Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

Good Phones, Plans, Watches, Tablets, Gadgets, Laptops and TVs in India


TELUGU

Question

Reliance Jio new plan with 90-day validity: 90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన జియో

29-04-2024 Mon 16:26 | Business

రోజుకు 2 జీబీ.. అదనంగా మరో 20 జీబీ డేటా

రూ.749 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ

జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్న టెలికం దిగ్గజం

cr-20240429tn662f7cde6fb06.jpg

దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్ బేస్ కలిగివున్న దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో సాధారణ ఆఫర్లతో పోల్చితే యూజర్లకు అధిక డేటా లభిస్తోంది. ఆఫర్‌లో రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటాను జియో అందిస్తోంది. మొత్తం 200 జీబీల డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఉచిత కాలింగ్, ఎంఎస్‌ఎంలు, ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి.

ఇక ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. 5జీ మొబైల్ కలిగివుండి కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ యాక్సెస్ ఉంటే అదనపు డేటాను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఆఫర్ కింద జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌లకు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 90 రోజులపాటు ఈ సేవలను పొందవచ్చు.

కాగా తక్కువ రేటుతో సాధ్యమైనన్ని గరిష్ఠ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా జియో ఇటీవలే రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అనేక వర్గాలుగా విభజించింది. అందులో భాగంగా ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా భారత్‌లో అత్యధికంగా 45 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లను జియో కలిగివుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా జియో కొనసాగుతోంది.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Vivo Pad 3: వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..

ప్రస్తుతం మార్కెట్లో ట్యాబ్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఓటీటీ వీడియోలు స్ట్రీమింగ్‌, గేమింగ్‌తో పాటు ఎడ్యుకేషన్‌ పరంగా ట్యాబ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో మార్కెట్లోకి కొంగొత్త ట్యాబ్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వివో కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. వివో ప్యాడ్‌ 3 పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. ఈ ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

vivo.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చారు. వివో ప్యాడ్ 3 టాబ్లెట్ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను చైనా మార్కెట్‌లో లాంచ్‌ చేశారు. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ట్యాబ్‌ను తీసుకురానున్నారు.

vivo-pad-3.jpg

ఈ ట్యాబ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జనరేషన్‌ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 12.1 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇచ్చారు. 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 600నిట్స్ బ్రైట్‌నెస్‌ని ఇచ్చారు.

vivo-pad-3-features.jpg

ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ పనిచేస్తుంది. ఇందులో 44 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 10,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 28,700, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 35 వేలకిపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

vivo-pad-3-price.jpg

కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ ట్యాబ్‌ బరువు 589.2 గ్రాములుగా ఉంది.

vivo-tablet.jpg

కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వై-ఫై 6, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. యూఎస్‌బీ 3.2 జనరేషన్ 1 టైప్-సి పోర్ట్‌ను అందించారు.

Link to comment
Share on other sites

  • 0

Samsung Galaxy F54: సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే..

సౌత్‌ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ప్రీమియం సెగ్మెంట్‌తో పాటు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది సామ్‌సంగ్‌. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌54 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు...

samsung-galaxy-f54.jpg?w=1280

సౌత్‌ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ప్రీమియం సెగ్మెంట్‌తో పాటు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది సామ్‌సంగ్‌. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌54 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్‌54 స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ ఎక్సినోస్‌ 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ స్కానర్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇక ఈ సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌54లో బ్యాటరీకి పెద్ద పీట వేశారు. ఇందులో ఏకంగా 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వడం విశేషం. ఈ ఫోన్‌ కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇక ఫోన్‌ను ఎంత నాన్‌ స్టాప్‌గా ఉపయోగించినా 8 గంటల బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుంది.

8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం. కెమెరాకు కూడా ఇందులో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కెమెరా క్లారిటీ విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో మంచి టచ్‌ అనుభూతి కోసం సూపర్‌ స్మూత్ అనుభూతితో పాటు శక్తివంతమైన టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను తీసుకొచ్చారు. ఈ కెమెరాతో 4కే రిజల్యూషన్‌ వీడియోను చిత్రీకరించవచ్చు. ఇక ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24000గా నిర్ణయించారు. ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.

Link to comment
Share on other sites

  • 0

Flipkart Sale on Smart Phones: ఫ్లిప్‌కార్ట్‌లో ఊహకందని ఆఫర్స్‌.. స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బచాత్‌ డేస్‌ సేల్‌ పేరుతో మంచి సేల్‌ను అందిస్తోంది. జూల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సేల్‌ 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌ భాగంగా స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు. అన్ని రకాల స్మార్ట్ ఫోన్‌ల ధరలను తగ్గించారు. అలాగే తక్కువ మొత్తంలో నెలవారీ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను అందించారు...

flipkart-sale.jpg?w=1280

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బచాత్‌ డేస్‌ సేల్‌ పేరుతో మంచి సేల్‌ను అందిస్తోంది. జూల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సేల్‌ 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌ భాగంగా స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు. అన్ని రకాల స్మార్ట్ ఫోన్‌ల ధరలను తగ్గించారు. అలాగే తక్కువ మొత్తంలో నెలవారీ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను అందించారు. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా ఏయే స్మార్ట్‌ ఫోన్స్‌పై డిస్కౌంట్స్‌ లభించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* వివో టీ3ఎక్స్‌ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా వివో టీ3ఎక్స్‌ ఫోన్‌పై డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఈ 5జీ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 13,499కాగా, ఆఫర్‌లో భాగంగా రూ. 1000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. దీంతో పాటు నెలకు కేవలం రూ. 836 ఈఎమ్‌ఐ చెల్లింపుతో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

* మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ ఫోన్‌పై భారీ ఆఫర్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2000 డిస్కౌంట్‌ పొందొచ్చు. అలాగే నో కాస్ట్‌ ఈఎమ్‌ఐని సైతం అందిస్తున్నారు. ఇక ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం కూడా ఇందులో 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

* షావోమీ 14 సివి స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 42,999కాగా హెచ్‌డీఎఫ్‌ బ్యాంకుకు చెందిన క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 3000 డిస్కౌంట్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను కూడా అందించారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.55 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎస్‌ జెన్‌ 3 ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 50 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

Link to comment
Share on other sites

  • 0

Recharge plan: మొబైల్ యూజర్లకు బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌.. ధరలు పెరిగినా..

ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కంపెనీలు ఏకంగా 10 నుంచి 25 శాతం వరకు ధరలను పెంచాయి. దీంతో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న వారిపై భారీగా భారం పడింది. జియో మొదలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వరకు అన్ని సంస్థలు టారిఫ్‌లను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి...

Recharge Plans

jio.jpg

ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కంపెనీలు ఏకంగా 10 నుంచి 25 శాతం వరకు ధరలను పెంచాయి. దీంతో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న వారిపై భారీగా భారం పడింది. జియో మొదలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వరకు అన్ని సంస్థలు టారిఫ్‌లను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే ధరలు పెరిగిన తర్వాత కూడా ప్రముఖ టెలికాం దిగ్గజం జియో కొన్ని మంచి ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. ఇతర కంపెనీలతో పోల్చితే జియో అందిస్తున్న కొన్ని రీఛార్జ్‌ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి..

* జియో అందిస్తున్న బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌లో రూ. 249 ఒకటి. ఈ ప్లాన్‌తో రోజుకు 1 జీబీ డేటాతో పాటు అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. అయితే ఇతర సంస్థలతో పోల్చితే జియోలోనే ఈ ప్లాన్‌ తక్కువ ధరకు లభిస్తోంది.

* రూ. 299తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ లభిస్తాయి. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర కంపెనీల్లో రూ. 349 ప్లాన్‌ అమల్లో ఉంది.

* ఇక జియో అందిస్తున్న మరో బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌లో రూ. 349 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌ పొందొచ్చు. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర టెలికాం సంస్థల్లో అదనంగా రూ. 50 చెల్లించాల్సిందే.

* మూడు నెలల ప్లాన్‌ కోసం చూస్తున్న వారికి రూ. 479 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో యూజర్లకు 6 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర టెలికాం సంస్థల్లో రూ. 509 వరకు ఉన్నాయి.

* ఏడాది ప్లాన్‌ విషయానికొస్తే.. రూ. 1899 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. 24 జీబీ డేటా లభిస్తుంది. ఇదే ప్లాన్‌ ఇతర సంస్థల్లో 5 శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 0

Recharge Plans: మూడు నెలల రీచార్జ్‌పై ముచ్చటైన ఆఫర్లు.. ఏ కంపెనీ యూజరైనా ఆసక్తి చూపాల్సిందే..!

ఇటీవల కాలంలో టెలికాం కంపెనీలు యూజర్లకు షాక్ ఇస్తూ రీచార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచాయి. అయితే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అగ్ర ప్రొవైడర్ల నుంచి 84 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌లు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందాయి. ప్రతి కంపెనీ డేటా, కాలింగ్ ఫీచర్‌లు, అదనపు పెర్క్‌లతో ప్రత్యేకమైన ప్యాకేజీలను అందిస్తుంది.

Calls Talking

calls-talking.jpg?w=1280

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు ఫోన్లు ఉంటున్నాయంటే ఫోన్ల వాడకం ఏ స్థాయిలో ఉందో? అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో టెలికాం కంపెనీలు యూజర్లకు షాక్ ఇస్తూ రీచార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచాయి. అయితే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అగ్ర ప్రొవైడర్ల నుంచి 84 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌లు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందాయి. ప్రతి కంపెనీ డేటా, కాలింగ్ ఫీచర్‌లు, అదనపు పెర్క్‌లతో ప్రత్యేకమైన ప్యాకేజీలను అందిస్తుంది. వినియోగదారులకు వారి నిర్దిష్ట అవసరాలు, రోజువారీ అవసరాల ఆధారంగా సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ నేపథ్యంలో 84 రోజుల రీచార్జ్ ప్లాన్‌లపై ఏయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం. 

జియో రూ. 719  ప్లాన్

రిలయన్స్ జియోకు సంబంధించిన రూ.719 ప్లాన్ 84 రోజుల పాటు గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందవచ్చు. అంటే మొత్తం ప్లాన్ వ్యవధిలో 168 జీబీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ ప్లాన్ ద్వారా ట్రూ 5జీ డేటా యొక్క ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. బోనస్‌గా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. 

ఎయిర్‌టెల్ రూ. 719 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.719 ప్లాన్ 84 రోజుల సర్వీస్, అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను వస్తుంది. అలాగే ఏదైనా పాటను మీ హలో ట్యూన్‌గా ఉచితంగా సెట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ డేటా వాడేవారితో పాటు మెసేజింగ్ అనువైనదిగా ఉంటుంది. 

వొడాఫోన్ ఐడియా రూ. 459 ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా 6 జీబీ డేటా, 1000 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. మీరు అపరిమిత స్థానిక, జాతీయ వాయిస్ కాల్‌లను ఆస్వాదించవచ్చు. డేటా కోటా ముగిసిన తర్వాత అదనపు డేటా కోసం మీకు ఎంబీకి 50 పైసలు ఛార్జ్ చేస్తారు. ఎస్ఎంఎస్‌ను కోటాను ఉపయోగించిన తర్వాత ప్రతి స్థానిక SMSకి రూ 1, ప్రతి ఎస్ఎంఎస్‌కు రూ. 1.5 ఖర్చవుతుంది. ఈ ప్లాన్ మంచి డేటా, మెసేజింగ్, కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. 

Link to comment
Share on other sites

  • 0

Lava Blaze X 5G: లావా నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ ఫోన్‌.. ప్రీమియం లుక్స్‌తో..

లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జులై 10వ తేదీన ఈ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేయనుంది. ఇక జుల్‌ 20వ తేదీన అమెజాన్‌ అందించనున్న అమెజాన ప్రైమ్‌ డే సేల్ 2024లో భాగంగా ఈ ఫోన్‌ మొదటి సేల్‌ ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.?

Lava Blaze X 5G phone

lava.jpg?w=1280

ప్రముఖ భారతీయ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకురావడంతో ఎప్పుడూ ముందుంటుందీ సంస్థ. బడ్జెట్‌ ధరలో ప్రీమియం లుక్స్‌, స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్న లావా తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది.

లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జులై 10వ తేదీన ఈ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేయనుంది. ఇక జుల్‌ 20వ తేదీన అమెజాన్‌ అందించనున్న అమెజాన ప్రైమ్‌ డే సేల్ 2024లో భాగంగా ఈ ఫోన్‌ మొదటి సేల్‌ ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లావా బ్లేజ్‌ ఎక్స్‌ 5జీ ఫోన్‌ను మొత్తం మూడు వేరియంట్సలో లాంచ్‌ చేయనున్నారు. వీటిలో 4 జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌, 8 జీబీ ర్యామ్‌ ఉన్నాయి. ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందించనున్నారు. స్క్రీన్‌ పరంగా చూస్తే ఇందులో అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌తో అందుబాటులోకి తెస్తున్నారు.

ఇందులో USB టైప్ C పోర్ట్, స్పీకర్ గ్రిల్ వంటి ఫీచర్స్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఫోన్‌కు కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్స్‌ ఉండనున్నాయి. లుక్స్‌ పరంగా ఫోన్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా బ్లేజ్‌ లెస్‌ స్క్రీన్‌, పంచ్‌ హోల్‌ కెమెరాను ఇవ్వనున్నారు. దీంతో ఫోన్‌ను రిచ్‌ లుక్‌ వచ్చింది. ధర విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోయినా ఫోన్‌ రూ. 20 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Xhilarating. Xtreme. #BlazeX - Launching on 10.07.24, 12 PM #LavaMobiles #ProudlyIndian

 

Link to comment
Share on other sites

  • 0

how to beat the plan price increases?

జులై 3 నుంచి జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. - TV9

 

Link to comment
Share on other sites

  • 0

Motorola: మోటోరోలా నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. ధర అక్షరాల రూ. లక్ష..

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా క్వాల్‌కామ్‌ కొత్త స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో మెయిన్‌ స్క్రీన్‌ను ఫుల్‌హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ ని అందించారు. 165Hz రీఫ్రెష్‌ రేట్‌, 6.9 ఇంచెస్‌తో కూడిన మెయిన్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇక బయటి స్క్రీన్‌ 4 ఇంచెస్‌తో కూడిన ఎల్‌టీపీఓ,ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌, 165Hz రీఫ్రెష్ రేట్‌...

Motorola Razr 50 Ultra

motorola-razr-50-ultra.jpg?w=1280

ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. దాదాపు అన్ని స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీలు మడతపెట్టే ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఇప్పటికే మార్కెట్లోకి లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ జులై 20వ తేదీ నుంచి ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌తో పాటు, రిలయన్స్‌ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ధర విషయానికొస్తే మోటోరాల రేజర్‌ 50 అల్ట్రా 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 99,999గా నిర్ణయించారు. అయితే లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 5000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు. అలాగే ఎంపిక చేసిన కొన్ని బ్యాంకు కార్డులపై అదనంగా మరో రూ. 5000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 89,999కే సొంతం చేసుకోవచ్చు. జులై 10వ తేదీ నుంచి బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫోన్‌ను మిడ్‌ నైట్ బ్లూ, , స్ప్రింగ్‌ గ్రీన్‌, పీచ్‌ ఫజ్‌ వంటి కలర్స్‌లో తీసుకొస్తున్నారు.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా క్వాల్‌కామ్‌ కొత్త స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో మెయిన్‌ స్క్రీన్‌ను ఫుల్‌హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ ని అందించారు. 165Hz రీఫ్రెష్‌ రేట్‌, 6.9 ఇంచెస్‌తో కూడిన మెయిన్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇక బయటి స్క్రీన్‌ 4 ఇంచెస్‌తో కూడిన ఎల్‌టీపీఓ,ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌, 165Hz రీఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. ఫోన్‌ను ఫోల్డ్‌ చేసినప్పుడు వీడియోలు, నావిగేషన్‌ వివరాలు, సెల్ఫీలు వంటివి ఈ స్క్రీన్‌తో చేసుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈస్మార్ట్‌ ఫోఒన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. 30X ఏఐ సూపర్‌ జూమ్‌, ఏఐ యాక్షన్‌ షాట్‌, ఏఐ అడాప్టివ్‌ స్టెబిలైజేషన్‌, ఇంటెలిజెంట్‌ ఆటో ఫోకస్‌ ట్రాకింగ్‌ వంటి ఏఐ ఫీచర్లను కెమెరా కోసం ప్రత్యేకంగా అందించారు. ఇక లోపలి డిస్‌ప్లే 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అదించారు. 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఈ ఫోన్‌ 15 వాట్స్‌వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Link to comment
Share on other sites

  • 0

Upcoming Smartphones in July 2024: జూలైలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. జాబితా కొంచెం పెద్దదే..

ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3ప్రో, షావోమీ 14 సివి, రియల్‌మీ జీటీ6, మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా వంటి ఫోన్లు మార్కెట్లోకి వచ్చేందుకు ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశాయి. వీటితో పాటు రెడ్‌మీ 13 5జీ, సీఎంఎఫ్‌ ఫోన్‌1తో పాటు మోటోరోలా, శామ్సంగ్‌ నుంచి ప్రీమియం ఫోల్డబుల్‌ ఫోన్లను కూడా ఈ జూలైలోనే లాంచ్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

Samsung Galaxy Z Fold 6

samsung-galaxy-z-fold-6.jpg?w=1280

జూలై మాసాన్ని అనేక టెక్‌ కంపెనీలు తమ లక్కీ నెలగా మార్చుకుంటున్నాయి. అందుకే వరసపెట్టి స్మార్ట్‌ ఫోన్లను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిల్లో టాప్‌ బ్రాండ్లు అయిన వివో, షావోమీ, రియల్‌మీ, మోటోరోలా వంటివి ఉ‍న్నాయి. వీటిల్లో పలు ప్రీమియం మోడళ్లు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3ప్రో, షావోమీ 14 సివి, రియల్‌మీ జీటీ6, మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా వంటి ఫోన్లు మార్కెట్లోకి వచ్చేందుకు ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశాయి. వీటితో పాటు రెడ్‌మీ 13 5జీ, సీఎంఎఫ్‌ ఫోన్‌1తో పాటు మోటోరోలా, శామ్సంగ్‌ నుంచి ప్రీమియం ఫోల్డబుల్‌ ఫోన్లను కూడా ఈ జూలైలోనే లాంచ్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయా ఫోన్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.

REDMI 13 5G: రెడ్‌మీ 13 5జీ..

రెడ్‌మీ 1350 క్రిస్టల్ గ్లాస్ డిజైన్, 108ఎంపీ ప్రైమరీ కెమెరా, స్నాప్ డ్రాగన్ 4 జెన్‌ 2, చిప్‌సెట్‌, 33వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టు, హైపర్‌ఓఎస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన 5,030ఎంఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌ జూలై 9న భారతదేశంలో లాంచ్ అవుతుంది. దీని రూ.12,000-రూ. 13,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

CMF PHONE 1: సీఎంఎఫ్‌ ఫోన్ 1..

ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 5జీ చిప్ సెట్, సూపర్ అమోల్డ్‌ డిస్ ప్లే వస్తుంది. సీఎంఎఫ్‌ వాచ్ ప్రో 2, బడ్స్ ప్రో 2లతో కలిపి లాంచ్‌ కానున్నాయి. నథింగ్ సబ్-బ్రాండ్‌గా ఈ ఫోన్‌ లాంచ్‌ అవుతోంది. జూలై 8న మార్కెట్లోకి వస్తోంది. దీని ధర రూ. 20,000 లోపు ఉండవచ్చని భావిస్తున్నారు.

MOTOROLA RAZR 50 ULTRA: మోటోరోలా రాజ్‌ఆర్‌ 50 అల్ట్రా..

మోటోరోలా నుంచి ఫ్లాగ్లిప్ క్లామ్ షెల్ స్నాప్ డ్రాగన్ 8ఎస్‌ జెన్‌ 3 చిప్ సెట్, 165హెర్జ్‌ స్క్రీన్, 50ఎంపీ ఓఐఎస్‌ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో సెన్సార్, 45వాట్ల వైర్డ్, 15వాట్ల వైర్ లెస్ ఛార్జింగ్‌తో వస్తుంది. 4,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్‌ జూలై 4న లాంచ్ అవుతోంది. ఈ ఫోల్డబుల్ హ్యాండ్సెట్ ధర రూ. 75,000 ధర బ్రాకెట్లో ఉండవచ్చు.

SAMSUNG GALAXY Z FOLD 6, GALAXY 2 FLIP 6: శామ్సంగ్‌ గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 6, గెలాక్సీ 2 ఫ్లిప్‌ 6..

ఈ రెండు ఫోన్లలో గెలాక్సీ చిప్ సెట్, కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్లల కోసం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 30 చిప్‌ సెట్‌ ఉంటుంది. శామ్సంగ్‌ గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 6 రూ. 1,69,999 గెలాక్సీ 2 ఫ్లిప్‌ 6 రూ. 1,09,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ధరలను శామ్సంగ్‌ ధ్రువీకరించలేదు. ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్లు జూలై 10న గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌-2024 ఈవెంట్లో ప్రారంభించుకునే అవకాశం ఉంది.

మరిన్ని లాంచ్‌ అయ్యే అవకాశం..

ఒప్పో, టెక్‌నో, లావా, హానర్‌ వంటి మరిన్ని బ్రాండ్లు తమ కొత్త స్మార్ట్‌ ఫోన్లను లంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పలు ఆన్‌లైన్‌ నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫినిక్స్‌ ఇటీవల నోట్‌ 40జీ ప్రారంభించింది. దీని తర్వాత నోట్ 408 4జీని తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అలాగే టెక్నో స్పార్క్ 20ని విడుదల చేయనుంది. ఇది డైమెన్సీటీ 6080 చీప్ సెట్, 12042 డిస్ ప్లే, 108 ఎంపీ, ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది రూ. 11,000 ధర బ్రాకెట్లో ఉండే అవకాశం ఉంది. లావా అమెజాన్లో బ్లేజ్ ఎక్స్‌ను లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్ విషయానికొస్తే, వన్ ప్లస్ ఈ నెలలో నోర్డ్ 4ని ఆవిష్కరించే అవకాశం ఉంది. రియల్ మీ 13 ప్రో సిరీస్ 5జీని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒప్పో రెనో 12 సిరీస్ 5జీని జూలై 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. హానర్ 200 5జీ సిరీస్ ను ఇప్పటికే అమెజాన్లో టీజ్ చేసింది. ఇది కూడా ఈ నెలలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

  • 0

Tecno Spark 20 Pro: లాంచింగ్‌కు సిద్ధమైన మరో బడ్జెట్‌ 5జీ ఫోన్‌.. అదిరే ఫీచర్స్‌

ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. మొదట్లో 5జీ ఫోన్‌ల ధరలు ఎక్కువగా ఉన్నా ప్రస్తుతం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లోనే 5జీ ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా...

Tecno Spark 20 Pro

tecno-spark-20-pro.jpg?w=1280

ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. మొదట్లో 5జీ ఫోన్‌ల ధరలు ఎక్కువగా ఉన్నా ప్రస్తుతం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లోనే 5జీ ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టెక్నో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. టెక్నో స్పార్క్‌ 20 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జుల్‌ 9వ తేదీన ఇండియాలో ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌ను 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకురానున్నారు.

ఇక ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పనిచేయనుంది. ఇందులో పంచ్‌ హోల్‌తో కూడిన 8 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే రెయిర్‌ కెమెరా విషయానికొస్తే 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను ఇవ్వనున్నారు. ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ రానుంది.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనుంది. ఐపీ53 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌ను ఇవ్వనున్నారు. స్టీరియో స్పీకర్స్‌, సౌండ్ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రిట్ స్కానర్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్‌కు కుడి వైపున పవర్ బటన్‌తో పాటు వాల్యూమ్ రాకర్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. సౌండ్ విషయానికొస్తే డాల్బీ అట్మాస్ సెటప్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ధర పరంగా చూస్తే ఈ ఫోన్‌ రూ. 20 వేలలోపు ఉండొచ్చని అంచనా.

Link to comment
Share on other sites

  • 0

Redmi Pad Pro 5G: మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ వస్తోంది.. 10000mAh వంటి పవర్‌ఫుల్‌ బ్యాటరీతో

తొలుత గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానున్న ఈ ట్యాబ్ ఆ తర్వాత ఇండియన్‌ మార్కెట్లోకి రానుంది. ఇంతకి ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్యాబ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.1 ఇంచెస్‌తో కూడిన 2.5 కే ఎల్‌సీడీ ప్యానెల్‌ సెటప్‌ను అందించారు..

Redmi Pad Pro 5g

redmi-pad-pro-5g.jpg?w=1280

ప్రస్తుతం టెక్‌ ప్రపంచంలో ట్యాబ్స్‌కి ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓటీటీ స్ట్రీమింగ్ సేవలు అందుబాటులోకి రావడం, గేమ్స్‌కు ఎక్కువగా ఆదరణ పెరగడంతో చాలా మంది ట్యాబ్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు సైతం అధునాతన ఫీచర్లతో కూడిన ట్యాబ్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. రెడ్‌మీ ప్యాడ్ ప్రో 5జీ పేరుతో ఈ ట్యాబ్‌ను లాంచ్‌ చేయనున్నారు.

తొలుత గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానున్న ఈ ట్యాబ్ ఆ తర్వాత ఇండియన్‌ మార్కెట్లోకి రానుంది. ఇంతకి ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్యాబ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.1 ఇంచెస్‌తో కూడిన 2.5 కే ఎల్‌సీడీ ప్యానెల్‌ సెటప్‌ను అందించారు. 2560×1600 పిక్సెల్ రిజల్యూషన్‌, 120Hz రిఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందించారు. అలాగే ఈ స్క్రీన్‌ 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌ను విడుదల చేస్తుంది. దీంతో సన్‌లైట్‌లోనూ స్క్రీన్‌ క్లియర్‌గా కనిపిస్తుంది.

ఇక ట్యాబ్‌ డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్‌ను అందించారు. ఈ ట్యాబ్‌ను 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో తీసుకొస్తున్నారు. మైక్రో SD కార్డ్ సహాయంతో ఇంటర్నల్‌ మెమోరీని 1.5 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్‌ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, అలాగే 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 10000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ట్యాబ్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇందులో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ పింట్‌ సెన్సార్‌ను అందించారు. కనెక్టివిటీ విషయానికిస్తే ఈ ట్యాబ్‌లో Wi-Fi 6, బ్లూటూత్ 5.2, USB టైప్-C 2.0 వంటి ఫీచర్లను అందించారు.

Link to comment
Share on other sites

  • 0

4G plans from BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 4జీ సేవలు.. ప్లాన్స్‌ ఎలా ఉండనున్నాయంటే..

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రధాన టెలికం కంపెనీలన్నీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆగస్టు నాటికి దేశంలో 4జీ సేవలను తీసుకొచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సన్నాహాలు చేస్తోంది...

Bsnl 4g

bsnl-4g.jpg?w=1280

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రధాన టెలికం కంపెనీలన్నీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆగస్టు నాటికి దేశంలో 4జీ సేవలను తీసుకొచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 4జీ సేవలకు సంబంధించిన ప్లాన్స్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వివరాలను వెల్లడించారు. ఇంతకీ BSNL అందిస్తోన్న ప్లాన్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రూ. 2,399 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 395 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. ఈ ప్లాన్‌తో ప్రతి రోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. వీటితో పాటు ప్రతీ రోజూ 2 జీబీ డేటా పొందొచ్చు.

* రూ. 1,999 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మొత్తం 600 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు.

* రూ. 997 ప్లాన్‌..

రూ. 997 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 160 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ప్రతీరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు.

* రూ. 599 ప్లాన్‌..

రూ. 599 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రూ. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. ప్రతీ రోజూ 3 జీబీ డేటా లభిస్తుంది.

* రూ. 347 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 54 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ప్రతీరోజూ 2 జీబీ డేటా పొందొచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్‌ పొందొచ్చు.

* రూ. 199 ప్లాన్‌..

రూ. 199తో రీఛార్జ్‌ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. అలాగే ప్రతీ రోజూ 2 బీబీ లభిస్తుంది.

* రూ. 153 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 26 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. మొత్తం 26జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు.

* రూ. 118 ప్లాన్‌..

రూ. 118 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 20 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. 10 జీబీ డేటా లభిస్తుంది. అలాగే 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు.

Link to comment
Share on other sites

  • 0

Cheap plan from BSNL with 150-day validity: బీఎస్‌ఎన్‌ఎల్‌లో చవకైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 150 రోజుల వ్యాలిడిటీ!

జూలై నుంచి ఖర్చు పెరిగింది. జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా మొబైల్ రీఛార్జ్ ధరను ఒక్కసారిగా పెంచేశాయి. ప్రతి టెలికాం కంపెనీ దాదాపు 25 శాతం టారిఫ్‌లను పెంచింది. మిగిలిన కంపెనీలు తమ రీఛార్జ్ రేట్లను పెంచగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దాని రీఛార్జ్ టారిఫ్‌లను పెంచలేదు. బదులుగా, బీఎస్‌ఎన్‌ఎల్‌..

bsnl.jpg?w=1280

జూలై నుంచి ఖర్చు పెరిగింది. జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా మొబైల్ రీఛార్జ్ ధరను ఒక్కసారిగా పెంచేశాయి. ప్రతి టెలికాం కంపెనీ దాదాపు 25 శాతం టారిఫ్‌లను పెంచింది. మిగిలిన కంపెనీలు తమ రీఛార్జ్ రేట్లను పెంచగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దాని రీఛార్జ్ టారిఫ్‌లను పెంచలేదు. బదులుగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ కొన్ని ప్లాన్‌లను అందిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొన్ని అద్భుతమైన ప్లాన్‌లు:

107 రూపాయల ప్లాన్: బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌లలో ఒకటి రూ. 107 రీఛార్జ్ ప్లాన్. దీని వాలిడిటీ 35 రోజులు. ఇది 3జీబీ 4G డేటాను అందిస్తుంది. అదనంగా 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్ అందుబాటులో ఉన్నాయి.

197 రూపాయల ప్లాన్: రూ.197 రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 70 రోజులు. మీకు 2జీబీ 4జీ డేటా లభిస్తుంది. అలాగే మీరు మొదటి 18 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. రూ.199 రీఛార్జ్ చేసుకుంటే 70 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది.

రూ. 397 ప్లాన్‌: ఈ ప్లాన్‌లో 150 రోజులు చెల్లుబాటు ఉంటుంది. ఇది మొదటి 30 రోజులకు 2జీబీ 4G డేటాను అందిస్తుంది.

రూ.797 ప్లాన్‌: ఈ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకుంటే 300 రోజులు. ఇది మొదటి 60 రోజులకు 2GB 4G డేటాను అందిస్తుంది.

1999 రూ ప్లాన్: ఈ ప్లాన్‌లోఒక సంవత్సరం వ్యాలిడిటీ పొందవచ్చు. ఇది అపరిమిత కాలింగ్, 600జీబీ 4G డేటాను అందిస్తుంది. ఈ రీఛార్జ్ కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్‌తో సహా బహుళ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Link to comment
Share on other sites

  • 0

Moto G85: మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. అద్భుతమైన ఫీచర్స్

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఓవైపు ప్రీమియం ఫోన్‌లతో పాటు, మరోవైపు బడ్జెట్‌ ఫోన్‌లను సైతం తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మోటోరోలా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. మోటో జీ85 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది...

moto-g85.jpg?w=1280

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఓవైపు ప్రీమియం ఫోన్‌లతో పాటు, మరోవైపు బడ్జెట్‌ ఫోన్‌లను సైతం తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మోటోరోలా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. మోటో జీ85 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మోటో జీ85 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని రోజుల క్రితం చైనాలో ఈ ఫోన్‌ను ఎస్‌50 నియో పేరుతో తీసుకొచ్చారు. తాజాగా భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జులై 10వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ 3డీ కర్వ్డ్‌ డిస్‌ప్లేను అందించనున్నారు. 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్‌తో కూడిన పీఓఎల్‌ఈడీ ప్యానెల్‌ను ఇవ్వనున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఇందులో సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ స్కానర్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6ఎస్‌ జెన్‌ 3 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందించనున్నారు.

ఇక ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌తో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌లో 24 జీబీ వరకు ర్యామ్‌ను ఎక్సపాండ్‌ చేసుకోవచ్చు. అలాగే మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఇంటర్నల్‌ మెమోరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు, అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 30 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, 5GHz వై-ఫై, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లను అందిచనున్నారు. ఈ ఫోన్‌లో డాల్బీ ఆటమ్స్‌కు సపోర్ట్‌ చేసే డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌ను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ రూ. 18 వేల నుంచి రూ. 20 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫోన్‌కు సంంధించిన పూర్తి వివరాలపై జుల్‌ 10వ తేదీన అధికారిక ప్రకటన రానుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...