Jump to content
  • 2

Good Phones, Tablets, Gadgets and Plans in India in 2024


TELUGU

Question

Reliance Jio new plan with 90-day validity: 90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన జియో

29-04-2024 Mon 16:26 | Business

రోజుకు 2 జీబీ.. అదనంగా మరో 20 జీబీ డేటా

రూ.749 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ

జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్న టెలికం దిగ్గజం

cr-20240429tn662f7cde6fb06.jpg

దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్ బేస్ కలిగివున్న దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో సాధారణ ఆఫర్లతో పోల్చితే యూజర్లకు అధిక డేటా లభిస్తోంది. ఆఫర్‌లో రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటాను జియో అందిస్తోంది. మొత్తం 200 జీబీల డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఉచిత కాలింగ్, ఎంఎస్‌ఎంలు, ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి.

ఇక ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. 5జీ మొబైల్ కలిగివుండి కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ యాక్సెస్ ఉంటే అదనపు డేటాను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఆఫర్ కింద జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌లకు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 90 రోజులపాటు ఈ సేవలను పొందవచ్చు.

కాగా తక్కువ రేటుతో సాధ్యమైనన్ని గరిష్ఠ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా జియో ఇటీవలే రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అనేక వర్గాలుగా విభజించింది. అందులో భాగంగా ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా భారత్‌లో అత్యధికంగా 45 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లను జియో కలిగివుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా జియో కొనసాగుతోంది.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Reliance Jio new plan with 15 OTT's: జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. ఒక్క ప్లాన్‌తో ఏకంగా 15 ఓటీటీలు

11-05-2024 Sat 08:15 | Business

రూ. 888 తో పోస్టుపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన జియో

30 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా

800 డిజిటల్ టీవీ చానళ్లు కూడా 

ఈ నెల 31తో ముగియనున్న ఆఫర్

cr-20240511tn663edbb20c942.jpg

జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం రిలయన్స్ జియో మరో ఆకర్షణీయమైన ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 888తో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన జియో.. దాంతోపాటు 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను తీసుకొచ్చింది. కొత్త వినియోగదారులు మాత్రమే కాకుండా జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్లు కూడా ఈ ప్లాన్‌కు మారొచ్చని కంపెనీ తెలిపింది.

ఈ ప్లాన్‌లో యూజర్లకు 30 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా, బేసిక్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ వంటి 15 ఓటీటీ యాప్స్ లభిస్తాయి. వీటికి అదనంగా 800 డిజిటల్ టీవీ చానళ్లను చూడొచ్చు. ఐపీఎల్ ధన్‌ధనా ఆఫర్ కూడా దీనికి వర్తిస్తుంది. 50 రోజులపాటు జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ కస్టమర్లు ఉచితంగా ఈ సేవలు పొందవచ్చు. ఈ నెల 31తో ఆఫర్ ముగుస్తుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Infinix GT 20 Pro: రెండు జేబీఎల్‌ స్పీకర్లు, 108 మెగాపిక్సెల్‌ కెమెరాతో ఇన్ఫినిక్స్‌ జీటీ 20 ప్రో.. ఫీచర్లు, ధర వివరాలివిగో!

తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్లతో విడుదల కానున్న ఫోన్

మే 21వ తేదీన భారత్ లో విడుదల చేయనున్నట్టు కంపెనీ వెల్లడి

అద్భుతమైన గేమింగ్ అనుభూతిని అందించగలదని ప్రకటన

cr-20240515tn6643adac43350.jpg

తక్కువ ధరల్లో మంచి స్పెసిఫికేషన్స్‌ తో ఫోన్లను అందించే ఇన్ఫినిక్స్‌ సంస్థ మరో ఫ్లాగ్‌ షిప్‌ ఫోన్‌.. ‘ఇన్ఫినిక్స్‌ జీటీ 20 ప్రో’ ఫోన్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో విడుదల చేసిన ఈ ఫోన్‌ ను మే 21వ తేదీన భారత దేశంలో విడుదల చేయనుంది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌ బడ్జెట్‌ ధరలోనే అందుబాటులో ఉంటుందని టెక్‌ మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నథింగ్‌ ఫోన్‌ 2ఏ, రెడ్‌ మీ నోట్‌ 13 ప్రో, రియల్‌ మీ 12ప్రో ఫోన్లకు.. ‘ఇన్ఫినిక్స్‌ జీటీ 20 ప్రో’ గట్టి పోటీ ఇస్తుందని అంటున్నాయి.

20240514fr6643ad9515860.jpg

‘ఇన్ఫినిక్స్‌ జీటీ 20 ప్రో’ ఫీచర్లు ఇవీ..

ఈ ఫోన్‌ లో 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్‌ వర్క్‌ లను ఉపయోగించుకోవచ్చు. 164.2 మిల్లీమీటర్ల పొడవు, 75.43 మిల్లీమీటర్లు, 8.15 మిల్లీమీటర్ల మందంతో వస్తుంది. బరువు 194 గ్రాములు.

6.78 అంగుళాల భారీ స్క్రీన్‌ తో ఫుల్‌ హెచ్‌ డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ ప్లే ఉంది. 144 హెట్జ్‌ రీఫ్రెష్‌ రేటుతో అద్భుతమైన గేమింగ్‌ అనుభూతిని అందించగలదు.

ఇందులో డైమెన్సిటీ 8200 ఆక్టాకోర్‌ 3.1 గిగాహెట్జ్‌ వేగవంతమైన ప్రాసెసర్‌ ను అమర్చారు. అద్భుతమైన గేమింగ్‌ కోసం ప్రత్యేకమైన డిస్‌ ప్లే చిప్‌ కూడా ఉంది.

256 జీబీ ఇన్‌ బిల్ట్‌ మెమరీ ఇచ్చారు. 8 జీబీ ర్యామ్‌/12 జీబీ ర్యామ్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది.

వెనుక భాగాన 102 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, మరో 2 మెగాపిక్సెల్‌ మాక్రో కెమెరా, ఇంకో 2 మెగాపిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ కెమెరాలు కలిపి ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. ముందుభాగంలో 32 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ విషయానికి వస్తే.. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 45 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ ను సపోర్ట్‌ చేస్తుంది.

స్క్రీన్‌ లో భాగంగానే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను అమర్చారు. 

అనవసరపు అంశాల జోలికి వెళ్లకుండా ఈ ఫోన్‌ లో ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ‘క్లీన్‌ అండ్‌ ప్యూర్‌ ఓఎస్‌’ను ఇన్‌ స్టాల్‌ చేసినట్టు కంపెనీ తెలిపింది.

మెకా బ్లూ, మెకా ఆరెంజ్‌, మెకా సిల్వర్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. 

ఈ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.24,999గా ఉండవచ్చని టెక్‌ వర్గాల అంచనా. ఫోన్‌ విడుదల సందర్భంగా ఇన్ఫినిక్స్‌ కంపెనీ రేటును ప్రకటించనుంది.

అయితే.. ఈ ఫోన్ లో జేబీఎల్ సంస్థకు చెందిన రెండు స్పీకర్లు ఉండనున్నట్టు టెక్ వర్గాలు చెప్తున్నాయి. ఫోన్ ను ఇండియాలో విడుదల చేసేప్పుడు.. స్థానిక పరిస్థితులు, ధరల వేరియంట్లకు తగినట్టుగా.. ఫీచర్లలో మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నాయి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Low-cost Nokia 3210 with mind-blowing features make a comeback: సరికొత్తగా.. అదిరిపోయే ఫీచర్లు.. సరసమైన ధరతో మళ్లీ వచ్చేసిన ‘నోకియా 3210’ ఫీచర్ ఫోన్లు

16-05-2024 Thu 09:49 | Technology

రీ-లాంచ్ చేసిన నోకియా కంపెనీ

ధర సుమారు రూ.4000గా నిర్ణయం

యూరప్ దేశాలు, చైనాలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఫోన్లు

cr-20240516tn6645894b458c8.jpg

1990 దశకంలో అత్యంత ఆదరణ పొందిన నోకియా 3210 మోడల్ ఐకానిక్ ఫీచర్ ఫోన్లు మళ్లీ మార్కెట్‌లోకి వచ్చేశాయి. సుమారు 25 సంవత్సరాల అనంతరం 4జీ కనెక్టివిటీతో సరికొత్త వేరియంట్ల ఫోన్లను కంపెనీ విడుదల చేసింది. యూజర్లు యూట్యూబ్ షార్ట్స్‌ని కూడా ఈ ఫోన్లలో వీక్షించవచ్చు. సీవైసీ 349 మోడల్ హ్యాండ్‌సెట్ ధర దాదాపు రూ. 4,000గా ఉంది. చైనాలో నోకియా అధికారిక వెబ్‌సైట్‌పై ఫోన్లను అందుబాటులో ఉంచగా విపరీతమైన డిమాండ్ కనిపించిందని కంపెనీ తెలిపింది.

అదిరిపోయే ఫీచర్లు..
కాగా నోకియా 3210 ఫోన్‌ను అప్‌డేట్లతో కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఫోన్ డిజైన్‌లో మార్పులు చేయడంతో పాటు కొత్త ఫీచర్లను అందించింది. 4జీ సామర్థ్యాలతో పనిచేస్తుంది. 2.4-అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, యూనీసాక్ టీ107 ప్రాసెసర్‌,తో  64ఎంబీ ర్యామ్, 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో మెమొరీని 32జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఎస్30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.

యూఎస్‌బీ టైప్ సీ ఛార్జింగ్ ఫీచర్‌తో 1,450 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని కలిగివుంది. ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9.8 గంటలపాటు ఫోన్ మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ రెండు 4జీ సిమ్‌లకు సపోర్ట్ చేస్తుంది.  బ్లూటూత్ 5.0, 3.5ఎంఎం ఆడియో జాక్‌తో పాటు ఇతర కనెక్టివిటీ ఫీచర్లకు కూడా ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్‌తో ముందు, వెనుక భాగంలో కెమెరాలు కూడా వచ్చాయి. ఎఫ్ఎం రేడియోతో పాటు ఎంపీ3 ప్లేయర్ క్లౌడ్ యాప్ సపోర్ట్‌తో పని చేస్తుంది. 

యూరప్, చైనాల్లో సోల్డ్ అవుట్..
యూరప్ దేశాలు, చైనాలో ఈ ఫోన్ అమ్మకానికి వచ్చిన వెంటనే 'అవుట్ ఆఫ్ స్టాక్' బోర్డు ప్రదర్శించాల్సి వచ్చిందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంతలా ఫోన్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఫోన్‌ కొనుగోలుకు యూజర్లు ఎగబడ్డారని సమాచారం. మే 8న అమ్మకానికి అందుబాటులో ఉంచగా కేవలం 2 రోజుల్లోనే ఫోన్లు మొత్తం అమ్ముడుపోయినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నలుపు, బంగారం, నీలం మూడు రంగుల వేరియంట్‌లలో అమ్మకానికి ఉంచగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని తెలిపాయి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jio Smartphone: జియో యూజర్లకు అంబానీ గుడ్‌న్యూస్‌.. అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌

రిలయన్స్‌ జియో ఏ నిర్ణయం తీసుకున్న అది సంచలనమే. టెలికం రంగంలో దూసుకుపోతున్న జియో.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసకోబోతోంది. జియో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. జియో 5G స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌తో వస్తుంది. అంతేకాకుండా 128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతోఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, 6-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

jio-smartphone1-1.jpg?w=1280&enlarge=tru

రిలయన్స్‌ జియో ఏ నిర్ణయం తీసుకున్న అది సంచలనమే. టెలికం రంగంలో దూసుకుపోతున్న జియో.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసకోబోతోంది. జియో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. జియో 5G స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌తో వస్తుంది. అంతేకాకుండా 128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతోఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, 6-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

1 / 5

jio-smartphone2.jpg

ఈ Jio 5G స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మీరు 33w ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి సులభంగా ఛార్జ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుందట. 2 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది.

2 / 5

jio-smartphone3.jpg

ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే గురించి మాట్లాడినట్లయితే, ఇది 5.5 అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో మీరు 4K నాణ్యతతో వీడియోలను సులభంగా చూడవచ్చు.

3 / 5

jio-smartphone4.jpg

ఇప్పుడు చాలా మంది Jio 5G స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్‌ రెండవ లేదా మూడవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

4 / 5

jio-smartphone5.jpg

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని, విడుదల తేదీని కూడా పొందవచ్చు.ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా త్వరలో వెల్లడి కానుంది. అయితే ఈ ఫోన్‌ విడుదల సమయంలో రూ.3000 వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది.

...

Complete article

  • Love 3
Link to comment
Share on other sites

  • 0

POCO C65: రూ. 7 వేలకే 50 మెగాపిక్సెల్‌ కెమెరా.. పోకో ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌

సీజన్‌తో సంబంధం లేకుండా ఈ కామర్స్ సంస్థలు స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. మొన్నటి వరకు సమ్మర్‌ సేల్‌లో స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సేల్‌ తర్వాత కూడా అమెజాన్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌పై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే పోకోసీ65 స్మార్ట్‌ ఫోన్‌పై భారీ తగ్గింపు ధర లభిస్తోంది. ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

poco-1.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో కంపెనీకి చెందిన పోకో సీ65 స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 11,999గా ఉండగా, అమెజాన్‌లో38 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 7,499కే సొంతం చేసుకోవవచ్చు.

poco-c65-price.jpg

దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 500 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 7వేలకే సొంతం చేసుకోవచ్చు. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం. అదే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్మార్ట్ ఫోన్‌ను డిస్కౌంట్‌తో రూ. 6,300కే సొంతం చేసుకోవచ్చు.

poco-c65-price-features.jpg

పోకో సీ65 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు.

poco-c65.jpg

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన మాక్రో కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 18 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

poco-c65-features.jpg

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్‌ ఇంటర్నలర్‌ మెమోరీని ఎస్‌డీ కార్డు సహాయంతో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. బ్లూటూత్‌, వైఫై, యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jio Recharge Plan: జియో కస్టమర్లకు నాన్ స్టాప్ వినోదం.. కొత్త రీచార్జ్ ప్లాన్ తో అదిరే ప్రయోజనాలు..!

క్రికెట్, సినిమాలు, టీవీ షోలు, పాటలు, చరిత్ర .. ఇలా ఏది తెలుసుకోవాలన్నా మన ఫోన్ ఆన్ చేస్తే చాలు. ప్రపంచంలోని సమాచారమంతా చిటికెలో ముందుంటుంది. మన పని చేసుకుంటూ ఖాళీ దొరికినప్పుడు నచ్చిన సినిమా చూడొచ్చు. పాటలు వినవచ్చు. కారు లేదా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు బోర్ కొట్టకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుంది. అయితే ఇవన్నీ చేయడానికి స్మార్ట్ ఫోన్ లో డేటా చాలా అవసరం.

jio-recharge-plan.jpg?w=1280

ఆధునిక కాలంలో వినోదం అంతా మన చేతిలోని స్మార్ట్ ఫోన్ లో ఇమిడిపోయింది. క్రికెట్, సినిమాలు, టీవీ షోలు, పాటలు, చరిత్ర .. ఇలా ఏది తెలుసుకోవాలన్నా మన ఫోన్ ఆన్ చేస్తే చాలు. ప్రపంచంలోని సమాచారమంతా చిటికెలో ముందుంటుంది. మన పని చేసుకుంటూ ఖాళీ దొరికినప్పుడు నచ్చిన సినిమా చూడొచ్చు. పాటలు వినవచ్చు. కారు లేదా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు బోర్ కొట్టకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుంది. అయితే ఇవన్నీ చేయడానికి స్మార్ట్ ఫోన్ లో డేటా చాలా అవసరం.

జియో 90 జీబీ డేటా ప్లాన్..

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ టెలికాం కంపెనీలు డేటా అందిస్తున్నాయి. వాటిలో మనకు అవసరమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా జియో కంపెనీ 28 రోజుల వ్యవధితో 90 జీబీ డేటాను ప్లాన్ అందిస్తుంది. దీని ద్వారా ఉచిత ఓటీటీ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ వివరాలు, ఉపయోగాలు తెలుసుకుందాం.

అద్భుతమైన ప్యాక్..

గతంలో స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్, ఫేస్ బుక్ చూసేవాళ్లం. చదువుకు సంబంధించి గూగుల్ లో సెర్చ్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిధి పెరిగింది. ఆన్‌లైన్ లోనే క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నాం. ఓటీటీ కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. టీవీ జోలికి వెళ్లనవసరం లేకుండా అన్ని ప్రోగ్రామ్ లు స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేశాయి. వీటికి అనుగుణంగానే డేటా కూడా ఉండాలి. జియో ఇస్తున్న కొత్త ప్లాన్ తో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అద్భుతమైన డేటా లభిస్తుంది. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్యాక్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి అందుబాటు ధరలలో ఉండడంతో పాటు పూర్తి ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్యాక్‌లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడతాయి.

రూ.399 ప్లాన్..

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. క్రికెట్ అభిమానులు మొబైల్‌లో ఎక్కువ డేటాను కోరుకుంటున్నారు. జియో తన కస్టమర్లకు రూ.399 ప్లాన్‌ని అందిస్తోంది. దీనిలో రోజువారీ డేటాతో పాటు, అదనపు ఉచిత డేటాను కూడా ఇచ్చింది. మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మ్యాచ్‌లను, ఓటీటీ కంటెంట్‌ను వీక్షించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

28 రోజుల వ్యాలిడిటీ..

ఈ ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. మరో 6 జీబీ కూడా ఉచితంగా లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఈ ప్లాన్‌తో కంపెనీ మొత్తం 90 జీబీ డేటాను అందిస్తోంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ లో మరో ప్రత్యేకత ఏమిటంటే మీకు అపరిమిత 5 జీ డేటా లభిస్తుంది.

మరిన్ని ప్రయోజనాలు..

జీయో కొత్త ప్లాన్ తో మరిన్ని ప్రయోజనాలు అందుతాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్‌లకు సభ్యత్వం లభిస్తుంది. జియో టీవీలో అనేక రకాల ప్రోగ్రామ్‌లు చూడవచ్చు. జియో సినిమాలో వివిధ సినిమాలు, టీవీ షోలు, క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Realme Narzo N65 for Rs. 10,000: రూ. 10 వేలలో 50 ఎంపీ కెమెరా.. రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు వరుసగా భారత మార్కెట్లోకి కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియ్‌మీ నార్జో ఎన్‌65 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

realme-1.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రియల్‌మీ నార్జో ఎన్‌65 పేరుతో వచ్చే వారం కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

smartphone-9.jpg

రియల్‌మీ నార్జో ఎన్‌65 స్మార్ట్ ఫోన్‌ను ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు.

tech-news-8.jpg

ఇక ఐపీ 54 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్లను ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా అందించారు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో అమ్మకానికి రానున్నాయి.

realme-smart-phone.jpg

ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,499గా ఉండనుంది. అలాగే ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే బ్యాక్‌ ప్యానెల్‌ మీద లార్జ్‌ సర్క్యూలర్‌ కెమెరా యూనిట్‌ను అందించారు.

realme-new-phone.jpg

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 15 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Redmi A3x: తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్స్‌.. రెడ్‌మీ నుంచి స్టన్నింగ్ ఫోన్‌

బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని మార్కెట్లోకి కొంగొత్త స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. రూ. 10 వేలలో బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ ఏ3ఎక్స్‌ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

redmi-2.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ ఏ3ఎక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో తీసుకొచ్చిన రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ఫోన్‌కు దీనిని అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

redmi-a3x.jpg

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.71 ఇంచెస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్‌లో యూనిసోక్ టీ603 చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు.

redmi-a3x-phone.jpg

రెడ్‌మీ ఏ3ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌లో 3జీబీ లేదా 4జీబీ ర్యామ్‌ను అందించారు. ఏఐ ఫేస్ అన్ లాక్ ఫీచర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లను ఇందులో ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ రేర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ డెకోరేటివ్ సెన్సర్ కెమెరాలను అందించారు.

redmi-a3x-price.jpg

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 10వాట్ల వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను గ్రీన్, గ్రే కలర్స్‌లో తీసుకొచ్చారు.

smart-phone-4.jpg

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇక ధర విషయానికొస్తే గతేడాది వచ్చి రెడ్‌మీ ఏ3‌ స్మార్ట్ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 7,299గా ఉండగా. రెడ్‌మీ ఏ3 ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ బేసిక్ వేరియంట్‌ ధర కూడా రూ. 10 వేలలోపు ఉండొచ్చని అంచనా.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

VI Recharge Plan: సూపర్ రీచార్జ్‌ ప్లాన్‌ ప్రకటించిన వీఐ.. ఒక్క రూపాయకే షాకింగ్‌ ప్రయోజనాలు

దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వీఐ ఇటీవల టెలికాం రంగంలో చౌకైన ప్లాన్‌ను ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని సంవత్సరాల క్రితం, వోడాఫోన్‌ను హచ్‌గా పిలిచినప్పుడు రూ. 4 చిన్న రీఛార్జ్‌ను కంపెనీ "ఛోటా రీఛార్జ్"గా పరిచయం చేసింది. అయితే ప్రస్తుతం వీఐ తన వినియోగదారులకు రూ. 1 ప్లాన్‌ని అందిస్తూ రూ. 4 కంటే తక్కువ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది.

mobile-recharge-plan.jpg?w=1280

పెరిగిన సెల్‌ఫోన్‌ వినియోగానికి అనుగుణంగా కస్టమర్లను ఆకర్షించేందుకు టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్లాన్‌లను ప్రవేశపెడుతున్నాయి. దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వీఐ ఇటీవల టెలికాం రంగంలో చౌకైన ప్లాన్‌ను ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని సంవత్సరాల క్రితం, వోడాఫోన్‌ను హచ్‌గా పిలిచినప్పుడు రూ. 4 చిన్న రీఛార్జ్‌ను కంపెనీ “ఛోటా రీఛార్జ్”గా పరిచయం చేసింది. అయితే ప్రస్తుతం వీఐ తన వినియోగదారులకు రూ. 1 ప్లాన్‌ని అందిస్తూ రూ. 4 కంటే తక్కువ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. వీఐ అందించే ఒక్క రూపాయి ప్లాన్‌లో అందించే వివిధ ప్రయోజనాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

వీఐ రూ.1 ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు టాక్ టైమ్‌తో పాటుఆన్-నెట్ కాలింగ్ నిమిషాలతో సహా బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ రూ. 1 ప్లాన్ చెల్లుబాటు వ్యవధి లేదు. కానీ ఇందులో లభించే ప్రయోజనాలు ఒక రోజు వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ ప్లాన్‌లో 75 పైసల టాక్ టైమ్ ఉంటుంది. అలాగే కస్టమర్‌లకు 1 ఆన్-నెట్ నైట్ మినిట్ కాలింగ్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో డేటా లేదా ఎస్‌ఎంఎస్‌ వంటివి ఉండవు. రూ. 99, రూ. 198 లేదా రూ. 204తో వారి వీఐ నంబర్‌ని రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ఈ రూ.1 ప్లాన్ అందుబాటులో ఉంటుంది. మీ ప్లాన్‌కు సంబంధించిన టాక్ టైమ్ ముగిసిన తర్వాత మీరు రూ. 1 ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. అయితే కేవలం మిస్డ్ కాల్స్ చేయడానికి మాత్రమే అనుమతిస్తుంది. 

VI వీఐ రూ.169 ప్లాన్‌ 

వీఐ కొత్తగా రూ. 169 ధరతో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కస్టమర్‌లకు మెరుగైన విలువ ఆధారిత సేవలను అందిస్తుంది. కొత్త రూ.169 ప్రీపెయిడ్ ప్లాన్ కస్టమర్‌లకు వారి మొబైల్ అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పొడిగించిన చెల్లుబాటు వ్యవధితో వస్తుంది. సాధారణ 28 రోజుల చెల్లుబాటుకు బదులుగా పూర్తి 30 రోజుల సేవను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు వినియోగించుకోవడానికి మొత్తం 8 జీబీ డేటా ఉంటుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది రోజువారీ పరిమితి లేకుండా డేటాను అందిస్తుంది. 30-రోజుల చెల్లుబాటు వ్యవధిలో ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Moto G04s for Rs. 10,000: రూ. 10 వేలలో కళ్లు చెదిరే ఫీచర్లు.. మోటో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ మోటోరోలో ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. మోటో జీ04ఎస్‌ పేరుతో ఈ ఫోన్‌ను భారత్‌లోకి లాంచ్‌ చేయనున్నారు. ఇంతకి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

moto-g04s-price.jpg?w=1280&enlarge=true

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. మోటో జీ04ఎస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. మోటోరోలా నుంచి ఇప్పటికే వచ్చే వచ్చిన మోటో ఎడ్జ్‌ 50 ఫ్యుజన్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

motorola.jpg

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్‌ను ఇవ్వనున్నారు. అలాగే స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ కోసం ఇందులో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. యూనిసోక్ టీ606 ఒక్టాకోర్ ప్రాసెసర్ విత్ 4జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

motorola-new-phone.jpg

ఈ ఫోన్‌లో ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 4 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీని అందించారు. మోటో జీ04ఎస్‌ స్మార్ట్ ఫోన్‌లో డాల్బీ ఆట్మోస్‌ ఆడియోను ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

moto-new-phone-1.jpg

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ పవర్డ్ రెయిర్‌ కెమెరాను అందించారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌ నైట్ విజన్, పోర్ట్రైట్ మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది.

moto-2.jpg

బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందిస్తున్నారు. ధర విషయానికొస్తే భారత కరెన్సీ ప్రకారం ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 10,700గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా పలు ఈ కామర్స్‌ సంస్థలు ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందించనున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Oneplus Open 2: వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర అక్షరాల రూ. లక్షన్నర..

టెక్‌ మార్కెట్లో బడ్జెట్‌ ఫోన్‌లకు ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో.. ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లకు సైతం అదే స్థాయిలో డిమాండ్‌ ఉంటోంది. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీలన్నీ మడతపెట్టే ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్ మార్కెట్లోకి కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

oneplus-3.jpg?w=1280&enlarge=true

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ మార్కెట్లోకి కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్‌ ఓపెన్‌ 2 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. నిజానికి గతేడాది లాంచ్‌ చేసిన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్‌గా కొత్త వన్‌ప్లస్ ఓపెన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కొత్త లుక్‌లో అందుబాటులోకి రాబోతోంది.

oneplus-open-2.jpg

ఇదిలా ఉంటే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ నెట్టింట మాత్రం కొన్ని ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

oneplus-open-2-features.jpg

ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 4 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ శాటీలైట్‌ టెక్నాలజీతో వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ను ఓప్పో ఫైండ్‌ ఎన్‌5కి రీబ్రాండెడ్‌ వెర్షన్‌ను తీసుకొస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

onplus-new-phone.jpg

ఈ ఫోన్‌లో 5 కెమెరాలతో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. వీలో 64 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సర్‌, 48 ఎంపీ మెయిన్‌ సెన్సర్‌, 48 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌లతో పాటు అన్‌ఫోల్డ్‌ డిస్‌ప్లేపై మరో 32 ఎంపీ కెమెరాను ఇవ్వనున్నారని సమాచారం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 20 ఎంపీ కెమెరా ఇవ్వనున్నారు.

oneplus-open-2-price.jpg

ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 1,40,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Poco F6: ఆ చిప్ కలిగి ఉన్న ఫస్ట్ ఫోన్ ఇదే.. క్రేజీ లుక్.. టాప్ క్లాస్ ఫీచర్స్.. సేల్ ఎప్పటి నుంచి అంటే..

పోకో కంపెనీ మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో ఎఫ్ 6 అనే మోడల్ ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ 90 డబ్ల్యూ టర్బో చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఫోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ మే 23న విడుదల చేశారు. దీని ప్రారంభ రూ.29,999 గా నిర్ణయించారు. ఆఫర్ల పై దాదాపు రూ.నాలుగు వేల తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

poco-f6-4.jpg?w=1280

దేశ మార్కెట్లోకి రోజూ అనేక మోడళ్ల స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అనేక కొత్త ఫీచర్లు, డిజైన్ తో ఆకట్టుకుంటున్నాయి. వివిధ కంపెనీలు ప్రజలకు అందుబాటు ధరలలో బెస్ట్ ఫోన్లు అందజేస్తున్నాయి. పనితీరు, నాణ్యత, బ్యాటరీ బ్యాకప్ తదితర వాటిలో వేటికవే తీసిపోని విధంగా ఉంటున్నాయి. ఇందులో భాగంగానే పోకో కంపెనీ ఎఫ్ 6 పేరిట కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.

పొకో ఎఫ్ 6 విడుదల..

పోకో కంపెనీ మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో ఎఫ్ 6 అనే మోడల్ ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ 90 డబ్ల్యూ టర్బో చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఫోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ మే 23న విడుదల చేశారు. దీని ప్రారంభ రూ.29,999 గా నిర్ణయించారు. ఆఫర్ల పై దాదాపు రూ.నాలుగు వేల తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

అనేక ప్రత్యేకతలు..

ఫోకో ఎఫ్ 6 ఫోన్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్‌సెట్ మద్దతు ఉంది. స్పష్టమైన డిస్‌ప్లే, వేగవంతమైన పనితీరు, మంచి కెమెరా, ఎక్కువ బ్యాకప్ కలిగిన బ్యాటరీతో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ధర, ఇతర వివరాలు..

పోకో ఎఫ్ 6 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 ఎంబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో కూడిన స్టాండర్డ్ వేరియంట్ రూ.29,999, అలాగే 12 ఎంబీ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో కూడిన వెర్షన్ రూ. 31,999, ఇంకా 12 ఎంబీ 512 జీబీ కలిగిన మరో వేరియంట్ రూ.33,999 ధరలలో అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు వేరియంట్లు వేటికమే ప్రత్యేకమైనవి.

29న సేల్ ప్రారంభం..

మే నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సేల్ ఆన్ లైన్ లో ప్రారంభమవుతుంది. మొదటి రోజు ప్రత్యేక ఆఫర్లో దాదాపు 4 వేల రూపాయల తగ్గింపు ధరలో వీటిని కొనుగోలు చేయవచ్చు. అంటే పోకో ఎఫ్ 8 ఎంబీ+256 జీబీ వెర్షన్ రూ.25,999, 12 ఎంబీ+256 జీబీ వెర్షన్ రూ.27,999, 12 ఎంబీ+ 512 జీబీ వెర్షన్ రూ.29,999కి పొందవచ్చు. అలాగే రూ. 2 వేలు బ్యాంక్ ఆఫర్‌, మరో రూ. 2 వేలు ప్రొడక్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ఉన్నాయి. సేల్ ప్రారంభమైన మొదటి రోజు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక వారంటీ ఉంటుంది.

మరింత తగ్గింపు..

ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లు, ఈఎమ్ ఐ విధానంలో తీసుకునేవారు రూ. 2 వేల తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. క్లాసిక్ బ్లాక్, టైటానియం గ్లో అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

ఆకట్టుకునే డిజైన్..

పోకో ఎఫ్ 6 5జీ స్మార్ట్ ఫోన్ మంచి డిజైన్ తో చూడగానే ఆకట్టుకుంటుంది. ఫీచర్లు కూాడా అద్భుతంగా ఉన్నాయి. దీనిలో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ను ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఏర్పాటు చేశారు. వీడియో కోసం f/1.59 ఎపర్చరు, హెచ్ డీఆర్10 + ఫీచర్‌తో డ్యూయల్ సోనీ కెమెరాను అమర్చారు. 90 డబ్ల్యూ టర్బో చార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్ ఎక్కువ సేపు పనిచేస్తుంది. బూస్ట్ ఛార్జింగ్ స్పీడ్ ఫీచర్ తో పాటు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌, 6.67 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ విక్టస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

కాంతివంతమైన డిస్ ప్లే..

పోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ లో క్రిస్టల్ రెస్ ఫ్లో అమోలెడ్ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ఇది 2400 నిట్‌ల వరకు బ్రైట్ నెస్ తో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటుంది. దేశంలో కొత్త క్వాల్కమ్ చిప్‌ని ప్యాక్ చేసిన మొదటి ఫోన్ కూడా ఇదే. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా షియోమి హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Lava Yuva 5G: రూ. 10 వేలలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. డిజైన్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

లావా యువ 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చే దిశగా లావా కీలక అడుగు వేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన చిన్న టీజర్‌ను సైతం కంపెనీ విడుదల చేసింది. బ్రేస్‌ యూవర్‌ సెల్ఫ్‌, లావా 5జీ కమింగ్‌ సూన్‌ అంటూ ట్విట్టర్‌ వేదికగా ఈ వీడియోను కంపెనీ షేర్‌ చేసింది. ఈ వీడియో చూస్తుంటే ఫోన్‌ డిజైన్‌ చాలా బాగా ఉండేలా కనిపిస్తోంది...

lava-5g-1.jpg?w=1280

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రాగా, దేశంలోని అన్ని నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ని విస్తరించేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వరుసగా 5జీ ఫోన్‌లు లాంచ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫోన్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ లావా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది.

లావా యువ 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చే దిశగా లావా కీలక అడుగు వేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన చిన్న టీజర్‌ను సైతం కంపెనీ విడుదల చేసింది. బ్రేస్‌ యూవర్‌ సెల్ఫ్‌, లావా 5జీ కమింగ్‌ సూన్‌ అంటూ ట్విట్టర్‌ వేదికగా ఈ వీడియోను కంపెనీ షేర్‌ చేసింది. ఈ వీడియో చూస్తుంటే ఫోన్‌ డిజైన్‌ చాలా బాగా ఉండేలా కనిపిస్తోంది.

ఇక ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ప్రస్తుతం నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో డ్యుయల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. సర్క్యూలర్‌ మోడల్‌లో కెమెరాను డిజైన్‌ చేశారు. ఇక కెమెరా పనితీరు విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో ఈ కెమెరా ఉండనుంది.

అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుందని సమాచారం.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఇందులో కెమెరాకు ప్రత్యేకంగా ఏఐ టెక్నాలజీని అందించనున్నారని సమాచారం. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 10 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

...

Complete article

Brace yourself, Gen-Z!

#Yuva5G - Coming soon...

 

Link to comment
Share on other sites

  • 0

Fast Charging Smartphones: 5 అద్భుతమైన 5జీ స్మార్ట్‌ఫోన్లు.. నిమిషాల్లోనే ఛార్జింగ్‌

Five Fast Charging Smartphones: ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. మార్కెట్లో రోజురోజుకు స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అయితే ప్రతి ఫోన్‌లో ఛార్జింగ్‌ అనేది ముఖ్యమైన భాగం. ఛార్జింగ్‌ ఎంత సేపు వస్తే అంత మంచిది. ఉదయాన్నే నిద్రలేచి ఫోన్‌కి ఛార్జింగ్‌ పెట్టాలి. ఫోన్ ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటే, మీ పనులకు ఆటంకం ఏర్పడుతుంటుంది. అలాంటి సమయంలో తక్కువ..

smartphone1-2.jpg?w=1280&enlarge=true

Five Fast Charging Smartphones: ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. మార్కెట్లో రోజురోజుకు స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అయితే ప్రతి ఫోన్‌లో ఛార్జింగ్‌ అనేది ముఖ్యమైన భాగం. ఛార్జింగ్‌ ఎంత సేపు వస్తే అంత మంచిది. ఉదయాన్నే నిద్రలేచి ఫోన్‌కి ఛార్జింగ్‌ పెట్టాలి. ఫోన్ ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటే, మీ పనులకు ఆటంకం ఏర్పడుతుంటుంది. అలాంటి సమయంలో తక్కువ సమయంలోనే పూర్తి ఛార్జింగ్‌ అయ్యే ఫోన్‌ల కోసం వెతుకుతుంటారు. ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు చాలా ఉన్నాయి. ఈ ఫోన్‌లు 120 W లేదా అంతకంటే ఎక్కువ మద్దతుతో అందుబాటులో ఉన్నాయి.

smartphone2-1.jpg

Redmi Note 13 Pro+ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేస్తోంది. ఫోన్ 120w హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఈ Redmi స్మార్ట్‌ఫోన్ కేవలం 19 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ 8GB RAM మద్దతుతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 30,999. అమెజాన్ ఈ ఫోన్‌పై రూ. 3000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కలిగి ఉంది. మీరు ఈ ఫోన్‌ను చౌకగా పొందవచ్చు. ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా, వాటర్‌ప్రూఫ్ రేటింగ్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్‌డ్‌ AMOLED డిస్‌ప్లే ఉన్నాయి.

smartphone3-1.jpg

Motorola Edge 50 Pro ఫోన్ 125 W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.35,999. క్యాష్‌బ్యాక్ పొందడం ద్వారా ఈ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. ఈ ఫోన్ 144 Hz రేటింగ్‌తో 6.7-అంగుళాల 1.5 POLED కర్వ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ AIలో కూడా పనిచేసే ప్రో గ్రేడ్ కెమెరా సెటప్‌ను కూడా పొందుతోంది.

smartphone4-1.jpg

IQOO నియో 9 ప్రో : IQ నుండి అద్భుతమైన ఫోన్ 129 W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో కూడా అందుబాటులో ఉంది. ఇది 5160 mAh బ్యాటరీని కలిగి ఉంది. రెడ్ కలర్ ఫోన్ కూడా భారీగా కనిపిస్తోంది. అమెజాన్‌లో ఈ ఫోన్ 8GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో శక్తివంతమైన ప్రాసెసర్, సాలిడ్ కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్ కూడా ఉన్నాయి.

smartphone5-1.jpg

IQOO 12: ఈ మొబైల్‌ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్. 5000 mAh బ్యాటరీ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.52,999కి అందుబాటులో ఉంది. మీరు బ్యాంక్ ఆఫర్‌లపై తగ్గింపులను కూడా పొందవచ్చు. ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ బలమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దాని ప్రాసెసర్ చాలా శక్తివంతమైనది.

smartphone6-1.jpg

iQOO నియో 7 ప్రో 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంది. దీనితో పాటు 120 w ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జింగ్ కోసం సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 25 నిమిషాలు పడుతుంది. ఈ ఫోన్ యొక్క 8GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.29,000. మీరు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్పీకర్ స్టీరియో సౌండ్‌ని కలిగి ఉంది. ఫోన్‌లో హై-డెఫినిషన్ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్ కూడా ఉన్నాయి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jio Plans for under Rs. 200: రూ. 200లోపు జియో బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌.. అదిరిపోయే బెనిఫిట్స్‌.

ప్రముఖ టెలికం సంస్థ జియోకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది వినియోగదారులను సంపాదించుకొని అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ సంస్థ. తక్కువ ధరకే ఇంటర్నెట్‌, అన్‌లిమిటెడ్‌ కాలింగ్ ఆఫర్లను అందించి. ప్రత్యర్థి కంపెనీలకు పోటీనిచ్చింది. మరీ ముఖ్యంగా...

jio-recharge-plan-2.jpg?w=1280

ప్రముఖ టెలికం సంస్థ జియోకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది వినియోగదారులను సంపాదించుకొని అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ సంస్థ. తక్కువ ధరకే ఇంటర్నెట్‌, అన్‌లిమిటెడ్‌ కాలింగ్ ఆఫర్లను అందించి. ప్రత్యర్థి కంపెనీలకు పోటీనిచ్చింది. మరీ ముఖ్యంగా రూ. 200లోపు పలు ఆకర్షణీయమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తున్నారు. ఇంతకీ రూ. 200 లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఏంటి.? వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జియో రూ. 149 ప్లాన్‌..

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌లో ఇదీ ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 20 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో రోజుకు 1 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందుతారు.

జియో రూ.179 ప్లాన్..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం పొందొచ్చు. రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు.

జియో రూ. 199 ప్లాన్‌..

23 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ రీఛార్జ్‌ ప్లాన్‌తో రోజుకు 1.5 జీబీ డేటా పొందొచ్చు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు.

జియో రూ. 152 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో రోజుకు 500 ఎంబీ డేటా పొందుతారు. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Redmi 13 4G: బడ్జెట్‌లో మంచి ఫీచర్ల ఫోన్‌ కోసం చూస్తున్నారా.? ఇదే బెస్ట్‌ ఆప్షన్‌

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థలు తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ 13 పేరుతో తీసుకొస్తున్న ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

redmi-3.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రెడ్‌మీ 13 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని లాంచ్‌ చేస్తోంది. అయితే ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రెడ్‌మీ కొత్తగా మళ్లీ 4జీ ఫోన్‌ లాంచ్‌ చేయడం గమనార్హం.

redmi13-price.jpg

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర వఙషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 16,500గా ఉండగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19వేలుగా ఉండనుంది. ఈ ఫోన్‌ను బ్లాక్‌, బ్లూ, పింక్‌, ఎల్లో షేడ్స్‌తో తీసుకొస్తున్నారు.

tech-news-10.jpg

రెడ్‌మీ13 స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్ హెలియో జీ91 ఆల్ట్రా ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తోపాటు రెండు సర్క్యులర్ కెమెరా యూనిట్లను అందించనున్నారు. స్పీకర్ గ్రిల్లె, మిక్, యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు.

redmi-new-phone-1.jpg

ఇక ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ ఈ ఫోన్‌ సొంతం. అలాగే ఇందులో ఎడ్జ్ రైట్ పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్‌ను అందించారు. మైక్రో ఎస్టీ కార్డు ద్వారా స్టోరేజీ కెపాసిటీని ఒక టిగా బైట్‌ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

redmi-13-price.jpg

ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడి ప్రైమరీ సెన్సర్‌ కెమరా, 2 మెగాపిక్సెల్స్‌ సెకండరీ కెమెరా, సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 33 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5030 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇవ్వనున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Oppo Find X7 Ultra: కళ్లు చెదిరే ఫీచర్లతో ఒప్పో ఫోన్‌.. ఏమన్నా ఫీచర్సా అసలు..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో ఓవైపు బడ్జెట్ ఫోన్‌లతో పాటు ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లను సైతం విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా పేరుతో ఓ ప్రీమియం ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించింది ఒప్పో. ఇంతకీ ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రాలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

oppo-find-x7-ultra.jpg?w=1280&enlarge=tr

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో గత కొన్ని రోజుల క్రితం మార్కెట్లోకి ఎప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా పేరుతో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ప్రపంచలోనే తొలి క్వాడ్‌ మెయిన్‌ కెమెరా విత్ హైపర్‌టోన్‌ ఇమేజ్‌ ఇంజన్‌తో తీసుకొచ్చిన ఫోన్‌ ఇదే కావడం విశేషం.

oppo-find-x7-ultra-features.jpg

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో హాసెల్‌బ్లాడ్ బ్రాండెడ్ క్వాడ్ రియ‌ర్ కెమెరా సెట‌ప్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన నాలుగు రెయిర్ కెమెరాలను అందించారు.

oppo-find-x7-ultra-price.jpg

ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో సోనీ లేటెస్ట్ 1 ఇంచ్ టైప్ ఎల్‌వైటీ-900 సెన్స‌ర్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

oppo-new-phone.jpg

ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌7 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌లో 100 వాట్స్‌ సూపర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. పైన్‌ షాడో, సిల్వర్‌ మూన్‌, వ్యాస్ట్‌ సీ, స్కై కలర్స్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ. 70 వేలుగా ఉంది.

oppo-smartphone.jpg

ఈ స్మార్ట్‌ పోన్‌ కేవలం 40 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌తోకూడిన కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 1600 నిట్స్‌ ఫుల్ స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఐపీ68 రేటింగ్‌ను ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Tending Jio vs Airtel Rs. 299 Plans: రూ.299 ప్లాన్ ఎందుకు బాగా ట్రెండ్ అవుతోంది..!

ఈ రోజుల్లో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ భారతీయ టెలికాం పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందింది. ఎయిర్‌టెల్ లేదా జియో కావచ్చు. భారతదేశంలోని ఈ రెండు పెద్ద టెలికాం కంపెనీల రూ. 299 ప్లాన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఏం ఉంది అనే ప్రశ్న తలెత్తుతుంది. దీని కారణంగా ప్రజలు ఈ ప్లాన్..

mobile-recharge-3.jpg?w=1280

ఈ రోజుల్లో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ భారతీయ టెలికాం పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందింది. ఎయిర్‌టెల్ లేదా జియో కావచ్చు. భారతదేశంలోని ఈ రెండు పెద్ద టెలికాం కంపెనీల రూ. 299 ప్లాన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఏం ఉంది అనే ప్రశ్న తలెత్తుతుంది. దీని కారణంగా ప్రజలు ఈ ప్లాన్ గురించి చర్చించుకుంటున్నారు. Airtel, Jio ఈ రూ.299 ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 299:

Airtel రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 1.5GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ చెల్లుబాటు సమయంలో వినియోగదారులు అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ సౌకర్యాన్ని పొందుతారు. ఇది కాకుండా రోజుకు 100 SMS సౌకర్యం కూడా అందించబడుతుంది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత 5G డేటా, 3 నెలల ఉచిత అపోలో సబ్‌స్క్రిప్షన్, Hellotune, Wynk Musicకు ఉచిత యాక్సెస్‌ను పొందుతారు.

జియో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్:

జియో రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి మరింత చర్చ జరుగుతోంది. జియో వెబ్‌సైట్ ప్రకారం.. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ 2జీబీ హై స్పీడ్ డేటా, రోజువారీ 100 SMS, అపరిమిత లోకల్ ఎస్‌టీడీ, రోమింగ్ కాల్‌లను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో ఉచితంగా లభించే జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌లో జియో సినిమా ప్రీమియం ప్రయోజనాలు ఉండవని ఈ ప్లాన్ వివరాలతో పాటు జియో వెబ్‌సైట్‌లో స్పష్టంగా రాసి ఉంది.

జియో సినిమా ప్రీమియం ప్లాన్ రూ. 299:

కొన్ని రోజుల క్రితం కంపెనీ ప్రారంభించిన జియో సినిమా రూ.299 ప్లాన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.. ఈ ప్లాన్ కారణంగా రూ.299 ప్లాన్ సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. రిలయన్స్ జియో జియో సినిమా ప్రీమియం కోసం వార్షిక ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 12 నెలలు అంటే 365 రోజులు. ఈ ప్లాన్ ధర రూ.299. ఇందులో వినియోగదారులు స్పోర్ట్స్, లైవ్ కంటెంట్ మినహా అన్ని కంటెంట్‌ను యాడ్-రహితంగా చూసే అవకాశాన్ని పొందుతారు. ఇది కాకుండా జియో సినిమా అన్ని ప్రీమియం కంటెంట్ ఇందులో అందుబాటులో ఉంది. వినియోగదారులు 4కే వీడియో నాణ్యతతో బహుళ భాషల్లో విభిన్న బాలీవుడ్, హాలీవుడ్ కంటెంట్‌లను చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు జియో రూ. 299 జియో సినిమా ప్రీమియం ప్లాన్‌ను ప్రారంభించింది. దీనిలో ఈ ప్రయోజనాలన్నీ ఒక ఫోన్‌ కోసం మొత్తం సంవత్సరానికి అందుబాటులో ఉంటాయి. జియో సినిమా వార్షిక ప్రీమియం ప్లాన్ కోసం ఇంతకుముందు మీరు రూ. 999 ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇప్పుడు అది కేవలం రూ. 299కి మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

జియో ప్రీపెయిడ్, ప్రీమియం విభిన్న ప్లాన్‌లు

జియో ప్రీపెయిడ్ కనెక్షన్ రూ. 299 టారిఫ్ ప్లాన్‌తో జియో సినిమా ప్రీమియం ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉందని, జియో ఈ కొత్త రూ. 299 ప్లాన్ గురించి వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. జియో ప్రీపెయిడ్ సిమ్ రూ. 299 ప్లాన్‌తో, సాధారణ జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ మాత్రమే 28 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. ఇందులో ప్రీమియం ప్రయోజనాలు అందుబాటులో లేవు. అదే సమయంలో జియో సినిమా ప్రీమియం ఒక సంవత్సర ప్రణాళికను జియో సినిమా యాప్‌కి వెళ్లి కొనుగోలు చేయాలి. దీని కోసం రూ. 299 విడిగా ఖర్చు చేయాలి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jio: జియో నుంచి అదిరిపోయే ప్లాన్‌.. రూ.26 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ!

రిలయన్స్‌ జియో.. అనతికాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఇతర నెట్‌వర్క్‌ కంపెనీలకు పోటీగా జియో దూసుకుపోతోంది. వినియోగదారుల కోసం కొత్త కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ మరింత మందిని ఆకర్షిస్తోంది. భారతీయ టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో అతిపెద్ద వినియోగదారులను కలిగి ఉంది. కంపెనీ ఇప్పటికే ఉన్న..

jio-5.jpg?w=1280

రిలయన్స్‌ జియో.. అనతికాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఇతర నెట్‌వర్క్‌ కంపెనీలకు పోటీగా జియో దూసుకుపోతోంది. వినియోగదారుల కోసం కొత్త కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ మరింత మందిని ఆకర్షిస్తోంది. భారతీయ టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో అతిపెద్ద వినియోగదారులను కలిగి ఉంది. కంపెనీ ఇప్పటికే ఉన్న వినియోగదారులకు అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది, వాటిలో కొన్ని కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. కంపెనీ కేవలం రూ. 26 ప్లాన్‌ను అందిస్తోంది, పూర్తి 28 రోజుల పాటు డేటా ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. Reliance Jio రూ. 26 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ నిజానికి JioPhone యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే పరిమిత సమయం వరకు డేటా ప్రయోజనం అందించబడుతుంది. ప్లాన్‌లో అందుబాటులో ఉన్న ప్రయోజనాల గురించి మాట్లాడితే.. ఇది డేటాను మాత్రమే అందిస్తుంది. కాల్ లేదా ఎస్‌ఎంఎస్‌ వంటి ప్రయోజనాలను కలిగి ఉండదు.

26 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, వినియోగదారులకు మొత్తం 2GB డేటా అందుకుంటారు. ఈ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. తక్కువ డేటాను ఉపయోగించే లేదా JioPhoneని ఉపయోగించే సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

ఈ ప్లాన్‌ను ఇప్పటికే ఉన్న ఏదైనా జియోఫోన్‌ రీఛార్జ్ ప్లాన్‌తో టాప్-అప్‌గా ఉపయోగించవచ్చు. జియో ఇతర ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల కంటే ఈ ప్లాన్ చాలా చౌకగా ఉంటుంది. మీరు తక్కువ డేటాను ఉపయోగిస్తుంటే, 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ కావాలనుకుంటే ఈ ప్లాన్ మీకు మంచి ఎంపికగా ఉంటుంది.

మీకు JioPhone లేకపోయినా, అటువంటి ప్రయోజనాలతో కూడిన ప్లాన్‌తో రీఛార్జ్ చేయాలనుకుంటే, మీరు రూ.155 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ JioPhoneని ఉపయోగించని వినియోగదారులకు పైన పేర్కొన్న ప్రయోజనాలను అందిస్తుంది. ఈ డేటా మాత్రమే ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 2GB మొత్తం డేటాను కూడా అందిస్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Realme GT 6T with stunning features: మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌ మీ కొత్త ఫోన్‌.. స్టన్నింగ్‌ ఫీచర్స్‌..

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను తీసుకొస్తూనే ఉంది. మొన్నటి వరకు బడ్జెట్ ఫోన్‌లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా మిడ్ రేంజ్‌లో ఓ మంచి ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ జీటీ 6టీ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

realme-3.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌ మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ జీటీ 6టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌తో పాటు, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

realme-gt-6t.jpg

రియల్‌మీ జీటీ 6టీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన 1.5K LTPO 3D కర్వ్డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌, 6,000 నిట్‌ల వరకు బ్రైట్ నెస్ ఈ ఫోన్‌ సొంతం. దీంతో సన్‌లైట్‌లోనూ స్క్రీన్‌ స్పష్టంగా కనిపిస్తుంది.

realme-gt-6t-features.jpg

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 120 వాట్స్‌కు సపోర్ట్ చేసే ఫాస్ట్‌ ఛార్జర్‌ను అందించారు. 10 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ చెబుతోంది.

realme-new-phone-1.jpg

రియల్‌మీ జీటీ 6టీ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో గూగుల్‌ జెమిని ఏఐ ఫీచర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

smartphone-11.jpg

ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 30,999కాగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 32,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 35,999గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 33,999గా ఉంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Moto G04s with awesome features for just Rs. 7,000: రూ. 7 వేలలో కళ్లు చెదిరే ఫీచర్స్‌.. మోటో నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల వరుసగా బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా రూ. 10 వేల లోపు మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటీ జీ04ఎస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

moto-3.jpg?w=1280&enlarge=true

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని మోటో జీ04ఎస్‌ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. గతేడాది తీసుకొచ్చిన మోటో జీ04 స్మార్ట్ ఫోన్‌కు అప్‌డేట్ వెర్షన్‌గా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

moto-g04s-1.jpg

మోటో జీ04ఎస్‌ స్మార్ట్ ఫోన్‌ గురువారం లాంచ్‌ అవుతుండగా జూన్‌ మొదటి వారం నుంచి సేల్స్‌ ప్రారంభంకానున్నాయి. ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ స్మార్ట్ ఫోన్‌ను విక్రయించనున్నారు.

moto-g04s-features.jpg

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. యూనిసోక్ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

moto-g04s-price-1.jpg

ఈ స్మార్ట్ ఫోన్‌లో డాల్బీ ఆట్మోస్‌ సౌండ్‌ను అందించారు. 6.6 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అంచారు. 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు.

moto-phone.jpg

ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్‌లో 500 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6,999 కాగా.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,499గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Realme: రియల్‌మీ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్‌, ధర, ఫీచర్స్‌ ఇలా..!

రియల్‌మీ భారతదేశంలో Narzo N65 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.11,499. ఈ ఫోన్ చిప్‌లో MediaTek Dimensity 6300 సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఫోన్ 4జీబీ, 6జీబీ ర్యామ్‌ ఎంపికలతో 128జీబీ ఆన్-బోర్డ్ నిల్వను కూడా అందిస్తుంది. ఇంకా, స్మార్ట్‌ఫోన్ అంబర్ గోల్డ్, డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. కొత్త మోడల్‌ను రియల్‌ ఆన్‌లైన్ స్టోర్,.

realme-narzo-n65-5g.jpg?w=1280

రియల్‌మీ భారతదేశంలో Narzo N65 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.11,499. ఈ ఫోన్ చిప్‌లో MediaTek Dimensity 6300 సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఫోన్ 4జీబీ, 6జీబీ ర్యామ్‌ ఎంపికలతో 128జీబీ ఆన్-బోర్డ్ నిల్వను కూడా అందిస్తుంది. ఇంకా, స్మార్ట్‌ఫోన్ అంబర్ గోల్డ్, డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. కొత్త మోడల్‌ను రియల్‌ ఆన్‌లైన్ స్టోర్, ఇ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo N65 ధర మరియు వేరియంట్లు

  • 4GB RAM + 128GB స్టోరేజీ: రూ. 11,499
  • 6GB RAM + 128GB స్టోరేజీ: రూ. 12,499

Realme Narzo N65 స్మార్ట్‌ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో మే 31 నుండి జూన్ 4 వరకు విక్రయిస్తోంది. అలాగే, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ భారతదేశంలో అందుబాటులో ఉంది.ఈ కాలంలో, వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 తగ్గింపు కూపన్‌ను పొందవచ్చు. దీంతో 4GB + 128GB స్మార్ట్‌ఫోన్ రూ. 10,499కి, 6GB + 128GB స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,499కి తగ్గించింది.

స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 6300 చిప్‌తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB ఆన్-బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ DUVSUT చేత ధృవీకరించబడిందని రియల్‌మీ తెలిపింది. అలాగే, కంపెనీ స్మార్ట్‌ఫోన్ రూపకల్పన, నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది. అదనంగా స్మార్ట్‌ఫోన్ నీరు, ధూళి నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.

Realme Norso N65 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

6.67-అంగుళాల, 720×1604 (HD) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 500నిట్స్.

ప్రాసెసర్: Mediatek డైమెన్సిటీ 6300

  • RAM: 4 GB, 6 GB
  • స్టోరేజీ: 128 GB
  • వెనుక కెమెరా: 50MP
  • ఫ్రంట్ కెమెరా: 8MP
  • బ్యాటరీ: 5000mAh
  • ఛార్జింగ్: 15W వైర్
  • OS: ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 5.0

ఈ ఫోన్‌ MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ ఉంది. అదే శక్తివంతమైన ప్రాసెసర్ Realme C65 5Gలో ఉంది. ఈ చిప్‌సెట్ రోజువారీ పనులు, 5G కనెక్టివిటీ కోసం వేగవంతమైన పనితీరును అందిస్తుంది. వెనుక భాగంలో 50MP కెమెరా సెటప్ ఉంది. అదనంగా ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. అంటే ఇది దుమ్ము, నీటి నుండి కొంత రక్షణను కలిగి ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో వాటర్‌ ఫ్రూప్‌ కాదని గమనించండి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Pixel 8a: గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదు..

సాధారణంగా ఈ కామర్స్‌ సంస్థలు పండుగల వేళ డిస్కౌంట్స్ ప్రకటిస్తాయని తెలిసిందే. అయితే ఇటీవల కాలంతో సంబంధం లేకుండా ఆఫర్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది...

google-pixel-8a.jpg?w=1280

సాధారణంగా ఈ కామర్స్‌ సంస్థలు పండుగల వేళ డిస్కౌంట్స్ ప్రకటిస్తాయని తెలిసిందే. అయితే ఇటీవల కాలంతో సంబంధం లేకుండా ఆఫర్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్‌ లభిస్తోంది.? ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 75,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై ప్రత్యేక డీల్‌లో భాగంగా రూ. 63,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు.. ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 8000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే అదనంగా రూ. 4000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో అన్న ఆఫర్లు కలుపుకొని ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 24000 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇక ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఇవ్వడం ద్వారా గరిష్టంగా రూ. 39,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.

ఇక గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.2 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెస్‌ రేట్ ఈ ఫోన్ సొంతం. అలాగే ఇందులో Google Tensor G3 చిప్‌సెట్‌ను అందించారు. Titan M2 సెక్యూరిటీ చిప్‌ ఈ ఫోన్‌ సొంతం. ఈ ఫోన్‌ను మొత్తం రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. వీటిలో ఒకటి 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌.. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 12 మెగాపిక్సెల్స్‌తో సెకండరీ కెమెరాను ఇచ్చారు. బ్యాటరీ పరంగా చూస్తే ఇందులో.. 27 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4575 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Smartphones for under Rs. 10,000: రూ.10 వేల లోపు అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్‌ వీటి సొంతం

మీరు స్మార్ట్‌ఫోన్ కొనడానికి రూ.10,000 బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారా? ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. రూ. 10,000 లేదా అంతకంటే తక్కువ ధరతో మీరు ఏ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో మీరు ఏ ఫీచర్లను పొందుతున్నారు. మీరు ఎంత తగ్గింపు పొందుతున్నారు? మీరు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి ఆర్డర్ చేయడం ద్వారా బంపర్ డిస్కౌంట్ ప్రయోజనాన్ని..

smartphone-11.jpg?w=1280

మీరు స్మార్ట్‌ఫోన్ కొనడానికి రూ.10,000 బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారా? ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. రూ. 10,000 లేదా అంతకంటే తక్కువ ధరతో మీరు ఏ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో మీరు ఏ ఫీచర్లను పొందుతున్నారు. మీరు ఎంత తగ్గింపు పొందుతున్నారు? మీరు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి ఆర్డర్ చేయడం ద్వారా బంపర్ డిస్కౌంట్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

Redmi 13C ఫోన్ తక్కువ ధరకే..

మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లో అనేక ఫీచర్లను పొందుతారు. MediaTek Helio G85 చిప్‌సెట్‌తో ఈ ఫోన్‌లో మీరు ఫోటో-వీడియోగ్రఫీ కోసం 50MP AI ట్రిపుల్ కెమెరాను పొందుతారు. మీరు స్మార్ట్‌ఫోన్‌లో 5000mA బ్యాటరీని పొందుతారు. ఇది 18 వాట్, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 11,999 అయినప్పటికీ, మీరు దీన్ని 36 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,699కే పొందవచ్చు.

POCO C65 స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు:

4GB RAM 128GB ROM స్టోరేజ్ వేరియంట్‌ను డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్ 6GB RAM 128GB ROM స్టోరేజ్ వేరియంట్‌ను కూడా పొందుతారు. ఫోన్ 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. Helio G85 చిప్‌సెట్‌తో వస్తుంది. మీరు ఫోన్‌లో 5000 mAh బ్యాటరీని పొందుతారు. ఇది మీకు చాలా కాలం పాటు ఉంటుంది. ఫోటోలు, వీడియోల కోసం ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ. 11,999 అయినప్పటికీ, మీరు దీన్ని అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ నుండి కేవలం రూ. 7,499కి డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M14:

Samsung Galaxyలో మీరు ఫోటో-వీడియోగ్రఫీ కోసం ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతారు. స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందించింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.13,999 అయినప్పటికీ, మీరు దీన్ని 36 శాతం తగ్గింపుతో కేవలం రూ.8,999కే కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు కాకుండా, LAVA 02, Vivo Y18e, Nokia G42 మరియు Tecno POP 8 వంటి స్మార్ట్‌ఫోన్‌లు రూ. 10 వేల లోపు అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలంటే, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Truke Earbuds: అద్భుతమైన సౌండ్ క్వాలిటీ ఇయర్‌బడ్స్‌.. చౌక ధరల్లోనే..

మార్కెట్లో రకరకాల ఇయర్‌బడ్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరల్లో నాణ్యమైనవి పొందవచ్చు. వెయ్యి రూపాయల లోపు మీ కోసం ఇయర్‌బడ్‌లు కొనాలని ఆలోచిస్తున్నారా? ఇవి బెస్ట్‌ ఇయర్‌బడ్‌లుగా నిరూపిస్తున్నాయి. ట్రూక్ తన శక్తివంతమైన TWS BTG అల్ట్రా ఇయర్‌బడ్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. మీరు ఈ ఇయర్‌బడ్‌లలో మెరుగైన ఫీచర్‌లు, నాణ్యతను పొందుతున్నారు. ఇంత తక్కువ ధరకు వచ్చే ఈ ఇయర్‌బడ్‌ల..

truke-earbuds.jpg?w=1280

మార్కెట్లో రకరకాల ఇయర్‌బడ్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరల్లో నాణ్యమైనవి పొందవచ్చు. వెయ్యి రూపాయల లోపు మీ కోసం ఇయర్‌బడ్‌లు కొనాలని ఆలోచిస్తున్నారా? ఇవి బెస్ట్‌ ఇయర్‌బడ్‌లుగా నిరూపిస్తున్నాయి. ట్రూక్ తన శక్తివంతమైన TWS BTG అల్ట్రా ఇయర్‌బడ్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. మీరు ఈ ఇయర్‌బడ్‌లలో మెరుగైన ఫీచర్‌లు, నాణ్యతను పొందుతున్నారు. ఇంత తక్కువ ధరకు వచ్చే ఈ ఇయర్‌బడ్‌ల ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.

Truke BTG అల్ట్రా గేమింగ్ TWS:

ఈ ఇయర్‌బడ్‌లు వైర్‌లెస్ ఆడియో పనితీరు, కొత్త డిజైన్‌ను పొందుతున్నాయి. ఈ ఇయర్‌బడ్‌లలో ర్యాపిడ్ పవర్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించబడింది. దీని కారణంగా ఈ ఇయర్‌బడ్‌లు నిమిషాల్లో ఛార్జ్ అవుతాయి. Quad mic PureVoice ENC టెక్నాలజీ, Google Assistant వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. సంగీత ప్రియులు, గేమింగ్‌ను ఇష్టపడే వ్యక్తులు ఈ ఇయర్‌బడ్‌లను ఎక్కువగా ఇష్టపడతారు. Truk BTG అల్ట్రా బాటిల్ మోడ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది మొత్తం గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి అంతిమ పనితీరు కోసం రూపొందించబడింది. ఇది 40ms అల్ట్రా-తక్కువ జాప్యాన్ని కలిగి ఉంది.

బ్యాటరీ పరంగా పవర్ ఫుల్:

ఈ ఇయర్‌బడ్‌లు రాపిడ్‌పవర్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తాయి. ఈ సాంకేతికత కారణంగా వారు 10 నిమిషాల ఛార్జ్‌లో 10 గంటల సమయం వరకు వినియోగించుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్‌ల విషయంలో 500mAh బ్యాటరీ వస్తుంది. ఇది 60 గంటల ఆట సమయాన్ని అందిస్తుంది.

ధర:

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ట్రూక్ అధికారిక వెబ్‌సైట్‌లలో BTG అల్ట్రా విక్రయం ప్రారంభమైంది. మీరు మూడు ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయవచ్చు. దీని విక్రయం నేటి నుండి ప్రారంభమైంది. ఆఫర్లలో భాగంగా వీటి ధర కేవలం రూ. 899కే పొందవచ్చు. దీని తర్వాత మీరు ఈ ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేస్తే మీరు వాటిని సాధారణ ధర రూ. 1099కి పొందుతారు.

...

Complete article

Truke BTG Ultra Gaming Earbuds have landed!

40ms Ultra Low Latency Battle Mode

60H Playtime for marathon sessions

360 Spatial Audio

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...