Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

Good Phones, Plans, Watches, Tablets, Gadgets, Laptops and TVs in India in 2024


TELUGU

Question

Reliance Jio new plan with 90-day validity: 90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన జియో

29-04-2024 Mon 16:26 | Business

రోజుకు 2 జీబీ.. అదనంగా మరో 20 జీబీ డేటా

రూ.749 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ

జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్న టెలికం దిగ్గజం

cr-20240429tn662f7cde6fb06.jpg

దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్ బేస్ కలిగివున్న దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో సాధారణ ఆఫర్లతో పోల్చితే యూజర్లకు అధిక డేటా లభిస్తోంది. ఆఫర్‌లో రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటాను జియో అందిస్తోంది. మొత్తం 200 జీబీల డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఉచిత కాలింగ్, ఎంఎస్‌ఎంలు, ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి.

ఇక ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. 5జీ మొబైల్ కలిగివుండి కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ యాక్సెస్ ఉంటే అదనపు డేటాను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఆఫర్ కింద జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌లకు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 90 రోజులపాటు ఈ సేవలను పొందవచ్చు.

కాగా తక్కువ రేటుతో సాధ్యమైనన్ని గరిష్ఠ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా జియో ఇటీవలే రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అనేక వర్గాలుగా విభజించింది. అందులో భాగంగా ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా భారత్‌లో అత్యధికంగా 45 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లను జియో కలిగివుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా జియో కొనసాగుతోంది.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Amazon: ఫోన్‌ మార్చే ఆలోచనలో ఉన్నారా.? అమెజాన్‌ ప్రైమ్‌ డేలో లాంచ్‌ అవుతోన్న కొత్త ఫోన్స్‌

పలు స్మార్ట్‌ ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా లాంచింగ్‌కు సిద్ధమవుతోన్న ఈ ఫోన్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

amazon-prime-day.jpg?w=1280

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా అమెజాన్‌ ప్రైమ్‌ డే పేరుతో సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 20, 21వ తేదీల్లో కేవలం రెండు రోజులు మాత్రమే నిర్వహించిన ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

పలు స్మార్ట్‌ ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా లాంచింగ్‌కు సిద్ధమవుతోన్న ఈ ఫోన్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

Samsung Galaxy M35:

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌35 స్మార్ట్‌ఫోన్‌ జులై 17వ తేదీన లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, సెల్ఫీలు.. వీడియో కాల్స్‌ కోసం 13 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. 25 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.

Motorola Razr 50 Ultra:

మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌ జులై 10వ తేదీన లాంచ్‌ కానుంది. అమెజాన్‌ సేల్లో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ పోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.9 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరా ఈ ఫోన్ సొంతం.

OnePlus Nord CE 4 Lite 5G (Ultra Orange):

వన్‌ప్లస్ బడ్జెట్‌ ఫోన్‌ నార్డ్‌ సీఈ4 లైట్‌ 5జీ ఫోన్‌ ఇప్పటికే లాంచ్‌ కాగా తాజాగా అమెజాన్ ప్రైమ్‌ డే సేల్‌లో అల్ట్రా ఆరంజ్‌ కలర్‌లో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ. 19,999గా నిర్ణయించారు. సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌ లభించనుంది.

Redmi 13 5G:

ప్రైమ్‌ డే సేల్‌లో అందుబాటులోకి వస్తున్న మరో కొత్త ఫోన్‌ రెడ్‌మీ 13 5జీ. జులై 9వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్‌తో కూడిన సూపర్‌ ఇమ్మెర్సివ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ ఆటమ్స్‌ సౌండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఈ ఫోన్‌ సొంతం.

HONOR 200 series:

హానర్‌ 200 సిరీస్‌ ఫోన్‌ కూడా అమెజాన్‌ ప్రేమ్‌ డే సేల్‌లో భాగంగ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో జుల్‌ 18వ తేదీన లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌లో హానర్ 200 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ కర్వ్డ్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 2664 x 1200 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెట్ రేట్‌ను అందింనున్నారు. 400 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్ సొంతం.

Link to comment
Share on other sites

  • 0

Smartphone: రూ. 20 వేల లోపు ఫోన్‌ కోసం చూస్తున్నారా.? బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే..

మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ సందడి చేస్తోంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. దీంతో ఏడాదికి మించి ఫోన్‌ వాడడమే కష్టంగా మారిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రతీసారి కొత్త ఫోన్‌ కొనుగోలు చేయాలంటే బడ్జెట్‌తో కూడిన అంశంగా చెప్పొచ్చు. మరి బడ్జెట్‌ ధరలో కొత్త ఫోన్‌ కోసం చూస్తున్న కొన్ని వారికి కొన్ని బెస్ట్‌ ఫోన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ ఫోన్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

lava-agni-2-5g.jpg?w=1280&enlarge=true

Lava Agni 2 5G: రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో లావా అగ్ని 2 ఒకటి. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 25,999కాగా అమెజాన్‌లో 35 శాతం డిస్కౌంట్‌తో రూ. 16,999కే లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇందులో 66 వాట్స్‌ సూపర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. 6.78 ఇంచెస్‌తో కూడని ఫుల్‌హెచ్‌డీ+ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిసప్లేను ఇచ్చారు.

oneplus-nord-ce-3-lite-5g.jpg

OnePlus Nord CE 3 Lite 5G: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 19,999కాగా అమెజాన్‌లో 12 శాతం డిస్కౌంట్‌తో రూ. 17,699కే లభిస్తోంది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందింఆచరు 6.72 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు.

realme-12-5g.jpg

realme 12 5G: రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లలో రియల్‌మీ 12 5జీ ఒకటి. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను అందించారు. 45 వాట్స్‌ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ధర విషయానికొస్తే అసలు ధర రూ. 20,999 కాగా 24 శాతం డిస్కౌంట్‌తో రూ. 16,030కి సొంతం చేసుకోవచ్చు.

samsung-galaxy-f34-5g.jpg

Samsung Galaxy F34 5G: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 25,999కాగా 37 శాతం డిస్కౌంట్‌తో రూ. 16,443కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపికెల్స్‌తో కూడిన నో షేక్‌ కెమెరాను అందించారు. 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చిన ఫోన్‌లో డాల్బీ ఆటమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక అమోఎల్‌ఈడీ స్క్రీన్‌తో పాటు గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు.

samsung-galaxy-m32.jpg

Samsung Galaxy M32: సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌32 స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 18,999కాగా 25 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 14,300కి లభిస్తోంది. ఈ ఫోన్‌లో 6.4 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను, సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 20 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందంచారు. 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

Link to comment
Share on other sites

  • 0

Jio PrePaid Plans: ఎంతకావాలంటే అంత 5జీ డేటా.. ఈ ప్లాన్లతో అన్ లిమిడెట్ వినోదం..

రిలయన్స్ జియో ఇటీవల టారిఫ్‌ను పెంచింది. ప్రీపెయిడ్‌కు సంబంధించి కొన్ని ప్లాన్లను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో మూడు కొత్త ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ యాడ్ ఆన్ ప్లాన్లను తీసుకువచ్చింది. అయితే ఇవి విడిగా ఉండవు. కానీ ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాన్‌కు యాడ్-ఆన్‌గా ఉంటాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

jio-1.jpg?w=1280

రిలయన్స్ జియోకు దేశంలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అపరిమిత డేటా, కాల్స్ తదితర వాటి కోసం వివిధ ప్లాన్ల ను అందిస్తూ అందరికీ చేరువైంది. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. ట్రూ అన్ లిమిటెడ్ 5జీ డేటా పేరుతో మూడు కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

యాడ్-ఆన్ ప్లాన్లు..

రిలయన్స్ జియో ఇటీవల టారిఫ్‌ను పెంచింది. ప్రీపెయిడ్‌కు సంబంధించి కొన్ని ప్లాన్లను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో మూడు కొత్త ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ యాడ్ ఆన్ ప్లాన్లను తీసుకువచ్చింది. అయితే ఇవి విడిగా ఉండవు. కానీ ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాన్‌కు యాడ్-ఆన్‌గా ఉంటాయి.

అపరిమిత 5జీ డేటా..

రిలయన్స్ జియో తీసుకువచ్చిన కొత్త ప్లాన్లకు వినియోగదారుల ఆదరణ బాగుంటుందని భావిస్తున్నారు. 1 జీబీ, 1.5 జీబీ డేటా ప్లాన్లను రీచార్జి చేసుకున్నయూజర్ల కోసం ఈ బూస్టర్ ప్లాన్లు తీసుకువచ్చింది. అధిక డేటా కోసం రీచార్జి చేసుకునే వారికి వీటి వల్ల ఉపయోగం ఉంటుంది. కొత్త ప్లాన్ల ధరలను రూ.51, రూ.101, రూ.151 గా నిర్ధారించింది. ఈ ప్లాన్ల ద్వారా అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. సాధారణంగా 2 జీబీ, అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్ల తీసుకున్న వారికి ఇప్పటికే అపరిమిత 5జీ డేటా అందుతున్న విషయం తెలిసిందే.

5జీ ఫోన్లకు ఉపయోగం..

స్మార్ట్ ఫోన్లు 5జీకి అనుకూలంగా ఉంటే కొత్త ప్లాన్ల ద్వారా అపరిమిత 5జీ డేటా పొందవచ్చు. జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌ కు కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అదే 4జీ నెట్ వర్క్ అయితే ఈ ప్లాన్లు పరిమిత డేటాను అందిస్తాయి. వాటి వివరాలు కింద విధంగా ఉన్నాయి.

ప్లాన్ల వివరాలు..

  • రూ.151 ప్లాన్.. ఈ ప్లాన్ ద్వారా అధిక వేగంతో 9 జీబీ వరకూ 4జీ డేటా లభిస్తుంది. అలాగే 5 జీ మద్దతు ఉన్న ఫోన్లకు అధిక వేగంతో అపరిమిత 5జీ డేటా అందుతుంది.
     
  • రూ.101 ప్లాన్.. ఈ ప్లాన్ కింద 6 జీబీ వరకూ 4జీ డేటా అందజేస్తారు. అలాగే 5జీ ఫోన్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.
     
  • రూ.51 ప్లాన్.. దీని కింద 3 జీబీ వరకూ 4జీ డేటా వినియోగదారులకు అందుతుంది. ఒక 5 జీ ఫోన్లు ఉన్న వారికి అపరిమిత 5 జీ డేటా అందిస్తారు.

సమస్యకు పరిష్కారం..

అపరిమిత 5జీని అందించే రూ. 1559, రూ. 359 ప్లాన్ల ను ఇటీవల జియో తొలగించింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఎక్స్ లో తమ నిరసన తెలిపారు. దీంతో కొత్త బూస్టర్ ప్లాన్లు ఆ సమస్యను పరిష్కరిస్తాయని భావిస్తున్నారు. అంటే 1 జీబీ, 1.5 జీబీ డేటా ప్లాన్లు రీచార్జి చేసుకున్న వినియోగదారులు అపరిమిత 5 జీ డేటా కావాలంటే కొత్త బూస్టర్ ప్లాన్లను తీసుకోవాలి. 2 జీబీ, అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్లలో వినియోగదారులకు మామూలుగానే అపరిమిత 5 జీ డేటా అందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా ఇటీవల అన్ని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, డేటా-ఆన్ ప్లాన్‌లపై టారిఫ్‌లను పెంచాయి. అంటే దాదాపు 25 శాతం వరకూ ఎక్కువ చేశాయి.

Link to comment
Share on other sites

  • 0

HP Laptops: ఆ హెచ్‌పీ ల్యాప్‌టాప్స్‌తో మీరే టాప్.. రూ.50 వేలల్లో ది బెస్ట్ ల్యాప్ టాప్స్ ఇవే

ప్రస్తుత రోజుల్లో ల్యాప్‌టాప్‌లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ముఖ్యంగా వీటిని ఎక్కడైనా తీసుకెళ్లి పని చేసుకునే వెసులుబాటు ఉండడంతో అందరూ కంప్యూటర్ల కంటే ల్యాప్‌టాప్‌లను ఇష్టపడుతున్నారు. హెచ్‌పీ బ్రాండ్ భారతదేశంలో కొన్ని అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లను అందిస్తుంది. శక్తివంతమైన ప్రాసెసర్‌లు, ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్, మంచి డిజైన్‌లతో హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లు యువతను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్య-శ్రేణి ధరలో అధునాతన ఫీచర్లతో వచ్చే ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రూ.50 వేలలోపు ధరలో అందుబాటులో ఉండే ల్యాప్‌టాప్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

hp-15-1.jpg?w=1280&enlarge=true

హెచ్‌పీ 15ఎస్ 12 జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో వస్తుంది. 15.6 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు అనువుగా ఉంటుంది. విండోస్ 11కు సపోర్ట్ చేసే ఈ ల్యాప్‌టాప్ వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీతో వస్తుంది. ముఖ్యంగా వీడియో కాల్‌లకు అనువైన ట్రూ విజన్ 720పీ హెచ్‌డీ కెమెరాతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర: రూ. 47,800గా ఉంది.

hp-15-2.jpg

హెచ్‌పీ 15ఎస్ రైజన్ 5500యూ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ స్ట్రీమింగ్, సర్ఫింగ్, మల్టీ టాస్కింగ్ కోసం సరిగ్గా సరిపోతుంది. 15.6 అంగుళాల డిస్ ప్లేతో వచ్చే ఈ ల్యాప్ టాప్ హెచ్‌డీ కెమెరా, డ్యూయల్ అర్రే మైక్‌లు, డ్యూయల్ స్పీకర్‌లతో వస్తుంది. ఏఎండీ రేడియన్ గ్రాఫిక్‌ కార్డుతో వచ్చే ఈ ల్యాప్ టాప్ ఆకర్షణీయమైన కంప్యూటింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 16 జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ ల్యాప్ టాప్ యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్‌తో సహా వివిధ కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 43,490గా ఉంది.

hp-15-3.jpg

హెచ్‌పీ 15 ల్యాప్ టాప్ 13 జెనరేషన్, ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో వస్తుంది. మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వచ్చే ఈ ల్యాప్ టాప్ మైక్రో-ఎడ్జ్ డిస్‌ప్లేతో 15.6 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. విండోస్ 11, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 పని చేసే ఈ ల్యాప్‌టాప్ యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ ఎక్కువగా పని చేసే వారికి సరైన ఎంపికగా ఉంటుంది. 7 గంటల 45 నిమిషాల బ్యాటరీ లైఫ్‌ను అందించే ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 40,990గా ఉంది.

hp-15-4.jpg

హెచ్ పీ 15 12వ జెన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ల్యాప్ టాప్ 16 జీబీ ర్యామ్‌తో వస్తుంది. మెరగైన మల్టీ టాస్కింగ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ 512 ఎస్ఎస్‌డీతో వస్తుంది. డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్‌తో పాటు క్రిస్టల్-క్లియర్ ఆడియోను అందిస్తుంది. అల్ట్రా-లైట్ తేలికైన ల్యాప్‌టాప్. అందువల్ల ఈ ల్యాప్‌టాప్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. మెరుగైన కంప్యూటింగ్ అనుభవాన్ని అందించే ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 35,999గా ఉంది.

hp-15.jpg

హెచ్ 15 ఎస్ 11వ జెనరేషన్ ల్యాప్‌టాప్ ఐ5 ప్రాసెసర్‌తో 15.6 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. మల్టీటచ్‌తో వచ్చే ఇమేజ్‌ప్యాడ్‌ ఈ ల్యాప్ టాప్ ప్రత్యేకత. యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేతో యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ, ఏసీ స్మార్ట్ పిన్, హెడ్‌ఫోన్/మైక్రోఫోన్ పోర్ట్‌తో సహా బహుళ పోర్ట్ ఎంపికలతో వస్తుంది. అలాగే క్రిస్టల్-క్లియర్ ఆడియోను అందించే డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 41,499గా ఉంది.

Link to comment
Share on other sites

  • 0

Galaxy Buds 3: సామ్‌సంగ్ నుంచి కొత్త ఇయర్‌ బడ్స్‌.. ఏఐ ఫీచర్లతో..

సౌత్‌ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పారిస్‌లో జరిగి గ్యాలక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024లో ఫోల్డబుల్‌ ఫోన్‌తో పాటు స్మార్ట్‌వాచ్‌, ఇయర్‌ బడ్స్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే గ్యాలక్సీ బడ్స్‌ 3 పేరుతో కొత్త ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

earbuds.jpg?w=1280&enlarge=true

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఇయర్‌ బడ్స్‌ని లాంచ్‌ చేసింది. గ్యాలక్స్‌ బడ్స్‌ 3పేరుతో అధునాతన ఫీచర్లతో కూడిన ఇయర్‌ బడ్స్‌ని తాజాగా జరిగిన గ్యాలక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బడ్స్‌ 3, గ్యాలక్సీ బడ్స్‌ 3 ప్రోలను లాంచ్‌ చేసింది.

గ్యాలక్సీ బడ్స్‌ ఇయర్‌ బడ్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను జోడించారు. ఇందులో మెరుగైన 2-వే స్పీకర్ సిస్టమ్‌గా పనిచేసే 'కెనాల్ టైప్' స్టెమ్ డిజైన్‌ను ఇచ్చారు. ఇందులో క్రిస్టల్-క్లియర్ సౌండ్ అనుభూతి కోసం డ్యూయల్ యాంప్లిఫైయర్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. ఇయర్‌బడ్‌లు IP57 రేటింగ్‌తో తీసుకొచ్చారు.

galaxy-buds-3.jpg

ఇక గ్యాలక్సీ బడ్స్‌ 3 బరువు 4.7 గ్రాములుగా ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 48 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన బ్యాటరీని అందించారు. అలాగే ఛార్జింగ్‌ కేస్‌ బ్యాటరీ సామర్థ్యం 515 ఎమ్‌ఏహెచ్‌గా ఉంటుంది. స్పష్టమైన సౌండ్ క్వాలిటీ కోసం ఇందులో 11ఎమ్‌ఎమ్ డైమనిక్‌ డ్రైవర్‌లను అందించారు.

వీటితో 360 డిగ్రీస్‌ ఆడియో సరౌండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పొందొచ్చు. ఈ ఇబయ్‌ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేసే 24 గంటలపాటు నాన్‌స్టాప్‌గా వినొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఇయర్‌ బడ్స్‌ను వైట్‌, సిల్వర్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు.

ఇక ధర విషయానికొస్తే గ్యాలక్సీ బడ్స్‌ 3 ధర రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే గ్యాలక్సీ బడ్స్‌ 3 ప్రో ధర రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీ ఆర్డర్స్‌ ప్రారంభంకాగా జులై 24 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

Link to comment
Share on other sites

  • 0

Samsung just copied Apple. It’s sad. We kinda love it. (Buds 3 / 3 Pro First Look)

 

Link to comment
Share on other sites

  • 0

Oppo Reno 12: ఒప్పో నుంచి కొత్త ఫోన్‌.. అదిరే లుక్‌, ఆకర్షణీయమైన ఫీచర్స్‌

ప్రస్తుతం మార్కట్‌లోకి వరుసగా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన సంస్థలు తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఒప్పో రెనో 12 పేరుతో కొత్త సిరీస్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

oppo.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో రెనో 12 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కూడిన కొన్ని ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒప్పో రెనో 12 సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చింది. ఒప్పో రెన్‌ 12, ఒప్పో రెనో 12 ప్రో పేరుతో 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ రెండు ఫోన్‌లలోనూ 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ కర్వ్డ్‌ ఫ్లెక్సిబుల్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్తేను అందించారు.

ఒప్పో రెనో 12లో స్క్రీన్ ప్రొటెక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్‌ 7ఐని అందించారు. అలాగే రెనో 12 ప్రో ఫోన్‌లో గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ను తీసుకొచ్చారు. ఈ రెండు ఫోన్‌లు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. అలాగే 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెట్‌ వీటి సొంతం.

ఇక ఈ రెండు ఫోన్‌లు కూడా మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇలాంటే ఇందులో ఏఐ పనితీరును మెరుగుపరిచేందుకు ఇందులో MediaTek APU 655ని జోడించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఎల్‌వైటీ 600 రెయిర్ కెమెరాను, 50 ఎంపీతో కూడి సెకండరీ కెమెరాను, 8 ఎంపీతో కూడిన వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను ఇచ్చారు. ఇక 12 ప్రో విషయానికొస్తే ఇందులో 50MP సోనీ LYT-600 ప్రైమరీ + 50MP+8MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం రెండు ఫోన్స్‌లోనూ 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

Link to comment
Share on other sites

  • 0

BSNL Prepaid 4G services: బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు షురూ.. అతి తక్కువ ధరకే సూపర్ ప్లాన్లు..

బీఎస్ఎన్ఎల్ అతి త్వరలోనే భారతదేశం అంతటా తన 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ ఇప్పటికే కొన్ని టెలికాం సర్కిల్‌లలో తన 4జీ సేవలను ప్రవేశపెట్టింది. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ఈ సేవను విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చర్యతో ప్రైవేట్ టెలికాం కంపెనీలతో బీఎస్ఎన్ఎల్ పోటీకి వచ్చే అవకాశం ఉంది.

bsnl-1.jpg?w=1280

బీఎస్ఎన్ఎల్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందా? ప్రైవేటు టెలికాం కంపెనీల హోరులో కనుమరుగైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైందా? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అప్ డేట్ అవుతోంది. వారి బడ్జెట్ కు అనుగుణంగా అనువైన ట్యారిఫ్ లతో ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు..

బీఎస్ఎన్ఎల్ అతి త్వరలోనే భారతదేశం అంతటా తన 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ ఇప్పటికే కొన్ని టెలికాం సర్కిల్‌లలో తన 4జీ సేవలను ప్రవేశపెట్టింది. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ఈ సేవను విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చర్యతో ప్రైవేట్ టెలికాం కంపెనీలతో బీఎస్ఎన్ఎల్ పోటీకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల, కంపెనీ ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనాలను అందించే రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. బీఎస్ఎన్ఎల్ 365 రోజుల వ్యాలిడిటీతో తక్కువ ధరలోనే ప్లాన్లను అందిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్లు ఇవి..

బీఎస్ఎన్ఎల్ రూ. 1198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్ ధర రూ.1198 కాగా ఇది 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ నెలకు 3జీబీ డేటా, 30ఎస్ఎంఎస్ లతో 300 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది

బీఎస్ఎన్ఎల్ రూ. 1999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్ ధర రూ. 1999 కాగా ఇది 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ 365 రోజుల పాటు 600జీబీ డేటాతో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ రూ. 2999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్ ధర రూ. 2999కాగా ఇది 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ ప్రతి రోజు 3జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది.

యాపిల్ హెచ్చరిక..

ఇదిలా ఉండగా.. టెక్ దిగ్గజం అయి యాపిల్ ఓ హెచ్చరికను తన వినియోగదారులకు అందించింది. పెగాసస్ తరహాలోనే ఓ కొత్త స్పైవేర్ దాడి చేసే అవకాశం ఉందని భారతదేశంతో సహా కనీసం 98 దేశాల్లోని ఐఫోన్ వినియోగదారులకు హెచ్చరికను జారీ చేసింది. యాపిల్ హెచ్చరిక ప్రకారం, మీ యాపిల్ ఐడీతో అనుబంధంగా ఉండే ఐఫోన్ ని రిమోట్ గా ఉపయోగించకునేలా ఈ స్పైవేర్ పనిచేస్తుందని గుర్తించినట్లు వెల్లడించింది.

Link to comment
Share on other sites

  • 0

BSNL: Cheap and best plan for Rs. 94 బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి బెస్ట్‌ ప్లాన్‌.. రూ.94తో 30 రోజుల చెల్లుబాటు.. బెనిఫిట్స్‌ ఇవే!

జూలై నుంచి రీఛార్జ్ ధర పెరిగింది. జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా ప్రతి టెలికాం కంపెనీ రీఛార్జ్ ధరలను పెంచింది. రీఛార్జ్ రేట్లను పెంచని ఏకైక ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌. రీఛార్జ్ టారిఫ్‌ను పాత రేటులోనే ఉంచారు. బీఎస్‌ఎన్‌ఎల్‌BSNL అనేక సరసమైన ప్లాన్‌లను కలిగి ఉంది, ఇక్కడ ఒక నెల చెల్లుబాటు యొక్క రీఛార్జ్ సౌకర్యాలు 100 రూపాయల కంటే తక్కువ ధరకు అందుబాటులో..

bsnl-2.jpg?w=1280

జూలై నుంచి రీఛార్జ్ ధర పెరిగింది. జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా ప్రతి టెలికాం కంపెనీ రీఛార్జ్ ధరలను పెంచింది. రీఛార్జ్ రేట్లను పెంచని ఏకైక ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌. రీఛార్జ్ టారిఫ్‌ను పాత రేటులోనే ఉంచారు. బీఎస్‌ఎన్‌ఎల్‌BSNL అనేక సరసమైన ప్లాన్‌లను కలిగి ఉంది, ఇక్కడ ఒక నెల చెల్లుబాటు యొక్క రీఛార్జ్ సౌకర్యాలు 100 రూపాయల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఆలోచిస్తే, ఇంత తక్కువ ధర, ఖచ్చితంగా అన్ని సేవలు అందుబాటులో లేవా? కానీ అది అస్సలు కాదు. ఇంటర్నెట్ నుండి ఉచిత కాల్, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

రీఛార్జ్ ప్లాన్:

బీఎస్‌ఎన్‌ఎల్‌ 30 రోజుల చెల్లుబాటుతో రూ.94 రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో 3 GB హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. 200 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంత తక్కువ ధరలో చాలా ప్రయోజనాలను అందించే జియో, ఎయిర్‌టెల్‌ నుంచి ప్రస్తుతం అలాంటి రీఛార్జ్ ప్లాన్ ఏదీ లేదు. వోడాఫోన్‌ ఐడియా-ఎయిర్‌టెల్ 4జీబీ డేటాను అందించే రూ.95 రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. అయితే దీని వాలిడిటీ 14 రోజులు మాత్రమే. అయితే ఇటీవల కూడా చాలా ప్లాన్స్‌ ప్రకటించింది బీఎస్‌ఎన్‌ఎల్‌.

1999 రూ ప్లాన్:

అదే కాకండా రూ.1999 ప్లాన్‌ కూడా తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లోఒక సంవత్సరం వ్యాలిడిటీ పొందవచ్చు. ఇది అపరిమిత కాలింగ్, 600జీబీ 4G డేటాను అందిస్తుంది. ఈ రీఛార్జ్ కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్‌తో సహా బహుళ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి..

Link to comment
Share on other sites

  • 0

Popular Smart TV’s: ఆ స్మార్ట్ టీవీలతో మీ ఇల్లు మరింత స్మార్ట్.. మార్కెట్‌లో ఎక్కువగా ఏ టీవీలు అమ్ముడవుతున్నాయంటే..?

స్లో రిఫ్రెష్ రేట్లు, బ్లర్డ్ విజువల్స్‌తో తక్కువ నాణ్యత కంటెంట్‌ని అందించే టీవీలకు ఇటీవల రోజుల్లో కాలం చెల్లింది. పెరిగిన టెక్నాలజీతో అధిక పిక్సెల్‌ రిజుల్యూషన్‌తో వచ్చే టీవీలు ప్రజలను మరింత ఆకట్టుకుంటున్నాయి. మెరుగైన పిక్చర్ క్వాలిటీతో పాటు సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న టీవీలను అమితంగా ఇష్టపడుతున్నారు. అంతర్నిర్మిత పవర్ సేవింగ్ ఫీచర్‌తో వచ్చే ఈ టీవీలు యూహెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడయ్యే టీవీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

haier-55-inches.jpg?w=1280&enlarge=true

హాయర్ 55 అంగుళాల టీవీ 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 4కేతో స్మార్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. స్పష్టత, మృదువైన విజువల్స్ కోసం మోషన్ బ్లర్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ గూగుల్ టీవీ 178 వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో కూడా వస్తుంది. ఈ టీవీ అల్ట్రా హై డెఫినిషన్ మోడ్‌లు మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ టీవీ ధర రూ. 38,990గా ఉంది.

lg-ultra-hd-43.jpg

ఎల్‌జీ అల్ట్రా హెచ్‌డీ టీవీ 43 అంగుళాల స్టాండింగ్ స్క్రీన్ పరిమాణంతో వస్తుంది. ఈ టీవీ మధ్యస్థ-పరిమాణ బెడ్‌రూమ్‌లకు మంచి ఎంపిక. ఎల్ఈడీ స్క్రీన్‌తో వచ్చే ఈ టీవీ అతి తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మోషన్ బ్లర్‌‌తో పాటు అధిక ఫ్రీక్వెన్సీ సంగీతంతో పాటు నాణ్యతను మెరుగుపరిచే ఏఐ సౌండ్ ప్రోతో వచ్చే ఈ టీవీ ధర రూ. 31,990

mi-43-inches.jpg

ఎంఐ 43 అంగుళాల స్మార్ట్ టీవీ అల్ట్రా హై డెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తుంది. గూగుల్ 4కేకు సపోర్ట్ చేసే ఈ టీవీ సినిమాటిక్ సౌండ్, ఎన్వలపింగ్ అనుభవం కోసం డాల్బీ ఆడియోతో 30 వాట్స్ స్పీకర్లతో వస్తుంది. ముఖ్యంగా ఈ స్పీకర్లు ప్లేబ్యాక్ సౌండ్‌లను కూడా మెరుగుపరుస్తాయి. వైఫై కనెక్ట్ చేసేలా వస్తున్న ఈ టీవీ ధర రూ. 26,499గా ఉంది.

redmi-43-inches.jpg

రెడ్‌మీ ఎల్ఈడీ ఫైర్ టీవీ 43 అంగుళాల స్టాండింగ్ స్క్రీన్ సైజుతో వస్తుంది. ఈ టీవీ చిన్న, మధ్యస్థ పరిమాణ గదులకు మంచి ఎంపికగా ఉంటుంది. 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో వచ్చే ఈ 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ టీవీ ప్రధాన స్ట్రీమింగ్ యాప్‌లను ఆశ్వాదించవచ్చు. స్క్రీన్ కాస్టింగ్ ఫీచర్‌ రావడం వల్ల స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేయడంతో పాటు ఈ టీవీ గేమ్‌లు ఆడవచ్చు. 24 వాట్స్ స్పీకర్లతో వచ్చే ఈ టీవీ ధర రూ. 23,999గా ఉంది.

tcl-43-inches.jpg

టీసీఎల్ స్మార్ట్ గూగుల్ టీవీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్‌తో వచ్చే ఈ టీవీలో మొబైల్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల నుంచి కంటెంట్‌ను ప్లే చేయవచ్చు. హై పెనెట్రేషన్ స్క్రీన్ డిస్ప్లే‌ ఆధారం పని చేసే టీ- స్క్రీన్‌ ఫీచర్‌తో వచ్చే ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 24,990గా ఉంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Samsung: సామ్‌సంగ్ నుంచి బడ్జెట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్స్‌

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్న క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌, రెడ్‌మీ వంటి ఫోన్‌లకు పోటీనిస్తూ మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్‌35 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

samsung-2.jpg?w=1280&enlarge=true

సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎం సిరీస్‌లో భాగంగా గ్యాలక్సీ ఎమ్‌35 ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే.

samsung-galaxy-m35-5g-featu.jpg

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌35 5జీ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.ఇక ఈ ఫోన్‌లో 6.6 ఇంచస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌ 100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

ఇక ఈ ఫోన్ ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 130 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఈ స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా విక్టస్‌+ ప్రొటెక్షన్‌ను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై 6, బ్లూటూత్‌ 5.3, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌,8 మెగాపిక్సెల్స్‌ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌తో కూడిన ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మూడు స్టోరేజీ వేరియంట్లలో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.19,999.. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.21,499, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ అమ్మకాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా అన్ని ఆఫర్స్‌ కలుపుకొని రూ. 3 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

Link to comment
Share on other sites

  • 0

Motorola Edge 50 Neo: మార్కెట్లోకి స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ ధరలోనే..

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ మోటోరోలా మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

moto.jpg?w=1280&enlarge=true

మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, మోటోరోలా ఎడ్జ్5o ప్రోకి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

మోటోరాలో ఎడ్జ్‌ 50 నియో ఫోన్‌ను 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ధర విషయానికొస్తే 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 23,999 కాగా, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,999గా నిర్ణయించినట్లు సమాచారం.

ఈ ఫోన్‌ను గ్రే, బ్లూ, పోయిన్సియానా, మిల్క్ కలర్స్‌లో లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌తో కూడిన పీ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1300నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్‌ స్క్రీన్‌ను అందించనున్నారు.

అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్‌లో ఐపీ68 వాటర్‌ రెసిస్టెంట్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ 6879 డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

  • 0

Realme Watch S2: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్‌.. లగ్జరీ లుక్స్‌, స్టన్నింగ్‌ ఫీచర్స్‌..

ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌వాచ్‌ల హవా నడుస్తోంది. అధునాతన ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజాలు మార్కెట్లోకి తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రియల్‌మీ కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

new-watch.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీవాచ్‌ ఎస్‌2 పేరుతో ఈ వాచ్‌ను లాంచ్‌ చేశారు. తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ లుక్స్‌తో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

realme-10.jpg

రియల్‌మీ వాచ్‌ ఎస్‌2 వాచ్‌ను జులై 30వ తేదీన మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. రియల్‌మీ 13 ప్రో సిరీస్‌తో పాటు ఈ వాచ్‌ను తీసుకొస్తున్నారు. ఈ వాచ్‌లో సర్క్యూలర్‌ డయల్‌తో లాంచ్‌ చేశారు.

realme-watch.jpg

ఇక ఈ వాచ్‌ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 380 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 20 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఇందుకోసం ఏఐ పవర్డ్‌ ఆప్టిమైజేషన్‌ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు.

smart-watch-1.jpg

రియల్‌మీ వాచ్‌ ఎస్‌2లో వాటర్‌ రెసిస్టెంట్‌ కోసం ఐపీ68 రేటింగ్‌ను ఇచ్చారు. 30 నిమిషాల పాటు 1.5 మీటర్ల లోతులో ఉన్నా ఫోన్‌ పనిచేస్తుంది. 1.3 ఇంచెస్‌తో కూడిన సర్క్యూలర్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

tech-news-9.jpg

ఇక ఈ స్మార్ట్‌వాచ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌తో వాయిస్‌ అసిస్టెంట్‌తో చాట్‌ జీపీటీ ఆప్షన్‌ను అందించారు. వాయిస్‌ కమాండ్స్‌తో వాచ్‌ ఫేస్‌లను మార్చుకునే అవకాశం కల్పించారు. ఈ వాచ్‌ను బ్లాక్‌, సిల్వర్‌ కలర్స్‌తో తీసుకొచ్చారు.

Link to comment
Share on other sites

  • 0

Jio Bharat J1 4G: యూపీఐ, లైవ్‌ టీవీతో పాటు మరెన్నో ఫీచర్లు.. రూ. 1799కే 4జీ ఫోన్‌

టెలికం రంగంలో జియో సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు ఇంటర్‌నెట్ ధరలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన జియో. ఆ తర్వాత తక్కువ ధరలో ఫోన్‌లను కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు స్మార్ట్‌ ఫోన్‌లతో పాటు, ఫీచర్‌ ఫోన్‌లను తీసుకొచ్చిన జియో.. తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. జియో భారత్‌ జీ1 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్లు, ధర వివరాలు..

jio-7.jpg?w=1280&enlarge=true

ప్రముఖ టెలికం రంగ సంస్థ జియో మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. జియో భారత్ బీ1 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. పేరుకు స్మార్ట్‌ఫోన్‌ కాకపోయినా స్మార్ట్‌ ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సరికొత్త డిజైన్‌, ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో యూపీఐ సేవలను పొందొచ్చు. అలాగే జియోపేతో పేమెంట్స్‌ కూడా చేసుకోవచ్చు. కంటెంట్‌ స్ట్రీమింగ్ కోసం జియో సినిమాకు కూడా సపోర్ట్ చేస్తుంది. మెరుగైన అవుట్‌ డిస్‌ప్లేను ఇందులో అందించారు.

ధర విషయానికొస్తే జియో భారత్‌ జీ1 4జీ ఫోన్‌ ధరను రూ. 1799గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను సింగిల్ బ్లాక్/గ్రే కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో లభిస్తోంది

jio-4g-phone-feature.jpgఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 2.8 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఇందులో 2500 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో గల బ్యాటరీని అందించారు. దీంతో మెరుగైన ఛార్జింగ్‌ లభిస్తుంది. స్టాండ్‌ బై లో ఈ ఫోన్‌ రెండు రోజులు ఛార్జింగ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

అయితే ఈ ఫోన్‌లో కేవలం జియో సిమ్‌ మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. ఇతర సిమ్‌లను ఉపయోగంచడం కుదరదు. బడ్జెట్‌లో ధరలో లైవ్‌ టీవీ, యూపీఐ పేమెంట్స్‌ కోసం ఫోన్‌ చూస్తున్న వారికి జియో బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

Link to comment
Share on other sites

  • 0

Realme noise cancellation earbuds: రియ‌ల్‌మీ నుంచి స్ట‌న్నింగ్ ఇయ‌ర్ బ‌డ్స్‌.. బ‌య‌ట ఎన్ని శ‌బ్ధాలు వ‌చ్చినా..

ప్ర‌స్తుతం వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది వీటిని కొనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఇయ‌ర్ బ‌డ్స్ కొనుగోలు చేసే ముందే చూడాల్సిన ప్ర‌ధాన అంశాల్లో వాయిస్ క్యాన్సిలేష‌న్‌. ఈ ఫీచ‌ర్ ఉన్న ఇయ‌ర్ బ‌డ్స్ మంచి అనుభూతిని అందిస్తాయి. తాజాగా ఇలాంటి ఫీచ‌ర్‌తోనే మార్కెట్లోకి కొత్త ఇయ‌ర్ బ‌డ్ వ‌చ్చింది..

earbuds.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం రియ‌ల్ భార‌త మార్కెట్లోకి కొత్త ఇయ‌ర్ బ‌డ్స్‌ను లాంచ్ చేసింది. రియ‌ల్ బ‌డ్స్ టీ310 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్రూలీ వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌లో అధునాత‌న ఫీచ‌ర్ల‌ను త‌క్క‌వ ధ‌ర‌లోనే తీసుకొచ్చారు.

realme.jpg

ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఇందులో 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్‌లు, AI-బ్యాక్డ్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సపోర్ట్‌ను ఇచ్చారు. ఈ ఇయర్ బడ్స్ గరిష్టంగా 46dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు 360-డిగ్రీల సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. దీంతో నాణ్య‌మైన వాయిస్‌ను వినొచ్చు.

realme-buds-t310.jpg

ఇక ఈ ఇయ‌ర్ బ‌డ్స్‌ను రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయల్ డివైజ్ కనెక్టింగ్ ఆప్షన్‌తో తీసుకొచ్చారు. ఛార్జింగ్ విష‌యానికొస్తే చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 40 గంటల వరకు ప‌వ‌ర్ బ్యాక‌ప్ ల‌భిస్తుంది. ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆన్‌లో ఉంటే, 26 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ వస్తుంది.

realme-ear-buds-price.jpg

ఈ ఇయ‌ర్‌బ‌డ్స్‌ను కేవలం 10 నిమిషాల చార్జ్‌తో 5 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయ‌ని కంపెనీ చెబుతోంది. ఇక ఇందులో స్మార్ట్ ట‌చ్ కంట్రోలింగ్ ఫీచ‌ర్‌ను అందించారు. ఆగ‌స్టు 5వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభ‌మ‌య్యాయి.

realme-ear-bus-features.jpg

అలాగే వీటిలో దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్ష‌న్ కోసం ఐపీ55 రేటింగ్‌ను ఇచ్చారు. ఎజైల్ వైట్, మోనెట్ ప‌ర్పుల్‌, వైబ్రంట్ బ్లాక్ క‌ల‌ర్స్‌లో తీసుకొచ్చారు. ధ‌ర విష‌యానికొస్తే ఈ ఇయ‌ర్ బ‌డ్స్ రూ. 2499కి అందుబాటులో ఉన్నాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...