Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

Good Phones, Plans, Watches, Tablets, Gadgets, Laptops and TVs in India in 2024


TELUGU

Question

Reliance Jio new plan with 90-day validity: 90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన జియో

29-04-2024 Mon 16:26 | Business

రోజుకు 2 జీబీ.. అదనంగా మరో 20 జీబీ డేటా

రూ.749 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ

జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్న టెలికం దిగ్గజం

cr-20240429tn662f7cde6fb06.jpg

దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్ బేస్ కలిగివున్న దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో సాధారణ ఆఫర్లతో పోల్చితే యూజర్లకు అధిక డేటా లభిస్తోంది. ఆఫర్‌లో రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటాను జియో అందిస్తోంది. మొత్తం 200 జీబీల డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఉచిత కాలింగ్, ఎంఎస్‌ఎంలు, ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి.

ఇక ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. 5జీ మొబైల్ కలిగివుండి కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ యాక్సెస్ ఉంటే అదనపు డేటాను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఆఫర్ కింద జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌లకు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 90 రోజులపాటు ఈ సేవలను పొందవచ్చు.

కాగా తక్కువ రేటుతో సాధ్యమైనన్ని గరిష్ఠ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా జియో ఇటీవలే రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అనేక వర్గాలుగా విభజించింది. అందులో భాగంగా ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా భారత్‌లో అత్యధికంగా 45 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లను జియో కలిగివుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా జియో కొనసాగుతోంది.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Airtel recharge plan with 35 day validity: 35 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్‌ నుంచి సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌.. పూర్తి వివరాలు

ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు కొత్త కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ ప్లాన్‌తో ఎక్కువ వ్యాలిడిటీ వచ్చే రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తోంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ వినియోగదారులకు 35 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌ను అందిస్తోంది. ఎయిర్‌టెల్ కాకుండా, బీఎస్‌ఎన్‌ఎల్‌..

airtel4-1.jpg?w=1280

ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు కొత్త కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ ప్లాన్‌తో ఎక్కువ వ్యాలిడిటీ వచ్చే రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తోంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ వినియోగదారులకు 35 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌ను అందిస్తోంది. ఎయిర్‌టెల్ కాకుండా, బీఎస్‌ఎన్‌ఎల్‌ 35 రోజుల ప్లాన్‌ను అందిస్తోంది. కస్టమర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ 35 రోజుల ప్లాన్‌ను తీసుకొచ్చింది. లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం చూస్తున్న ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఎయిర్‌టెల్‌ ఈ ప్రత్యేక ప్లాన్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

35 రోజుల వ్యాలిడిటీతో..

35 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ ప్లాన్ రూ.289. ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ఈ ప్లాన్‌లో ఎస్‌ఎంఎస్‌, కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్‌ సేవతో వస్తుంది. ఇందులో కస్టమర్లు 4 జీబీ డేటా ప్రయోజనం కూడా పొందుతారు.

35 రోజుల ప్లాన్

ఈ కొత్త రూ. 289 రీఛార్జ్ ప్లాన్ ఎక్కువ డేటాను ఉపయోగించాల్సిన అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో WiFiని కలిగి ఉంటే లేదా నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి రీఛార్జ్ చేస్తే, ఈ రూ. 289 ప్లాన్ మీకు ఉపయోగపడుతుంది.

మీరు ఇంటర్నెట్ టాప్ అప్ ప్లాన్ తీసుకోవచ్చు

ఎయిర్‌టెల్‌ చౌకైన ప్లాన్ ధర రూ.19. ధర పరంగా, ఇది ఎయిర్‌టెల్‌ చౌకైన ప్లాన్. ఎయిర్‌టెల్‌ రూ. 19 టాప్ అప్ ప్లాన్‌లో 1 జీబీ డేటా ఒక రోజు అందుబాటులో ఉంది. తక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమం. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా ఒక రోజు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
  • Administrators

Jio Recharge Plan: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. జియో నుంచి చౌకైన ఇంటర్నెట్‌ ప్లాన్‌

భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ జియో తన కస్టమర్లను ఆకర్షించడానికి ప్రతిరోజూ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూనే ఉంది. అదే సమయంలో జియో ఇటీవల కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది చాలా ప్రజాదరణ పొందింది. అదే సమయంలో ప్రతి టెలికాం సెక్టార్‌లో రీఛార్జ్ ధరలు పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎవరైనా చౌకైన ఇంటర్నెట్‌ను అందిస్తే, మొత్తం టెలికామ్‌లో జియో మాత్రమే.

jio1-2.jpg?w=1280&enlarge=true

భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ జియో తన కస్టమర్లను ఆకర్షించడానికి ప్రతిరోజూ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూనే ఉంది. అదే సమయంలో జియో ఇటీవల కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది చాలా ప్రజాదరణ పొందింది. అదే సమయంలో ప్రతి టెలికాం సెక్టార్‌లో రీఛార్జ్ ధరలు పెరుగుతున్నాయి.

మీరు ఇప్పుడు ఐపీఎల్‌ని ఆస్వాదించాలనుకుంటే, మీకు ఇంటర్నెట్ చాలా అవసరం. మీరు ఆన్‌లైన్ మ్యాచ్‌లు, ఓటీటీ కంటెంట్‌ను చూడాలనుకుంటేక జియో ఈ కొత్త ప్లాన్ చాలా శక్తివంతమైనది. దీని కోసం మీకు రూ. 399 ఖర్చవుతుంది. అపరిమిత డేటాతో పాటు అదనపు డేటాను అందిస్తుంది.

జియో నుండి ఈ ప్లాన్ చాలా చౌకగా ఉంటుంది. ఇది మీకు హోచ్‌డీ నాణ్యతతో విపరీతమైన డేటా కంటెంట్‌ను అందిస్తూ డేటాను చూడటానికి మీకు చాలా ఫీచర్లను అందిస్తుంది. దీనితో పాటు, మీరు జియో రూ.399 ప్లాన్‌లో 3GB ఇంటర్నెట్ డేటా, 6GB ఇంటర్నెట్ డేటాను అదనంగా పొందుతారు. దీనితో మీరు మీ మొత్తం 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

Jio ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది మరియు ప్రతి నెట్‌వర్క్ ప్రాంతంలో కాల్ చేయడానికి అనుమతిస్తుంది, అలాగే వినియోగదారులకు అపరిమిత 5G మద్దతును అందించే 100 ప్యాక్‌లు కూడా ఉన్నాయి.

జియో రూ. 399 రీఛార్జ్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా మీరు జియో టీవీ, జియో, సినిమాలు, టిక్కెట్ షోలు, క్రికెట్, జియో క్లౌడ్ సేవను కూడా ఆస్వాదించవచ్చు. మీరు తక్కువ అంతర్గత నిల్వ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మీరు ఈ ప్లాన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు MyJio యాప్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

...

Complete article

--
Administrator
Telugus.com

Telugus.com

Link to comment
Share on other sites

  • 0

Best 5G Phones under Rs.15,000: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.. రూ. 15 వేల లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..

మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 జీ నుంచి 5జీ నెట్‌వర్క్‌కు మారిపోవచ్చు. నాణ్యమైన పనితీరు, ఆకర్షణీయమైన ఫీచర్లు, స్టైలిష్ లుక్, వేగవంతమైన ఇంటర్నెట్, సులభ స్ట్రీమింగ్, అలాగే గేమింగ్ సదుపాయాలతో ఈ ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. డిస్‌ప్లే, ప్రాసెసర్లు, బ్యాటరీ సామర్థ్యం, కెమెరా పనితనం అన్ని ఎంతో మెరుగ్గా ఉన్నాయి. రూ.15 వేల లోపు లభిస్తున్న 5జీ ఫోన్లు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

5g-phones.jpg?w=1280

మీరు 5జీ నెట్ వర్క్‌కు మారాలనుకుంటున్నారా? అందుబాటు ధరలో ఉండే స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ శుభవార్త మీకోసమే. అతి తక్కువ బడ్జెట్ లో 5 జీ ఫోన్లు అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.15 వేలలోపు ధరలో దొరుకుతున్నాయి. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 జీ నుంచి 5జీ నెట్‌వర్క్‌కు మారిపోవచ్చు. నాణ్యమైన పనితీరు, ఆకర్షణీయమైన ఫీచర్లు, స్టైలిష్ లుక్, వేగవంతమైన ఇంటర్నెట్, సులభ స్ట్రీమింగ్, అలాగే గేమింగ్ సదుపాయాలతో ఈ ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. డిస్‌ప్లే, ప్రాసెసర్లు, బ్యాటరీ సామర్థ్యం, కెమెరా పనితనం అన్ని ఎంతో మెరుగ్గా ఉన్నాయి. రూ.15 వేల లోపు లభిస్తున్న 5జీ ఫోన్లు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

రియల్ మీ నార్జో 60ఎక్స్ 5జీ (Realme narzo 60X 5G)..

6.72 అంగుళాల స్క్రీన్, మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ తో పనితీరు బాగుంటుంది. ముందు 8 ఎంపీ, వెనుక 50 ఎంపీ ఏఐ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. 5 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ కెపాసిటీ దీని ప్రత్యేకత. దీనిలోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీని 33W సూపర్వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 30 నిమిషాల్లో 50 శాతం, 70 నిమిషాల్లో వందశాతం చార్జింగ్ చేసుకోవచ్చు. 28 వేల కంటే ఎక్కువ ఫొటోలు, లేదా 450 టీవీ షో ఎపిసోడ్‌లను స్టోర్ చేయవచ్చు. ఈ ఫోన్ ధర రూ.14,499.

సామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung galaxy M34 5G)..

ఈ ఫోన్ లో 6.5 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌, ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 50 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ 13 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. దీనిలోని 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కారణంగా బ్యాకప్ చాలా బాగుంటుంది. ఈ ఫోన్ ధర రూ.12,999.

రియల్ మీ 12 5జీ (Redmi 12 5G)..

ఈ ఫోన్ లో 6.79 అంగుళాల స్క్రీన్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కేపాసిటీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎంఐయూఐ 14 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో డిస్ ప్లేకు రక్షణ లభిస్తుంది. విభిన్న మోడ్‌లతో కూడిన 50 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంది. 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డస్ట్/వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ దీనికి అదనపు ప్రత్యేకత. ఈ ఫోన్ 12,499కు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ (Realme NARZO 70x 5G)..

ఆండ్రాయిడ్ 14పై నడిచే రియల్ మీ నార్జో 70 ఎక్స్ 5జీ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంది. 6.72 అల్ట్రా స్మూత్ డిస్‌ప్లేతో పాటు అల్యూమినియం ఫ్రేమ్‌తో ఆకట్టుకుంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ప్రాసెసర్‌తో పనితీరు వేగవంతంగా ఉంటుంది. దీనిలోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీని 45 డబ్ల్యూ సూపర్వూక్ ఛార్జర్ తో 31 నిమిషాలలోనే 50 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు మార్కెట్‌లోని అత్యంత సన్నని ఫోన్లలో ఇది ఒకటి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, 50 ఎంపీ ఏఐ కెమెరా, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇతర ప్రత్యేకతలు. ఈ ఫోన్ ధర రూ.14,999.

రెడ్ మీ 12సీ 5జీ (Redmi 12c 5G)..

ఈ ఫోన్ లో 6.74 అంగుళాల స్క్రీన్ , వెనుక 50 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా, ముందు 5 ఎంపీ కెమెరా ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ఎస్వోసీ ప్రాసెసర్ తో పనితీరు చాలా వేగంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పని చేస్తుంది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.11,999.

Link to comment
Share on other sites

  • 0

Jio Data Booster Plans with nonstop uninterrupted services: ఈ ప్లాన్లతో నాన్-స్టాప్ సేవలు.. మీ ఫోన్‌కు నిరంతరాయంగా ఇంటర్‌నెట్..

చాలా ప్లాన్లలో ఫోన్ కాల్స్ చేసుకోవడానికి అవసరమయ్యే బాలెన్స్ తోనే డేటా కూడా ఉంటుంది. ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు దాదాపు నెల రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఒకసారి రీచార్జి చేసుకుంటే నెల రోజుల పాటు కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజూ పరిమితి మేరకు డేటా లభిస్తుంది.

jio.jpg?w=1280

స్మార్ట్ ఫోన్ కనీస అవసరంగా మారిన ఈ రోజుల్లో అది పనిచేయడానికి ఇంటర్నెట్ డేటా చాలా అవసరం. ఇంటర్నెట్ లేకపోతే ఎంత ఖరీదైన ఫోన్ ఉన్నా ప్రయోజనం ఉండదు. వాట్సాప్, ఫేస్ బుక్, డిజిటల్ లావాదేవీలు కొనసాగించడానికి డేటా అనేది ప్రధానం. చాలా ప్లాన్లలో ఫోన్ కాల్స్ చేసుకోవడానికి అవసరమయ్యే బాలెన్స్ తోనే డేటా కూడా ఉంటుంది. ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు దాదాపు నెల రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఒకసారి రీచార్జి చేసుకుంటే నెల రోజుల పాటు కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజూ పరిమితి మేరకు డేటా లభిస్తుంది.

పనికి అంతరాయం లేకుండా..

స్మార్ట్ ఫోన్ లో మనం ముఖ్యమైన పనిలో ఉన్నపుడు డేటా అయిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ పనికి తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీనివల్ల మీ ముఖ్యమైన పని ఆగిపోవచ్చు. టీవీ షో, క్రికెట్ మ్యాచ్ చూడడం కుదరకపోవచ్చు. యూపీఐ చెల్లింపులు మధ్యలో ఆగిపోవచ్చు. డబ్బులు వేరొకరికి ట్రాన్స్ ఫర్ అవ్వకపోవచ్చు.

అతి తక్కువ ధరలో..

ఫోన్ వినియోగదారులకు డేటా అయిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి పనికి అంతరాయం లేకుండా ఉండేందుకు రిలయన్స్ జియో వివిధ ప్రీపెయిడ్ డేటా బూస్టర్ ప్లాన్లను అందిస్తుంది. అవి కూడా అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

జియో డేటా బూస్టర్ ప్లాన్లు..

రూ. 15 ప్లాన్.. పని చివరిలో డేటా అయిపోతే ఈ ప్లాన్ చాలా వీలుగా ఉంది. రూ.15 ప్లాన్ కింద వన్ జీబీ డేటా లభిస్తుంది. మీ పని అంతరాయం లేకుండా కొనసాగుతుంది. మీ ప్రస్తుత ప్లాన్ ఉన్నంత వరకూ చెల్లుబాటులో ఉంటుంది.

రూ. 19 ప్లాన్.. ఈ ప్లాన్ తో 1.5 జీబీ డేటా పొందవచ్చు. మీ యాక్టివ్ ప్లాన్ వ్యవధి వరకూ ఈ డేటా కొనసాగుతుంది. కొంచెం అదనపు డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉంటుంది.

రూ. 25 ప్లాన్.. కొంచె డేటా ఎక్కువ అవసరం ఉన్న వారికి ఈ ప్లాన్ ఉపయోగంగా ఉంటుంది. కేవలం రూ. 25కే 2 జీబీ డేటా లభిస్తుంది. దీంతో మీరు ప్రశాంతంగా బ్రౌజింగ్, స్ట్రీమింగ్ కొనసాగించవచ్చు. దీని చెల్లుబాటు కూడా మీ ప్రస్తుత ప్లాన్‌తో ముడిపడి ఉంటుంది.

రూ. 29 ప్లాన్.. 2 జీబీ కంటే ఎక్కువ డేటా కావాలనుకునే వారు రూ. 29 ప్లాన్ ను ఎంపిక చేసుకోవచ్చు. దీని ద్వారా 2.5 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ చెల్లుబాటు మీ ప్రస్తుత ప్లాన్‌ వరకూ ఉంటుంది.

రూ. 61 ప్లాన్.. ఈ ప్లాన్ లో 6 జీబీ డేటా లభిస్తుంది. భారీ డేటా కావాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది.

రూ.121 ప్లాన్.. వీడియోలను స్ట్రీమింగ్ చేయడం, పెద్ద ఫైల్స్ ను డౌన్‌లోడ్ చేయడం వంటి వాటికి ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుంది. రూ.121 ప్లాన్ తీసుకుంటే 12 జీబీ డేటాను అందుతుంది.

క్రికెట్ డేటా ప్యాక్.. క్రికెట్ అభిమానులు, భారీ డేటా వినియోగదారుల కోసం రూ.222లకు జియో క్రికెట్ డేటా ప్యాక్‌ అందుబాటులో ఉంది. దీని ద్వారా 50 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, ఇతర ప్రసారాలను అంతరాయం లేకుండా వీక్షించవచ్చు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

OnePlus Watch 2: వన్ ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. ఫోన్లో ఉండే అన్ని ఫీచర్లూ ఉన్నాయ్..

వన్ ప్లస్ తన రెండో వెర్షన్ స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. వన్ ప్లస్ వాచ్ 2 పేరిట దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో డ్యూయల్ చిప్‌సెట్‌లు, స్మార్ట్ మోడ్‌లో గరిష్టంగా 100 గంటల బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉండే ప్రత్యేకమైన డ్యూయల్-ఇంజిన్ ఆర్కిటెక్చర్‌ ఉంటుంది. ఇది బ్లూటూత్ కాలింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది.

oneplus-watch-2.jpg?w=1280

వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ వాచ్ లను వినియోగిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్ లలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక, అందులోని హెల్త్ ట్రాకర్లు, ఫోన్ తో అనుసంధానించుకునే అవకాశం వంటివి. ఇవి వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి మణికట్టుకు ఇవి ఒదిగిపోతున్నాయి. ఈ క్రమంలో కంపెనీలు కూడా ఉత్తమమైన ఫీచర్లను ఈ స్మార్ట్ వాచ్ లలో తీసుకొస్తున్నాయి. ఇప్పుటు అన్ని టెక్ కంపెనీలు కూడా ఈ స్మార్ట్ వాచ్ లను తయారు చేస్తున్నాయి. వాటిల్లో వన్ ప్లస్ కూడా ఒకటి. ఇటీవల వన్ ప్లస్ నుంచి వాచ్ 2 విడుదలైంది. ఇది డ్యూయల్ చిప్ సెట్, స్మార్ట్ మోడ్లో గరిష్టంగా 100 గంటల బ్యాటరీ జీవితాన్నికలిగి ఉంటుంది. అలాగే వేర్ ఓఎస్ తాజా వెర్షన్ తోనే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, రివ్యూని ఇప్పుడు చూద్దాం..

వన్ ప్లస్ వాచ్ 2..

వన్ ప్లస్ తన రెండో వెర్షన్ స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. వన్ ప్లస్ వాచ్ 2 పేరిట దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో డ్యూయల్ చిప్‌సెట్‌లు, స్మార్ట్ మోడ్‌లో గరిష్టంగా 100 గంటల బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉండే ప్రత్యేకమైన డ్యూయల్-ఇంజిన్ ఆర్కిటెక్చర్‌ ఉంటుంది. ఇది బ్లూటూత్ కాలింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. సంగీతాన్ని నియంత్రించడానికి మీరు దానితో మీ బ్లూటూత్ ఇయర్‌బడ్‌లను ఉపయోగించవచ్చు. వేర్ ఓఎస్(Wear OS) తాజా వెర్షన్‌తో పనిచేస్తుంది. గూగుల్ మ్యాప్స్, అసిస్టెంట్, వాలెట్ మొదలైన ప్రసిద్ధ యాప్స్ పనిచేస్తాయి. ఈ వాచ్ ధర రూ. 24,999 నుంచి ప్రారంభమవుతుంది.

డిజైన్ అండ్ లుక్..

ఈ స్మార్ట్ వాచ్ డిజైన్ పెద్దగా ఉంటుంది. చూడటానికి భారీగా కనిపిస్తుంది. అయితే దానిని ధరిస్తే మీ మణికట్టుకు కొత్త అందాన్ని తెస్తుంది. చాలా ఫ్యాషనబుల్ గా ఉంటుంది. ఇది 1.43-అంగుళాల రౌండ్ అమోల్డ్ డిస్‌ప్లే, నీలమణి క్రిస్టల్ కవర్ గ్లాస్‌ను కలిగి ఉంటుంది. ఇది రేడియంట్ స్టీల్, బ్లాక్ స్టీల్ , స్టెయిన్‌లెస్ స్టీల్ ఛాసిస్ లతో ప్రీమియంగా కనిపిస్తుంది.

డిజిటల్ క్రౌన్, ఛాసిస్ నుంచి కొద్దిగా విస్తరించి ఉన్న యాక్షన్ బటన్‌ను కలిగి ఉంటుంది. ఇది విభిన్న రూపాన్ని ఇస్తుంది. నీలమణి క్రిస్టల్ కవర్ ఆప్టికల్ క్లారిటీపై రాజీ పడకుండా మరింత స్క్రాచ్-రెసిస్టెంట్‌గా చేస్తుంది. ఇది ఐపీ68 రెసిస్టెంట్ రేటింగ్, 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. వాటర్ స్పోర్ట్స్ కోసం సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. పెద్ద బ్యాటరీ, స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్ కారణంగా ఇది కొంచెం భారీగా ఉంటుంది.

పనితీరు ఇలా..

స్మార్ట్‌వాచ్ రెండు వేర్వేరు చిప్‌సెట్‌లతో వన్‌ప్లస్ సొంతంగా అభివృద్ధి చేసిన డ్యూయల్-ఇంజిన్ ఆర్కిటెక్చర్ ఆధారంగా పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ బడ్ల్యూ5 పనితీరు చిప్‌సెట్, బీఈఎస్ 2700 ఎంసీయూ ఎఫిషియెన్సీ చిప్‌సెట్ ఉంటుంది. ఒక చిప్‌సెట్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని, సింపుల్ టాస్క్‌లను హ్యాండిల్ చేస్తే, మరొకటి శక్తివంతమైన టాస్క్‌ల కోసం యాక్టివ్‌గా మారుతుంది. దీనిలో సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ ఇచ్చే 7.5వాట్ల వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 500ఎంఏహెచ్ బ్యాటరీని 60 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఫుల్ చార్జ్ చేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే .. సాధారణంగా వినియోగిస్తే.. 100 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. అదే అధికంగా యాప్స్ అధికంగా వినియోగిస్తూ ఉంటే 48 గంటల పాటు పనిచేస్తుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Infinix Note 40 5G: తక్కువ బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా.. ఇన్‌ఫినిక్స్ నుంచి సూపర్ ఫోన్‌

తక్కువ బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని కంపెనీలు కొంగొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో 5జీ ఫోన్‌లకు డిమాండ్‌ పెరుగుతోది. దీనికి అనుగుణంగానే కంపెనీలు సైతం తక్కువ ధరలోనే ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది ఇన్‌ఫినిక్స్..

infinix-note-40-price.jpg

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలు ఈ నెల 26వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 17,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఒబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

ఈ ఫోన్‌లో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఒక టిగా బైట్‌ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో రెండేండ్లు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, సెక్యూరిటీ అప్ డేట్స్ మూడేండ్లపాటు అందించనున్నారు. 33వాట్ల చార్జింగ్‌కు, 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అదించారు. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), మరో రెండు 2-మెగా పిక్సెల్ మాక్రో, డెప్త్ సెన్సర్ కెమెరాలను ఇచ్చారు. అలాగే సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Smartphones with best cameras for under Rs.30,000: బెస్ట్‌ కెమెరా ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రూ. 30 వేల బడ్జెట్‌లో..

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్స్‌లో కెమెరాకు ప్రధాన్యత పెరుగుతోంది. కెమెరా క్లారిటీ ఉన్న ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ కెమెరాల స్థానాన్ని స్మార్ట్ ఫోన్‌లు ఆక్రమించిన తరుణంలో మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లోనే మంచి కెమెరా ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మరి ప్రస్తుతం మార్కెట్లో రూ. 30 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్‌ ఫోన్‌లు ఏంటి.? వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

realme-12-pro-plus.jpg?w=1280&enlarge=tr

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ ఫోన్స్‌లో రియల్‌ మీ12 ప్రో+ స్మార్ట్ ఫోన్‌ ఒకటి. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా సెన్సార్, 64 మెగాపిక్సెల్ ఓవీ64బీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

vivo-30e.jpg

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివోకు సంబంధించి వివో వీ30ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో కంటిన్యూస్ షూటింగ్, హై డైనమిక్ రేంజ్ మోడ్ సూపర్‌ మూన్‌ వంటి ఫీచర్లను అందించారు.

redmi-note-13-pro-plus.jpg

రోడ్‌ మీ నోట్‌ 13 ప్రో+ స్మార్ట్ ఫోన్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. దీంతో పాటు సామ్‌సంగ్‌ ఐసోసెల్ హెచ్పి 3 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, ఎ2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

oneplus-2.jpg

మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో మంచి కెమెరాతో అందుబాటులో ఉన్న మరో ఫోన్‌ వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ 4 ఒకటి. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ లైట్ 600 ప్రైమరీ కెమెరా విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

tecno.jpg

టెక్నో కంపెనీకి చెదిన టెక్నో కామోన్‌ 30 కూడా బెస్ట్‌ కెమెరా ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో ఓఐఎస్ సపోర్ట్తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అందించారు. అలాగే 50 ఎంపీతో కూడిన ఆటోఫోకస్‌ ఫ్రంట్ కెమెరాను అందించారు. దీంతో సెల్ఫీలు ఆకర్షణీయంగా, హై క్వాలిటీతో వస్తాయి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Realme GT 6: మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌మీ కొత్త ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ జీటీ6 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గురువారం భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఫోన్‌ మార్కెట్లో సందడి చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

realme-3.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ జీటీ 6 పేరుతో గురువారం ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 24వ తేదీ అర్థ రాత్రి 11.50 గంటల వరకు ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ప్రీ ఆర్డర్‌ బుక్‌ చేసుకున్న వారికి స్క్రీన్ డ్యామేజీ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు.

realme-gt-6-price-1.jpg

ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.40,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.42,999, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.44,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్ షేడ్స్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

realme-phone.jpg

రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కింద రూ. 1000 వరకు బోనస్‌ పొందొచ్చు. ఇక ఇందులో డాల్బీ విజన్‌, హెచ్‌డీఆర్ 10+కి సపోర్ట్ చేసే స్క్రీన్‌ను అందించారు.

realme-smart-phone-2.jpg

120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేసే 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ 8టీ ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే ఈ ఫోన్‌ సొంతం. 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటుతోపాటు 6000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను అందించారు. 4ఎన్ఎం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

smart-phone-6.jpg

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఎల్వైటీ 808 సెన్సర్ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 4కే రిజల్యూషన్‌తో వీడయో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో 120 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ కేవలం 28 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబతోంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Vivo T3 Lite 5G: వివో నుంచి బడ్జెట్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్‌ కూడా అదుర్స్

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీలు పోటీపడీ మరి 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు సంస్థలు తక్కువ ధరలో 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేయగా తాజాగా వివో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

vivo-4.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వివో టీ3 లైట్‌ 5జీ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ నెలఖారులో లేదా జులై మొదటి వారంలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

vivo-phone.jpg

ఇక ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ. 11,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వివో టీ3 లైట్ 5జీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారని సమాచారం.

vivo-smartphone.jpg

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. సోనీ ప్రైమరీ సెన్సర్ కెమెరా, సెకండరీ కెమెరా ఉంటాయని సమాచారం. ఇక ఈ ఫోన్‌ను కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ ఫ్లేక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

vivo-smartphone-features.jpg

44 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌బ్యాటరీని అందించనున్నారు. ఇక వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది.

vivo-t3-lite-5g.jpg

అలాగే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ రానుందని తెలుస్తోంది. ఇక 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999లకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

iPhone14: ఐఫోన్‌ 14పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌.. ఏకంగా..

ఐఫోన్‌ కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. యాపిల్ బ్రాండ్‌కు ఉన్న పాపులారిటీ, ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లు యూజర్లను అట్రాక్ట్ చేస్తుంటాయి. అయితే ధర విషయంలో చాలా మంది వెనుకడగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ మంచి ఆఫర్‌ను అందిస్తోంది. తక్కువ ధరకే ఏఫోన్‌14 ప్లస్‌ ఫోన్‌ని సొంతం చేసుకునే..

iphone-14-plus.jpg?w=1280

ఐఫోన్‌ కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. యాపిల్ బ్రాండ్‌కు ఉన్న పాపులారిటీ, ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లు యూజర్లను అట్రాక్ట్ చేస్తుంటాయి. అయితే ధర విషయంలో చాలా మంది వెనుకడగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ మంచి ఆఫర్‌ను అందిస్తోంది. తక్కువ ధరకే ఏఫోన్‌14 ప్లస్‌ ఫోన్‌ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఐఫోన్‌ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్‌ ఐఫోన్‌ 14 ప్లస్‌ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 79,900కాగా ప్రస్తుతం ఫ్లిప్‌ కార్ట్‌లో 29 శాతం డిస్కౌంట్‌తో రూ. 55,999కే లభిస్తోంది. దీంతో పాలు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్‌ యూపీఐతో కొనుగోలుచేస్తే గరిష్టంగా రూ. 750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఈ ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేవు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా ఈ ఫోన్‌పైస గరిష్టంగా రూ. 48,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఐఫోన్‌ 14 ప్లస్ ఫీచర్లు..

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను ఈ ఫోన్‌ అందిస్తుంది. ఇక ఇందులో ఐఫోన్ 14 ప్లస్ A15 బయోనిక్ చిప్‌సెట్‌ను అందించారు. ఐఓస్‌ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ పోన్‌ పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై6, బ్లూటూత్‌ 5.3, ఎన్‌ఎఫ్‌సీ, లైట్నింగ్ కనెక్టర్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ రెండు రియర్ కెమెరాలను 16 మెగాపిక్సెల్స్‌తో తీసుకొచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4323 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 26 గంటలు పనిచేస్తుంది.

Link to comment
Share on other sites

  • 0

Bharati Airtel unlimited internet for Rs.9: రూ.9తో రీచార్జ్‌ చేస్తే.. వాడుకున్నంత ఇంటర్‌నెట్‌ ఫ్రీ..

భారతీ ఎయిర్‌టెల్ రూ.9 ప్లాన్ అపరిమిత డేటాతో వస్తుంది. అయితే ఇది ఓ గంట సేపు ‍మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే గంట పాటు మీరు ఎంత డేటా వాడుకున్న ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఎఫ్‌యూపీ (ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ) పరిమితి 10జీబీ వరకూ మాత్రమే ఉంది. దీనివల్ల మీరు 10జీబీ వరకూ హై-స్పీడ్ డేటాను పొందుతారు.

airtel4-1.jpg?w=1280

భారతీ ఎయిర్‌టెల్‌.. మన దేశంలో రెండో అతి పెద్ద టెలికాం ఆపరేటర్‌. నెట్‌వర్క్‌ విషయంలో దీనికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఎటువంటి ప్రాంతంలో అయినా ఇది సిగ్నల్‌ ఇస్తుందన్న నమ్మకం వినియోగదారుల్లో ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్‌ ప్లాన్ల రేటు కాస్త ఎక్కువగానే ఉంటాయి. రిలయన్స్‌ జియోతో పోల్చితే దీని ట్యారిఫ్‌ ఎక్కువే. అయితే ఇప్పుడు ఓ అద్భుతమైన ప్లాన్‌ను వినియోగదారులకు అందిస్తోంది. కేవలం రూ. 9తో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ని తీసుకొచ్చింది. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే అపరిమితంగా డేటాను వినియోగించుకోవచ్చు. ఇది కేవలం డేటా ప్లాన్‌ మాత్రమే. ఎటువంటి ఇతర సేవలు లభించవు. మరి రూ.9తో రీచార్జ్‌ చేసుకోవడం మంచిదేనా? దాని వల్ల ప్రయోజనం ఎలా ఉంటుంది? భారతీ ఎయిర్‌ టెల్‌ రూ.9 ప్లాన్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎయిర్‌టెల్ రూ 9 ప్లాన్..

భారతీ ఎయిర్‌టెల్ రూ.9 ప్లాన్ అపరిమిత డేటాతో వస్తుంది. అయితే ఇది ఓ గంట సేపు ‍మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే గంట పాటు మీరు ఎంత డేటా వాడుకున్న ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఎఫ్‌యూపీ (ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ) పరిమితి 10జీబీ వరకూ మాత్రమే ఉంది. దీనివల్ల మీరు 10జీబీ వరకూ హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఆ పరిమితి దాటిన తర్వాత ఇంటర్‌నెట్‌ వేగం 64కేబీపీఎస్‌కి తగ్గుతుంది. మీకు ఎక్కువ మొత్తంలో ఏదైనా డౌన్‌ లోడ్‌ చేయాల్సిన అవసరం వస్తే.. తక్కువ వ్యవధిలో ఈ డేటా బూస్ట్‌ మీకు అవసరం అవుతుంది. ప్రస్తుతం ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ నుంచి 10జీబీ వరకు డేటా కావాలంటే అందుకు దాదాపు రూ.100 వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్లాన్ మీకు రూ.9కే ఇస్తుంది.అయితే ఇది ఒక గంట మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రెండు ఓచర్లు తీసుకుంటే..

మీరు ఈ ప్లాన్‌ రెండు వోచర్‌లను కొనుగోలు చేస్తే, మీరు రూ. 18 ఖర్చు చేస్తారు. కానీ 20జీబీ డేటాను పొందుతారు. ఇక్కడ, ప్రతి జీబీ డేటా మీ కోసం రూ. 1 కంటే తక్కువకే వచ్చేస్తోంది. కాబట్టి కస్టమర్‌లకు ఇది గొప్ప అవకాశం. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లో రీఛార్జ్ చేసుకోవడానికి ఈ ప్లాన్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉంది. కాగా భారతీ ఎయిర్‌టెల్ తన పోర్ట్‌ఫోలియోకు ప్రీపెయిడ్ ప్లాన్‌ల శ్రేణిని నిశ్శబ్దంగా జోడించింది. ఇటీవల జోడించిన కొన్ని ప్లాన్‌లలో రూ.279 ప్లాన్, రూ.395 ప్లాన్ ఉన్నాయి.

Link to comment
Share on other sites

  • 0

Samsung Galaxy s24: 200 మెగా పిక్సెల్‌ కెమెరాతో శాంసంగ్‌ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్

శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాను కొత్త కలర్ వేరియంట్‌లో విడుదల చేసింది. కంపెనీ టైటానియం పసుపు రంగును పరిచయం చేసింది. బ్రాండ్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను సంవత్సరం ప్రారంభంలో విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ ఏడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వైలెట్, టైటానియం బ్లూ, గ్రీన్, ఆరెంజ్ రంగులలో..

samsung-smartphone.jpg?w=1280

శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాను కొత్త కలర్ వేరియంట్‌లో విడుదల చేసింది. కంపెనీ టైటానియం పసుపు రంగును పరిచయం చేసింది. బ్రాండ్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను సంవత్సరం ప్రారంభంలో విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ ఏడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వైలెట్, టైటానియం బ్లూ, గ్రీన్, ఆరెంజ్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా ఫోన్ కాన్ఫిగరేషన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు.

ధర ఎంత?

మీరు ఇప్పుడు టైటానియం పసుపు రంగులో Samsung Galaxy S24 అల్ట్రాను కొనుగోలు చేయవచ్చు. ఈ రంగు ఎంపిక 12GB RAM + 256GB స్టోరేజీ, 12GB RAM + 512GB నిల్వ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అధికారిక స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. మీరు Samsung Galaxy S24 Ultraని మూడు కాన్ఫిగరేషన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,29,999. అయితే 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,39,999. టాప్ వేరియంట్ 12GB RAM + 1TB స్టోరేజ్ రూ. 1,59,999.

స్పెసిఫికేషన్స్ ఏమిటి?

Samsung Galaxy S24 Ultra 6.8-అంగుళాల డైనమిక్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఫోన్ 12GB RAM మరియు 1TB స్టోరేజీతో వస్తుంది. ఈ మొబైల్‌ Android 14 ఆధారంగా One UI 6.1లో పని చేస్తుంది. ఇది 7 సంవత్సరాల వరకు అప్‌డేట్‌ సదుపాయం కూడా ఉంది. హ్యాండ్‌సెట్ క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీని ప్రధాన లెన్స్ 200MP. ఇది కాకుండా 50MP పెరిస్కోప్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా, 10MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందుబాటులో ఉన్నాయి. ముందు భాగంలో కంపెనీ 12MP సెల్ఫీ కెమెరాను అందించింది. మొబైల్‌కు 5000mAh బ్యాటరీ అందించింది కంపెనీ. ఇది 45W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని కలిగి ఉంది.

Link to comment
Share on other sites

  • 0

Jio Plan for Rs. 296 with 30 day validity: జియో నుంచి చౌవకైన రీఛార్జ్‌ ప్లాన్‌.. హైస్పీడ్‌ డేటా.. 30 రోజుల వ్యాలిడిటీ!

రిలయన్స్‌ జియో తన కస్టమర్ల కోసం రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మీరు తక్కువ ధరలో మీ డేటా వినియోగంపై పరిమితి లేని ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియో నుండి ఈ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌కు రోజువారీ డేటా పరిమితి లేదు. అంటే మీరు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్‌లో కాలింగ్..

jio-3.jpg

రిలయన్స్‌ జియో తన కస్టమర్ల కోసం రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మీరు తక్కువ ధరలో మీ డేటా వినియోగంపై పరిమితి లేని ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియో నుండి ఈ ప్లాన్ అందిస్తోంది.

ఈ ప్లాన్‌కు రోజువారీ డేటా పరిమితి లేదు. అంటే మీరు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్‌లో కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ వంటి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

జియో ఈ ప్లాన్ ధర 296 రూపాయలు. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఇందులో రోజువారీ పరిమితి ఇవ్వలేదు. ఎలాంటి అంతరాయం లేకుండా మీరు డేటాను ఉపయోగించుకోవచ్చు.

వినియోగదారులకు 30 రోజుల్లో 25 జీబీ డేటా అందిస్తుంది జియో. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా కాల్ చేయడానికి అపరిమిత కాలింగ్ సౌకర్యం అందిస్తోంది.

ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లులు అందుతాయి. దీనితో పాటు, JioTV, JioCinema, JioSecurity, JioCloud కి యాక్సెస్ కూడా అందించబడుతుంది. ఇది వినియోగదారులకు అపరిమిత 5G డేటాను అందిస్తుంది.

Link to comment
Share on other sites

  • 0

Anticipated Smartphones: రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల జాతర.. రిలీజ్ కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

2024లో ప్రముఖ కంపెనీలైన యాపిల్, గూగుల్, సామ్‌సంగ్ వంటి ముఖ్య స్మార్ట్ ఫోన్ తయారీ బ్రాండ్లు ఫ్లాగ్‌షిప్ మోడల్‌లను ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు త్వరలోనే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆసక్తితో ఉంటే కచ్చితంగా వెయిట్ చేసి సరికొత్త మోడల్ ఫోన్‌ను కొనుగోలు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు.

smart-phones.jpg?w=1280

ప్రతి ఏడాది జూన్ తర్వాత స్మార్ట్‌ఫోన్ ఔత్సాహికులు ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే ఈ ఆరు నెలల్లోనే టాప్ కంపెనీలన్నీ తమ సూపర్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తాయి. వారి అంచనాలను నిజం చేసేలా 2024లో ప్రముఖ కంపెనీలైన యాపిల్, గూగుల్, సామ్‌సంగ్ వంటి ముఖ్య స్మార్ట్ ఫోన్ తయారీ బ్రాండ్లు ఫ్లాగ్‌షిప్ మోడల్‌లను ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు త్వరలోనే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆసక్తితో ఉంటే కచ్చితంగా వెయిట్ చేసి సరికొత్త మోడల్ ఫోన్‌ను కొనుగోలు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఆరు నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్న టాప్ ఫోన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఐఫోన్ 16

ఐఫోన్ 16 ఫోన్లు సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. యాపిల్ వార్షిక ఐఫోన్ లాంచ్ ఈవెంట్‌‌లో ఈ సంవత్సరం 6.1 అంగుళాలతో వచ్చే ఐఫోన్ 16 రిలీజ్ చేయనున్నారు. ఈ ఫోన్ నాలుగు మోడల్స్‌లో అందుబాటులో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 6.7 అంగుళాల స్క్రీన్‌తో ఐ ఫోన్ 16 ప్లస్, 6.3 అంగుళాల ఐ ఫోన్ 16 ప్రో, 6.9 అంగుళాల ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ నాలు మోడల్‌లు ఐఓఎస్ 18 సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్‌లు ముఖ్యమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో వస్తాయని భావిస్తున్నారు. ప్రో వేరియంట్‌లు యాపిల్ ఇంటెలిజెన్స్‌‌తో వస్తాయని, అలాగే ఆన్-డివైస్, ప్రైవేట్-క్లౌడ్ బ్యాక్డ్ జెనరేటివ్ ఏఐ టెక్నాలజీతో వస్తాయని అంచనా.

గూగుల్ పిక్సెల్ 9

ప్రముఖ కంపెనీ గూగుల్ రాబోయే రోజుల్లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఫోన్లను టెన్సార్ జీ 4 ప్రాసెసర్‌తో అందించే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా గూగుల్ ఐఓ 2024లో ఈ ఫోన్లను లాంచ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ల ఫీచర్లపై అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి. మెరుగైన పనితీరు, మెరుగైన కెమెరాలు, రిఫ్రెష్ చేసిన డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్లపై స్మార్ట్ ఫోన్ల ప్రియులు అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నారు. 

సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, జెడ్ ఫోల్డ్ 6

సామ్‌సంగ్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫోల్డబుల్‌లను జూలైలో ఆవిష్కరించే అవకాశం ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, జెడ్ ఫోల్డ్ 6 వచ్చే ఈ ఫోన్లు ఫ్లిప్, ఫోల్డబుల్ డిజైన్‌లతో వస్తాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3తో పని చేస్తాయి. అలాతే గెలాక్సీ ఏఐ సామర్థ్యాల శ్రేణిని ఏకీకృతం చేస్తూ వన్ యూఐ 6.1తో లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మెరుగైన కంప్యూటింగ్ శక్తిని అందిస్తాయి.

మోటోరోలా రాజర్, రాజర్ ప్లస్ 

మోటోరోలా కంపెనీ ఇప్పటికే 2024 ప్రథమార్ధంలో అద్భుతమైన బడ్జెట్, మిడ్-టైర్, హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. తాజాగా రాబోయే రోజుల్లో కంపెనీ తన ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్స్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. రాజర్, రాజర్ ప్లస్ పేరుతో లాంచ్ చేసే ఈ ఫోన్లు సామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్లకు గట్టి పోటీనివ్వనున్నాయి. రాజర్ ప్లస్ అతిపెద్ద కవర్ డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 7 7 సిరీస్ చిప్ ద్వారా శక్తిని పొందుతాయి. అలాగే రాజర్ 2024 ఎడిషన్ మరింత బడ్జెట్ స్నేహపూర్వక ఫోల్డబుల్‌గా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 

Link to comment
Share on other sites

  • 0

Samsung Music Photo Frame: మ్యూజిక్‌ ఫ్రేమ్‌ను విడుదల చేసిన సామ్‌సంగ్.. అసలేంటీ గ్యాడ్జెట్‌

మ్యూజిక్‌ ఫ్రేమ్‌ ఒక వైర్‌లెస్‌ స్పీకర్‌ లాటింది. ఇందులో డిస్‌ప్లే ఉంటుంది. యూజర్లు సాంగ్స్‌ను ప్లే చేసుకునే సమయంలో తమ ఫొటోలు డిస్‌ప్లే అయ్యేలా చేసుకోవచ్చు. ఈ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ గ్యాడ్జెట్‌ 120 వాట్స్‌ అవుట్ పుట్‌, డాల్బీ ఆటమ్స్‌ 2.0 ఛానల్‌, 6 స్పీకర్లతో సౌరండ్ సౌండ్ ఎక్స్‌పాన్షన్‌ లభిస్తుంది. ఈ గ్యాడ్జెట్‌ను గోడకు హ్యాంగ్‌ చేసుకోవచ్చు, లేదా టేబుల్ పై పెట్టుకోవచ్చు...

samsung-music-frame.jpg?w=1280

సౌత్‌ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి కొత్త గ్యాడ్జెట్‌ను తీసుకొచ్చింది. సామసంగ్‌ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ పేరుతో ఈ సరికొత్త గ్యాడ్జట్‌ను మార్కెట్లోకి తసుకొచ్చారు. ఇంతకీ అసలేంటీ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ గ్యాడ్జెట్‌, దీని ఉపయోగం ఏంటి? ప్రత్యేతలు ఏంటి.?ఇప్పుడు తెలుసుకుందాం..

మ్యూజిక్‌ ఫ్రేమ్‌ ఒక వైర్‌లెస్‌ స్పీకర్‌ లాటింది. ఇందులో డిస్‌ప్లే ఉంటుంది. యూజర్లు సాంగ్స్‌ను ప్లే చేసుకునే సమయంలో తమ ఫొటోలు డిస్‌ప్లే అయ్యేలా చేసుకోవచ్చు. ఈ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ గ్యాడ్జెట్‌ 120 వాట్స్‌ అవుట్ పుట్‌, డాల్బీ ఆటమ్స్‌ 2.0 ఛానల్‌, 6 స్పీకర్లతో సౌరండ్ సౌండ్ ఎక్స్‌పాన్షన్‌ లభిస్తుంది. ఈ గ్యాడ్జెట్‌ను గోడకు హ్యాంగ్‌ చేసుకోవచ్చు, లేదా టేబుల్ పై పెట్టుకోవచ్చు.

ఇక మ్యూజిక్‌ ఫ్రేమ్‌ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌ వంటి వాయిస్‌ అసిస్టెంట్‌లకు సపోర్ట్ చేస్తుంది. వైఫై లేదా బ్లూటూత్‌ ద్వారా ఈ డివైజ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. టీవీలకు కూడా కనెక్ట్‌ చేసుకోవచ్చు. యాక్టివ్‌ వాయిస్‌ అంప్లిఫయర, స్పేస్‌ఫిట్ సౌండ్‌, వాయిన్‌ ఎన్‌హాన్స్‌ మోడ్‌, నైట్ మోడ్‌ వంటి ఫీచర్ల అందించారు.

అలాగే ఇందులో అడాప్టివ్‌, మ్యూజిక్‌, స్టాండర్డ్ వంటి సౌండ్‌ మోడ్స్‌ను అందించారు. వైఫై 5, బ్లూటూత్‌ వీ5.2, వన్ కంట్రోల్‌, ఎక్స్‌1 ఆప్టికల్ ఇన్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. యాపిల్‌ ఎయిర్‌ప్లే2కి కూడా ఈ గ్యాడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. ధర విషయానికొస్తే ఈ గ్యాడ్జెట్‌ను సామ్‌సంగ్‌ రూ. 29,990గా నిర్ణయించింది. అయితే లిటిమెట్ డైట్ ఆఫర్‌లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ. 23,990కి లభిస్తోంది. దీంతో పాటు సామ్‌సంగ్‌ అవుట్‌లెట్స్‌లో అదుబాటులోకి వచ్చాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...