Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

Good Phones, Plans, Watches, Tablets, Gadgets, Laptops and TVs in India in 2024


TELUGU

Question

Reliance Jio new plan with 90-day validity: 90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన జియో

29-04-2024 Mon 16:26 | Business

రోజుకు 2 జీబీ.. అదనంగా మరో 20 జీబీ డేటా

రూ.749 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ

జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్న టెలికం దిగ్గజం

cr-20240429tn662f7cde6fb06.jpg

దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్ బేస్ కలిగివున్న దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో సాధారణ ఆఫర్లతో పోల్చితే యూజర్లకు అధిక డేటా లభిస్తోంది. ఆఫర్‌లో రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటాను జియో అందిస్తోంది. మొత్తం 200 జీబీల డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఉచిత కాలింగ్, ఎంఎస్‌ఎంలు, ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి.

ఇక ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. 5జీ మొబైల్ కలిగివుండి కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ యాక్సెస్ ఉంటే అదనపు డేటాను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఆఫర్ కింద జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌లకు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 90 రోజులపాటు ఈ సేవలను పొందవచ్చు.

కాగా తక్కువ రేటుతో సాధ్యమైనన్ని గరిష్ఠ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా జియో ఇటీవలే రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అనేక వర్గాలుగా విభజించింది. అందులో భాగంగా ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా భారత్‌లో అత్యధికంగా 45 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లను జియో కలిగివుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా జియో కొనసాగుతోంది.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Amazon Sale: Top brand laptops at 45% discount - టాప్ బ్రాండ్ ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 45శాతం ఆఫర్.. త్వరపడండి..

టాప్ బ్రాండ్లు అయిన లెనోవో, డెల్, అసుస్, హెచ్‌పీ, యాసర్ వంటి వాటిపై ఏకంగా 45శాతం వరకూ తగ్గింపు డీల్స్ ను అమెజాన్ అందిస్తోంది. వీటిల్లో అత్యాధునిక ఫీచర్లు, బెస్ట్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అమెజాన్లో మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగించి లావాదేవీ చేస్తే మరో 10శాతం అదనపు తగ్గింపును పొందొచ్చు.

Laptops

laptops-1.jpg?w=1280

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 ప్రారంభమైంది. దీనిలో అన్ని రకాల వస్తువులపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ కథనంలో చీప్ అండ్ బెస్ట్ ల్యాప్ టాప్ ల గురించి తెలుసుకుందాం. టాప్ బ్రాండ్లు అయిన లెనోవో, డెల్, అసుస్, హెచ్‌పీ, యాసర్ వంటి వాటిపై ఏకంగా 45శాతం వరకూ తగ్గింపు డీల్స్ ను అమెజాన్ అందిస్తోంది. వీటిల్లో అత్యాధునిక ఫీచర్లు, బెస్ట్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అమెజాన్లో మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగించి లావాదేవీ చేస్తే మరో 10శాతం అదనపు తగ్గింపును పొందొచ్చు.

లెనోవో వీ15 జీ2 ల్యాప్ టాప్..

ఇది అత్యంత చవకైన ల్యాప్ టాప్. విద్యార్థుల అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. ఇది 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్డీ, రోజువారీ పనులకు సున్నితమైన పనితీరును అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. గరిష్టంగా 6.5 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఈథర్నెట్ కనెక్టివిటీ, డాల్బీ ఆడియోతో వస్తుంది. దీనిని అమెజాన్ లో కేవలం రూ. 24,449కే కొనుగోలు చేయొచ్చు.

అసుస్ వివోబుక్ గో 13(2023)..

ఇది విద్యార్థుల కోసం ఉద్దేశించిన ల్యాప్ టాప్. చవకైన ధరకే లభ్యమవుతుంది. ఇది 14-అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను అందిస్తుంది, ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్డీ సామర్థ్యంతో ఉంటుంది. కేవలం 1.3 కిలోల బరువు, ఇది అత్యంత పోర్టబుల్ గా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. విండోస్ 11 హోమ్‌తో ప్రీలోడెడ్ అయి వస్తుంది. యాంటీ-గ్లేర్ స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మంచి అనుభూతిని అందిస్తాయి. దీని ధర అమెజాన్ సేల్లో రూ. 22,749గా ఉంది.

డెల్15 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్..

మంచి పనితీరు, పోర్టబిలిటీని కోరుకునే ప్రొఫెషనల్స్ కి ఇది సరిగ్గా సరిపోతుంది. దీనిలో 12వ తరం ఇంటెల్ కోర్ ఐ3-1215యూ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ (16జీబీ వరకూ విస్తరించుకోవచ్చు. 512జీబీ ఎస్ఎస్డీ ఫీచర్‌తో వస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేతో స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది. విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ 2021, మెక్ఏఫీ సెక్యూరిటీతో ప్రీలోడ్ అయి వస్తుంది. దీని ధర అమెజాన్ సేల్లో రూ. 33,990గా ఉంది.

లెనోవో ఐడియా ప్యాడ్ గేమింగ్ 3 ల్యాప్ టాప్..

బడ్జెట్ లిమింట్ ఉండాలనుకునే గేమింగ్ ప్రియులకు ఇది సరిగ్గా సరిపోతుంది. దీనిలో ఏఎండీ రైజన్ 5 5500హెచ్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది. 144హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్‌ప్లే తో శక్తివంతమైన విజువల్స్‌ను నిర్ధారిస్తుంది. ఎన్విడా ఆర్టీఎక్స్ 2050 4జీబీ గ్రాఫిక్స్ కార్డుతో వస్తుంది. విండోస్ 11, అలెక్సా, మూడు నెలల గేమ్ పాస్ తో లోడ్ అయి వస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 44,990గా ఉంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Flipkart Sale: 6GB RAM smartphone for Rs.6,000 only - ఆరు వేలకే 8జీబీ ర్యామ్ ఫోన్.. ఫ్లిప్ కార్ట్‌లో ఆఫర్ మిస్ కాకండి..

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాగ్‌ షిప్‌ సేల్‌ను ప్రారంభించింది. దీనిలో అన్ని వస్తువులపై ఫ్రీడమ్‌ డీల్స్‌ను అందిస్తోంది. అతి తక్కువ ధరలోనే ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను కూడా అందిస్తోంది. వాటిల్లో స్మార్ట్‌ ఫోన్లు కూడా ఉన్నాయి. ఆ డీల్స్‌ అన్నింటిలోనూ ఆసక్తికరంగా కనిపిస్తోంది మోటోరోలా జీ సిరీస్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్‌. దీని గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

Motorola G04s

motorola-g04s.jpg?w=1280

ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాగ్‌ షిప్‌ సేల్‌ను ప్రారంభించింది. దీనిలో అన్ని వస్తువులపై ఫ్రీడమ్‌ డీల్స్‌ను అందిస్తోంది. అతి తక్కువ ధరలోనే ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను కూడా అందిస్తోంది. వాటిల్లో స్మార్ట్‌ ఫోన్లు కూడా ఉన్నాయి. ఆ డీల్స్‌ అన్నింటిలోనూ ఆసక్తికరంగా కనిపిస్తోంది మోటోరోలా జీ సిరీస్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్‌. దీని గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఈ బంపర్‌ డీల్‌లో మోటోరోలా జీ 04ఎస్ ఫోన్ ని మీరు కేవలం రూ. 6,999కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాక ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా లావాదేవీ చేస్తే మరో 5శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలతో పాటు అసలు మోటోరోలా జీ 04ఎస్ ఫీచర్లు ఏంటి? స్పెసిఫికేషన్లు ఏంటి? తెలుసుకుందాం రండి..

రూ. 247ఈఎంఐతో ఫోన్..

నెలకు రూ. 247తో మీరు ఈమోటోరోలా జీ04ఎస్ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ చేంజ్ ఆఫర్లో మీరు దీనిపై మరో రూ. 950 వరకూ తగ్గించవచ్చు. అయితే ఈ తగ్గింపు మీ ఎక్స్ చేంజ్ చేసే పాత ఫోన్, దాని బ్రాండ్, ఆ ఫోన్ పరిస్థితి ఆధారంగా ఉంటుంది. మొత్తం మీద దీనిని మీరు కేవలం రూ. 6,050కే కొనుగోలు చేయొచ్చు. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వార మరో 5శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందొచ్చు.

మోటోరోలా జీ04ఎస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

మోటోరోలా జీ04ఎస్ లో 720×1612 పిక్సెల్ రిజల్యూషన్ తో కూడిన 6.56 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ ప్యానెల్ ఉంటుంది. ఫోన్లో అందిస్తున్న ఈ డిస్ప్లే 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. డిస్ ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కూడాఉంటుంది. ఇది 4 జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ర్యామ్ బూస్ట్ మ్యాక్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దీంతో మరో 4జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే మొత్తం 8జీబీ వరకూ ర్యామ్ మనకు అందుబాటులో ఉంటుంది. ఫోన్ ప్రాసెసర్ గురించి చూస్తే.. దీనిలో దీనిలో యూనిసెక్ టీ606 ప్రాసెసర్ ఉంటుంది. 1టీబీ వరకూ మైక్రో ఎస్డీ కార్డు మద్దతు ఉంటుంది. ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్ తో ఉంటుంది. సెల్ఫీ కోసం ఈ ఫోన్లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ సామర్థ్యాన్ని పరిశీలిస్తే 5000ఎంఏహెచ్ ఉంటుంది. ఇది 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం, ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఓఎస్ విషయానికొస్తే, ఆండ్రాయిడ్-14 ఆధారంగా పనిచేస్తుంది. ఆడియో కూడా డాల్బీ అట్మోస్ క్లారిటీతో వస్తుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

HP Chromebook for Rs.19,000: రూ. 19 వేలలో సూపర్ ల్యాప్‌టాప్‌.. హెచ్‌పీ కంపెనీ..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాగ్‌షిప్‌ ఇండిపెండెన్స్‌ సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా గృహోపకరణాలు మొదలు, అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వరకు భారీ డిస్కౌంట్‌ లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగానే ల్యాప్‌టాప్స్‌పై కూడా ఊహకందని తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. ఇలాంటి ఓ బెస్ట్ ల్యాప్‌టాప్‌ డీల్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

hp-chromebook.jpg?w=1280

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం ఎంత ఎక్కువైందో, ల్యాప్‌టాప్‌ల ఉపయోగం కూడా అదే స్థాయిలో పెరిగింది. మరీ ముఖ్యంగా కరోనో తదనంతర పరిణామాల తర్వాత ల్యాప్‌టాప్‌ల వినియోగం ఎక్కువైంది. ఇక కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతోన్న సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లపై ఊహకందని డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాగ్‌షిప్‌ ఇండిపెండెన్స్‌ సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా గృహోపకరణాలు మొదలు, అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వరకు భారీ డిస్కౌంట్‌ లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగానే ల్యాప్‌టాప్స్‌పై కూడా ఊహకందని తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. ఇలాంటి ఓ బెస్ట్ ల్యాప్‌టాప్‌ డీల్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌పీ కంపెనీ చెందిన క్రోమ్‌ బుక్‌పై మంచి ఆఫర్‌ లభిస్తోంది. హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ 2024 మోడల్‌ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 25,450గా ఉండగా, ప్రస్తుతం సేల్‌లో భాగంగా 17 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 20,990కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేదు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1800 వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ లెక్కన ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ. 19వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఇక హెచ్‌పీ క్రోముక్‌2024 ల్యాప్‌టాప్‌ ఫీచర్ల విషయానికొస్తే. ఇందులో.. మీడియాటెక్‌ ఎమ్‌టీ8183 ప్రాసెసర్‌ను అందించారు. 11.6 ఇంచెస్‌ హెచ్‌డీ ఎల్‌ఈడీ బ్యాక్‌క్లిట్‌ యాంటీ గ్లేజర్‌ డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను ఇండిగో, బ్లూ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఇక ఈ ల్యాప్‌టాప్‌ బరువు 1.7 కేజీలుగా ఉంది. ఇక ఇందులో 4జీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ కెపాసిటీని అందించనున్నారు.

Link to comment
Share on other sites

  • 0

Samsung Galaxy Z Fold6 costs as much as a second hand car! ఈ ఫోన్‌ ధరతో, ఎంచక్కా సెకండ్ హ్యాండ్‌ కారే కొనొచ్చు. ప్రైజ్‌ ఎంతో తెలిస్తే..

ఓవైపు బడ్జెట్ ఫోన్‌లతో పాటు, మరోవైపు ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లకు సైతం మార్కెట్లో డిమాండ్ ఉంటోంది. ఒకప్పుడు రూ. 50 ఫోన్‌ అంటేనే వామ్మో అనుకునే వాళ్లం, కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌ ధరలు లక్షలు దాటేసింది. తాజాగా సామ్‌సంగ్ నుంచి వచ్చిన కొత్త ఫోన్‌ ధర ఎంతో తెలిస్తే అవాక్కవాల్సిందే..

samsung-1.jpg?w=1280&enlarge=true

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ ఇటీవల మార్కెట్లోకి గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్‌6 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. అయితే ఈ ఫోన్‌ ధరతో ఎంచక్కా ఒక సెకండ్ హ్యాండ్‌ కారునే కొనుగోలు చేయొచ్చు.

సామ్‌సంగ్ గ్యాలక్సీ జెడ్‌ ఫోల్డ్‌6 స్మార్ట్‌ఫోన్‌.. 12జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అక్షరాల రూ. 2,00,999కావడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోన్‌ను పలు బ్యాంకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 15 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

samsung-2-lakhs-phone.jpg

ఇంతకీ రూ. 2 లక్షల ధర పలికే ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనేగా మీ సందేహం. వివరాల్లో వెళితే.. ఇది ఒక మడతపెట్టే ఫోన్‌. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 వంటి పవర్ ఫుల్‌ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 2 లిథియం బ్యాటరీలను అందించారు.

స్క్రీన్‌ విషయానికొస్తే ఈ ఫోన్‌లో ఫోల్డబుల్ డైనమిక్‌ ఎల్‌టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 7.6 ఇంచెస్‌తో స్క్రీన్‌ ఈ ఫోన్‌ సొంతం. అలాగే 6.3 ఇంచెస్‌తో కూడిన కవర్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

tech-news-3.jpg

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌, 10 మెగాపిక్సెల్‌, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 10 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా చూస్తే సౌడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

JioTag Air: ఈ ట్యాగ్ ఉంటే చాలు.. మీ వస్తువులు సేఫ్‌..

బైక్‌ ఎక్కడో పెట్టేస్తాం మర్చిపోతాం, వ్యాలెట్‌ కూడా అంతే పదే పదే వెతక్కుంటుంటాం. అయతే ఇలాం పదే పదే మర్చిపోయే వస్తువులు మిస్‌ అవ్వకుండా ఉండేందుకు కూడా ఓ స్మార్ట్‌ గ్యాడ్జెట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే యాపిల్ వంటి సంస్థలు ఈ ట్యాగ్‌ను తీసుకురాగా.? జియో కూడా దీన్ని లాంచ్‌ చేసింది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన ఈ ట్యాగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

air-tag.jpg?w=1280&enlarge=true

తరచూ వస్తువులను ఎక్కడ పెట్టామో మరిచిపోయే వారికి ఉపయోగపడేలా ఈ డివైజ్‌ను తీసుకొచ్చారు. జియో ట్యాగ్ పేరుతో ఈ గ్యాడ్జెట్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాగ్‌ను కంపెనీ బ్లూ, గ్రే, రెడ్ కలర్స్‌లో లాంచ్‌ చేశారు.

ప్రస్తుతం ఈ జియో ట్యాగ్‌ జియో మార్ట్‌తో పాటు రియలన్స్‌ డిజిటల్‌, అమెజాన్‌ ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికొస్తే జియోట్యాగ్‌ ఎయిర్‌ ధరను రూ. 1499గా నిర్ణయించారు.

ఇంతకీ ఈ ట్యాగ్ ఎలా పనిచేస్తుందంటే. ఆండ్రాయిడ్ యూజర్లు జియో థింగ్స్‌ యాప్‌ సహాయంతో ఈ డివైజ్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే యాపిల్‌ యూజర్లు ఫైండ్‌ మై నెట్‌వర్క్‌ యాప్‌ ద్వారా ఈ డివైజ్‌ను వాడొచ్చు.

reliance-jio-1.jpg

ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్‌ 14, ఆపై ఆపరేటింగ్ సిస్టమ్‌ ఫోన్‌లకు ఈ ఫోన్‌ పనిచేస్తుంది. జియో ట్యాగ్‌ బ్లూటూత్‌ 5.3తో పనిచేస్తుంది. ఇందులో ఇన్‌బిల్ట్‌గా స్పీకర్‌ అందించారు. దీంతో సౌండ్‌ ఆధారంగా ఈ వస్తువులు ఎక్కడున్నాయో కనిపెట్టొచ్చు.

ఇందులో అందించిన ఇన్‌ బిల్ట్ స్పీకర్‌ 90-120 db రేంజ్‌తో శబ్దం చేస్తుంది. ఈ చిన్న డివైజ్‌ బరువు కేవలం 10 గ్రాములే కావడం విశేషం. ఇందులోని వేసే బ్యాటరీ ఏడాది పాటు పనిచేస్తుంది. ఒకవేళ మీ వస్తువు ఫోన్‌ పరిధికి దూరంగా వెళ్తే వెంటనే మీకు అలర్ట్‌ వస్తుంది.

Link to comment
Share on other sites

  • 0

Infinix Xpad tablet: భారత మార్కెట్లోకి మరో కొత్త ట్యాబ్‌.. తక్కువ ధరలో, అద్భుతమైన ఫీచర్స్‌..

స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలన్నీ ట్యాబ్లెట్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే అన్ని దిగ్గజ సంస్థలు మార్కెట్లోకి ట్యాబ్లెట్స్‌ను తీసుకురాగా.. తాజాగా మరో ఎలక్ట్రానిక్‌ సంస్థ ఇన్‌నిఫిక్స్‌ కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమమవుతోంది. ఇన్‌ఫినిన్స్‌ ఎక్స్‌ప్యాడ్ పేరుతో ఈ కొత్త ట్యాబ్‌ను తీసుకురానున్నారు. ఇంతకీ ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

infinix-1.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్‌ప్యాడ్‌ పేరుతో కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్స్‌ ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్‌ప్యాడ్ ట్యాబ్లెట్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఈ స్క్రీన్‌ను డిజైన్‌ చేయనున్నారు.

infinix-xpad.jpg

ఇక ప్రాసెసర్ విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 2.2 జీహెచ్‌జెడ్‌ ఆక్టా కోర్‌ సీపీయూతో కూడిన హీలియో జీ99 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇన్‌ఫినిక్స్‌ కొత్త ప్యాడ్‌ను మూడు విభిన్న పవర్‌ మోడ్స్‌లో తీసుకొస్తున్నారని సమాచారం.

ఈ ట్యాబ్‌ను 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్స్‌లో ఈ ట్యాబ్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఇందులో చాట్‌జీపీటీ ఆధారిత ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ను ఇవ్వనున్నారని టాక్‌.

కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 9 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే 18 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Infinix Note 40X: కళ్లు చెదిరే డిజైన్‌తో స్టన్నింగ్ ఫోన్‌.. ధర మాత్రం చాలా తక్కువ

iPhone look-alike for Rs. 15,000

తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు, అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీలు 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో యూజర్లను అట్రాక్ట్‌ చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెంది స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం...

Infinix Note 40x

infinix-note-40x.jpg?w=1280

తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు, అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీలు 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో యూజర్లను అట్రాక్ట్‌ చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెంది స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్‌ నోట్ 40 ఎక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చిన ప్రీమియం లుక్‌తో లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌ చూస్తే అచ్చంగా ఐ ఫోన్‌ను పోలినట్లు ఉండడం ఇవేషం. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. యాపిల్‌ డైనమిక్‌ ఐలాండ్‌ తరహాలోనే డైనమిక్‌ పోర్ట్ ఫీచర్‌ ఈ ఫోన్‌ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ డైనమిక్‌ ఐలాండ్‌లో ఛార్జింగ్‌ యానిమేషన్‌, లో బ్యాటరీ ఇండికేషన్‌, ఫేస్‌ అన్‌లాక్‌ వంటి సమాచాచరం కనిపిస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది ఇక ఈ ఫోన్‌ను 8 జీబీ, 12 జీబీ ర్యామ్‌తో లాంచ్‌ చేశారు. 500 నిట్స్‌ బ్రైట్నెస్‌, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

ఇక సెక్యూరిటీ కోసం ఇందులో ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ అథెంటికేషన్‌ అందించారు డీటీఎస్‌ ఆడియో ప్రాసెసింగ్‌తో కూడిన డ్యుయల్‌ స్పీకర్లు ఇచ్చారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. బ్లూటూత్‌ 5.2, వైఫై 5.0, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇచ్చారు. ఇక ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999 కాగా.. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. బ్యాంక్‌ ఆఫర్లలో భాగంగా రూ. 1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

Link to comment
Share on other sites

  • 0

Jio: 1 GB data per day on Rs.122 plan - జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.122ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా.. పూర్తి వివరాలు!

దేశవ్యాప్తంగా 49 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు తమ ఫోన్లలో రిలయన్స్ జియో సిమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇంత పెద్ద యూజర్ బేస్ కోసం జియో అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్, జియో ఫోన్, జియో ఫోన్ ప్రైమా వినియోగదారుల కోసం జియో వేర్వేరు ప్లాన్‌లను కలిగి ఉంది. జియో ఇటీవల తన..

 
Jio: జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.122ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా.. పూర్తి వివరాలు!

దేశవ్యాప్తంగా 49 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు తమ ఫోన్లలో రిలయన్స్ జియో సిమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇంత పెద్ద యూజర్ బేస్ కోసం జియో అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్, జియో ఫోన్, జియో ఫోన్ ప్రైమా వినియోగదారుల కోసం జియో వేర్వేరు ప్లాన్‌లను కలిగి ఉంది. జియో ఇటీవల తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచింది. కానీ ఇప్పుడు కంపెనీ తన వినియోగదారుల కోసం ఒక గొప్ప ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

మీరు ఖరీదైన రీఛార్జ్‌ల వల్ల కూడా ఇబ్బంది పడుతుంటే చౌకైన ప్లాన్‌ ధర మంచి ప్రయోజనం పొదంవచ్చు. దేశంలో అత్యధికంగా వినియోగదారులలే లక్ష్యంగా జియో లోబడ్జెట్ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుం టోం ది. తక్కువ ఖర్చుతో కూడిన డేటా సొల్యూషన్‌లను కోరుకునే వారి కోసం టెలికాం కంపెనీ అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొస్తుంది.. దీని ధర కేవలం రూ. 122 మాత్రమే.

రూ. 122 ప్లాన్ వల్ల ప్రయోజనాలు ఏంటి?

జియో తీసుకువచ్చిన ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లో రోజు 1జీబీ డేటా 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో కాలింగ్‌, ఎస్‌ఎంస్‌ల సదుపాయం ఉండదని గుర్తించుకోండి. అలాగే ఈ ప్లాన్‌ అందరి కోసం కాదు. కేవలం జియో ఫోన్‌ వాడుతున్న వినియోగదారులకు మాత్రమేనని గుర్తించుకోండి. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉండదు.

రిలయన్స్ జియో ప్రధానంగా తన వినియోగదారులకు తక్కువ ధరల్లో ఎక్కువ డేటా అందించేందుకు రూపొందించింది. జియో ఫోన్‌లపై ఆధారపడే వారికి, ఈ ప్లాన్ తక్కువ ఖర్చుతో డేటా కనెక్షన్‌ని పొందవచ్చు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Fire-Boltt: కెమెరా, 4జీ సిమ్‌, ఇంకా ఎన్నో ఫీచర్స్‌… అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌

ప్రస్తుతం వాచ్‌కు అర్థమే మారిపోయింది. ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకునే గ్యాడ్జెట్‌. కానీ వాచ్‌తో చేయలేని పని అంటూ లేదు. అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కొత్త వాచ్‌ తీసుకొచ్చారు. ఇంతకీ వాచ్‌ ఏంటి.? ఇందులో ఉన్న ఆ ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఫైర్‌ బోల్ట్ భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఫైర్‌బోల్ట్‌ స్నాప్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లో కళ్లు చెదిరే ఫీచర్లను అందించారు.
 

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఫైర్‌ బోల్ట్ భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఫైర్‌బోల్ట్‌ స్నాప్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లో కళ్లు చెదిరే ఫీచర్లను అందించారు.

ఈ స్మార్ట్‌ వాచ్‌లో సెల్ఫీ కెమెరాను అందించడం విశేషం. దీంతో వాచ్‌తోనే వీడియో కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. ఈ ఫోన్‌ 4జీ నానో సిమ్‌ స్లాట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో సిమ్‌ కార్డుతో నేరుగా కాల్స్‌ చేసుకోవచ్చు. ఇక ఈ వాచ్‌లో 2.1 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.
 

ఈ స్మార్ట్‌ వాచ్‌లో సెల్ఫీ కెమెరాను అందించడం విశేషం. దీంతో వాచ్‌తోనే వీడియో కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. ఈ ఫోన్‌ 4జీ నానో సిమ్‌ స్లాట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో సిమ్‌ కార్డుతో నేరుగా కాల్స్‌ చేసుకోవచ్చు. ఇక ఈ వాచ్‌లో 2.1 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

ఈ వాచ్‌కు అచ్చంగా స్మార్ట్ ఫోన్‌లాగే పనిచేస్తుంది. ప్లే స్టోర్‌తో వచ్చే ఈ వాచ్‌లో అన్ని రకాల యాప్స్‌ను డౌనల్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఓటీటీలను కూడా వీక్షించొచ్చు. ఇందులో 1000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.
 

ఈ వాచ్‌కు అచ్చంగా స్మార్ట్ ఫోన్‌లాగే పనిచేస్తుంది. ప్లే స్టోర్‌తో వచ్చే ఈ వాచ్‌లో అన్ని రకాల యాప్స్‌ను డౌనల్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఓటీటీలను కూడా వీక్షించొచ్చు. ఇందులో 1000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇక ఈ వాచ్‌ను 2జీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 2 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వంటి వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. గేమ్స్‌కి కూడా ఈ వాచ్‌ సపోర్ట్ చేస్తుంది.
 

ఇక ఈ వాచ్‌ను 2జీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 2 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వంటి వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. గేమ్స్‌కి కూడా ఈ వాచ్‌ సపోర్ట్ చేస్తుంది.

ధర విషయానికొస్తే ఈ వాచ్‌ అసలు ధర రూ. 24,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ. 5999కే సొంతం చేసుకోవచ్చు. 76 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ పొందొచ్చు.
 

ధర విషయానికొస్తే ఈ వాచ్‌ అసలు ధర రూ. 24,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ. 5999కే సొంతం చేసుకోవచ్చు. 76 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ పొందొచ్చు.

...
 
Link to comment
Share on other sites

  • 0

Vivo T3 Ultra with AI features: వారెవ్వా వివో నయా ఫోన్ అదిరిందిగా.. అబ్బురపరుస్తున్న ఏఐ ఫీచర్స్‌

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. జనాభాకు అనుగుణంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. ఈ నేపథ్యంలో అన్నికంపెనీలు పెరుగుతున్న టెక్నాలజీకు అనుగుణంగా అధునాతన ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు మార్కెట్‌లో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన వివో టీ3 అల్ట్రా 5జీ పేరుతో నయా స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.

 
Vivo T3 Ultra: వారెవ్వా వివో నయా ఫోన్ అదిరిందిగా.. అబ్బురపరుస్తున్న ఏఐ ఫీచర్స్‌
Vivo T3 Ultra 5g

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. జనాభాకు అనుగుణంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. ఈ నేపథ్యంలో అన్నికంపెనీలు పెరుగుతున్న టెక్నాలజీకు అనుగుణంగా అధునాతన ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు మార్కెట్‌లో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన వివో టీ3 అల్ట్రా 5జీ పేరుతో నయా స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మీడియా టెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్ ద్వారా పని చేసే ఈ స్మార్ట్ ఫోన్ ఐపీ68 రేటింగ్ డస్ట్, వాటర్ ప్రొటెక్షన్‌‌తో వస్తుంది. వివో టీ 3 అల్ట్రా 5జీ ఏఐ ఎరేజర్, ఏఐ ఫోటో ఎన్‌హాన్స్ వంటి అనేక ఏఐ ఆధారిత ఫోటో ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలో వివో టీ 3 అల్ట్రా 5జీ స్మార్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

వివో టీ 3 అల్ట్రా 5జీ ఫోన్ 8జీబీ +128 జీబీ వేరియంట్‌లో లాంచ్ చేశారు. అలాగే ఈ ఫోన్ ధర రూ.31,999గా ఉంది. అలాగే 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది.  12 జీబీ + 256 జీబీ వేరియంట్ రూ.35,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో సెప్టెంబర్ 19 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఫోన్ రెండు కలర్స్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఫారెస్ట్ గ్రీన్, లూనార్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 

వివో టీ 3 అల్ట్రా 5జీ ఫోన్ 1.5కే రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల 3డీ కర్వ్డ్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఫన్ టచ్ ఓఎస్ 14పై పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్ 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మద్దుతునిచ్చే 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 921 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాలు ఉన్నాయి. అలాగే ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌లో ‘ఆరా రింగ్ లైట్’ ఆకట్టుకుంటుంది.

Link to comment
Share on other sites

  • 0

Realme Narzo 70 Turbo for under Rs.15,000: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. రూ. 15వేలలోనే..

రియల్‌మీ నార్జో 70 టర్బో ఫోన్‌లో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తోకూడి సామ్‌సంగ్‌ ఐ4 ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇక ఇందులో 45 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. సెప్టెంబర్‌ 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానుంది...

 
Realme Narzo 70 Turbo: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. రూ. 15వేలలోనే..
Realme Narzo 70 Turbo

బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ నెలకొంది. రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రూ. 15 వేల మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కంపెనీలు కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ నార్జో 70 టర్బో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రియల్‌మీ నార్జో 70 టర్బో ఫోన్‌లో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తోకూడి సామ్‌సంగ్‌ ఐ4 ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇక ఇందులో 45 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. సెప్టెంబర్‌ 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ను టర్బో ఎల్లో, టర్బో గ్రీన్‌, టర్బో పర్పుల్‌ కలర్‌లో అందుబాటులోకి రానుంది.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1s80Hz రేట్, 1s80Hz రేట్ స్క్రీన్‌ను అందించారు. 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇందులో ప్రత్యేకంగా రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక 12జీబీ వరకు ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ద్వారా పవర్‌ను అందిస్తున్నారు. వర్చువల్‌గా 26 జీబీ వరకు మెమోరీని పెంచుకోవచ్చు. గేమ్స్‌కు సపోర్ట్‌ చేసేలా ఈ ఫోన్‌లో 6,050ఎమ్ఎమ్ చదరపు స్టెయిన్‌లెస్ స్టీల్ స్టీమ్ కూలింగ్ అందిస్తోంది. దీంతో ఫోన్‌ వేడెక్కదు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. అలాగే 2 ఎంపీతో కూడిన పోర్ట్రెయిట్ కెమెరాను ఇచచారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిస్తున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, బెయిడూ, గెలిలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, వై-ఫై వంటి ఫీచర్లను అందించనున్నారు. ఇక సెక్యూరిటీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు అందించారు.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌ బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతానికి పెరుగుతుంది. ధర విషయానికొస్తే రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 16,999కు లభించనుంది. ఇక 8జీబీ + 128జీబీ, 12జీబీ + 256జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 17,999, రూ. 20,999గా నిర్ణయించారు. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 2000 డిస్కౌంట్‌ లభించనుంది. దీంతో ఈ ఫోన్‌ స్టార్టింగ్ వేరియంట్‌ రూ. 15 వేలకే లభిస్తుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...