారు. నరసాపురం, కోససీమ వశిష్ట వారధి నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

వశిష్ట వారధి నిర్మించకుండా ఓట్లు అడగనని జగన్ అన్నారని.. ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. లేసు పరిశ్రమకు పూర్వ వైభవం కల్పించి, మహిళలకు ఆదాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అక్వా రైతులను జగన్ ముంచేశారని ధ్వజమత్తారు. అక్వా పరిశ్రమను గోదావరి జిల్లాల్లో సమూలంగా ముంచేశారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.

ఆ జీవోను రద్దు చేస్తా...

అక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. గుజరాత్ తర్వాత ఎక్కువ సముద్ర తీరం ఏపీలోనే ఉందని తెలిపారు. మత్స్యకార సామాజిక వర్గాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

పలుమార్లు మత్స్యకారులు అంతర్జాతీయ జలాల్లోకి వెళ్తే కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించానని గుర్తుచేశారు. మత్స్యకారులకు సంబంధించిన 217 జీవోను రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు.

ఆ కేసులను ఎత్తివేస్తాం...

జగన్ ప్యాలస్‌ల మీద ప్యాలస్‌లు కడుతున్నారని దుయ్యబట్టారు. మత్స్యకారులకు మాత్రం జెట్టీలు, హార్బర్లు మాత్రం కట్టడం లేదన్నారు. మత్స్యకారులకు ఏ ప్రమాదం జరిగినా రూ. 10 లక్షలు బీమా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

మత్స్యకారులపై పెట్టిన ఎక్సైజ్ కేసులను అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామన్నారు. జగన్ ఈ మధ్య సభల్లో చాలా ఎక్కువ మాట్లాడారని అన్నారు. ఒక కులాన్ని నమ్ముకుంటే వ్యాపారాలు చేయలేరని చెప్పారు. కానీ జగన్ కాపులను టార్గెట్ చేస్తూ, తనను వారితో తిట్టిస్తారని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ప్రచారానికి ఇంకా 20 రోజులే... చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

1ba_5a8e3a4d18_V_jpg--799x414-4g.webp

తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం నాడు బీ ఫామ్స్ (B forms) అందజేశారు. బీ ఫామ్స్ అందజేసిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం నాడు బీ ఫామ్స్ (B forms) అందజేశారు. బీ ఫామ్స్ అందజేసిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బీ ఫాం తీసుకున్న ప్రతి అభ్యర్థి ఈ ఎన్నికల్లో గెలిచి రావాలని ఆశీర్వదించారు. ఏపీకి ఏం చేశారో చెప్పుకోలేకే సీఎం జగన్ (CM Jagan) డ్రామాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు.

సంకల్పంతో అభ్యర్థులు ముందుకెళ్లాలి

పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు. మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ప్రచారానికి ఇంకా 20 రోజులే ఉందని.. ఈ సమయం ఎంతో కీలకమని సూచించారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం... సంకల్పంతో ముందుకెళ్లాలని అభ్యర్థులను దీవించారు. ప్రజలు గెలవాలి... రాష్ట్రం నిలవాలన్నదే మన నినాదమని అన్నారు.

ఓటు బదిలీ జరగాలి..

తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతల మధ్య సమన్వయం ఉండాలని.. ఓటు బదిలీ జరగాలని అన్నారు. ప్రజాగళానికి వస్తున్న స్పందన జగన్ పతనాన్ని చాటిచెబుతోందన్నారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు.

జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత..

పార్టీ క్యాడర్‌తో ప్రతి అభ్యర్థి అనుసంధానం కావాలని సూచించారు. అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. వైసీపీలో సీటు ఇస్తానన్నా తీసుకోకుండా చాలామంది ఆ పార్టీ నేతలు బయటకు వచ్చి టీడీపీలో చేరారని తెలిపారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి మంచి వాళ్లను మాత్రమే తీసుకుని సీట్లు ఇచ్చానని గుర్తుచేశారు. పార్టీలో కొత్తగా చేరిన నేతలు పార్టీ లైన్ ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. ఎన్నికలకు ఇంకా 22 రోజుల సమయమే ఉందని.. .ప్రచారానికి 20 రోజులే ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం..

తాను ఇప్పటికే 40కి పైగా ప్రజాగళం సభలు నిర్వహించానని పేర్కొన్నారు. పలు సభలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తోనూ కలిసి నిర్వహించానని వివరించారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

లేనిది ఉన్నట్లు... ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్ సిద్ధహస్తుడని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లోనూ సానుభూతితో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రూ.43 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధారిస్తే దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని జగన్ ప్రచారం చేసుకున్నారని అన్నారు.

బోండా ఉమాపై కుట్రలు..

జగన్ బస్సు యాత్రలో వాళ్లే కరెంట్ తీసేసుకున్నారని.. తనపై అంభాడాలు మోపుతున్నారని మండిపడ్డారు. చీకట్లో తాను దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ఫ్లకార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేశారని దుయ్యబట్టారు. రాయి విసిరిన వ్యక్తితో టీడీపీ నేత బోండా ఉమమహేశ్వరరావు ప్రమేయం ఉందని చెప్పించేలా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెన్షన్ల పంపిణీకి నిధుల్లేకుండా చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

ఏపీని అడ్డగోలుగా దోచుకున్నారు..

వలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతో పెన్షన్లు ఆగిపోయాయని తనపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. జగనే అందరినీ అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. కానీ మళ్లీ ఆయనే తనను అంతం చేయడానికి వస్తున్నారని ఎదుటివారిపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి, పోలవరాన్ని విధ్వంసం చేశారని.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

what a dysfunctional family! one family member does not know what the other family members are stating to public because they are not interested in politics or people but just SCAMMING public money!

she is just trying to appease the women and saying YES for everything and "yes, it is difficult for you" lol. does anyone think this multi-millionaire politician woman is really interested in listening to people's woes??

on the other hand cbn is promising to cheering pulka voters that he is going to supply high quality alcohol at lower prices. HOW?? where is the money going to come from to offer high quality alcohol at lower prices???? just fooling public.

has any political leader ever campaigned on the basis of providing alcohol to voters?? such are these illiterate visionaries.

ఆయన వింటున్నారు on prohibition

 

  • Best 1
Link to comment
Share on other sites

  • 0

Nara Lokesh: ఏపీ సీఈవో నోటీసులకు నారా లోకేశ్ వివరణ

సైకో పోవాలి సైకిల్ రావాలి పాటపై సీఈవోకు ఫిర్యాదు చేసిన వైసీపీ

నారా లోకేశ్ కు నోటీసులు

కోడ్ రాకముందే ఆ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారన్న లోకేశ్

చంద్రబాబు, పవన్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సీఈవోకు ఫిర్యాదు

cr-20240420tn662383e64afe3.jpg

ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు నోటీసులు జారీ చేయడం తెలిసిందే. సైకో పోవాలి సైకిల్ రావాలి పాటకు సంబంధించి వైసీపీ నేతలు సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, నారా లోకేశ్ ఆ నోటీసులకు సమాధానం ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఆ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారని వివరణ ఇచ్చారు. 

మేమంతా సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సీఎం జగన్  అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని లోకేశ్ ఈ సందర్భంగా సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. భీమవరం సభలో సీఎం జగన్ ఎన్నికల నియమావళి అతిక్రమించారని ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నాయని కూడా లోకేశ్ సీఈవోకు ఫిర్యాదు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ఏపీని పేద‌రికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తా: చంద్ర‌బాబు

జ‌గ‌న్ పాల‌న‌లో కుంభ‌కోణాలు త‌ప్ప ఏమీ లేవ‌న్న టీడీపీ అధినేత‌

అంద‌రినీ మోసం చేసి ఒక్క‌డే ఉండాల‌నుకునే వ్య‌క్తి జ‌గ‌న్ అని ధ్వ‌జం

సంప‌ద సృష్టించ‌డం తెలిసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్న‌ చంద్ర‌బాబు

cr-20240420tn6623810d34f2b.jpg

చంద్ర‌బాబు నాయుడు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గూడూరులో మహిళ‌ల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని పేద‌రికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తాన‌ని అన్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో కుంభ‌కోణాలు త‌ప్ప ఏమీ లేవ‌న్నారు. స్కామ్‌లు జ‌రిగితే ప్ర‌జ‌లంతా బానిస‌లుగా ఉండాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. అంద‌రినీ మోసం చేసి ఒక్క‌డే ఉండాల‌నుకునే వ్య‌క్తి జ‌గ‌న్ అని విమ‌ర్శించారు. దీపం ప‌థ‌కం కింద వంట గ్యాస్ ఇస్తే దాన్ని ఆర్పేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. సంప‌ద సృష్టించ‌డం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...