Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 3

Garam Garam Varthalu​ 🧨 Smoking Hot News​ 🔥


Vijay

Question

Recommended Posts

  • 0

KCR on Hyderabad and Congress rule: హైదరాబాద్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోయే... ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొంది: కేసీఆర్

08-05-2024 Wed 21:33 | Telangana

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెల్లలో రాష్ట్రం ఆగమైందన్న కేసీఆర్

ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కేవలం ఉచిత బస్సు పథకం మాత్రమే నెరవేర్చిందన్న కేసీఆర్

మల్లన్నసాగర్ నుంచి నీళ్లు వస్తే నర్సాపూర్ బంగారు తునక అవుతుందన్న మాజీ సీఎం

cr-20240508tn663ba24d2ed8d.jpg

కరెంట్ కోతల వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి, ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌ బస్సు యాత్ర బుధవారం మెదక్‌ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో రాష్ట్రం ఆగమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అందర్నీ వంచించిందన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కేవలం ఉచిత బస్సు పథకం మాత్రమే నెరవేర్చిందన్నారు. రైతుబంధు అందరికీ పడలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ జరగలేదన్నారు.

వరికి బోనస్ బోగస్ అయిందని విమర్శించారు. కరెంట్ కోతల వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి, ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. నర్సాపూర్ ప్రాంతానికి మంచి నీళ్లు రావాలని కోమటిబండ నుంచి ప్రత్యేక లైన్ వేయించానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నర్సాపూర్ లింక్ అయి లక్షా యాభై వేల ఎకరాలకు నీరు రావాలని శంకరంపేట వద్ద కాల్వలు కూడా తవ్వుతున్నారని తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి నీళ్లు రావడం ప్రారంభమైతే నర్సాపూర్ బంగారు తునక అవుతుందన్నారు.

కాంగ్రెస్ ఈ అభివృద్ధి చేస్తుందనే నమ్మకం తనకు లేదని, ఆ కాల్వ పూర్తై మల్లన్నసాగర్ నుంచి నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ప్రభుత్వానికి నీళ్లు ఇచ్చే ఉద్దేశ్యం లేదన్నారు. రైతు బంధు వ్యవసాయం చేసినవారికి, పొలం దున్నినవాళ్లకే ఇస్తారట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్‌ను కేసీఆర్ ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశారో అందరికీ తెలుసునన్నారు. ఈ ప్రభుత్వం ప్రతి దానికి ఏదో కొండి పెడుతోందని... తొండి పెడుతోందని విమర్శించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Avinash Reddy on Sharmila and Sunitha: మా అక్కలు చంద్రబాబు కుట్రలో పావులుగా మారారు: అవినాశ్ రెడ్డి

08-05-2024 Wed 14:21 | Andhra

కడప లోక్ సభ స్థానంలో అవినాశ్ రెడ్డి ఎన్నికల ప్రచారం

షర్మిల, సునీతారెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పట్ల విచారం

వారితో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారని ధీమా

cr-20240508tn663b3d103db72.jpg

కడప లోక్ సభ స్థానం నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై వైఎస్ షర్మిల, సునీతారెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. 

తన అక్కలు చేస్తున్న ఆరోపణలు ఎంతో బాధిస్తున్నాయని, వారితో పోరాడే శక్తిని తనకు ప్రజలే ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. వారిద్దరూ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నిరాధార వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారని అవినాశ్ రెడ్డి విమర్శించారు.  

వాచ్ మన్ రంగన్నకు నార్కో టెస్టుపైనా ఎవరూ మాట్లాడలేదు, వివేకాను తానే చంపానని దస్తగిరి చెప్పుకుంటున్నా ఎవరూ మాట్లాడడంలేదు... కానీ 2021 తర్వాత మా అక్కలు ఇద్దరూ చంద్రబాబు కుట్రలో పావులుగా మారారు... రెండున్నరేళ్లుగా మాట్లాడని వారు ఇప్పుడొచ్చి మాట్లాడుతుంటే కోపం కంటే బాధే ఎక్కువగా కలుగుతోందని అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. 

"మా నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ పని కావాలన్నా చేసి పెట్టే వ్యక్తి... ఆయను జైలుపాల్జేశారు... నేనేమీ తప్పు చేయకపోయినా అన్యాయంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు" అని అవినాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

నాకు ప్రజల మద్దతు ఉంది... ఎన్నికల్లో గెలిచేది నేనే... ఇప్పుడు తిడుతున్న వాళ్లు నన్ను క్షమాపణలు అడగాలి... నేను అది వినాలి అని అవినాశ్ వ్యాఖ్యానించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
On 5/6/2024 at 10:18 PM, Vijay said:

నా ప్రియమిత్రుడు, @ncbn గారికి ధన్యవాదాలు. ఆంధ్ర ప్రదేశ్‌కు చేరుకుని ఎన్‌డిఎ ర్యాలీలో పాల్గొనేందుకు రాజమండ్రి వెళ్లే మార్గంలో ఉన్నాను, తరువాత అనకాపల్లిలో మరొక ర్యాలీ ఉంది. ఏపీ మద్దతు మొత్తం ఎన్డీయేకే!

Welcome to Andhra Pradesh, Hon'ble Prime Minister Shri @narendramodi Ji! The people of Andhra Pradesh are eagerly looking forward to your visit and invigorating address.

🤮:emoji-fart::emoji-poop::emoji-poop-fire:

 

3 oosaravelli chameleons made for each other!

they can take a U turn on anybody at any time to scam public money!!

voters are smart and know who is a chameleon.

🤮

Link to comment
Share on other sites

  • 0
23 hours ago, Vijay said:

Tindipothu Pappu tongue slip: దారుణంగా నోరు జారిన లోకేష్ మీటింగ్ మధ్యలో వెళ్లిపోయిన మోడీ షాక్ లో చంద్రబాబు పవన్ PC Digital. నరేంద్ర మోదీ గారికి మన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూపించాలని అన్నారు. 

రాజమండ్రి కూటమి సభలో టీడీపీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. విశ్వ జీత్ (విశ్వ విజేత) నరేంద్ర మోదీకి హృదయపూర్వక నమస్కారాలు అంటూ లోకేశ్ ప్రసంగం ప్రారంభించారు. ఆయనను విశ్వ జీత్ అని ఎందుకంటున్నానంటే... ఇవాళ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం మోదీనే అని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉందని, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మనసు చాలా పెద్దదని, మీ మమకారం, మీ వెటకారం రెండూ సూపర్ అని కొనియాడారు. నరేంద్ర మోదీ గారికి మన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూపించాలని అన్నారు. 

"దేశానికి నరేంద్ర మోదీ గారి అవసరం ఎంతో ఉంది. నాలుగు అక్షరాలు దేశం దశ  దిశ మార్చాయి. అది నమో నమో నమో (NaMo). తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అయితే, ఇవాళ భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ. మోదీ భారతదేశానికి గర్వకారణం... మోదీ నవభారత నిర్మాత. 

🤮🤮🤮🤮

pappu pulakesh will over eat and gain all his weight back the moment he gets one chance to eat again!

he is just greasing modi's palm and kaka paduthunnadu just in case cbn gets thrown prison in future, pappu can approach modi, "modi uncle, please release my dad..."

:emoji-lol-giggle:

Link to comment
Share on other sites

  • 0

Garam Garam Varthalu Full Episode 07-05-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan |@SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0
On 5/7/2024 at 7:54 PM, TELUGU said:

FIR on Sharmila for violating court orders: వివేకా హత్య కేసు ప్రస్తావన.. షర్మిలపై కేసు నమోదు

07-05-2024 Tue 10:40 | Andhra

కోర్టు ఆదేశాలను అతిక్రమించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్

బద్వేలులో వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ షర్మిల ప్రసంగం

వైఎస్సార్ జిల్లా బద్వేల్ నోడల్ అధికారి ఫిర్యాదు

cr-20240507tn6639b7caba295.jpg

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. 

అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని, ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు రాజకీయ నేతలను హెచ్చరించింది. బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించడం ద్వారా షర్మిల కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బద్వేల్ నోడల్ అధికారి, బద్వేల్ మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా షర్మిలపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ నేత ఒకరు కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని ఆదేశాలు జారీ చేసింది.

...

Complete article

if she has that much decency and leadership qualities, she would have been in a better position today.

Sharmila BEGGING for votes - as Jagan said, she'll lose her deposit!

 

Link to comment
Share on other sites

  • 0

పవన్ మరీ ఇంత భయస్తుడా? : Tough Battle For Pawan Kalyan In Pithapuram | greatandhra.com

 

Link to comment
Share on other sites

  • 0

Posani Krishna Murali Sensational Comments On Chiranjeevi & Pawan Kalyan | AP Elections@SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

if rajesh is talking positive about Jagan, aa kick ae veru!!

జగన్ దమ్మున్న హీరో 🔥 #mahasenarajesh #YSJagan #chandrababu #politics #pawankalyan #trolls #apnews

 

Indian Political Super Star - YSJagan 😎 #ysjagan #cmysjagan #andhrapradesh #politics #voteforfan

 

Link to comment
Share on other sites

  • 0

Another shock to Sharmila and Sunitha

పీసీసీ చీఫ్‌ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మరోసారి తెర మీదకు వచ్చింది.

yssharmilaandsunita1-1715184301.jpg

సరిగ్గా అంటే.. ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ..ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలపై వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో భాగస్వామి అని వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు వివేకానందరెడ్డి కూతురు సునీత, వైఎస్ షర్మిల సైతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డే అని..ఆయన్ను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ సునీత, వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయవద్దని సునీత, షర్మిల రొడ్డెక్కి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించవించడానికి వీల్లేదని కడప కోర్టు స్పష్టం చేసింది.

అయితే కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇటీవల వివేక కూమార్తె సునీత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..కేసు విషయాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో గతంలో ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తూ సునీత, షర్మిల వేసిన పిటిషన్‌ను కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది.

Link to comment
Share on other sites

  • 0

My heartfelt wishes to @PawanKalyan garu on your election journey. I have always been immensely proud of the path you've chosen, dedicating your life to service. As a family member, my love and support will always be with you. My best wishes for achieving all that you aspire for. Allu Arjun

 

Link to comment
Share on other sites

  • 0

అభివృద్ధి కావాలంటే సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించండి - సినీ నటి నమిత

"సైకిల్ " గుర్తుకు ఓటేద్దాం...! భీమిలి అభివృద్ధికి తోడ్పడదాం.!!

 

Link to comment
Share on other sites

  • 0

Sajjala Ramakrishna Reddy on development in AP: ఏపీలో అభివృద్ధి జరగకపోతే ఇదంతా ఎలా సాధ్యమైంది?: సజ్జల

09-05-2024 Thu 17:20 | Andhra

ఏపీలో అభివృద్ధి శూన్యం అంటూ విపక్షాల ధ్వజం

ఏపీ అప్పు రూ.13.5 లక్షల కోట్లు అంటూ ఇటీవల ప్రధాని వ్యాఖ్యలు

మీడియా సమావేశం పెట్టి వివరణ వచ్చిన సజ్జల

cr-20240509tn663cb888667b3.jpg

ఏపీలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ద్వారా వివరణ ఇచ్చారు. 

ఈ నాలుగేళ్ల 10 నెలల సమయంలో పయనీర్ అల్యూమినియం, అపోలో టైర్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గాయత్రి వంటి భారీ పరిశ్రమలు వచ్చాయని, ఇవన్నీ రూ.1000 కోట్లు, రూ.2 వేల కోట్లకు పైబడి పెట్టుబడులు పెట్టిన సంస్థలని వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కర్నూలు ఎయిర్ పోర్టు, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు... ఇదంతా మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. 

మధ్యలో కొవిడ్ వచ్చిందన్న సంగతి మర్చిపోరాదని సజ్జల పేర్కొన్నారు. రెండేళ్లు కొవిడ్ తోనే సరిపోయిందని, ఆ సమయంలోనూ ప్రభుత్వం యాక్టివ్ గానే ఉందని స్పష్టం చేశారు. కొవిడ్ సంక్షోభం వేళ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయిలో సిబ్బంది అందించిన సేవలు బ్రహ్మాండంగా ఉన్న సంగతి అందరికీ తెలుసని అన్నారు. 

కొవిడ్ సమయంలో ఈ వ్యవస్థలు లేకుంటే ఈ సేవలు అందేవే కావని... పేదవాళ్లు, ధనికులు అనే తేడా లేకుండా అందరికీ సేవలు అందించామని సజ్జల స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినవాళ్ల జాబితాలు సచివాలయాల్లో ఉంటాయని, కావాలంటే వెళ్లి చూసుకోవచ్చని అన్నారు. 

ఇక, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే సమయానికి డ్వాక్రా సంఘాలు కునారిల్లిపోయాయని, రుణమాఫీ చేస్తాన్న చంద్రబాబు హామీ నెరవేర్చకపోగా, సున్నా వడ్డీ కూడా ఆపేశాడని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు ఇవ్వనిది కూడా జగన్ వచ్చాక ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. 

జగన్ వచ్చేసరికి దివాలా తీసిన స్వయం సహాయక గ్రూపులు 18 శాతం ఉంటే, జగన్ అధికారం చేపట్టిన ఒకట్రెండు నెలల్లోనే అది 3 శాతానికి తగ్గిందని, ఇప్పుడది 0.17గా ఉందని సజ్జల వెల్లడించారు. గతంలో 9 లక్షల గ్రూపులు... 95 లక్షల మంది సభ్యులు ఉంటే, జగన్ హయాంలో ఇప్పుడా మహిళల సంఖ్య 1.15 కోట్లకు చేరిందని సజ్జల సగర్వంగా చెప్పారు. ఆ మహిళలు మంచి ఆదాయం పొందుతున్నారు, సకాలంలో తమ గ్రూపులకు రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు అని వివరించారు. 

చంద్రబాబు హయాంలో డ్వాక్రా మహిళలు రూ.55 వేల కోట్ల రుణం తీసుకుంటే, జగన్ నాలుగేళ్ల 10 నెలల కాలంలో డ్వాక్రా గ్రూపుల మహిళలు రూ.1.69 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకున్నారని తెలిపారు. ఇంత ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నప్పుడు ఉత్పత్తి అయ్యే ఆదాయం మహిళలకే పోతోందని వెల్లడించారు. 

మహిళలకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని, చేయూత పథకం ద్వారానూ రూ.18,750 ఇచ్చి సహకరిస్తున్నామని వెల్లడించారు. 16 లక్షల మంది చేయూత పథకం కింద స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ విధంగా ఒక కోటి 15 లక్షల కుటుంబాలు ఆదాయం పరంగా పైకి వచ్చాయంటే అభివృద్ధి జరిగిన నట్టు కాదా? అని సజ్జల ప్రశ్నించారు. 

ఇక, దేశ జీడీపీలో మన రాష్ట్ర వాటా 2014-19 మధ్య 4.47 శాతం ఉంటే, జగన్  ప్రభుత్వం హయాంలో అది  4.82కి పెరిగిందని సజ్జల చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే ఇది ఎలా సాధ్యమైంది? ఇవి మేం చెబుతున్న గణాంకాలు కాదు... కేంద్ర ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు అని స్పష్టం చేశారు. 

ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర అప్పులపై  కూడా సజ్జల వివరణ ఇచ్చారు. 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని మాట్లాడుతున్నారని.... చంద్రబాబు హయాంలో రూ.2.58 లక్షల కోట్లు అప్పు తీసుకుంటే, జగన్ హయాంలో తీసుకున్న అప్పు రూ.2.98 లక్షల కోట్లు అని స్పష్టం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AP High Court on releasing funds for welfare schemes: పథకాలకు నిధుల నిలిపివేతపై పిటిషన్లు... తీర్పు రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

09-05-2024 Thu 16:12 | Andhra

ఏపీలో ఎన్నికల కోడ్ అమలు

నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు

ఈసీకి మరోసారి విజ్ఞప్తి చేయాలన్న ఏపీ హైకోర్టు

నేడు సమాధానమిచ్చిన ఈసీ

cr-20240509tn663ca887431d7.jpg

ఏపీలో ఎన్నికల్ కోడ్ అమల్లో ఉన్నందున, పథకాలకు నిధుల విడుదల ఆపేయాలంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. అయితే, ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. 

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... మరోసారి ఈసీకి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ అభ్యంతరాలకు సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా... ఈసీ నేడు సమాధానం ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు  ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. 

కాగా, జనవరి-మార్చి మధ్యలో పథకాలకు బటన్లు నొక్కి అప్పుడే నిధులు విడుదల చేయకుండా, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎలా నిధులు విడుదల చేస్తారని నేటి విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. 

సైలెంట్ పీరియడ్ లో నిధుల విడుదలకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. అందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిస్తూ... తామేమీ కొత్త పథకాలు ప్రకటించలేదని, ఎప్పటినుంచో నడుస్తున్న పథకాలకు మాత్రమే నిధులు విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు. 

అందుకు, ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ... ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జూన్ 6న నిధులు విడుదల చేసుకోవాలని గతంలో తాము చెప్పామని, ఇప్పుడు పోలింగ్ పూర్తయ్యాక నిధులు విడుదల చేసుకోవచ్చని చెబుతున్నామని అన్నారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

...

Complete article

Andhra Pradesh: EC on welfare funds: ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు జ‌మ‌పై ఈసీ ఆంక్ష‌లు

09-05-2024 Thu 13:31 | Andhra

పోలింగ్ త‌ర్వాతే న‌గ‌దు బ‌దిలీ చేయాల‌ని ఆదేశం

ఇప్ప‌టికే బ‌ట‌న్ నొక్కిన ప‌థ‌కాల న‌గ‌దు జ‌మ‌ను ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కు వాయిదా 

మే 13న పోలింగ్ ముగిసిన త‌ర్వాత డ‌బ్బు జ‌మ చేసేలా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేస్తామ‌న్న‌ ఈసీ

cr-20240509tn663c8481352bc.jpg

ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు బ‌దిలీపై ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు విధించింది. పోలింగ్ త‌ర్వాతే న‌గ‌దు జ‌మ చేయాల‌ని ఆదేశించింది. ఇప్ప‌టికే బ‌ట‌న్ నొక్కిన ప‌థ‌కాల డ‌బ్బు జ‌మ‌ను ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కు వాయిదా వేసింది. మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన త‌ర్వాత డ‌బ్బు జ‌మ చేసేలా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేస్తామ‌ని ఈసీ పేర్కొంది. కాగా, ఎల‌క్ష‌న్ కోడ్ కంటే ముందే వివిధ ప‌థ‌కాల కోసం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కారు. అయితే, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాతే ల‌బ్ధిదారుల‌కు న‌గ‌దు జ‌మ చేయాల‌ని ఈసీ ఆదేశించ‌డం జ‌రిగింది.

Link to comment
Share on other sites

  • 0

CBI on YS Jagan's overseas trip permission: వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి

09-05-2024 Thu 15:25 | Andhra

ఏపీలో మే 13న ఎన్నికలు... జూన్ 4న ఫలితాలు

ఈ వ్యవధిలో యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న సీఎం జగన్

నిన్న నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ పై విచారణ

నేడు కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ

ఇప్పటికే జగన్ ఓసారి విదేశాలకు వెళ్లొచ్చారన్న సీబీఐ

తదుపరి విచారణ ఈ నెల 14కి వాయిదా

cr-20240509tn663c9d8c23a9c.jpg

బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని ఏపీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై నిన్న విచారణ జరిపిన సీబీఐ న్యాయస్థానం... కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో, సీబీఐ నేడు కోర్టులో తమ వాదనలు వినిపించింది. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతున్న దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఓసారి ఆయన విదేశాలకు వెళ్లొచ్చారని గుర్తుచేసింది. 

వాదనలు విన్న అనంతరం సీబీఐ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ మే 14న ఉంటుందని పేర్కొంది. 

కాగా, సీఎం జగన్ కోర్టు అనుమతి వస్తే ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటన చేయాలని భావిస్తున్నారు. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుండగా, ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. ఈ వ్యవధిలో ఆయన కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...