Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

Chandrababu Praja Galam: టీడీపీ ప్రజాగళం ఎన్నికల ప్రచారం


TELUGU

Question

Chandrababu: నాలాగా జగన్ మండుటెండలో మూడు సభల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా?: చంద్రబాబు సవాల్

సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు రిప్లయ్

జగన్ ను పిల్లకాకితో పోల్చిన టీడీపీ అధినేత

జగన్ పనిదొంగ అంటూ విమర్శలు

cr-20240329tn6606b615205a5.jpg

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. జగన్ నా వయసు గురించి మాట్లాడతాడు... నా మాదిరిగా మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని, సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా ఈ జగన్? అని ఎద్దేవా చేశారు. 

"ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడని అడుగుతాడు... తెలుగు రాష్ట్రాల్లో  పిల్లలను అడిగినా చెబుతారు నేను ఏం చేశానో. అతనికి తెలియకపోతే ఆ అజ్ఞానానికి ఎవరేం చేయగలం?" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

అంతేకాదు, బనగానపల్లెలో తాను జగన్ పై చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా చంద్రబాబు పంచుకున్నారు. జగన్ ను పిల్లకాకితో పోల్చారు. నాలాగా రెండ్రోజులు మధ్యాహ్నం ఒంటిగంటకు మంచి ఎండలో మీటింగ్ లు పెట్టగలవా? అని సవాల్ విసిరారు. పనిదొంగ, దోపిడీదారుడు ఈ జగన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Chandrababu: అసలే డ్రైవింగ్ తెలియని వ్యక్తి... రివర్స్ గేర్ లో తీసుకెళుతున్నాడు: చంద్రబాబు

29-04-2024 Mon 21:00 | Andhra

నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రజాగళం సభ

ప్రతి ఒక్కరినీ నాశనం చేసిన వ్యక్తి జగన్ అంటూ చంద్రబాబు ధ్వజం

ఏమిటీ చెత్త పరిపాలన అంటూ విమర్శలు

డ్రైవింగ్ చేతకాని వ్యక్తికి డ్రైవింగ్ అప్పగించారని వ్యాఖ్యలు

cr-20240429tn662fbd1c8fcf9.jpg

నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు. యువత, రైతులు, బీసీలు, ముస్లింలు, మహిళలు... ఇలా ఏ వర్గం వారు కూడా ఆనందంగా లేరని అన్నారు. ఏమిటీ చెత్త పరిపాలన అంటూ విమర్శించారు. 

"సైకో జగన్ కు తెలిసిందల్లా రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, కేసులు... ఇవి కాకుండా ఒక్క మంచి పని చేశాడా? నేను నందికొట్కూరు నుంచి సవాల్ విసురుతున్నా. నేనేం చేశానో చెబుతున్నా. ఈ జిల్లాను తీసుకుంటే... తంగడంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు ముందుకెళ్లాను. అది వచ్చుంటే రైతులకు ఆదాయం పెరిగేది, మీరు పండించే పంట విత్తనాలుగా మారి ప్రపంచానికి వెళ్లుంటే మీ ఆదాయం పెరిగి పరిశ్రమలు వచ్చేవి. ఈ యువత ఎక్కడికీ వెళ్లే పనిలేకుండా మీ ఊర్లోనే ఉద్యోగాలు వచ్చేవి. 

అమెరికాలోనే బెస్ట్ విద్యాసంస్థ అయోవా యూనివర్సిటీ. ఆ సంస్థతో  ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. కానీ ఈ దుర్మార్గుడు, దుష్టుడు ఆ ఎంఓయూ నేను చేశానన్న కారణంతో మీ పొట్టకొట్టాడు. 

రూ.365 కోట్లతో జైన్ ఇరిగేషన్ కు ఒక ప్రాజెక్టు ఇచ్చాం. ఆ ప్రాజెక్టుతో నర్సరీ మొత్తం తయారుచేసి, ఆదర్శప్రాయమైన మైక్రో ఇరిగేషన్ తో రాయలసీమను హార్టికల్చర్ గా మార్చి మీ ఆదాయాన్ని రెట్టింపు చేయాలని భావించాను. కానీ ఈ రోజు జైన్ ఇరిగేషన్ వచ్చిందా? ముచ్చుమరి ప్రాజెక్టు పూర్తి చేసింది ఎవరు? ఇలాంటి ప్రాజెక్టులు ఒకటీ రెండు కాదు. 

మరోవైపు ఓర్వకల్లు. నేనే ఒక్క సంవత్సరంలో ఎయిర్ పోర్టు కట్టించాను. ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా వెళ్లేందుకు ప్రణాళికలు రచించాను. సోలార్ పార్క్, విండ్ మిల్స్, పంప్డ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాను. ఇవాళ ఇవన్నీ వచ్చాయా? ఇవన్నీ గనుక వచ్చుంటే హైదరాబాద్ కు నందికొట్కూరు ఒక శాటిలైట్ టౌన్ షిప్ మాదిరిగా తయారయ్యేది. 

కానీ ఈ రాయలసీమ ద్రోహిని, నందికొట్కూరును నాశనం చేసిన వ్యక్తిని మీరు క్షమిస్తారా? ఈ జగన్ ఒక సైకో, ఒక అహంకారి, విధ్వంసకారుడు. ఊరికొక సైకోను తయారుచేశాడు. ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఉన్నాడు. 

ముఖ్యమంత్రిగా ఉండేందుకు జగన్ కు అర్హత ఉందా? పరిపాలన చేతకాని వ్యక్తి జగన్. డ్రైవింగ్ చేతకాని వ్యక్తికి మీరు డ్రైవింగ్ అప్పగించారు. అసలే డ్రైవింగ్ తెలియదు, రివర్స్ గేర్ లో తీసుకెళుతూ అందరి జీవితాలను నాశనం చేస్తున్నాడు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu on pension distributions: ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ సాధ్యమే... చంద్రబాబు కీలక ప్రెస్ మీట్

29-04-2024 Mon 14:35 | Andhra

ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ప్రహసనంలా మారిన వైనం

సచివాలయాల వద్ద పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం

పలువురు వృద్ధుల మృతి

మీరే కారణం అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న అధికార, విపక్షాలు

ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ పెద్ద కష్టమైన పనేం కాదంటూ వివరాలు తెలిపిన చంద్రబాబు

cr-20240429tn662f62f112f90.jpg

మే 1వ తేదీ వస్తుండడంతో మళ్లీ అందరి దృష్టి పెన్షన్ల పంపిణీపై పడింది. ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ఒక ప్రహసనంలా మారడం తెలిసిందే.

ఇళ్ల వద్దకే పెన్షన్లు అందించాలని ఈసీ ఆదేశించినా ప్రభుత్వం సచివాలయాల వద్ద పెన్షన్లు ఇచ్చిందని విపక్షాలు భగ్గుమనడం, విపక్షాలు వాలంటీర్లపై ఫిర్యాదు చేయడం వల్లే సచివాలయాల వద్ద ఇవ్వాల్సి వచ్చిందని, అందుకే పలువురు వృద్ధులు ఎండవేడిమికి మరణించారని ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం అందరూ చూశారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ప్రెస్ మీట్ పెట్టి పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాల్సిందేనని, ఈసీ ఆదేశాలు పాటించాలని డిమాండ్ చేశారు. "పెన్షన్లు ఇంటివద్దే పంపిణీ చేయండి... ఇది సాధ్యం. మీకు అధికారులు ఉన్నారు... సచివాలయాలు ఉన్నాయి... యంత్రాంగం ఉంది... ఇది పెద్ద కష్టమైన పని కాదు... అని చాలా స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. 

ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, సీఎంవోలో ఉండే పెద్ద పైరవీకారుడు ధనంజయరెడ్డి, సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి వీళ్లు కలిసి మళ్లీ అదే కుట్రకు తెరలేపారు. పెన్షన్ల పంపిణీపై మేం (ఎన్డీయే కూటమి) చాలాసార్లు ఎన్నికల సంఘాన్ని కలిశాం.... గవర్నర్ ను కలిశాం... ఏం చేస్తే బాగుంటుందనేది సూచనల రూపంలో తెలియజేశాం. 

ఎన్నికల సంఘం కూడా... ఇదేమంత  కష్టం కాదు, ఎలాగైనా ఇళ్ల వద్దనే పెన్షన్లు అందించాలని స్పష్టం చేసింది. పోయినసారి జరిగిన సంఘటనలు పునరావృతం కారాదని కూడా ఆదేశాలు ఇచ్చింది. 

సచివాలయాల ద్వారా 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. 15 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, 5 వేల మంది వెలుగు సిబ్బంది, 5 వేల మంది వ్యవసాయ శాఖ సిబ్బంది, 3 వేల మంది హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు. వీరందరూ గ్రామస్థాయిలో ఉన్నారు. వేలిముద్రలు, కనుపాపల నిర్ధారణ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. 

కానీ ప్రభుత్వం మొండికేస్తోంది. ఎన్నికల సంఘం చెప్పినా ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఆయా సిబ్బంది గ్రామ స్థాయిలోనే పనిచేస్తున్నా వారికి లబ్దిదారుల ఇళ్లు తెలియవట... ఊర్లో ఎవరుంటున్నారో కూడా తెలియకుండా వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారా? 

ఇప్పుడు మళ్లీ కొత్త కుట్రకు తెరలేపారు... పింఛన్లు బ్యాంకులో వేస్తారట! కిందటిసారి ప్రభుత్వం ఏం చెప్పింది... మా వద్ద లబ్దిదారుల బ్యాంకు ఖాతాల వివరాలు లేవని చెప్పింది. పోయిన నెలలో లేని బ్యాంకు ఖాతాలు ఇప్పుడెలా వచ్చాయి? మీరెలాంటి కుట్రలు  చేసినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. 

ప్రభుత్వం ఏంచెబుతోంది అంటే... ఆధార్ లింక్ అయినవాళ్లందరికీ బ్యాంకులో వేస్తామని, మిగిలిన వాళ్లందరికీ ఇంటికి వెళ్లి ఇస్తామని చెబుతోంది. రాష్ట్రంలో మొత్తం 65,49,000 మంది పింఛన్ లబ్దిదారులు ఉన్నారు. వీరిలో 48,92,000 మందికి అకౌంట్ వివరాలు లింక్ అయి ఉన్నాయట. అంటే దాదాపు 75 శాతం మందికి బ్యాంకు ఖాతాల్లో పింఛను జమచేస్తారట. మిగిలిన వారిలో ఎవరైతే అకౌంట్ వివరాలు లింకు లేని వాళ్లు, దివ్యాంగులు, నడవలేనివాళ్లు 16,57,000 మంది ఉన్నారంటున్నారు. 

ఎవరు నడవలేరు అనేది చెప్పేందుకు మీరేమైనా నిర్ధారణ చేశారా? చిరునామాలు ఉన్నాయా? రాత్రికి రాత్రే వెరిఫై చేశారా? మీ వద్ద ఎవరు వికలాంగులు, ఎవరు నడవలేరు అనే డేటా ఉంటే వాళ్ల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వొచ్చు కదా? 

దీన్నిబట్టి అర్థమవుతోంది ఏంటంటే... వీళ్లు బోగస్ సమాచారంతో కాలయాపన చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇది సరైన పంథా కాదు. ప్రజలను మోసం చేయొద్దు. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతతో పనిచేయాలి" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ఈ ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు: డోన్ లో చంద్రబాబు వ్యాఖ్యలు

29-04-2024 Mon 17:25 | Andhra

నంద్యాల జిల్లా డోన్ లో ప్రజాగళం సభ

రాష్ట్రంలో దొంగలు పడ్డారన్న చంద్రబాబు

ఆ దొంగలను పట్టే రోజు మే 13 అని వెల్లడి

మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టారని విమర్శలు

రుణభారాన్ని ప్రజల నెత్తిపై మోపిన దుర్మార్గుడు బుగ్గన అంటూ వ్యాఖ్యలు

cr-20240429tn662f8aa272a56.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల జిల్లా డోన్ లో ప్రజాగళం సభకు హాజరయ్యారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని, నంద్యాల లోక్ సభ స్థానం అభ్యర్థి బైరెడ్డి శబరిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని, ఈ దొంగలను పట్టే రోజు మే 13 అని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మద్యంపై వచ్చే ఆదాయం రూ.25 వేల కోట్లు తాకట్టు పెట్టారని, ఆ భారాన్ని ప్రజల నెత్తిపై మోపిన దుర్మార్గుడు ఈ బుగ్గన అని మండిపడ్డారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు హరికథలు చెబుతున్నారని విమర్శించారు. వీళ్లు రాయలసీమకు ఏమైనా చేశారా, ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక రోడ్డు వేశారా, ఒక పరిశ్రమ తెచ్చారా? వీళ్లకు ఎందుకు ఓట్లేయాలి? అని ప్రశ్నించారు. 

"ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి రంగుల పిచ్చోడు. రంగులు వేసుకోవడానికి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశాడు. ప్రజలు ఈ సైకోకు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపించాలి. ఇతడు బడికి, గుడికి, ఆఖరికి చెట్లకు రంగులు వేశాడు. ఎప్పుడైనా ఇలాంటి వాడ్ని చూశారా? సలహాదారుల కింద 100 మందిని పెట్టుకుని వాళ్లకు రూ.700 కోట్లు అప్పజెప్పాడు. ఇంకోపక్క, సాక్షి పత్రికకు వాణిజ్య ప్రకటనల కింద రూ.1000 కోట్లు ఇచ్చాడు. 

ఇప్పుడు అడుగుతున్నా... రాయలసీమ సాగునీటికి ఖర్చు పెట్టారా? తాగు నీటికి ఖర్చు పెట్టారా? ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వని వీళ్ల అవసరం మనకుందా? ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, ఆరోగ్యశ్రీకి రూ.1500 కోట్లు బకాయిలు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టింది. 

ఐదేళ్లుగా రైతాంగాన్ని కుదేలు చేశారు. రైతులను తొక్కేశారు. నేను ఇక్కడ 90 శాతం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను... ఈ ప్రభుత్వం ఇస్తోందా? రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చి రైతు గౌరవంగా తిరిగే పరిస్థితి కల్పించిన పార్టీ టీడీపీ. కానీ ఈ ప్రభుత్వ పాలనలో పండ్ల తోటలు, కూరగాయల సాగు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతను ఆదుకుంటాం. ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థికసాయం అందిస్తాం" అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇక్కడే ఎమ్మార్పీఎస్ వాళ్లు కూడా ఉన్నారు... మాదిగ కాలనీలకు వెళ్లండి... ఇంటింటికీ చెప్పండి... ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ... మళ్లీ ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయబోయేది ఎన్డీయే... మంద కృష్ణ మాదిగ కూడా రేపట్నించి వచ్చి ప్రచారం చేస్తాడు అని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AP Elections 2024: డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్‌ గేర్‌లో వెళ్లింది: చంద్రబాబు

ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్‌, లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్‌ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

babu5_712d2ac695_V_jpg--799x414-4g.webp

Nara Chandrababu Naidu

చీరాల: ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్‌, లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్‌ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ప్రజావేదికను కూల్చి పాలన ప్రారంభించారని ధ్వజమెత్తారు.

Janasena: గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత రిలీఫ్..

పోలీసు వ్యవస్థ ద్వారా ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. జగన్‌ ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్‌ యాక్టు తీసుకువచ్చారని అన్నారు. ఈ సైకో(జగన్)ను ఇంటికి సాగనంపాలని అందరిలో కసి ఉందన్నారు.ప్రజల భూములపై జగన్‌ పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం రద్దు ఫైల్‌పై రెండో సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ దుర్మార్గ పాలనను తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మాటిచ్చారు. డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్‌ గేర్‌లో వెళ్లిందని విమర్శించారు. టీచర్లను మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టారని ధ్వజమెత్తారు.

ఏపీని రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఫైర్ అయ్యారు. ఏపీకి కేంద్రం నుంచి అప్పులు వచ్చే పరిస్థితి లేదని.. ఆదాయం తగ్గిందని.. జీతాలు ఇవ్వలేరని అన్నారు. ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే పరిపాలన చేయాలన్నారు. ఇష్టానుసారం జేబ్రాండ్లు పెట్టి ఏపీని అతలాకుతలం చేశారని ఏకిపారేశారు. ఏపీలో 30వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఏపీని జగన్ నియంతలా పాలించాలనుకున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu on Amaravati and schemes: అమరావతి లేకపోతే ఏంటి నష్టం అనుకుంటున్నారా?: చంద్రబాబు

01-05-2024 Wed 17:51 | Andhra

బాపట్ల జిల్లా చీరాలలో ప్రజాగళం సభ

అమరావతి విశిష్టతను వివరించిన చంద్రబాబు

రాజధాని పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆవేదన

జగన్ చేసిన వాటిలో మంచి పనులు ఉంటే కొనసాగిస్తామని స్పష్టీకరణ

cr-20240501tn663233ba62680.jpg

బాపట్ల జిల్లా చీరాలలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని అవసరాన్ని నొక్కి చెప్పారు. 

"అమరావతి లేకపోతే నష్టం ఏంటి అనుకుంటున్నారా? అమరావతి పూర్తయి ఉంటే ఒకటిన్నర గంటలో అమరావతి వెళ్లి పనిచూసుకుని సాయంత్రానికి తిరిగొచ్చే వీలుండేది. మన పిల్లల చదువు కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం అమరావతి ఒక కేంద్రంగా ఉండేది. సంపద సృష్టించడానికి ఒక కేంద్రంగా ఉండేది. సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన ఆదాయాన్ని పెంచే ఒక కేంద్రంగా ఉండేది. 

చీరాల, బాపట్లలో పని దొరక్కపోతే హైదరాబాద్ కో, చెన్నైకో, బెంగళూరుకో వెళ్లే ఖర్మ పట్టింది. ఇప్పటికే అదే పరిస్థితి కొనసాగుతోంది. ఎవరన్నా మీ రాజధాని ఏదంటే, రాజధాని పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో తెలుగుజాతి ఉంది. 

పట్టిసీమ ప్రాజెక్టు నేను ప్రారంభించానని, నేను నిర్మించానని, ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఉపయోగించుకోని దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి కొన్ని పనులు చేశాడు... వాటిలో కొన్ని చెడ్డపనులు ఉన్నాయి... వాటిని సరిదిద్దుతాం. అతడు చేసిన వాటిలో కొన్ని మంచి పనులు ఉంటే నేను అవి కూడా కొనసాగిస్తానే తప్ప, ఒక సైకో చేశాడని అతడి లాగా నేను విధ్వంసం చేయను. 

అందరూ మే 13వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజలంతా కూటమి అభ్యర్థుల గుర్తులపై ఓటు వేసి గెలిపించాలి. బాపట్ల ఎంపీ అభ్యర్థి టీడీపీ నాయకుడే... ఈ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే పోటీ చేస్తున్నారు. పోయినసారి కూడా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారు... ఈసారి నాకు అనుమానమే లేదు... ఏడుకు ఏడు మనం గెలుస్తున్నాం... స్వేచ్ఛగా, ఆలోచించి, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి. 

నిన్న మేనిఫెస్టో విడుదల చేశాం. దేశంలోనే తొలిసారిగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారి పిల్లలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం. మేం అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. పెంచిన పెన్షన్ ను ఏప్రిల్ నుంచే వర్తించేలా ఇస్తాం. అతడు (జగన్) కూడా పెన్షన్ పెంచుతానంటున్నాడు. 2028కి రూ.250 పెంచుతాడట, 2029కి మరో రూ.250 పెంచుతాడట. 

నేను అలా చెప్పడంలేదు... ఏప్రిల్ నుంచే పెంచుతాం... దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తాం. పూర్తిగా కాళ్లు, చేతులు లేని వారికి నెలకు రూ.15 వేలు ఇస్తాం. కొందరు కిడ్నీ, తలసేమియా బాధితులకు రూ.10 వేలు ఇస్తాం. మళ్లీ చంద్రన్న బీమా తీసుకువస్తాం... సహజంగా చనిపోతే రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు ఇచ్చే బాధ్యత మాది. 

ప్రతి ఒక్క కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తాం. డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తాం, మండల కేంద్రాల్లో జనరిక్ ఔషధాల దుకాణాలు తెరుస్తాం. బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా మందులు సరఫరా చేస్తాం" అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

does cbn have alzheimer's? this is not the first time he sounded like he is working for ycp. election win ayite, 5 years kastame.

cbn asking people to vote for ycp candidate

:emoji-nervous::emoji-lol:

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: నెల్లూరులో కూటమి రోడ్ షో... హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్

03-05-2024 Fri 20:24 | Andhra

ఏపీలో మే 13న ఎన్నికలు

ప్రచార వేగం పెంచిన కూటమి పార్టీలు

నేడు ఉమ్మడిగా నెల్లూరులో రోడ్ షో, సభ

cr-20240503tn6634fab1c4c49.jpg

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో, కూటమి నేతలు ప్రచారంలో ఊపు పెంచారు. వరుసబెట్టి సభలు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ నెల్లూరు సిటీలో నిర్వహించిన భారీ రోడ్ షోకు హాజరయ్యారు. 

రోడ్ షోలో కూటమి పెద్దలు చంద్రబాబు, పవన్ పాల్గొనడంతో టీడీపీ, జనసేన శ్రేణులు పోటెత్తాయి. నెల్లూరు నగరం జనసంద్రాన్ని తలపించింది. బాణసంచా మోతలు, పార్టీల గీతాలతో నెల్లూరు రోడ్లు హోరెత్తాయి. పవన్ వీలైనంతవరకు అభిమానులతో చేయి కలుపుతూ ముందుకు సాగగా, చంద్రబాబు అభివాదం చేస్తూ కూటమి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu on 4000 pension: మేం వస్తూనే రూ.4 వేలు పెన్షన్ ఇస్తాం... జగన్ 2028 నాటికి రూ.250 పెంచుతాడంట!: చంద్రబాబు

03-05-2024 Fri 18:18 | Andhra

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభ

టీడీపీ ఎప్పుడూ పేదల పక్షమేనన్న చంద్రబాబు

తాము అధికారంలోకి రాగానే ఇంటివద్దనే పెన్షన్ ఇస్తామని హామీ

పెన్షన్ల కోసం వృద్ధులను బ్యాంకులకు తిప్పుతున్నారని ఆగ్రహం 

ప్రభుత్వానికి, సీఎస్ కు వృద్ధుల ఉసురు తగులుతుందని వ్యాఖ్యలు

cr-20240503tn6634dd18b2b19.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాగళం సభలో మేనిఫెస్టో హామీలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తూనే ఏప్రిల్ నెల నుంచి వర్తించేలా రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కానీ జగన్ 2028 నాటికి రూ.250 పెంచుతాడంట అని వెల్లడించారు. ఇప్పుడు చెప్పండి... పేదల పెన్నిధి ఎవరు? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదల పక్షమేనని అన్నారు. 

ఏపీలో సచివాలయాలు, పంచాయతీల్లో 1.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, వారు ఒక్కొక్కరు 40 మందికి ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి వృద్ధులను చంపేసే పరిస్థితికి వచ్చాడని చంద్రబాబు మండిపడ్డారు. ఇంటి దగ్గర ఇవ్వకుండా, వృద్ధులను సచివాలయాలకు తిప్పి, అక్కడా ఇవ్వకుండా పండుటాకుల వంటి ముసలి వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దుర్మార్గం ఇది, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. 

ఈ నెల పెన్షన్లపైనా తాము పోరాడామని, సిబ్బంది ద్వారా ఇప్పించాలని చెప్పామని, కానీ ఈ దుర్మార్గుడు ఇంటివద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో వేశాడు... బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేయడం ముసలివాళ్లకు తెలుసా? అని ఆగ్రహం వెలిబుచ్చారు. 

"ఐఏఎస్ చదువుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడుగుతున్నా... ముసలివాళ్లు ఐదు కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లగలరా? బ్యాంకుకు వెళితే ఆధార్ కార్డు కావాలి, పాన్ నెంబరు కావాలి... పాపం ఆ ముసలివాళ్లు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతెలియకుండా అవస్థ పడుతున్నారు. ఇప్పుడు చెబుతున్నా... మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేనుంటా. రూ.4 వేల పెన్షన్ ఇస్తా... 1వ తేదీనే మీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది. ప్రభుత్వాన్ని, సీఎస్ ను హెచ్చరిస్తున్నా... ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వృద్ధులు పడే క్షోభ నేను చూశాను... వారి ఉసురు మీకు తగులుతుంది" అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu on Modi's guarantee: ఇప్పుడు మనకు మోదీ గ్యారెంటీ ఉంది: అనకాపల్లి సభలో చంద్రబాబు

06-05-2024 Mon 19:25 | Andhra

అనకాపల్లిలో ప్రజాగళం సభ

హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు

ప్రధాని మోదీ వెళ్లిపోయాక చంద్రబాబు ప్రసంగం

మోదీ అనకాపల్లి సభ ద్వారా స్పష్టమైన భరోసా ఇచ్చారన్న టీడీపీ అధినేత

cr-20240506tn6638e14b6f131.jpg

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అనకాపల్లి ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ అనకాపల్లి సభ ద్వారా ఏపీ భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చారని తెలిపారు. తద్వారా రాబోయే రోజుల్లో ఏపీకి అన్నీ మంచి శకునాలే, వైసీపీకి అన్నీ పీడ శకునాలే అని అభివర్ణించారు. 

మూడు పార్టీలు ఎందుకు కలిశాయని చాలామందికి సందేహాలు ఉన్నాయని, దానిపై నిన్న అమిత్ షా స్పష్టంగా వివరణ ఇచ్చారని, ఇవాళ మోదీ చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. 

పవన్ కు ఆ గౌరవం చాలకనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఒకే మాట చెబుతున్నాడు... సైకోజగన్ పోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి... ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయన సీట్ల కోసం ఆలోచించలేదు. ఆయనకు సినీ జీవితంలో గౌరవం లేకనా? అంతకుమించిన గౌరవం ఇక్కడొస్తుందని ఆయన రాజకీయాల్లోకి రాలేదు. తనను నమ్ముకున్న ఈ ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 

నాడు ఇదే విశాఖకు పవన్ వస్తే అడుగడుగునా ఆటంకాలు కల్పించారు, ఉన్నపళంగా వేరే ప్రాంతానికి తరలించారు. విశాఖపట్నం వీళ్లబ్బ సొమ్ము అని సైకో అనుకుంటున్నాడు. విశాఖ ఏమైనా వీళ్ల తాత జాగీరా? 

వ్యక్తిగత విమర్శలు చేశాడు. పవన్ ను ఎంతో అవమానించాడు. పవన్ కు ఇక్కడ విశాఖలో జరిగిన అవమానం జరిగిన తర్వాత నేను విజయవాడ వెళ్లి కలిసి ఆయనకు సంఘీభావం తెలిపాను. తిరిగి నన్ను జైల్లో పెట్టిన తర్వాత, ఇంకేమీ ఆలోచించకుండా పొత్తు ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కల్యాణ్. అదీ ఆయన చిత్తశుద్ధి. సినిమాల్లోనే హీరో కాదు... ప్రజా జీవితంలో నిజమైన హీరో పవన్. 

మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అవమానాలు భరించాం... ప్రజలను కాపాడుకునేందుకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఇవాళ చెబుతున్నా... ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరు. మోదీ కూడా చెప్పారు... గెలుపు మనదే. సైకోను ఎక్కడికి పంపించాలో ప్రజలే నిర్ణయించాలి. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి ఈ సైకో. 

అదే మా కల!

ప్రధాని మోదీ గత పదేళ్లలో దేశాన్ని ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. రాబోయే ఐదేళ్లలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తామని సంకల్పం ప్రకటించారు. 2047 నాటికి వికసిత్ భారత్ అనేది మోదీ కల... అదే సమయంలో వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది నా కల, పవన్ కల్యాణ్ కల! 

ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ కావాలి, దేశంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం కావాలి, ప్రపంచంలో తెలుగుజాతి నెంబర్ వన్ కావాలి, పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం ఈ కూటమి ద్వారా సాధిస్తాం. ఇప్పుడు మనకు మోదీ గ్యారెంటీ ఉంది, మన సూపర్ సిక్స్ ఉంది. అదేవిధంగా నేను, పవన్ కల్యాణ్ కలిసి ఎన్నికల  మేనిఫెస్టో తీసుకువచ్చాం. మన మేనిఫెస్టో రావడంతోనే సైకో మేనిఫెస్టో వెలవెలపోయింది. 

మన మేనిఫెస్టోకు ఆదరణ పెరిగింది. 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలుస్తున్నాం. 160 అసెంబ్లీ సీట్లు కూటమే గెలుస్తుంది. సైకోను ఇంటికి పంపిస్తాం. ఎన్ని నాటకాలు వేశాడు ఇతడు. 2019కి ముందు ఊరూరా తిరిగాడు. ఆ రోజున నేను తలుచుకుని ఉంటే బయట తిరిగేవాడా? అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు! 

ఇప్పుడీ ముఖ్యమంత్రి కొత్తగా టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చాడు. ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా... భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస్ బుక్ పై ఎవరి ఫొటో ఉండాలి? జగనన్న భూ హక్కు అంట! భూములు ఇచ్చింది నీ తాతలా? మా తాతలు మాకు ఇచ్చారు... దానిపై నీ ఫొటో ఏంది? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నేను నా పాస్ పుస్తకంపై సైకో ఫొటో పెట్టుకోవాలా? 

సీన్ మారిపోయింది!

నిన్న ఉద్యోగులను చూస్తే కడుపు నిండిపోయింది. నిన్న, ఇవాళ పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైసీపీ వాళ్లు వెళితే... ఒంగోలులో ఛీ కొట్టారు. 

వాళ్లిచ్చిన డబ్బులు తీసుకోకుండా ఓ మహిళ మా క్యాంపు వద్దకు వచ్చి... వాళ్ల డబ్బును ఛీ కొట్టాం, నేను రూ.10 వేలు ఇస్తున్నా... ఈ డబ్బును పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించాలని కోరిందంటే సీన్ ఎలా మారిపోయిందో అర్థమైందా? ఉద్యోగులంతా కూటమికే ఓట్లేశారు, వేస్తున్నారు కూడా. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గెలుపు మనదే. సైకో... నీ సీన్ అయిపోయింది, ఇక నీ డబ్బులు పనిచేయవు. 

మళ్లీ అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం

ఇవాళ మోదీ చెప్పినట్టు  మళ్లీ పోలవరం కడతాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం. మోదీ గ్యారెంటీలను, మన మేనిఫెస్టోను శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఇవాళ ఇతడి డ్రామాలన్నీ అయిపోయాయి. 2014లో తండ్రి లేని బిడ్డనని వచ్చాడు. మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని, వాళ్ల షాపులపై దాడి చేశాడు. 2019లో గెలిచాక, రిలయన్స్ అధినేత చెప్పిన వారికి రాజ్యసభ సీటు ఇచ్చాడు. ఇదీ ఆయన రాజకీయ నీతి! 

హూ కిల్డ్ బాబాయ్ అంటే అందరికీ అర్థమైంది... జగ్గూ భాయ్ కి మాత్రం అర్థం కాలేదు. అందరూ వెళ్లి జగ్గూ భాయ్ చెవిలో చెప్పాలి... నువ్వే మీ బాబాయ్ ని చంపి నాటకాలు ఆడుతున్నావు అని చెప్పాలి. 

ఇది నాకు ఇష్టమైన సిటీ

విశాఖ నేను మెచ్చిన నగరం. ఈ జిల్లా అంటే నాకు చాలా ఇష్టం. ఇది మంచి వాళ్లు ఉండే ప్రాంతం. హుద్ హుద్ తుపాను వస్తే 10 రోజులు ఇక్కడే ఉన్నాను. మోదీ వచ్చి సంఘీభావం తెలిపి పూర్తిగా సహకరించారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలు చూపిన ఆదరణ నా జీవితంలో మర్చిపోలేను. 

గత ఎన్నికల్లో ఇక్కడ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారంటే అదీ ఇక్కడి ప్రజల మంచితనం. మంచి చేస్తే మర్చిపోని ప్రజానీకం విశాఖ ప్రజలు. అలాంటి విశాఖ ఇవాళ వైసీపీ నేతల దోపిడీకి కేంద్రంగా మారింది. భూముల మీద కన్నేశారు, అభివృద్ధి ఆగిపోయింది, ఏదైనా ఒక్క పని చేశారా? మెట్రో వస్తుందా ఇప్పుడు? 

'భోగాపురం' నాశనం చేశారు

భోగాపురం ఎయిర్ పోర్టుకు నేను శంకుస్థాపన చేశాను. నేను అధికారంలో ఉంటే రెండేళ్లలో ఎయిర్ పోర్టు వచ్చేది. కానీ ఈ సైకో నాశనం చేశాడు. నేను చేసిన శంకుస్థాపన స్థానంలో ఈయన మళ్లీ శంకుస్థాపన చేశాడు. ఇతడొక స్టిక్కర్ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి. అందుకే, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలి. 

ఇవాళ మోదీ చెప్పారు... ప్రపంచ ఐటీ రంగంలో తెలుగువారు దూసుకుపోతున్నారని చెప్పారు. అదీ మనం వేసుకున్న పునాది.. అందులో నాకు భాగం ఉందని చెప్పడానికి గర్విస్తున్నా. రేపు అధికారంలోకి వచ్చాక మళ్లీ సంపద సృష్టిస్తాం... ఆదాయాన్ని పెంచుతాం... పెంచిన ఆదాయాన్ని పేదలకు ఇస్తాం... అదే సమయంలో అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళతాం" అని చంద్రబాబు వివరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Road Show without electricity: తిరుపతిలో నిలిచిన విద్యుత్ సరఫరా... చీకట్లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షో!

07-05-2024 Tue 20:34 | Andhra

ఏపీలో మే 13న ఎన్నికలు

ముమ్మరంగా ప్రచారం చేస్తున్న కూటమి నేతలు

తిరుపతిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షో

రోడ్ షో ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

cr-20240507tn663a42ea6c0c6.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే, రోడ్ షో నిర్వహిస్తున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చీకట్లోనే ఫ్లాష్ లైట్లతో రోడ్ షో కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ఈ సాయంత్రం పుంగనూరు సభ అనంతరం తిరుపతి చేరుకోగా, పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి నేరుగా ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపట్లో చంద్రబాబు, పవన్ తిరుపతి గాంధీ రోడ్ లో ఏర్పాటు చేసిన సభకు హాజరుకానున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Narendra Modi: జూన్ 4వ తేదీతో వైసీపీ ప్రభుత్వానికి ఆఖరు: ప్రధాని మోదీ ట్వీట్

08-05-2024 Wed 22:14 | Andhra

విజయవాడలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో

రోడ్ షో అంచనాలకు మించి విజయవంతం కావడంతో ప్రధానిలో ఉత్సాహం

సందేహమే లేదు... ఏపీ ప్రజలు కూటమివైపేనంటూ ట్వీట్

వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని వెల్లడి

కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా

cr-20240508tn663babf819894.jpg

విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లతో కలిసి ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో తాను పాల్గొన్న రోడ్ షో మరపురానిదని పేర్కొన్నారు. 

గత కొన్ని రోజులుగా తాను ఏపీలో పర్యటిస్తున్నానని, ఏపీ ప్రజలు ఎన్డీయే కూటమి అభ్యర్థులకు భారీగా ఓట్లు వేయనున్నారన్న విషయం అర్థమైందని తెలిపారు. మహిళలు, యువ ఓటర్ల మద్దతతో ఎన్డీయే అభ్యర్థులకు భారీ మెజారిటీ ఖాయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  

ఏపీ అధికార పక్షం వైసీపీ పైనా ప్రధాని మోదీ విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందని, అందుకే ఆ పార్టీ రాష్ట్రంలో అవినీతి, కుటిలత్వం, మాఫియా తత్వాన్ని పెంచి పోషించిందని మోదీ ధ్వజమెత్తారు. వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, వాళ్ల ప్రభుత్వానికి జూన్ 4వ తేదీతో ఆఖరు అని స్పష్టం చేశారు. 

ఇక బీజేపీ, టీడీపీ గతంలోనూ కలిసి పనిచేశాయని, భవిష్యత్ అభివృద్ధి దిశగా తమది బలమైన బంధం అని స్పష్టం చేశారు. ఎంతో క్రియాశీలకంగా ఉన్న జనసేన పార్టీ వల్ల తమ కూటమి మరింత బలోపేతం అయిందని వివరించారు. తమ ఆకాంక్షలు నెరవేర్చే సత్తా ఈ కూటమికి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని మోదీ తన ట్వీట్ లో వెల్లడించారు. 

ఏపీలో వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చాలని, పారిశ్రామిక వృద్ధిని పెంచాలని, సేవల రంగంలోనూ ఏపీ తనదైన ముద్రను వేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఏపీ ప్రజలకు వరప్రసాదం అనదగ్గ ఉత్పాదకశక్తికి అవసరమైన ఉత్తేజాన్ని ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. 

ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర పురోగతి కోసం తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటుందని, రాష్ట్రంలో పోర్టుల ఆధారిత అభివృద్ధి జరిగేలా చూస్తామని మోదీ హామీ ఇచ్చారు. అదే సమయంలో మత్స్య రంగానికి గొప్ప ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. 

తదుపరి తరం మౌలిక సదుపాయాల రంగానికి తమ ప్రాధాన్యత కొనసాగుతుందని, రహదారుల వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, విమానయాన అనుసంధానత అభివృద్ధికి తాము చేయాల్సింది చాలా ఉందని మోదీ తెలిపారు. అంతేకాకుండా, బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వివరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటిముఖం పట్టించాలి: చంద్రబాబు

09-05-2024 Thu 17:47 | Andhra

జగన్ సర్కార్ ప్రజల జీవితాలతో చెలగాటమాడిందన్న బాబు

ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స తాకట్టు పెట్టారని మండిపాటు

జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని వెల్లడి

cr-20240509tn663cbc62c444d.jpg

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మట్టికరవబోతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజల జీవితాలతో వైఎస్సార్ పార్టీ చెలగాటమాడిందని ఆరోపించారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వైసీపీ సర్కార్ ను ఇంటిముఖం పట్టించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విశాఖపట్టణం ఇన్ చార్జ్ గా ఉన్న విజయసాయిరెడ్డి విశాఖ ప్రజలను దోచుకుతింటుంటే ఇదే నియోజకవర్గంలో ఉన్న బొత్స సత్యనారాయణ కిక్కురుమనకుండా ఉన్నారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర తెలుగు దేశం పార్టీకి కంచుకోటని, ఉత్తరాంధ్ర ప్రజలెప్పుడూ టీడీపీ వైపే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి బొత్స సత్యనారాయణ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇక్కడి పదవులన్నీ బొత్స సత్యనారాయణ కుటుంబానివేనని, ఉత్తరాంధ్రలో పదవులు నిర్వహించేందుకు వెనుకబడిన వర్గాల్లో సమర్థులెవరూ లేరా అని ప్రశ్నించారు.  బొత్స సత్యనారాయణలాంటి స్థాయి వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీని పట్టుకుని అవినీతిపరుడని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే మోదీ అవినీతిపరుడని మాట్లాడాలని చంద్రబాబు సవాల్ చేశారు. తెలుగు దేశం పార్టీ వంద సంక్షేమ పథకాలిచ్చిందని తెలిపారు.  జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలేమీ పెరగలేదని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రోడ్లు వేయలేదని, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని చంద్రబాబు చెప్పారు. ఈ ఐదేళ్ల కాలంలో తొమ్మిదిసార్లు కరెంట్ చార్జీలు పెంచారని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం క్వార్టర్ బాటిల్ 60 రూపాయలైతే జగన్ పాలనలో అది 200రూపాయలకు పెరిగిందని విమర్శించారు. జగన్ పాలనలో బాదుడే బాదుడు కార్యక్రమంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయని, పేదలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు.

...

Complete article

🔴LIVE: చంద్రబాబు భారీ బహిరంగ సభ | Chandrababu Prajagalam Public Meeting At Cheepurupalli |ABN Telugu

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu on funds release: జనవరిలో బటన్ నొక్కి ఇప్పటిదాకా ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్ రెడ్డీ?: చంద్రబాబు

09-05-2024 Thu 15:06 | Andhra

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ప్రజాగళం సభ

ఎండలు మండిపోతున్నా ప్రజల ఉద్ధృతి తగ్గడంలేదన్న చంద్రబాబు

ఫ్యాన్ నుంచి గాలి కూడా రావడంలేదని ఎద్దేవా

జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కి ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శలు

cr-20240509tn663c9913e5ea0.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కురుపాం సభకు హాజరైన ప్రజానీకాన్ని చూస్తుంటే గెలుపు ఖాయంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పోటీ చేస్తున్నారని, ఆమె ఆదివాసీ బిడ్డ అని వెల్లడించారు. మీ ఇంటిలో ఒక బిడ్డ  ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని, జగదీశ్వరిని ఆదరించాలని పిలుపునిచ్చారు. 

ఎంపీగా బీజేపీ అభ్యర్థి గీత పోటీ చేస్తున్నారని, కమలం పువ్వుపై ఓటేసి ఆమెను గెలిపించాలని అన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన పార్టీ బీజేపీ అని కొనియాడారు. ఎండలు మండిపోతున్నా ప్రజల ఉద్ధృతి తగ్గడం లేదని, ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలైపోవడం ఖాయమని, ఫ్యాన్ నుంచి గాలి కూడా రావడంలేదని, ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో పడేయాలని అన్నారు. 

"ఈ జలగ జగన్ దళిత, గిరిజన ద్రోహి. అందరినీ మోసం చేశాడు. గిరిజన ప్రాంతాల్లోనూ జగన్ కు సీట్లొచ్చాయి. మొదట కొంచెం బాధపడినా, ఓట్లేశారు కాబట్టి జగన్ గిరిజన ప్రాంతాల్లో ఏవైనా పనులు చేస్తాడనుకున్నా. కానీ, ఓట్లేసే వాళ్లను కాటేసే రకం ఈ జలగ జగన్. అభివృద్ధి జరిగిందా... ఒక్క రోడ్డయినా వేశాడా? ఒక స్కూలు కట్టాడా... ఒక్కటంటే ఒక్క మేలు జరిగిందా? 

ఎంతో పేదలైన గిరిజనులు ఉండే నియోజకవర్గం ఇది. అలాంటి పేదల కోసం నేను 16 పథకాలు తీసుకువచ్చాను. ఇవాళ ఆ పథకాలు ఉన్నాయా? మిమ్మల్ని కాటేయడానికి మళ్లీ మోసగాడు వస్తున్నాడు. మీకు ఓటేయం అని గట్టిగా చెప్పండి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు గిరిజన పిల్లల నైపుణ్యాభివృద్ధికి పాటుపడ్డాను. ఇప్పుడు ఉన్నాయా ఆ కార్యక్రమాలు? గిరిజన పిల్లలు మంచి పాఠశాలల్లో చదవాలని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో అవకాశం కల్పించాం. కానీ ఇప్పుడా అవకాశాలు లభిస్తున్నాయా? 

గిరిజనులు బాగుంటే అతడు చూడలేడు. ఎందుకు గిరిజనులంటే అంత కక్ష? వీళ్లు పైకొస్తే ఓర్వలేరా మీరు? ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేయండి. పేదవాళ్లందరికీ పింఛన్లు ఇస్తాను. రూ.200 పింఛను రూ.2 వేలు చేసింది నేనే. పింఛన్లు ప్రారంభించింది ఎన్టీఆర్. ఈ గిరిజనుల కోసం ఐటీడీఏ పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. క్వాలిఫికేషన్ లేకపోయినా గిరిజనులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్. 

ఇవాళ హామీ ఇస్తున్నా...  ఇంటివద్దనే రూ.4 వేల పెన్షన్ ఇస్తాను. ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా పెన్షన్ ఇస్తాం. వికలాంగులకు జులైలో రూ.12 వేలు వస్తాయి. ఎప్పుడైనా జలగ జగన్ ఇలాంటి ఆలోచనలు చేశాడా? జగన్  వచ్చాక బాదుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు! అన్నీ ధరలు పెరిగిపోయాయి. కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెరిగిపోయాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. మేం అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తాం.

యువతకు ఉద్యోగాలు వచ్చాయా? నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు... చేశాడా? మరి జాబ్ రావాలంటే కూటమి అధికారంలోకి రావాలి. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. కురుపాంలో ఉండే యువత కూడా ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తాం. కురుపాం యువత ఇంటి వద్ద నుంచే అమెరికాలో ఉండే కంపెనీల్లో పనిచేసేలా అవకాశాలు కల్పిస్తా. 

మీ నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అందరూ జనగణన, కులగణన చేస్తారు... మేం అధికారంలోకి రాగానే యువతలో నైపుణ్య గణన చేపడతాం. ప్రతి ఒక్కరి నైపుణ్యాన్ని పెంచడానికి కృషి చేస్తాం. యువతకు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. 

మహాశక్తి పథకం కింద ఆడబిడ్డలకు నెలకు.1,500 ఇస్తాం. సంవత్సరానికి రూ.18,000 చొప్పున ఐదేళ్లలో రూ.90,000 ఇస్తాం. ఇంట్లో ముగ్గురుంటే ఐదేళ్లలో రూ.2.70 లక్షలు ఇస్తాం. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తాం. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తాం. 

దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అన్నదాత రైతన్నకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. భవిష్యత్ లో ఆడబిడ్డలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ వస్తుంది. 

జగన్ బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా అంటున్నాడు... బటన్ నొక్కడం చాలా కష్టమంట? ఉత్తుత్తి బటన్ నొక్కడం కూడా కష్టమేనా? నాయకుడు అంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలి, ప్రజల ఆదాయాన్ని పెంచాలి, రైతులకు అండగా ఉండాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసినవాడు నాయకుడు. 

నేను బటన్ నొక్కా, నేను బటన్ నొక్కా అనేవాడు నాయకుడా? ఇంట్లో ఉండే బామ్మకు నేర్పిస్తే ఆమె కూడా బటన్ నొక్కుతుంది. బటన్ నొక్కడానికి పెద్ద చదువు, తెలివి కావాలా? నరేంద్ర మోదీ కూడా బటన్ నొక్కుతున్నారు... ఆయన ఎప్పుడైనా చెప్పుకున్నారా? కానీ ఇక్కడ ఏమీ తెలియని సోమరిపోతు బటన్లు నొక్కేసి... బటన్ నొక్కా, బటన్ నొక్కా అని చెప్పుకుంటున్నాడు. 

బటన్ నొక్కి నువ్వు ఎంత బొక్కావు, బటన్ నొక్కి ఎంత భారం మోపావు? నువ్వు బటన్ నొక్కి ఇచ్చింది రూ.10... నువ్వు బొక్కేసింది రూ.1000. నువ్వు మోపిన భారం రూ.100. నిన్న అంటున్నాడు... నేను బటన్ నొక్కాను, ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వడంలేదు అంటున్నాడు. 

జనవరిలో నువ్వు బటన్ నొక్కావు... డీబీటీ అంటే 24 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు రావాలా, లేదా? ఫోన్ లో ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ లోకి ఒక గంటలో డబ్బులు బదిలీ అయిపోతాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా... జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్ రెడ్డీ? పేదవాళ్ల అకౌంట్లో ఎందుకు డబ్బులు పడలేదు? 

ఉత్తుత్తి బటన్ల రాజకీయం వద్దు. ఇంటికిపోయే రోజు వచ్చిన తర్వాత... నేను బటన్ నొక్కాను, డబ్బులు పడలేదు అంటున్నాడు. నువ్వు నొక్కింది ఉత్తుత్తి బటన్... ఖజానా ఖాళీగా ఉంది. నువ్వు నొక్కిన బటన్ పేదలకు కాదు, దళారీలకు కాదు. నేను సవాల్ విసురుతున్నా... జనవరి నుంచి కాంట్రాక్టర్లకు రూ.16 వేల కోట్లు దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి!" అంటూ నిప్పులు చెరిగాడు.

...

Complete article

Related article

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu- ఎల్లుండి పోలింగ్... ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు 

11-05-2024 Sat 19:24 | Andhra

మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు

ఒకే రోజున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు

నేటి సాయంత్రంతో ముగిసిన ప్రచార పర్వం

cr-20240511tn663f7892a5df2.jpg

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ నిబంధనల నేపథ్యంలో, నేటి సాయంత్రంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. ఎల్లుండి పోలింగ్ జరగనుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అని నినదించారు. ఈ ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి, భవిష్యత్ తరాల అభ్యున్నతికి అత్యంత కీలకమైనవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మీ భవిష్యత్తును, మీ సంక్షేమాన్ని కాంక్షించే శ్రేయోభిలాషిగా ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని తెలిపారు. 

2014లో రాష్ట్రం విడిపోయిందని, అనేక కష్టనష్టాలతో నాడు టీడీపీ ప్రభుత్వం ప్రస్థానం మొదలుపెట్టిందని తెలిపారు. సుపరిపాలనతో రాష్ట్రాన్ని కొద్దికాలంలోనే అభివృద్ధి దిశగా నడిపించామని పేర్కొన్నారు. 2019లోనూ టీడీపీ గెలిచి ఉంటే ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని స్పష్టం చేశారు. 

కానీ మోసపూరిత హామీలతో జగన్ అధికారంలోకి వచ్చి, అధికారం చేపట్టినప్పటి నుంచే విధ్వంసక, అరాచక పాలనకు తెరదీశారని విమర్శించారు. వ్యవస్థలను చెరబట్టి, ప్రశ్నించే ప్రజలను, విపక్షాలను అణచివేశారని ఆరోపించారు. 

ఇప్పుడు వైసీపీ భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునే అవకాశం వచ్చిందని, మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని అరాచకాలకు ముగింపు పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిక్షణ అనే అజెండాతో ముందుకువచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు నిండుమనసుతో ఓటేసి గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు.

...

Complete article

20240511fr663f77b9100f5.jpg

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: ఇలాంటి మోసకారి మనకు అవసరమా?: చిత్తూరులో చంద్రబాబు

11-05-2024 Sat 17:53 | Andhra

నేడు ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు

చివరి సభను చిత్తూరులో నిర్వహించిన చంద్రబాబు

ఇది నా జిల్లా అంటూ టీడీపీ అధినేత సమరోత్సాహం

సీఎం జగన్ పై విమర్శలు

cr-20240511tn663f6330802ea.jpg

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో తన చివరి ప్రచార సభను చిత్తూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు గారు... ఒక చదువుకున్న వ్యక్తి. ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా పనిచేసి సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు. 

చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జగన్ మోహన్ పోటీ చేస్తున్నారు... తక్కువ సమయంలో బుల్లెట్ మాదిరి దూసుకుపోయాడని కొనియాడారు. చిత్తూరులో గెలుపు జగన్ మోహన్ దేనని ధీమా వ్యక్తం చేశారు. మొదట్లో తనకు సందేహం కలిగిందని, మనవాడు ముందుకు పోగలడా అనుకున్నానని, కానీ పేరును అనౌన్స్ చేశాక అందరినీ కలుపుకుని కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైపోయాడని అభినందించారు. కౌరవ వధ తప్పదని హెచ్చరించారు. 

ముఖ్యమంత్రి ఇక్కడ ఎలాంటి బ్రహ్మాండమైన నాయకుడ్ని పెట్టాడో తర్వాత మాట్లాడతానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు టీడీపీ అభ్యర్థి, తిరుపతి అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

సీనియర్ నేత సీకే బాబు గురించి చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు చిత్తూరులో తనకంటూ ప్రత్యేకత ఉందని అన్నారు. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం అని హెచ్చరించారు. చిత్తూరు నుంచి జగన్ మోహన్ ను గెలిపిస్తానని ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చిన వ్యక్తి సీకే బాబు అని కొనియాడారు. 

"ఇది నా జిల్లా. నేను పుట్టిన జిల్లా. ఎన్నికల కోసం రాష్ట్రమంతా తిరిగా... చివరి మీటింగ్  ను ఇక్కడే పెట్టాలని అనుకున్నా. రాష్ట్రం మొత్తానికి నేను చెప్పాలనుకున్నది ఇక్కడ్నించే చెబుతాను. నాకు రాజకీయ జన్మనిచ్చిన జిల్లా ఇది, రాజకీయాల్లో ఓనమాలు నేర్పించిన జిల్లా ఇది. చిత్తూరు జిల్లా ప్రజల గౌరవాన్ని కాపాడేందుకు అనునిత్యం పనిచేశాను. 

ఇవాళ నంద్యాలలో కూడా మీటింగ్ పెట్టాను. నన్ను ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడ మీటింగ్ పెట్టాను. ఏ తప్పు చేయని నన్ను అరెస్ట్ చేశారు. నాకే ఈ పరిస్థితి వస్తే, సామాన్యుల పరిస్థితేంటి? అందుకే సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ జిల్లాలో ఎవర్ని చూసినా నేను గుర్తుపట్టగలను. మీ రుణం తీర్చుకుంటా. 

జిల్లాలో పరిశ్రమలు  పెట్టించాను, సాగునీరు అందించేందుకు కృషి చేశాను. ఈ జిల్లా వాసులను అగ్రస్థానంలో నిలిపేందుకు నా జీవితాంతం పనిచేశాను. చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు రావాలని తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చాం. ఎక్కడైనా అభివృద్ధికి మారుపేరు టీడీపీ... అవినీతికి మారుపేరు సైకో పాలన! 

ఇక్కడ రోడ్లు ఎవరి వల్ల వచ్చాయి? నేను మొదట మలేషియాలో రోడ్లు చూసి, మనదేశంలోనూ మంచి రోడ్లు ఉండాలని నాటి  ప్రధాని వాజ్ పేయికి చెప్పి తొలిరోడ్డు నెల్లూరు నుంచి చెన్నైకి వేసేలా కృషి చేశాను. ఇప్పుడు దేశమంతా ఎక్స్ ప్రెస్ లేన్ రోడ్లు వచ్చాయంటే అది టీడీపీ వల్లే. మీరందరూ వాడే సెల్ ఫోన్లు తీసుకురావడానికి నేనే కారణం. గత 30 ఏళ్లుగా టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను. 

ఒకప్పుడు సెల్ ఫోన్ తిండిపెడుతుందా అని నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు భర్త లేకుండా భార్య ఉంటుంది, భార్య లేకపోయినా భర్త ఉంటాడు కానీ సెల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండలేరు. ఇప్పుడు పేదవాళ్ల దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి. 

ఇవన్నీ ఉంటే సరిపోదు... సాగునీరు కూడా ఉండాలి. సాగునీటి ప్రాధాన్యతను గుర్తించిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుగంగ, నగరి-గాలేరు, హంద్రీనీవా... ఇవన్నీ ఎన్టీఆర్ ఆలోచనలే. నేనొచ్చిన తర్వాత రూ.65 వేల కోట్లతో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను. 

నిన్నా మొన్నా వచ్చాడు... సినిమా సెట్టింగులు గాడు... ముఖ్యమంత్రి! నేరుగా కుప్పం పోయాడు, గేట్లు పెట్టాడు, ట్యాంకర్లలో నీళ్లు తెచ్చి పోసి గేట్లు ఓపెన్ చేశారు. ఈయన విమానం ఎక్కి వెళ్లిపోయాడు... నీళ్లు ఆరిపోయాయి, గేట్లు ఎత్తుకెళ్లిపోయారు. ఇదేనా అభివృద్ధి? ఇలాంటి మోసకారి మనకు అవసరమా? 

నేను అధికారంలోకి రాగానే చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా. ఇవాళ నంద్యాలలో కూడా చెప్పా... నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఈ గడ్డమీదనే పుట్టా. ఇప్పుడు సవాల్ విసురుతున్నా... రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించడానికి సిద్ధమా? గత ఎన్నికల్లో రాయలసీమలో 52 సీట్లలో 3 సీట్లే మాకు వచ్చాయి... వైసీపీని 49 సీట్లలో గెలిపించారు. మరి ఏమైనా చేశాడా? సాగునీరు తెచ్చాడా? కాలేజీలు తెచ్చాడా? రోడ్లు వేశాడా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? 

పాదయాత్ర చేసి ఒక్క చాన్స్ అన్నాడు. ప్రజలు ఐస్ మాదిరిగా కరిగిపోయారు. 151 సీట్లలో గెలిచేసరికి కొవ్వెక్కి, కళ్లు నెత్తికెక్కాయి. ఎదురుమాట్లాడితే వాళ్లపై దాడులు, కేసులు! పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. చిత్తూరు జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుంటే, ఇక్కడికి ప్రజలకు నేను భరోసా ఇవ్వాలనుకున్నాను. కానీ, నన్ను ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపించారు. మర్చిపోతానా ఇవన్నీ? నాకు రోషం లేదనుకుంటున్నారా? నేను తలుచుకుంటే మీరు రోడ్ల మీదకు కూడా రాలేరు.

ఇక్కడొకాయన ఉన్నాడు... పాపాల పెద్దిరెడ్డి. ఈ జిల్లాలో చూస్తే పదవులన్నీ ఆయనకే కావాలి. ఎంపీ ఆయన కొడుకే, ఎమ్మెల్యే ఆయన తమ్ముడే, మంత్రి పదవి ఆయనకే, కాంట్రాక్టులన్నీ ఆయనకే. ఇరిగేషన్ కాంట్రాక్టులు కూడా ఈయనకే. ఈ రాష్ట్రం వీళ్లబ్బ సొమ్ము అనుకుంటున్నారు. మెక్కిందంతా మక్కెలు విరగ్గొట్టి వసూలు చేస్తా, పేదల కోసం ఖర్చు చేస్తా. 

ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎర్రచందనం స్మగ్లర్... జైల్లో ఉండాల్సిన వ్యక్తి. నేను అనుకుంటే ఎప్పుడో ఎక్కడికో పోయేవాడు... ఏం తమాషా అనుకుంటున్నావా, ఇక్కడ అందరినీ బెదిరిస్తావా? 

ఈ ఐదేళ్లలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలంతా ఆలోచించాలి.జరిగిన దానికి కసి తీర్చుకోవాలని ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోంది. గత 40 రోజులుగా నేను ప్రచారం చేస్తున్నాను... ఇది 89వ సభ. ఎవరూ ఇన్ని సభలు చేసి ఉండరు. ఎక్కడి చూసినా ఇదే స్పందన, ఇదే ఉత్సాహం చూస్తున్నా. యువత, మహిళలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు అందరూ రోడ్లపైకి వచ్చారు. 

జగన్ పాలనలో బాగుపడింది ఐదుగురే. పాపాల పెద్దిరెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, జగన్ మోహన్ రెడ్డి.... వీళ్లు తప్ప ఎవరైనా బాగుపడ్డారా? రైతుల్లో రెడ్లు, కమ్మవాళ్లు, బలిజలు అందరూ ఉన్నారు... ఎవరైనా బాగుపడ్డారా? జగన్ దోపిడీకి అందరూ బలైపోయారు. 

అందుకే నేను, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందుకొచ్చాం. పవన్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరో. ప్రజలను ఆదుకోవాలని ముందుకు రావడమే కాదు, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడ్డాడు. నేను, ఆయన, బీజేపీ ముగ్గురం కలిశాం. ప్రజలు గెలవాలని, రాష్ట్రం వెలగాలని కలిశాం. నేను జైల్లో ఉంటే వచ్చి, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి, పొత్తు పెట్టుకుంటున్నాం అని ప్రకటించిన వ్యక్తి పవన్ కల్యాణ్" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...