Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

Good Phones, Plans, Watches, Tablets, Gadgets, Laptops and TVs in India


TELUGU

Question

Reliance Jio new plan with 90-day validity: 90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన జియో

29-04-2024 Mon 16:26 | Business

రోజుకు 2 జీబీ.. అదనంగా మరో 20 జీబీ డేటా

రూ.749 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ

జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్న టెలికం దిగ్గజం

cr-20240429tn662f7cde6fb06.jpg

దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్ బేస్ కలిగివున్న దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో సాధారణ ఆఫర్లతో పోల్చితే యూజర్లకు అధిక డేటా లభిస్తోంది. ఆఫర్‌లో రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటాను జియో అందిస్తోంది. మొత్తం 200 జీబీల డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఉచిత కాలింగ్, ఎంఎస్‌ఎంలు, ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి.

ఇక ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. 5జీ మొబైల్ కలిగివుండి కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ యాక్సెస్ ఉంటే అదనపు డేటాను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఆఫర్ కింద జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌లకు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 90 రోజులపాటు ఈ సేవలను పొందవచ్చు.

కాగా తక్కువ రేటుతో సాధ్యమైనన్ని గరిష్ఠ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా జియో ఇటీవలే రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అనేక వర్గాలుగా విభజించింది. అందులో భాగంగా ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా భారత్‌లో అత్యధికంగా 45 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లను జియో కలిగివుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా జియో కొనసాగుతోంది.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Redmi 13 4G: బడ్జెట్‌లో మంచి ఫీచర్ల ఫోన్‌ కోసం చూస్తున్నారా.? ఇదే బెస్ట్‌ ఆప్షన్‌

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థలు తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ 13 పేరుతో తీసుకొస్తున్న ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

redmi-3.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రెడ్‌మీ 13 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని లాంచ్‌ చేస్తోంది. అయితే ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రెడ్‌మీ కొత్తగా మళ్లీ 4జీ ఫోన్‌ లాంచ్‌ చేయడం గమనార్హం.

redmi13-price.jpg

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర వఙషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 16,500గా ఉండగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19వేలుగా ఉండనుంది. ఈ ఫోన్‌ను బ్లాక్‌, బ్లూ, పింక్‌, ఎల్లో షేడ్స్‌తో తీసుకొస్తున్నారు.

tech-news-10.jpg

రెడ్‌మీ13 స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్ హెలియో జీ91 ఆల్ట్రా ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తోపాటు రెండు సర్క్యులర్ కెమెరా యూనిట్లను అందించనున్నారు. స్పీకర్ గ్రిల్లె, మిక్, యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు.

redmi-new-phone-1.jpg

ఇక ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ ఈ ఫోన్‌ సొంతం. అలాగే ఇందులో ఎడ్జ్ రైట్ పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్‌ను అందించారు. మైక్రో ఎస్టీ కార్డు ద్వారా స్టోరేజీ కెపాసిటీని ఒక టిగా బైట్‌ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

redmi-13-price.jpg

ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడి ప్రైమరీ సెన్సర్‌ కెమరా, 2 మెగాపిక్సెల్స్‌ సెకండరీ కెమెరా, సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 33 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5030 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇవ్వనున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Oppo Find X7 Ultra: కళ్లు చెదిరే ఫీచర్లతో ఒప్పో ఫోన్‌.. ఏమన్నా ఫీచర్సా అసలు..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో ఓవైపు బడ్జెట్ ఫోన్‌లతో పాటు ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లను సైతం విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా పేరుతో ఓ ప్రీమియం ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించింది ఒప్పో. ఇంతకీ ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రాలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

oppo-find-x7-ultra.jpg?w=1280&enlarge=tr

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో గత కొన్ని రోజుల క్రితం మార్కెట్లోకి ఎప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా పేరుతో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ప్రపంచలోనే తొలి క్వాడ్‌ మెయిన్‌ కెమెరా విత్ హైపర్‌టోన్‌ ఇమేజ్‌ ఇంజన్‌తో తీసుకొచ్చిన ఫోన్‌ ఇదే కావడం విశేషం.

oppo-find-x7-ultra-features.jpg

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో హాసెల్‌బ్లాడ్ బ్రాండెడ్ క్వాడ్ రియ‌ర్ కెమెరా సెట‌ప్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన నాలుగు రెయిర్ కెమెరాలను అందించారు.

oppo-find-x7-ultra-price.jpg

ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో సోనీ లేటెస్ట్ 1 ఇంచ్ టైప్ ఎల్‌వైటీ-900 సెన్స‌ర్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

oppo-new-phone.jpg

ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌లో 100 వాట్స్‌ సూపర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. పైన్‌ షాడో, సిల్వర్‌ మూన్‌, వ్యాస్ట్‌ సీ, స్కై కలర్స్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ. 70 వేలుగా ఉంది.

oppo-smartphone.jpg

ఈ స్మార్ట్‌ పోన్‌ కేవలం 40 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌తోకూడిన కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 1600 నిట్స్‌ ఫుల్ స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఐపీ68 రేటింగ్‌ను ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Tending Jio vs Airtel Rs. 299 Plans: రూ.299 ప్లాన్ ఎందుకు బాగా ట్రెండ్ అవుతోంది..!

ఈ రోజుల్లో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ భారతీయ టెలికాం పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందింది. ఎయిర్‌టెల్ లేదా జియో కావచ్చు. భారతదేశంలోని ఈ రెండు పెద్ద టెలికాం కంపెనీల రూ. 299 ప్లాన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఏం ఉంది అనే ప్రశ్న తలెత్తుతుంది. దీని కారణంగా ప్రజలు ఈ ప్లాన్..

mobile-recharge-3.jpg?w=1280

ఈ రోజుల్లో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ భారతీయ టెలికాం పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందింది. ఎయిర్‌టెల్ లేదా జియో కావచ్చు. భారతదేశంలోని ఈ రెండు పెద్ద టెలికాం కంపెనీల రూ. 299 ప్లాన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఏం ఉంది అనే ప్రశ్న తలెత్తుతుంది. దీని కారణంగా ప్రజలు ఈ ప్లాన్ గురించి చర్చించుకుంటున్నారు. Airtel, Jio ఈ రూ.299 ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 299:

Airtel రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 1.5GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ చెల్లుబాటు సమయంలో వినియోగదారులు అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ సౌకర్యాన్ని పొందుతారు. ఇది కాకుండా రోజుకు 100 SMS సౌకర్యం కూడా అందించబడుతుంది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత 5G డేటా, 3 నెలల ఉచిత అపోలో సబ్‌స్క్రిప్షన్, Hellotune, Wynk Musicకు ఉచిత యాక్సెస్‌ను పొందుతారు.

జియో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్:

జియో రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి మరింత చర్చ జరుగుతోంది. జియో వెబ్‌సైట్ ప్రకారం.. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ 2జీబీ హై స్పీడ్ డేటా, రోజువారీ 100 SMS, అపరిమిత లోకల్ ఎస్‌టీడీ, రోమింగ్ కాల్‌లను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో ఉచితంగా లభించే జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌లో జియో సినిమా ప్రీమియం ప్రయోజనాలు ఉండవని ఈ ప్లాన్ వివరాలతో పాటు జియో వెబ్‌సైట్‌లో స్పష్టంగా రాసి ఉంది.

జియో సినిమా ప్రీమియం ప్లాన్ రూ. 299:

కొన్ని రోజుల క్రితం కంపెనీ ప్రారంభించిన జియో సినిమా రూ.299 ప్లాన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.. ఈ ప్లాన్ కారణంగా రూ.299 ప్లాన్ సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. రిలయన్స్ జియో జియో సినిమా ప్రీమియం కోసం వార్షిక ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 12 నెలలు అంటే 365 రోజులు. ఈ ప్లాన్ ధర రూ.299. ఇందులో వినియోగదారులు స్పోర్ట్స్, లైవ్ కంటెంట్ మినహా అన్ని కంటెంట్‌ను యాడ్-రహితంగా చూసే అవకాశాన్ని పొందుతారు. ఇది కాకుండా జియో సినిమా అన్ని ప్రీమియం కంటెంట్ ఇందులో అందుబాటులో ఉంది. వినియోగదారులు 4కే వీడియో నాణ్యతతో బహుళ భాషల్లో విభిన్న బాలీవుడ్, హాలీవుడ్ కంటెంట్‌లను చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు జియో రూ. 299 జియో సినిమా ప్రీమియం ప్లాన్‌ను ప్రారంభించింది. దీనిలో ఈ ప్రయోజనాలన్నీ ఒక ఫోన్‌ కోసం మొత్తం సంవత్సరానికి అందుబాటులో ఉంటాయి. జియో సినిమా వార్షిక ప్రీమియం ప్లాన్ కోసం ఇంతకుముందు మీరు రూ. 999 ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇప్పుడు అది కేవలం రూ. 299కి మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

జియో ప్రీపెయిడ్, ప్రీమియం విభిన్న ప్లాన్‌లు

జియో ప్రీపెయిడ్ కనెక్షన్ రూ. 299 టారిఫ్ ప్లాన్‌తో జియో సినిమా ప్రీమియం ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉందని, జియో ఈ కొత్త రూ. 299 ప్లాన్ గురించి వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. జియో ప్రీపెయిడ్ సిమ్ రూ. 299 ప్లాన్‌తో, సాధారణ జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ మాత్రమే 28 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. ఇందులో ప్రీమియం ప్రయోజనాలు అందుబాటులో లేవు. అదే సమయంలో జియో సినిమా ప్రీమియం ఒక సంవత్సర ప్రణాళికను జియో సినిమా యాప్‌కి వెళ్లి కొనుగోలు చేయాలి. దీని కోసం రూ. 299 విడిగా ఖర్చు చేయాలి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jio: జియో నుంచి అదిరిపోయే ప్లాన్‌.. రూ.26 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ!

రిలయన్స్‌ జియో.. అనతికాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఇతర నెట్‌వర్క్‌ కంపెనీలకు పోటీగా జియో దూసుకుపోతోంది. వినియోగదారుల కోసం కొత్త కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ మరింత మందిని ఆకర్షిస్తోంది. భారతీయ టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో అతిపెద్ద వినియోగదారులను కలిగి ఉంది. కంపెనీ ఇప్పటికే ఉన్న..

jio-5.jpg?w=1280

రిలయన్స్‌ జియో.. అనతికాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఇతర నెట్‌వర్క్‌ కంపెనీలకు పోటీగా జియో దూసుకుపోతోంది. వినియోగదారుల కోసం కొత్త కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ మరింత మందిని ఆకర్షిస్తోంది. భారతీయ టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో అతిపెద్ద వినియోగదారులను కలిగి ఉంది. కంపెనీ ఇప్పటికే ఉన్న వినియోగదారులకు అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది, వాటిలో కొన్ని కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. కంపెనీ కేవలం రూ. 26 ప్లాన్‌ను అందిస్తోంది, పూర్తి 28 రోజుల పాటు డేటా ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. Reliance Jio రూ. 26 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ నిజానికి JioPhone యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే పరిమిత సమయం వరకు డేటా ప్రయోజనం అందించబడుతుంది. ప్లాన్‌లో అందుబాటులో ఉన్న ప్రయోజనాల గురించి మాట్లాడితే.. ఇది డేటాను మాత్రమే అందిస్తుంది. కాల్ లేదా ఎస్‌ఎంఎస్‌ వంటి ప్రయోజనాలను కలిగి ఉండదు.

26 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, వినియోగదారులకు మొత్తం 2GB డేటా అందుకుంటారు. ఈ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. తక్కువ డేటాను ఉపయోగించే లేదా JioPhoneని ఉపయోగించే సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

ఈ ప్లాన్‌ను ఇప్పటికే ఉన్న ఏదైనా జియోఫోన్‌ రీఛార్జ్ ప్లాన్‌తో టాప్-అప్‌గా ఉపయోగించవచ్చు. జియో ఇతర ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల కంటే ఈ ప్లాన్ చాలా చౌకగా ఉంటుంది. మీరు తక్కువ డేటాను ఉపయోగిస్తుంటే, 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ కావాలనుకుంటే ఈ ప్లాన్ మీకు మంచి ఎంపికగా ఉంటుంది.

మీకు JioPhone లేకపోయినా, అటువంటి ప్రయోజనాలతో కూడిన ప్లాన్‌తో రీఛార్జ్ చేయాలనుకుంటే, మీరు రూ.155 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ JioPhoneని ఉపయోగించని వినియోగదారులకు పైన పేర్కొన్న ప్రయోజనాలను అందిస్తుంది. ఈ డేటా మాత్రమే ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 2GB మొత్తం డేటాను కూడా అందిస్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Realme GT 6T with stunning features: మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌ మీ కొత్త ఫోన్‌.. స్టన్నింగ్‌ ఫీచర్స్‌..

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను తీసుకొస్తూనే ఉంది. మొన్నటి వరకు బడ్జెట్ ఫోన్‌లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా మిడ్ రేంజ్‌లో ఓ మంచి ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ జీటీ 6టీ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

realme-3.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌ మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ జీటీ 6టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌తో పాటు, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

realme-gt-6t.jpg

రియల్‌మీ జీటీ 6టీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన 1.5K LTPO 3D కర్వ్డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌, 6,000 నిట్‌ల వరకు బ్రైట్ నెస్ ఈ ఫోన్‌ సొంతం. దీంతో సన్‌లైట్‌లోనూ స్క్రీన్‌ స్పష్టంగా కనిపిస్తుంది.

realme-gt-6t-features.jpg

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 120 వాట్స్‌కు సపోర్ట్ చేసే ఫాస్ట్‌ ఛార్జర్‌ను అందించారు. 10 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ చెబుతోంది.

realme-new-phone-1.jpg

రియల్‌మీ జీటీ 6టీ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో గూగుల్‌ జెమిని ఏఐ ఫీచర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

smartphone-11.jpg

ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 30,999కాగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 32,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 35,999గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 33,999గా ఉంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Moto G04s with awesome features for just Rs. 7,000: రూ. 7 వేలలో కళ్లు చెదిరే ఫీచర్స్‌.. మోటో నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల వరుసగా బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా రూ. 10 వేల లోపు మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటీ జీ04ఎస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

moto-3.jpg?w=1280&enlarge=true

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని మోటో జీ04ఎస్‌ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. గతేడాది తీసుకొచ్చిన మోటో జీ04 స్మార్ట్ ఫోన్‌కు అప్‌డేట్ వెర్షన్‌గా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

moto-g04s-1.jpg

మోటో జీ04ఎస్‌ స్మార్ట్ ఫోన్‌ గురువారం లాంచ్‌ అవుతుండగా జూన్‌ మొదటి వారం నుంచి సేల్స్‌ ప్రారంభంకానున్నాయి. ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ స్మార్ట్ ఫోన్‌ను విక్రయించనున్నారు.

moto-g04s-features.jpg

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. యూనిసోక్ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

moto-g04s-price-1.jpg

ఈ స్మార్ట్ ఫోన్‌లో డాల్బీ ఆట్మోస్‌ సౌండ్‌ను అందించారు. 6.6 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అంచారు. 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు.

moto-phone.jpg

ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్‌లో 500 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6,999 కాగా.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,499గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Realme: రియల్‌మీ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్‌, ధర, ఫీచర్స్‌ ఇలా..!

రియల్‌మీ భారతదేశంలో Narzo N65 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.11,499. ఈ ఫోన్ చిప్‌లో MediaTek Dimensity 6300 సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఫోన్ 4జీబీ, 6జీబీ ర్యామ్‌ ఎంపికలతో 128జీబీ ఆన్-బోర్డ్ నిల్వను కూడా అందిస్తుంది. ఇంకా, స్మార్ట్‌ఫోన్ అంబర్ గోల్డ్, డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. కొత్త మోడల్‌ను రియల్‌ ఆన్‌లైన్ స్టోర్,.

realme-narzo-n65-5g.jpg?w=1280

రియల్‌మీ భారతదేశంలో Narzo N65 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.11,499. ఈ ఫోన్ చిప్‌లో MediaTek Dimensity 6300 సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఫోన్ 4జీబీ, 6జీబీ ర్యామ్‌ ఎంపికలతో 128జీబీ ఆన్-బోర్డ్ నిల్వను కూడా అందిస్తుంది. ఇంకా, స్మార్ట్‌ఫోన్ అంబర్ గోల్డ్, డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. కొత్త మోడల్‌ను రియల్‌ ఆన్‌లైన్ స్టోర్, ఇ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo N65 ధర మరియు వేరియంట్లు

  • 4GB RAM + 128GB స్టోరేజీ: రూ. 11,499
  • 6GB RAM + 128GB స్టోరేజీ: రూ. 12,499

Realme Narzo N65 స్మార్ట్‌ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో మే 31 నుండి జూన్ 4 వరకు విక్రయిస్తోంది. అలాగే, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ భారతదేశంలో అందుబాటులో ఉంది.ఈ కాలంలో, వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 తగ్గింపు కూపన్‌ను పొందవచ్చు. దీంతో 4GB + 128GB స్మార్ట్‌ఫోన్ రూ. 10,499కి, 6GB + 128GB స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,499కి తగ్గించింది.

స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 6300 చిప్‌తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB ఆన్-బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ DUVSUT చేత ధృవీకరించబడిందని రియల్‌మీ తెలిపింది. అలాగే, కంపెనీ స్మార్ట్‌ఫోన్ రూపకల్పన, నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది. అదనంగా స్మార్ట్‌ఫోన్ నీరు, ధూళి నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.

Realme Norso N65 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

6.67-అంగుళాల, 720×1604 (HD) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 500నిట్స్.

ప్రాసెసర్: Mediatek డైమెన్సిటీ 6300

  • RAM: 4 GB, 6 GB
  • స్టోరేజీ: 128 GB
  • వెనుక కెమెరా: 50MP
  • ఫ్రంట్ కెమెరా: 8MP
  • బ్యాటరీ: 5000mAh
  • ఛార్జింగ్: 15W వైర్
  • OS: ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 5.0

ఈ ఫోన్‌ MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ ఉంది. అదే శక్తివంతమైన ప్రాసెసర్ Realme C65 5Gలో ఉంది. ఈ చిప్‌సెట్ రోజువారీ పనులు, 5G కనెక్టివిటీ కోసం వేగవంతమైన పనితీరును అందిస్తుంది. వెనుక భాగంలో 50MP కెమెరా సెటప్ ఉంది. అదనంగా ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. అంటే ఇది దుమ్ము, నీటి నుండి కొంత రక్షణను కలిగి ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో వాటర్‌ ఫ్రూప్‌ కాదని గమనించండి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Pixel 8a: గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదు..

సాధారణంగా ఈ కామర్స్‌ సంస్థలు పండుగల వేళ డిస్కౌంట్స్ ప్రకటిస్తాయని తెలిసిందే. అయితే ఇటీవల కాలంతో సంబంధం లేకుండా ఆఫర్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది...

google-pixel-8a.jpg?w=1280

సాధారణంగా ఈ కామర్స్‌ సంస్థలు పండుగల వేళ డిస్కౌంట్స్ ప్రకటిస్తాయని తెలిసిందే. అయితే ఇటీవల కాలంతో సంబంధం లేకుండా ఆఫర్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్‌ లభిస్తోంది.? ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 75,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై ప్రత్యేక డీల్‌లో భాగంగా రూ. 63,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు.. ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 8000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే అదనంగా రూ. 4000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో అన్న ఆఫర్లు కలుపుకొని ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 24000 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇక ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఇవ్వడం ద్వారా గరిష్టంగా రూ. 39,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.

ఇక గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.2 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెస్‌ రేట్ ఈ ఫోన్ సొంతం. అలాగే ఇందులో Google Tensor G3 చిప్‌సెట్‌ను అందించారు. Titan M2 సెక్యూరిటీ చిప్‌ ఈ ఫోన్‌ సొంతం. ఈ ఫోన్‌ను మొత్తం రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. వీటిలో ఒకటి 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌.. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 12 మెగాపిక్సెల్స్‌తో సెకండరీ కెమెరాను ఇచ్చారు. బ్యాటరీ పరంగా చూస్తే ఇందులో.. 27 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4575 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Smartphones for under Rs. 10,000: రూ.10 వేల లోపు అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్‌ వీటి సొంతం

మీరు స్మార్ట్‌ఫోన్ కొనడానికి రూ.10,000 బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారా? ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. రూ. 10,000 లేదా అంతకంటే తక్కువ ధరతో మీరు ఏ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో మీరు ఏ ఫీచర్లను పొందుతున్నారు. మీరు ఎంత తగ్గింపు పొందుతున్నారు? మీరు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి ఆర్డర్ చేయడం ద్వారా బంపర్ డిస్కౌంట్ ప్రయోజనాన్ని..

smartphone-11.jpg?w=1280

మీరు స్మార్ట్‌ఫోన్ కొనడానికి రూ.10,000 బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారా? ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. రూ. 10,000 లేదా అంతకంటే తక్కువ ధరతో మీరు ఏ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో మీరు ఏ ఫీచర్లను పొందుతున్నారు. మీరు ఎంత తగ్గింపు పొందుతున్నారు? మీరు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి ఆర్డర్ చేయడం ద్వారా బంపర్ డిస్కౌంట్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

Redmi 13C ఫోన్ తక్కువ ధరకే..

మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లో అనేక ఫీచర్లను పొందుతారు. MediaTek Helio G85 చిప్‌సెట్‌తో ఈ ఫోన్‌లో మీరు ఫోటో-వీడియోగ్రఫీ కోసం 50MP AI ట్రిపుల్ కెమెరాను పొందుతారు. మీరు స్మార్ట్‌ఫోన్‌లో 5000mA బ్యాటరీని పొందుతారు. ఇది 18 వాట్, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 11,999 అయినప్పటికీ, మీరు దీన్ని 36 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,699కే పొందవచ్చు.

POCO C65 స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు:

4GB RAM 128GB ROM స్టోరేజ్ వేరియంట్‌ను డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్ 6GB RAM 128GB ROM స్టోరేజ్ వేరియంట్‌ను కూడా పొందుతారు. ఫోన్ 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. Helio G85 చిప్‌సెట్‌తో వస్తుంది. మీరు ఫోన్‌లో 5000 mAh బ్యాటరీని పొందుతారు. ఇది మీకు చాలా కాలం పాటు ఉంటుంది. ఫోటోలు, వీడియోల కోసం ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ. 11,999 అయినప్పటికీ, మీరు దీన్ని అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ నుండి కేవలం రూ. 7,499కి డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M14:

Samsung Galaxyలో మీరు ఫోటో-వీడియోగ్రఫీ కోసం ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతారు. స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందించింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.13,999 అయినప్పటికీ, మీరు దీన్ని 36 శాతం తగ్గింపుతో కేవలం రూ.8,999కే కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు కాకుండా, LAVA 02, Vivo Y18e, Nokia G42 మరియు Tecno POP 8 వంటి స్మార్ట్‌ఫోన్‌లు రూ. 10 వేల లోపు అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలంటే, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Truke Earbuds: అద్భుతమైన సౌండ్ క్వాలిటీ ఇయర్‌బడ్స్‌.. చౌక ధరల్లోనే..

మార్కెట్లో రకరకాల ఇయర్‌బడ్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరల్లో నాణ్యమైనవి పొందవచ్చు. వెయ్యి రూపాయల లోపు మీ కోసం ఇయర్‌బడ్‌లు కొనాలని ఆలోచిస్తున్నారా? ఇవి బెస్ట్‌ ఇయర్‌బడ్‌లుగా నిరూపిస్తున్నాయి. ట్రూక్ తన శక్తివంతమైన TWS BTG అల్ట్రా ఇయర్‌బడ్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. మీరు ఈ ఇయర్‌బడ్‌లలో మెరుగైన ఫీచర్‌లు, నాణ్యతను పొందుతున్నారు. ఇంత తక్కువ ధరకు వచ్చే ఈ ఇయర్‌బడ్‌ల..

truke-earbuds.jpg?w=1280

మార్కెట్లో రకరకాల ఇయర్‌బడ్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరల్లో నాణ్యమైనవి పొందవచ్చు. వెయ్యి రూపాయల లోపు మీ కోసం ఇయర్‌బడ్‌లు కొనాలని ఆలోచిస్తున్నారా? ఇవి బెస్ట్‌ ఇయర్‌బడ్‌లుగా నిరూపిస్తున్నాయి. ట్రూక్ తన శక్తివంతమైన TWS BTG అల్ట్రా ఇయర్‌బడ్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. మీరు ఈ ఇయర్‌బడ్‌లలో మెరుగైన ఫీచర్‌లు, నాణ్యతను పొందుతున్నారు. ఇంత తక్కువ ధరకు వచ్చే ఈ ఇయర్‌బడ్‌ల ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.

Truke BTG అల్ట్రా గేమింగ్ TWS:

ఈ ఇయర్‌బడ్‌లు వైర్‌లెస్ ఆడియో పనితీరు, కొత్త డిజైన్‌ను పొందుతున్నాయి. ఈ ఇయర్‌బడ్‌లలో ర్యాపిడ్ పవర్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించబడింది. దీని కారణంగా ఈ ఇయర్‌బడ్‌లు నిమిషాల్లో ఛార్జ్ అవుతాయి. Quad mic PureVoice ENC టెక్నాలజీ, Google Assistant వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. సంగీత ప్రియులు, గేమింగ్‌ను ఇష్టపడే వ్యక్తులు ఈ ఇయర్‌బడ్‌లను ఎక్కువగా ఇష్టపడతారు. Truk BTG అల్ట్రా బాటిల్ మోడ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది మొత్తం గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి అంతిమ పనితీరు కోసం రూపొందించబడింది. ఇది 40ms అల్ట్రా-తక్కువ జాప్యాన్ని కలిగి ఉంది.

బ్యాటరీ పరంగా పవర్ ఫుల్:

ఈ ఇయర్‌బడ్‌లు రాపిడ్‌పవర్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తాయి. ఈ సాంకేతికత కారణంగా వారు 10 నిమిషాల ఛార్జ్‌లో 10 గంటల సమయం వరకు వినియోగించుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్‌ల విషయంలో 500mAh బ్యాటరీ వస్తుంది. ఇది 60 గంటల ఆట సమయాన్ని అందిస్తుంది.

ధర:

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ట్రూక్ అధికారిక వెబ్‌సైట్‌లలో BTG అల్ట్రా విక్రయం ప్రారంభమైంది. మీరు మూడు ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయవచ్చు. దీని విక్రయం నేటి నుండి ప్రారంభమైంది. ఆఫర్లలో భాగంగా వీటి ధర కేవలం రూ. 899కే పొందవచ్చు. దీని తర్వాత మీరు ఈ ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేస్తే మీరు వాటిని సాధారణ ధర రూ. 1099కి పొందుతారు.

...

Complete article

Truke BTG Ultra Gaming Earbuds have landed!

40ms Ultra Low Latency Battle Mode

60H Playtime for marathon sessions

360 Spatial Audio

 

Link to comment
Share on other sites

  • 0

Vivo: భారత్‌లో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసిన వివో

06-06-2024 Thu 16:34 | Technology

తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో విడుదల చేసిన కంపెనీ

ధర రూ.1,59,999గా ప్రకటించిన వివో

చైనా మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్

cr-20240606tn666197a2718b8.jpg

స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం వివో (Vivo) భారత్‌ మార్కెట్‌లో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో’ను విడుదల చేసింది. భారత్‌లో కొత్తగా విడుదలైనప్పటికీ చైనా మార్కెట్లో ఇప్పటికే అమ్మకాలు కొనసాగుతున్నాయి. 

ధర రూ.1,59,999
వివో ఎక్స్ ఫోల్డ్ 3 సెలెస్టియల్ బ్లాక్ కలర్ ఫోన్ ధర రూ.1,59,999గా ఉంది. 16జీబీ ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వివో ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. జూన్ 13 నుంచి అమ్మకాలు మొదలవుతాయని వివో వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్‌లను ఉపయోగించి రూ. 15,000 వరకు తగ్గింపు ఆఫర్లు పొందవచ్చు. ఇక ఎక్స్చేంజ్‌పై రూ.10,000, వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా యూజర్లు పొందవచ్చు. 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా వివో ఆఫర్ చేస్తోంది.

ఫీచర్లు ఇవే...
ఆక్టా-కోర్ స్నాప్‌ డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేయనుంది. జీస్-బ్రాండెడ్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8.03-అంగుళాల అమోలుడ్ ఇన్నర్ స్క్రీన్‌తో పాటు ఇతర ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్ట్, 120హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను అందించే రెండు స్క్రీన్‌లు ఉన్నాయి. మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 3 రెట్లు జూమ్‌తో కూడిన 64-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్‌, స్మార్ట్‌ఫోన్ 5G, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 5,700ఎంఏహెచ్‌గా ఉంది. 100 వాట్స్ వైర్డు, 50వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Redmi A3x for Rs. 6,000: ఆరు వేల రూపాయాల్లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. సూపర్ ఫీచర్స్‌

స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో ఫోన్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తక్కువ ధరకే తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. తక్కువ బడ్జెట్‌లో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

redmi-a3x.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రెడ్‌మీ ఏ3ఎక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. మొదటగ్లోబల్‌ మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్న ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

redmi-a3x-features.jpg

ఇక రెడ్‌మీ ఏ3 ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. యూనిసోక్‌ టీ603 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనచేస్తుంది. ఈ ఫోన్‌ను అరోరా గ్రీన్, మిడ్‌నైట్‌ బ్లాక్‌, మిడ్‌ నైట్ వైట్‌ కలర్స్‌లో తీసుకురానున్నారు.

redmi-a3x-price.jpg

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

redmi-smart-phone-new.jpg

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 5,700గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్‌తో తీసుకొస్తున్నారు. అయితే వర్చువల్‌గా ఎస్‌డీ కార్డు ద్వారా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇంటర్నల్‌ మెమోరీని కూడా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

smart-phone-1.jpg

కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై, బ్లూటూత్‌ 4.2, జీపీఎస్‌, గ్లోనాస్‌, గెలీలియో, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ వంటి ఫీచర్స్‌ను అందించారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఆధారిత ఫేక్ అన్ లాక్ ఫీచర్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jio Prepaid Plans: అన్‌లిమిటెడ్ ప్రయోజనాలతో నాన్‌స్టాప్ వినోదం.. జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్లు ఇవే..

స్మార్ట్ ఫోన్ పనిచేయడానికి డేటా చాలా అవసరం. వినియోగదారుల అవసరాన్ని బట్టి వివిధ రీచార్జి ప్యాక్ లను టెలికం కంపెనీలు అందిస్తున్నాయి. వీటిలో కాల్స్, డేటా, ఎస్ఎమ్ఎస్ తదితర సేవలు లభిస్తాయి. ఇప్పుడు వీటితో పాటు ఓటీటీ ప్లాట్ ఫారంలకు ఉచిత సబ్ స్క్రిప్షన్ లతో కూడా కొత్త ప్లాన్లు వస్తున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.

jio.jpg?w=1280

ఫోన్ అంటే గతంలో కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఆ అవసరానికి తగ్గట్టుగానే రీచార్జి ప్లాన్లు ఉండేవి. కానీ నేడు టెక్నాలజీ బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటితో ప్రజల అవసరాలు కూడా ఎక్కువయ్యాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ల లేకపోతే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. కాల్స్, వాట్సాప్, ఫేస్ బుక్, మ్యూజిక్, సినిమాలు, యూట్యూబ్ ఇలా అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాయి.

జియో ప్రీపెయిడ్ ప్లాన్లు..

స్మార్ట్ ఫోన్ పనిచేయడానికి డేటా చాలా అవసరం. వినియోగదారుల అవసరాన్ని బట్టి వివిధ రీచార్జి ప్యాక్ లను టెలికం కంపెనీలు అందిస్తున్నాయి. వీటిలో కాల్స్, డేటా, ఎస్ఎమ్ఎస్ తదితర సేవలు లభిస్తాయి. ఇప్పుడు వీటితో పాటు ఓటీటీ ప్లాట్ ఫారంలకు ఉచిత సబ్ స్క్రిప్షన్ లతో కూడా కొత్త ప్లాన్లు వస్తున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.

ప్లాన్ల వివరాలు..

రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఏడు ప్రీపెయిడ్ ప్లాన్లను అందజేస్తోంది. వీటితో డిస్నీ+ హాట్‌స్టార్‌కు ఏడాది పాటు ఉచిత సభ్యత్వం లభిస్తుంది. మీరు అదనపు ఖర్చు లేకుండా టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌ని చూడవచ్చు. రూ. 328 నుంచి రూ. 317 మధ్య అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం.

రూ. 328 ప్రీపెయిడ్ ప్లాన్.. రిలయన్స్ జియో అందజేస్తున్న రూ.328 ప్రీపెయిడ్ ప్లాన్ తో 28 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 1.5 జీబీడేటా లభిస్తుంది. సుమారు మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం లభిస్తుంది.

రూ.331 ప్లాన్.. ఈ ప్లాన్ వినియోగదారులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. 30 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 40 జీబీ డేటా లభిస్తుంది. మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ చందా లభిస్తుంది.

రూ. 388 ప్లాన్.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటా అందజేస్తారు. పైవిధంగానే 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ను ఉచితంగా వీక్షించవచ్చు.

రూ.598 ప్లాన్.. ఈ ప్లాన్ లో ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం లభిస్తుంది. వినియోగదారులు 28 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకునే వీలుంది. అలాగే రోజుకు 2 జీబీ డేటా అందజేస్తారు.

రూ.758 ప్లాన్.. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు మరింత ఉపయోగంగా ఉంటుంది. దాదాపు 84 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇక డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం మూడు నెలల పాటు లభిస్తుంది.

రూ.808 ప్లాన్.. ఈ ప్లాన్ వ్యాలిడీటీ 84 రోజులు ఉంటుంది. ఆ సమయంలో ఉచితంగా కాల్స్ చేసుకునే వీలుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. వీటికి అదనంగా మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం అందజేస్తారు.

రూ.3,178 ప్లాన్.. ఈ ప్లాన్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే ఏడాది పాటు కాల్స్ చేసుకోవచ్చు. వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటా అందజేస్తారు. ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం అందుతుంది.

వినూత్న పరిష్కార మార్గాలు..

ఆధునిక కాలంలో ఫోన్ వినియోగం, ప్రాధాన్యత, అవసరం బాగా పెరిగిపోయింది. అయితే ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ సరఫరాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అటువంటి పరిస్థితులలో నెట్‌వర్క్ దెబ్బతింటుంది. తద్వారా కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) చర్యలు తీసుకుంటోంది. అత్యవసర సమయాల్లో 5 జీ కనెక్టివిటీని నిర్వహించడానికి వినూత్న పరిష్కారాలను అన్వేషిస్తోంది. సాధారణ మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే వరకూ నిరంతర 5జీ కవరేజీని అందజేయడానికి బెలూన్లు, డ్రోన్‌లను వినియోగించే విధానాన్ని పరిశీలిస్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Wave Sigma 3: రూ. 1200లో కళ్లు చెదిరే ఫీచర్లతో.. బోట్‌ నుంచి అదిరే స్మార్ట్‌ వాచ్‌.

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్నాయి. కంపెనీలు ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన ప్రముఖ వియరబుల్ బ్రాండ్‌ బోట్‌ కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఇంతకీ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

boat-wave.jpg?w=1280&enlarge=true

భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ బోట్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్‌ చేసింది. బోట్‌వేవ్‌ సిగ్మ 3 పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. నావిగేషన్‌ ఫీచర్‌ను ఇందులో మరింత సులభతరం చేశారు. దీంతో మ్యాప్స్‌ కోసం ఇకపై మీ స్మార్ట్ ఫోన్‌ను చూడాల్సిన పని ఉండదు.

smart-watch-2.jpg

ఈ వాచ్‌ను యాక్టివ్‌ బ్లాక్‌, మెటల్‌ బ్యాలక్‌, మెటల్‌ గ్రే, కూల్‌ గ్రే, చెర్రీ బ్లూజుమ్‌, రస్టిక్‌ రోస్‌, బ్రీజ్‌ వంటి కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాచ్ ధరను రూ. 1199గా నిర్ణయించారు. బోట్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా వంటి ఈ కామర్స్‌ సైట్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

wave.jpg

ఇక ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2.01 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 550 నిట్స్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. దీంతో సన్‌లైట్‌లో కూడా వాచ్‌ స్క్రీన్‌ను స్పష్టంగా చూడొచ్చు. మాప్‌మై ఇండియా ఇందులో నావిగేషన్ సిస్టమ్‌ను అందిస్తోంది.

wave-sigma-3.jpg

ఈ వాచ్‌లో ఇన్‌బిల్ట్‌గా క్యూఆర్‌ కోడ్‌ ట్రేను అందించారు. దీంతో మీకు అవసరమైన క్యూఆర్‌ కోడ్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. దీంతో టికెట్‌ స్కానింగ్, పేమెంట్‌ కోడ్‌ వంటి స్కానింగ్‌లు సులభంగా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

wave-smart-watch.jpg

డయల్‌ ప్యాడ్, కాంటాక్ట్‌ లిస్ట్‌ను అందించారు. అలాగే ఈ వాచ్‌ను ఐపీ67 వాటర్‌ రెసిస్టెంట్‌తో రూపొందించారు. దీంతో వాటర్‌, చెమట నుంచి రక్షణ పొందొచ్చు. ఇక వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే వారం రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. వీటితో పాటు ఎస్‌పీఓ2, స్లీప్‌ ట్రాకింగ్‌ వంటి హెల్త్‌ ట్రాకింగ్ ఫీచర్లతో పాటు.. 700కిపైసగా యాక్టివ్‌ మోడ్స్‌ను అందించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jio 2GB per day with 1 year validity: రోజుకు 2 జీబీ డేటా, ఏడాది వ్యాలిడిటీ.. జియో నుంచి సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌

ప్రముఖ టెలికం కంపెనీ రియలన్స్‌ జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఛార్జీలు అందరికీ అందుబాటులోకి రావడం. అపరమిత ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణం. అయితే ప్రతీ నెల రీఛార్జ్‌ చేసుకోవడం కూడా ఇప్పుడు ఒక సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణంగా నెలవారీ రీఛార్జ్‌ చేసుకుంటే...

jio-recharge-plan.jpg?w=1280

ప్రముఖ టెలికం కంపెనీ రియలన్స్‌ జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఛార్జీలు అందరికీ అందుబాటులోకి రావడం. అపరమిత ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణం. అయితే ప్రతీ నెల రీఛార్జ్‌ చేసుకోవడం కూడా ఇప్పుడు ఒక సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణంగా నెలవారీ రీఛార్జ్‌ చేసుకుంటే 28 నుంచి 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్‌ అందుబాటులో ఉంటున్నాయి.

దీంతో 12 నెలలకు గాను ఏటా 13 సార్లు రీఛార్జ్‌ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి చెక్‌ పెట్టేందుకే ఇయర్లీ ప్లాన్స్‌ను జియో ప్రవేశపెడుతోంది. యూజర్లను ఈ దిశగా అట్రాక్ట్‌ చేస్తోంది. నెలనెల రీఛార్జ్‌ చేసుకునే కంటే ఏడాదికి ఒకసారి రీఛార్జ్‌ చేసే దిశగా అలవాటు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రూ. 3227 ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. ఇంతకీ ఈ ప్లాన్‌తో ఏయే బెనిఫిట్స్‌ పొందొచ్చు లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదాహరణకు మీకు రోజు 2 జీడీ డేటా కోరుకునే వారైతే 28 రోజుల వ్యాలిడిటీ కోసం రూ. 398 రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడాదంతా ఇదే ప్లాన్‌ను కంటిన్యూ చేయాలనుకుంటే మీరు ఏడాదికి రూ. 5,174 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇదే బెనిఫిట్స్‌తో జియో రూ. 3227 ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతో మీరు ఏడాదికి రూ.1947 ఆదా చేసుకోవచ్చు.

రూ. 3227 రీఛార్జ్‌ ప్లాన్‌ బెనిఫిట్స్‌ విషయానికొస్తే ఇందులో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే 2 జీబీ ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ లభిస్తుంది. వీటితో పాటు ఏడాది పాటు అన్‌లిమిటెడ్‌ డేటా పొందొచ్చు. అలాగే ప్రతీ రోజూ ఉచితం 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు సైతం లభిస్తాయి. ఇక వీటికి అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...