Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Crime news


TELUGU

Recommended Posts

Diesel Thieves: లారీ డ్రైవర్లు.. ఆ రోడ్డులో వెళ్తున్నారా..? బీకేర్‌ఫుల్..! కారుతో కేటుగాళ్లు కాచుక్కుని కూర్చున్నారు..!

అద్దంకి - నార్కెట్‌పల్లి హైవే.. అర్ధరాత్రి సమయం. జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. నిద్ర మత్తు వచ్చిన లారీ డ్రైవర్లు తమ వాహనాలను సమీపంలోని పెట్రోల్ బంక్ ల వద్ద నిలిపి అద మరిచి నిద్రపోతున్నారు.

Diesel Thieves

diesel-thieves.jpg?w=1280

అద్దంకి – నార్కెట్‌పల్లి హైవే.. అర్ధరాత్రి సమయం. జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. నిద్ర మత్తు వచ్చిన లారీ డ్రైవర్లు తమ వాహనాలను సమీపంలోని పెట్రోల్ బంక్ ల వద్ద నిలిపి అద మరిచి నిద్రపోతున్నారు. సమయం పన్నెండు గంటలు దాటడం నిద్ర ముంచుకొస్తుండటంతో డ్రైవర్లకు చుట్టు పక్కల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో పెట్రోల్ బంక్ లోని సిబ్బంది కూడా కుర్చీల్లో కూర్చొని నిద్ర మత్తులోకి జారుకుంటున్నారు.

ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి కారు ముఠాలు. తాము కూడా హైవేలో సుదూరం ప్రయాణిస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ పెట్రోల్ బంక్‌లోకి వస్తున్నారు. లారీకి సమీపంలోని తమ కారు నిలిపి రెస్ట్ తీసుకుంటున్నట్లు నటిస్తున్నారు. చుట్టుపక్కల జాగ్రత్తగా పరిశీలించి, కారులో నుండి దిగి లారీ డీజిల్ ట్యాంక్ వద్దకు వస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా లారీ డీజిల్ ట్యాంక్ లో నుండి ఆయిల్ ను కొట్టేస్తున్నారు. కొట్టేసిన ఆయిల్‌ను కారు డిక్కిలో పెట్టేసి కొద్దీ సేపటి తర్వాత అక్కడ నుండి హైవే మీదుగా చెక్కేస్తున్నారు. అయితే ఈ విషయం తెలియని లారీ డ్రైవర్లు నాలుగైదు గంటల సమయంలో లారీని తీసుకుని కొద్దీ దూరం వెళ్లగానే డీజిల్ అయిపోయిన సంకేతాలు అందుతున్నాయి. దీంతో ఖంగు తింటున్న లారీ డ్రైవర్లు పెట్రోల్ బంక్ నిర్వాహకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఇటువంటి ఘటనే నకరికల్లు మండలం చల్లగుండ్ల పెట్రోల్ బంక్ వద్ద జరిగింది. దీంతో కారుపై అనుమానం వచ్చిన లారీ డ్రైవర్ పెట్రోల్ బంక్ సిబ్బందికి చెప్పి సిసి కెమెరా విజువల్స్ ను పరిశీలించారు. స్పష్టంగా కారు లారీ పక్కనే పార్క్ చేయడం డ్రైవర్ కారు చుట్టుపక్కల తిరుగాడటం కెమెరాల్లో రికార్డ్ అయింది.

వీడియో చూడండి…

దీంతో కారులో వస్తున్న ముఠాలే లారీల్లోని డీజిల్ కొట్టేస్తున్నట్లు అర్దమయింది. లారీ డ్రైవర్లు, పెట్రోల్ బంక్ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచి కారు ముఠాల ఆటలు కట్టించాలని లారీ డ్రైవర్లు, పెట్రోల్ బంక్ సిబ్బంది కోరుకుంటున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 43
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Sanjiv

    18

  • TELUGU

    16

  • Vijay

    10

కర్నూలులో కొత్త రకం దొంగతనం... | Kurnool latest news updates @SumanTVKurnool

 

Link to comment
Share on other sites

RTC driver scammed out of 11 lakhs: జనగామ జిల్లాలో సైబర్ మోసం.. 11 లక్షలు పోగొట్టుకున్న RTC డ్రైవర్..ఏం జరిగిందంటే..

తీరా రామేశ్వర్ అకౌంట్ లో కేవలం 149 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి... అది గమనించిన కండక్టర్ లబోదిబోమంటూ వెంటనే బ్యాంకుకు వెళ్లి పరిశీలించాడు.. అప్పటికే అకౌంట్లోను డబ్బంతా సైబర్ మోసగాళ్లు కాజేసినట్టు తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఫలితం లేదు..

Cyber Fraudsters

cyber-fraudsters.jpg?w=1280

ఇంటికంటే బ్యాంకు పదిలం అనే భావనతో బ్యాంకులలో పైసా పైసా కూడా పెట్టుకునే ప్రజలు ఇప్పుడు సైబర్ మోసగాల వలలో చిక్కుకొని విలవిలాడుతున్నారు.. కష్టార్జితమంతా ఆ కేటుగాళ్లు కళ్ళు మూసి తెరిచేలోపే దోచేస్తున్నారు.. తాజాగా జనగామ జిల్లాలో ఓ కండక్టర్ తన జీవితకాలమంతా సంపాదించుకుని పోగు చేసుకున్న సొమ్మంతా ఒక్క నిమిషంలోనే కాజేశారు సైబర్ మోసగాళ్లు.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 లక్షల రూపాయలు కాజేయడంతో ఆ కండక్టర్ కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

రామేశ్వర్ అనేవ్యక్తి జనగామ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నాడు.. తన జీవిత ఆశయం సొంత ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో పైసా పైసా పోగు చేసుకుంటున్నాడు. దాదాపు 11 లక్షలకు పైగా బ్యాంకులో జమ చేసుకున్నాడు.. బ్యాంకులో ఉంటే భద్రంగా ఉంటాయని నమ్మకంతో ఎంతో భరోసాతో ఉన్నాడు.. కానీ సైబర్ మోసగాళ్లు నిండా ముంచేశారు.

బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని ఏపీకే అప్డేట్ చేస్తున్నామని నమ్మించారు. ఒక లింక్ పంపించి అందులో ఇతకి వివరాలు అప్డేట్ చేయాలని సూచించారు.. పూర్తి ఆధారాలు ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ఊడ్చేశారు..

తీరా రామేశ్వర్ అకౌంట్ లో కేవలం 149 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి… అది గమనించిన కండక్టర్ లబోదిబోమంటూ వెంటనే బ్యాంకుకు వెళ్లి పరిశీలించాడు.. అప్పటికే అకౌంట్లోను డబ్బంతా సైబర్ మోసగాళ్లు కాజేసినట్టు తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఫలితం లేదు..

జీవితకాలమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మంతా సైబర్ మోసగాళ్లు కాజేయడంతో తల్లడిల్లి పోతున్నారు.. తనలాంటి మోసం ఎవరికి జరగవద్దని, ఇలాంటి సైబర్ మోసగాలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Banking Frauds: New Phone numbers - బ్యాంకింగ్ మోసాలకు చెక్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త నెంబర్ సిరీస్

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో నగదు డిపాజిట్, విత్ డ్రాతో పాటు నగదు బదిలీ సేవలు కూడా చాలా సౌకర్యంగా మారాయి. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందన్న చందాన ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగించి చేసే మోసాల సంఖ్య కూడా పెరిగిపోయింది.

 
Banking Frauds: బ్యాంకింగ్ మోసాలకు చెక్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త నెంబర్ సిరీస్
Cyber Fraudsters

ముఖ్యంగా ఫేక్ కాల్స్ ద్వారా కేటుగాళ్లు బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును మాయం చేస్తున్నారు. కాల్ చేసే నంబర్లు కూడా బ్యాంకుల అధికారిక నెంబర్లు అనేలా భ్రమ పెడుతూ మోసగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేలా భారత ప్రభుత్వం కీలక చర్యలను తీసుకుంటుంది. త్వరలో బ్యాంకులకు 160తో ప్రారంభమయ్యే కొత్త 10 అంకెల ఫోన్ నంబర్ సిరీస్‌ను అందించనుంది. 160 సిరీస్ నెంబర్‌తో ఫోన్స్ వస్తే అవి కచ్చితంగా బ్యాంకుల నుంచి అధికారికంగా వచ్చే ఫోన్స్ కింద భావించవచ్చు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అధికారిక సంస్థల నుంచి కాల్స్‌ను సులభంగా గుర్తించవచ్చు. ఈ ప్రకటన మేలోనే వెలువడినా తాజాగా ఈ నెంబర్ కోసం ప్రభుత్వం చర్యలను తీసుకుంటుంది. ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మోసగాళ్లు వ్యక్తులను మోసగించడం చాలా కష్టంగా ఉంటుంది. వినియోగదారులు చట్టబద్ధమైన కాల్స్‌ను సులభంగా గుర్తించవచ్చు. ప్రారంభంలో 160 సిరీస్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ ద్వారా నియంత్రించే సంస్థలు ఉపయోగించవచ్చు. స్టాండర్డిస్డ్ నంబరింగ్ ఫార్మాట్ వినియోగదారులకు పెట్టుబడులు కోరే లేదా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించే మోసపూరిత సంస్థలను సులభంగా గుర్తించడంలో సహాయపడుతుందని డీఓటీ  చెబుతుంది.

ప్రభుత్వం, రెగ్యులేటర్లు అయాచిత కాల్స్‌కు అధిక జరిమానాలు విధించే అవకాశం ఉంది. భవిష్యత్తులో, ఈ నంబరింగ్ వ్యవస్థలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, వివిధ టెలికాం ప్రొవైడర్లు రానున్నారు. అదనంగా స్పామ్ కాల్లను తగ్గించడానికి ప్రభుత్వం ఇతర చర్యలు తీసుకుంటోంది. ట్రాయ్ ప్రమోషనల్ కాల్స్ కోసం ఉపయోగించేలా 140 సిరీస్‌ నంబర్‌ను లాంచ్ చేసిన విధితమే. ఈ కొత్త కొత్త నంబర్లు 1600ABCXXX  ఉంటుంది. ఇక్కడ “ఏబీ” టెలికాం సర్కిల్‌ను సూచిస్తుంది. 

...

Complete article

Link to comment
Share on other sites

22 hours ago, TELUGU said:

Banking Frauds: New Phone numbers - బ్యాంకింగ్ మోసాలకు చెక్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త నెంబర్ సిరీస్

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో నగదు డిపాజిట్, విత్ డ్రాతో పాటు నగదు బదిలీ సేవలు కూడా చాలా సౌకర్యంగా మారాయి. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందన్న చందాన ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగించి చేసే మోసాల సంఖ్య కూడా పెరిగిపోయింది.

ముఖ్యంగా ఫేక్ కాల్స్ ద్వారా కేటుగాళ్లు బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును మాయం చేస్తున్నారు. కాల్ చేసే నంబర్లు కూడా బ్యాంకుల అధికారిక నెంబర్లు అనేలా భ్రమ పెడుతూ మోసగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేలా భారత ప్రభుత్వం కీలక చర్యలను తీసుకుంటుంది. త్వరలో బ్యాంకులకు 160తో ప్రారంభమయ్యే కొత్త 10 అంకెల ఫోన్ నంబర్ సిరీస్‌నుఅందించనుంది. 160 సిరీస్ నెంబర్‌తో ఫోన్స్ వస్తే అవి కచ్చితంగా బ్యాంకుల నుంచి అధికారికంగా వచ్చే ఫోన్స్ కింద భావించవచ్చు
 

say goodbye to scammers!

 

Link to comment
Share on other sites

Sexual harrassment in ambulance: అంబులెన్స్‌లో పైశాచకం.. పేషెంట్‌ భార్యకి లైంగిక వేధింపులు..

అంబులెన్స్‌ డ్రైవర్ పేషెంట్‌ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించి.. ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్‌ను తొలగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపుర్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనలో పేషెంట్‌ ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు తెలుసుకుందాం పదండి..

 
Viral: అంబులెన్స్‌లో పైశాచకం.. పేషెంట్‌ భార్యకి లైంగిక వేధింపులు..
Ambulance

దేశంలో మహిళలపై అరాచకాలకు హద్దులేకుండా పోతోంది. ప్రతిరోజూ చాలా చోట్ల దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ.. అక్కడ… అని కాకుండా ప్రతి చోటా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా అంబులెన్స్‌ డ్రైవరే పేషెంట్‌ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించి.. ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్‌ను తొలగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని ఘాజిపుర్‌లో చోటు చేసుకొంది. ఈ ఘటనలో పేషెంట్‌ ప్రాణాలు కోల్పోయాడు.

సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ ఆగస్టు 28న ఘాజిపుర్‌లోని ఆరావళి మార్గ్‌లో ఉన్న ఒక ఆసుపత్రిలో భర్తను చేర్పించింది. అక్కడ ఖర్చు తట్టుకోలేక తన భర్తను ఇంటికి తీసుకెళతానని వైద్యులను అభ్యర్థించింది. దీంతో వారు ఆమెకు ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ నెంబర్‌ ఇచ్చారు. సదరు మహిళ అంబులెన్స్‌లో తన భర్తను, సోదరుడిని తీసుకొని సిద్ధార్థనగర్‌లోని ఇంటికి బయల్దేరింది. ప్రయాణం ప్రారంభించే ముందు ఆ డ్రైవర్‌ ఆమెను తనతో పాటు ముందుసీట్లో కూర్చోవాలని.. అలా అయితే రాత్రి వేళ పోలీసులు మధ్యలో ఆపరని చెప్పాడు. దీంతో ఆమె అలానే చేసింది. మార్గమధ్యలో డ్రైవర్‌, అతడి సహాయకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీనికి సదరు మహిళ అభ్యంతరం తెలిపింది. మరోవైపు వీరి ప్రవర్తనను గమనించిన ఆమె భర్త, సోదరుడు కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో చవానీ పోలీస్‌స్టేషన్‌రోడ్డులో వారు అంబులెన్స్‌ను ఆపి ఆమె భర్తను రోడ్డుపక్కనే దించేసి.. ఆక్సిజన్‌ తొలగించి వెళ్లిపోయారు. సదరు మహిళ వద్ద రూ.10వేల నగదు, కొన్ని ఆభరణాలు లాక్కొని వెళ్లిపోయారు. దీంతో సదరు మహిళ, ఆమె సోదరుడు 112, 108 నెంబర్లకు ఫోన్‌ చేసి పరిస్థితి చెప్పడంతో తక్షణమే పోలీసులు స్పందించి అక్కడికి చేరుకొన్నారు. ఆమె భర్తను మరో ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ అతడి పరిస్థితి విషమించడంతో గోరఖ్‌పుర్‌ మెడికల్‌ కాలేజీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

...

Complete article

Link to comment
Share on other sites

Cyber Crimes: వందలే కదా అని మీరు వదిలేస్తుంటే.. వాళ్లు వేల కోట్లు వెనకేసుకుంటున్నారు

ఇప్పటి వరకు మొత్తం 17 కోట్ల 13 లక్షల ఫిర్యాదులు పోలీసులకు అందగా అందులో 85 శాతం అంటే సుమారు 14.5 కోట్ల ఫిర్యాదులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే.

 
వందలే కదా అని మీరు వదిలేస్తుంటే.. వాళ్లు వేల కోట్లు వెనకేసుకుంటున్నారు

మే 22, 2024 బెంగళూరులోని ఈస్ట్ రామమూర్తినగర్ బాధితురాలు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫెడ్ ఎక్స్ కొరియర్ స్కామ్‌కి కోటి రూపాయల నష్టం. కొరియర్ వచ్చిందంటూ ఫెడ్ ఎక్స్ తరపున ఫోన్ చేస్తున్నామంటూ ఆమెకు ఓ కాల్ వచ్చింది. ఆ పేరున తైవాన్ వెళ్లాల్సిన ఓ కొరియర్‌ను ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు సీజ్ చేశారని చెప్పారు. అక్కడితో ఆగితో ఈ కథలో పెద్ద కిక్కు లేదు. ఆ పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరించారు. అక్కడ నుంచి కథ కస్టమ్స్‌కి మారింది. తాము కస్టమ్స్ అధికారులమంటూ మరి కొందరు ఫోన్‌లో బెదిరించడం మొదలు పెట్టారు. పార్శిల్‌లో డ్రగ్స్‌తో పాటు పాస్ట్ పోర్టులు, ఇతర వస్తువులు ఉన్నాయని, ఆల్రెడీ విచారణ మొదలైందంటూ భయపెట్టారు. అక్కడితో ఆగలేదు. మరొకరు ఫోన్ చేసి నార్కోటిక్స్ కేసులో ఆమె పాత్ర ఉందంటూ బెదిరింపులకు దిగాడు. ఆన్ లైన్లో ఇంటరాగేషన్ పేరుతో భయపెట్టారు. కేసు నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్‌కు సపోర్ట్ చెయ్యాలని, అందుకోసం ఆర్బీఐకి కొంత డబ్బు పంపాలని, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తిరిగి అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పి విడతల వారీగా కోటీ రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అంతే సడన్‌గా కాల్ కట్టయ్యింది. విచారణ పూర్తయ్యింది. అక్కడితో వారి క్రైం కథా చిత్రం కూడా పూర్తయ్యింది. ఇంత జరిగిన తర్వాత కోటి రూపాయలు ఇచ్చేసిన తర్వాత కానీ ఆమెకు తాను మోసపోయానన్న సంగతి తెలియలేదు. ఆ తర్వాత లబో దిబో మంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది.

బెంగళూరు వరకు ఎందుకు…? కొద్ది రోజుల క్రితం వైజాగ్‌లోనూ ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. మీకు లాటరీ తగిలిందనగానే లింక్ క్లిక్ చేశారు.లాటరీ మాట దేవుడెరుగు.. ఖాతాలో ఉన్న కాస్త డబ్బులు కూడా కనిపించకుండా పోయాయి.

01

మొత్తంగా వైజాగ్, బెంగళూరు అనే కాదు… దేశ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 5 సైబర్ కంప్లైంట్లు నమోదవుతున్నాయి. అంటే రోజూ నమోదవుతున్న సైబర్ క్రైం ఫిర్యాదుల సంఖ్య అక్షరాల ఏడు వేలు. ఇప్పటి వరకు మొత్తం 17 కోట్ల 13 లక్షల ఫిర్యాదులు పోలీసులకు అందగా అందులో 85 శాతం అంటే సుమారు 14.5 కోట్ల ఫిర్యాదులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే.

తాజాగా నేషనల్ సైబర్ క్రైం రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి రోజూ సుమారు ప్రజల నుంచి సైబర్ క్రైమ్స్‌కు సంబంధించి 67 వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఒక్క 2024 తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 1700 కోట్ల రూపాయల సైబర్ క్రైం మోసాలు దేశంలో జరిగాయి. సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా ఏటా 70 వేల కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయట. అయితే ఈ నేరాల విలువ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో లెక్క చెబుతున్నప్పటికీ… జరుగుతున్న నేరాల సంఖ్య విషయంలో మాత్రం పెద్దగా తేడాలు ఉండటం లేదు.

02

నిజానికి గతంలో సైబర్ నేరాల వల్ల ఏటా దేశంలో జరిగే నష్టం సుమారు 10 వేల కోట్లు ఉండేదని సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ చెబుతున్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పటికీ దాని విలువ విషయంలో భిన్నాభిప్రాయాలుండటానికి ప్రధాన కారణం ఈ సెబర్ నేరాల్లో చాలా వరకు చిన్న మొత్తాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఫిర్యాదులు ఇచ్చే వారి సంఖ్య పెద్దగా ఉండటం లేదు. లా ఎన్ ఫోర్స్‌మెంట్ దృష్టిలో పడకుండా ఉండేందుకు స్కామర్స్ చిన్న చిన్న మొత్తాలపైనే ఎక్కువ స్థాయిలో దృష్టి పెడుతున్నారు. ఫలితంగా ఆ మోసాల గురించి ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప నేరుగా చట్టం చేతికి చిక్కడం లేదు.

03

ఎక్కువగా ఈ స్కామ్‌లు మియన్మార్, లావోస్, కాంబోడియా, చైనా దేశాల బేస్‌గా జరుగుతున్నాయి. ఇండియాలో కొందర్ని అపాయింట్ చేసుకొని వారిని ఎరలుగా వాడుకుంటున్నారు. ఇలాంటి స్కామ్స్‌కి మన దేశంలో బీహార్‌లోని నలంద జిల్లా చాలా ఫేమస్. అలాగే గడిచిన 8 ఏళ్లుగా జవా కటియా అనే గ్రామం కూడా సైబర్ క్రైం సెంటర్‌గా పేరుంది. ఇలా దొంగలించే సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చేస్తున్నారు. ఫలితంగా వాటిని ట్రాక్ చెయ్యడం కూడా సాధ్యం కావడం లేదు.

సైబర్ క్రైం ఎన్నిరకాలు ?

కొరియర్ స్కామ్‌లు: దేశంలో ఇప్పుడు ఫెడ్ ఎక్స్ కొరియర్ స్కామ్ చాలా ఫేమస్. దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ కాల్స్ రోజూ ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటాయి. ఇందులో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మీపై డ్రగ్స్, నార్కోటిక్స్ అభియోగాలు ఉన్నాయని.. ఇలా ఏదో ఒక పేరుతో బెదిరించి డబ్బులు గుంజేస్తుంటారు. ఈ కథనం ప్రారంభంలో ప్రస్తావించిన బెంగళూరు యువతి ఘటన అందుకు ఉదాహరణ.

జాబ్ స్కామ్స్: భారీ జీతాలతో ఉద్యోగాలిస్తామని, అందుకు ముందుగా కొంత ఫీ చెల్లిస్తే చాలంటూ వచ్చే కాల్స్ ఈ తరహావి. వారు చెప్పే భారీ జీతానికి ఆశపడి ఫీజు చెల్లించారో మీ పని అయిపోయినట్టే.

ఇన్వెస్టిమెంట్ స్కామ్స్: ఇందులో బాధితుల్ని సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకుంటారు. ఆ తర్వాత ఓ నకిలీ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే మిమ్మల్ని ఒప్పిస్తారు. ఇలాంటివి సాధారణంగా క్రిప్టో మోసాలు క్యాటగిరిలో ఉంటాయి.

తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించేద్దాం.. అని ఇంటర్నెట్‌లో ఈ తరహా వెతికే వారు ఈజీగా ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకుంటారు. వాళ్ల డేటాను సేకరించి వాళ్లనే టార్గెట్‌గా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అలాగే వీళ్లు ఎప్పుడూ ఒకే లోకేషన్‌లో ఉండరు. అలాగే నలుగురుగైదురు ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉంటూ ఉంటారు కూడా. పని పూర్తయ్యాక.. వాళ్ల ఆచూకీ, ఆనవాళ్లు కూడా కనిపించకుండా చేస్తారు. నిజానికి ఇలాంటి విషయాల్లో ఫిర్యాదులిచ్చినా చాలా వరకు దాని ఎంక్వైరీకి అయ్యే ఖర్చుతో పోల్చితే బాధితుడికి జరిగే నష్టం అతి తక్కువ కావడంతో చిన్న చిన్న మొత్తాల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుంటుంది. అలాగే చిన్న మొత్తంలో నష్టపోయినప్పుడు బాధితులు కూడా దాని కోసం ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ, పోలీసుల చుట్టూ ఎవడు తిరుగుతాడులే అని వదిలేస్తున్నారు కూడా. కానీ ఈ చిన్న చిన్న మొత్తాలే వందల, వేల కోట్ల ఆదాయంగా మారుతోంది ఈ తరహా స్కామర్లకు.

signal-2024-09-12-133300-006.jpeg

పదో స్థానంలో ఇండియా

ప్రపంచంలో సైబర్ క్రైం నేరాల బారిన పడుతున్న దేశాలలో ఇండియా పదో స్థానంలో ఉంది. దీంతో ఈ తరహా మోసాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెడుతోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి లాంచ్ చేసిన సస్పెక్ట్ రిజస్ట్రీ ప్రకారం దేశంలో జరుగుతున్న సైబర్ మోసాలలో సుమారు 14 లక్షల మంది క్రిమినల్స్ భాగస్వాములై ఉన్నారని తేలింది. ఈ సస్పెక్స్ట్ రిజస్ట్రీని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సెంట్రల్ ఇన్విస్టిగేషన్, ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు వినియోగించుకోవచ్చు. దీనిని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ రూపొందించింది.

సైబర్ మోసాలకు గురయ్యే వారు గోల్డెన్ అవర్‌లో అంటే బ్యాంక్ నుంచి మోసగాళ్లు మీ డబ్బును వారి ఖాతాల్లోకి బదిలీ చేసుకునే తొలి గంటలో 1930కి కాల్ చెయ్యాలి, లేదా WWW.cybercrime.gov.inలో ఫిర్యాదు చెయ్యాలి. అలా చేస్తే వెంటనే మీ డబ్బుల్ని వారి ఖాతాల్లోకి వెళ్లకుండా ఫ్రీజ్ చెయ్యచ్చు. అలా 2021 నుంచి ఇప్పటి వరకు NCRP సుమారు 2800 కోట్ల రూపాయలను రికవరీ చేసింది. తద్వారా సుమారు 8లక్షల50వేల మంది బాధితులకు మేలు జరిగింది. NCRP ప్రకారం దేశంలో ఇప్పటి వరకు సుమారు 47.8 లక్షల సైబర్ క్రైం ఫిర్యాదులు అందాయి.

దేశంలో పెరిగిపోతున్న సైబర్ క్రైం నేరాలను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా 5 వేల మంది సైబర్ కమాండోలను వచ్చే ఐదేళ్లలో నియమిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా ప్రకటించారు. నేరం జరిగిన వెంటనే వీరు రెస్పాండ్ అవుతారని చెప్పారు. అలాగే ఇకపై ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ హోం మినిస్ట్రీ ఆధ్వర్యంలో పని చేయనుంది.

సర్కారు ప్రయత్నాలు సరే.. మన సంగతేంటి.. సైబర్ నేరాల బారిన పడకుండా మనకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం.

1.గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ , ఈమెయిల్స్, మెసేజ్‌ల జోలికి వెళ్లకండి 2.అలాగే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌ల్లోని లింకులు, అటాచ్మెంట్స్ క్లిక్ చెయ్యద్దు. 3.ఆఫర్ల పేరుతో వచ్చే కాల్స్ విషయంలో అనవసరంగా తొందరపడి అనర్ధాలు తెచ్చుకోవద్దు. 4.డబ్బులు పంపేటప్పుడు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేటప్పుడు సదరు కంపెనీ చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోండి. అలాగే మీ మొబైల్ ఫోన్లలలో కొన్ని యాప్స్‌ కాల్ లాగ్స్‌ని, కెమెరాను , మైక్రోఫన్ యాక్సిస్ అడుగుతాయి. వాటికి ఓకే చెప్పేటప్పుడు తప్పనిసరిగా వెరిఫై చేసుకోండి. 5.మీ ఆన్ లైన్ అకౌంట్లకు కఠినమైన పాస్ వర్డ్స్‌ను ఏర్పాటు చేసుకోండి. అలాగే టూ స్టెప్ వెరిఫికేషన్‌ను కచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. 6.మీ మొబైల్, ల్యాప్ ట్యాప్ సాప్ట్ వేర్ అలాగే సెక్యూరిటీ సిస్టమ్స్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోండి. 7. ఎప్పటికప్పుడు సైబర్ క్రైం విషయంలో వస్తున్న వార్తల్ని, వారి మోడస్ ఆపరెండీని గమనిస్తూ ఉండండి. భవిష్యత్తులో మీకు కూడా అదే తరహా కాల్స్, లేదా మెసేజెస్ లేదా మెయిల్స్ రావచ్చు. మీరు అనుకోకుండానే వాటిని క్లిక్ చేసే ప్రమాదం కూడా ఉంది. 8.గాడ్జెట్స్ వాడకంలో స్మార్ట్‌గా మాత్రమే కాదు… కేర్‌ఫుల్‌గా కూడా ఉండండి.

Link to comment
Share on other sites

New Google Pay and PhonePe scam: మీరు Google Pay, Phone Pay ఉపయోగిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక!

దైనందిన జీవితంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే గూగుల్ పే, ఫోన్ పే వంటి అప్లికేషన్ల ద్వారా కొత్త తరహా మోసాలు చోటుచేసుకుంటున్నాయని, వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. Google Payలో కొత్త తరహా మోసం ఏం జరుగుతోంది..? గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, ఇతర లావాదేవీలకు సంబంధించిన యాప్స్‌ వాడేవారికి..

 
మీరు Google Pay, Phone Pay ఉపయోగిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక!

దైనందిన జీవితంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే గూగుల్ పే, ఫోన్ పే వంటి అప్లికేషన్ల ద్వారా కొత్త తరహా మోసాలు చోటుచేసుకుంటున్నాయని, వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. Google Payలో కొత్త తరహా మోసం ఏం జరుగుతోంది..? గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, ఇతర లావాదేవీలకు సంబంధించిన యాప్స్‌ వాడేవారికి సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే దేని గురించి హెచ్చరిస్తున్నారు? అసలు మ్యాటర్‌ ఏంటో తెలుసుకుందాం.

గూగుల్‌ పేలో కొత్త రకం మోసం:

గూగుల్‌ పే మోసానికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు మాట్లాడుతూ.. మీకు ఇంతకు ముందు తెలియని ఎవరైనా గూగుల్‌ పే, ఫోన్‌ పే, యూపీఐ యాప్‌ల ద్వారా మీకు డబ్బు పంపిస్తారని, ఆ తర్వాత డబ్బు మీ బ్యాంకు ఖాతాకు చేరిన తర్వాత, మిమ్మల్ని సంప్రదించిన వ్యక్తి, వారు పొరపాటున మీకు డబ్బు పంపారని, మరొకరికి పంపకుండా తొందరపడి మీకు పంపినట్లు చెబుతారు. అంతే కాకుండా తాను పొరపాటున పంపిన డబ్బును తిరిగి అదే నంబర్‌కు పంపమని కూడా అడుగుతారు. మీరు సానుభూతి చూపి డబ్బు పంపితే వారు మీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేస్తారు. అప్పుడు మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం లూటీ అవుతుంది.

మోసం నుండి సురక్షితంగా ఉండటానికి చేయవలసినవి:

➦ మీకు తెలియని ఎవరైనా Google Payతో సహా UPI యాప్‌లలో ఇలా డబ్బు పంపి, దాన్ని తిరిగి పంపమని అడిగితే, వెంటనే డబ్బు పంపకండి.

➦ డబ్బు పంపిన వ్యక్తిని సంప్రదించి, వారి గుర్తింపు రుజువుతో సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వచ్చి నగదు తీసుకోమని చెప్పండి.

➦ ఎవరైనా మీకు Google Payలో డబ్బు పంపి, దాన్ని తిరిగి పంపడానికి మీకు టెక్ట్స్‌ సందేశంలో లింక్‌ను పంపితే, దానిపై క్లిక్ చేయవద్దు. ఇది మీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయడానికి లింక్ కావచ్చు.

➦ కాబట్టి మీరు ఆ లింక్‌పై క్లిక్ చేస్తే మోసగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ.

➦ SMS ద్వారా మీకు పంపబడిన లింక్‌లు పూర్తిగా నకిలీవి మరియు ప్రమాదకరమైనవి అని గుర్తుంచుకోండి.

➦ అయితే మీ మొబైల్ ఫోన్ పోయినట్లయితే మొబైల్ ఫోన్‌లోని యూపీఐ యాప్ ద్వారా బ్యాంకు ఖాతాలోని డబ్బును దొంగిలించే అవకాశం ఉంది. అందుకే మొబైల్ ఫోన్ పోతే వెంటనే యూపీఐ ఐడీని బ్లాక్ చేయడం అవసరం.

➦ పైన పేర్కొన్న విధానాలను అనుసరించడం ద్వారా Google Payతో సహా UPI యాప్‌ల ద్వారా జరిగే మోసాల నుండి మనం సురక్షితంగా ఉండవచ్చని గమనించడం ముఖ్యం.

Link to comment
Share on other sites

14-year old girl gang raped in moving car - మరో దారుణం.. కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఒక నిందితుడిని అరెస్టు చేశామని, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

 
మరో దారుణం.. కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం
14 Year Old Girl

బిహార్‌లోని సహర్షా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ టీనేజీ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో బాలికపై ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. బాధిత బాలిక మేకలు మేపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. ముగ్గురు యువకులు బలవంతంగా ఆమెను కారులోకి ఎక్కించారు. ముగ్గురిలో ఒకరు కారు నడుపుతుండగా.. మరో ఇద్దరు కదులుతున్న కారులోనే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితులు విలపిస్తూ పోలీసులకు చెప్పుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బీహార్ లోని సహర్షా జిల్లాలో సెప్టెంబరు 14న ఈ దారుణ ఘటన జరిగింది. ఈ మేరకు బాలిక సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ హిమాన్షు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఒక నిందితుడిని అరెస్టు చేశామని, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. మరోవైపు నిందితులు ఉపయోగించిన కారును సీజ్ చేశామన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 2 weeks later...

how in the world would the balance in a bank account get emptied from taking a phone call or even from doing nothing?? what kind of hopeless banking systems does india have?

in the event of a scam, call 1930 ASAP (at least within 24 hours) to recover maximum amount of stolen amount.

Hyderabad: 3 నిమిషాల్లో రూ. 1.10 కోట్లు.. కట్‌ చేస్తే.. ఆ తర్వాత 25 నిమిషాల్లో సీన్ ఇది

హైదరాబాద్‌కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్‌కు సెప్టెంబర్ 27 ఉదయం మూడు మెసేజ్‌లు వచ్చాయి. 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే.. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు.. రూ.10 లక్షలు ఒకసారి..

 
Hyderabad: 3 నిమిషాల్లో రూ. 1.10 కోట్లు.. కట్‌ చేస్తే.. ఆ తర్వాత 25 నిమిషాల్లో సీన్ ఇది

అంటే మొత్తంగా రూ.1.10 కోట్ల భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా బ్యాంక్ నుంచి మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది. తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావడంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే తేరుకున్న అతడు.. కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేశాడు.

నిమిషాల వ్యవధిలో అంటే 10.22 గంటల వేళలో 1930 నెంబర్‌కు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించాడు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్.. జరిగిన మోసానికి సంబంధించి సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టం సిబ్బందిని రంగంలోకి దించింది. తెలంగాణలో ఈ మోసం జరగడంతో వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్‌లోకి వచ్చేసింది.

బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం విషయంపై యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేసింది స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి.. నిధుల్ని డ్రా చేయకుండా పుట్ ఆన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి రూ.10.42 గంటల వేళలో ఫోన్‌కు మెసేజ్ చేశారు. సైబర్ నేరస్తులు దోచేసిన రూ.1.10 కోట్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. దీంతో డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరులోని ఖాతాలుగా గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా..! నిమిషాల్లో స్పందించి ‘1930’కు ఫోన్ చేస్తే.. డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని.. 1930 నెంబర్‌ మీద అవగాహన పెంచుకోవాలని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Young Look: నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్..

అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఆరుపదుల వయసుదాటినా నవయవ్వనంతో మెరిసిపోవాలి అనుకుంటారు. ముఖం మీద చిన్న ముడత కనిపించినా తీవ్ర ఆందోళనకు గురవుతారు. అందుకే అందంగా మారేందుకు ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరు కొంతమంది. ఈ క్రేజ్‌నే క్యాష్‌ చేసుకొంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ. 35 కోట్ల ఘరానా మోసం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రాజీవ్ కుమార్ దూబే , అతని భార్య, రష్మీ దూబే జంట అమాయకులకు మాయమాటలు చెప్పి కోట్లరూపాయలు కొల్లగొట్టారు. ఇజ్రాయెల్‌లో తయారైన టైమ్ మెషిన్ ద్వారా అందర్నీ నవ యవ్వనంగా మారుస్తామంటూ కొంతమంది వృద్ధులను బుట్టలో వేసుకుంది. కలుషిత గాలి వల్ల వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నామని, ‘ఆక్సిజన్ థెరపీ’ ద్వారా నెలరోజుల్లో యవ్వనం వస్తుందని చెప్పి వారిని నమ్మబలికారు. అలా పలువురి నుంచి ఏకంగా 35 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఇందుకోసం కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలో థెరపీ సెంటర్ – ‘రివైవల్ వరల్డ్ ’ ను ప్రారంభించారు. ఆక్సిజన్ థెరపీతో ఏకంగా 60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా మార్చేస్తామని చెప్పారు. ఒక్కో సెషన్‌కు ఆరు వేలు, మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కోసం రూ. 90వేలు… ఇలా రకరకాల ప్యాకేజీలను ఆఫర్‌ చేశారు.

మోసం ఎప్పడో అప్పడు బయటపడక మానదు. అలాగే వీరి బండారం కూడా బయటపడింది. బాధితుల్లో ఒకరైన రేణు సింగ్ ఫిర్యాదుతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తనకు మాయమాటలు చెప్పి రూ. 10.75 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వందలాది మందిని సుమారు రూ.35 కోట్లు మోసం చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 2 weeks later...

మరీ ఇంత దారుణమా.! అత్తా కోడళ్లపై గ్యాంగ్‌రేప్‌.. సీఎం చంద్రబాబు సీరియస్

పండుగ వేళ శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. అత్తాకోడళ్లపై గ్యాంగ్‌రేప్‌‌కు పాల్పడ్డారు దుండగులు. ఇంట్లోకి చొరబడి.. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేశారు.. అడ్డొచ్చిన తండ్రి, కొడుకుల పై దాడి చేశారు. వాచ్‌మన్‌ని, అతని కొడుకును కత్తులతో బెదిరించి.. అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం చేశారు నలుగురు దుండగులు. ఈ ఘటన చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో వెలుగుచూసింది.

ఉపాధి కోసం ఇటీవలే బళ్లారి నుంచి వచ్చింది కుటుంబం.. వీళ్లు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.. ఈ కుటుంబం ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసి వీళ్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో నిందితులకు సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. దుండగులు పక్కా ప్లాన్ తోనే గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీ రత్నతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించారు.

Six held for raping woman, daughter-in-law in Andhra Pradesh

The suspects, including three minors, reportedly attempted to rob the factory before committing the heinous crime.
 
Representative image.
ANANTAPUR: The Sri Satya Sai district police on Sunday detained six suspects in connection with the alleged gang-rape of a mother-in-law and daughter-in-law at Nallabommanipalle village in Chilmathur Mandal.

The incident took place in the early hours of Saturday when armed assailants, under the influence of alcohol and drugs, attacked a family of watchmen. The father and son were overpowered and threatened with a knife, while the women were sexually assaulted in front of them.

The victims’ family, originally from Bellary of Karnataka, had come to Nallabommanipalle to work as security guards at a carton factory under construction.

The suspects, including three minors, reportedly attempted to rob the factory before committing the heinous crime. The minors, known for their involvement in petty crimes and substance abuse, were arrested along with the others following a swift police investigation.

Local authorities, including Sri Sathya Sai district Superintendent of Police (SP) V Ratna, confirmed that the victims were receiving medical treatment and their condition was stable.

The crime has ignited outrage throughout the State, with public protests demanding justice. Chief Minister Chandrababu Naidu, took immediate action by reviewing the investigation’s progress and instructing police to expedite the arrests.

Handlooms & Textiles Minister S Savitha, Hindupur MP BK Parthasarathi and MLA Nandamuri Balakrishna also urged the police to ensure the culprits face justice.

Special police teams were formed to locate the suspects and by Saturday, all six, including the minors, were taken into custody. Protests have continued, reflecting the widespread anger over the incident and calls for swift legal action against those responsible.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...