Jump to content
  • 2

Good Phones, Tablets, Gadgets and Plans in India in 2024


TELUGU

Question

Reliance Jio new plan with 90-day validity: 90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన జియో

29-04-2024 Mon 16:26 | Business

రోజుకు 2 జీబీ.. అదనంగా మరో 20 జీబీ డేటా

రూ.749 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ

జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్న టెలికం దిగ్గజం

cr-20240429tn662f7cde6fb06.jpg

దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్ బేస్ కలిగివున్న దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో సాధారణ ఆఫర్లతో పోల్చితే యూజర్లకు అధిక డేటా లభిస్తోంది. ఆఫర్‌లో రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటాను జియో అందిస్తోంది. మొత్తం 200 జీబీల డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఉచిత కాలింగ్, ఎంఎస్‌ఎంలు, ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి.

ఇక ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. 5జీ మొబైల్ కలిగివుండి కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ యాక్సెస్ ఉంటే అదనపు డేటాను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఆఫర్ కింద జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌లకు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 90 రోజులపాటు ఈ సేవలను పొందవచ్చు.

కాగా తక్కువ రేటుతో సాధ్యమైనన్ని గరిష్ఠ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా జియో ఇటీవలే రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అనేక వర్గాలుగా విభజించింది. అందులో భాగంగా ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా భారత్‌లో అత్యధికంగా 45 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లను జియో కలిగివుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా జియో కొనసాగుతోంది.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Oneplus Nord CE4 Lite 5G for under Rs. 20,000: వన్‌ప్లస్ నుంచి కొత్త 5జీ ఫోన్.. ధర రూ. 20వేల లోపే.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అంతే..

ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందిన ప్రీమియం బ్రాండ్ వన్ ప్లస్. ఇప్పుడు మార్కెట్లోకి చవకైన ఫోన్లను లాంచ్ చేస్తోంది. రూ. 20,000లోపు ధరలో టాప్ క్లాస్ ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ ని ఇటీవల లాంచ్ చేసింది. దాని పేరు వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్ 5జీ. జూన్ 27 అంటే గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభమైంది.

Oneplus Nord Ce4 Lite 5g

oneplus-nord-ce4-lite-5g.jpg?w=1280

ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందిన ప్రీమియం బ్రాండ్ వన్ ప్లస్. ఇప్పుడు మార్కెట్లోకి చవకైన ఫోన్లను లాంచ్ చేస్తోంది. రూ. 20,000లోపు ధరలో టాప్ క్లాస్ ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ ని ఇటీవల లాంచ్ చేసింది. దాని పేరు వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్ 5జీ. జూన్ 27 అంటే గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో టాప్ క్లాస్ ఫీచర్లతో ఈ ఫోన్ ని లాంచ్ చేసింది వన్ ప్లస్. ఈ కొత్ ఫోన్లో అంతకు ముందు మోడల్ నోర్డ్ సీఈ3 లైట్ తో పోల్చితే అన్ని విభాగాల్లో అప్ గ్రేడ్లు కనిపిస్తాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బ్యాటరీ సూపర్..

వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 ఫోన్లో 5,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అది కూడా 80వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జంగ్ సపోర్టు ఉంటుంది. వాస్తవానికి ఇప్పటి వరకూ వన్ ప్లస్ 12 మోడల్లోనే 5,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దానిని మించిన రీతిలో ఇప్పుడు ఈ ఫోన్ లో బ్యాటరీని ఇచ్చారు. బ్యాటరీ 20.1 గంటల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ లేదా 47.62 గంటల వీడియో కాల్‌లను ఒకే ఛార్జ్‌పై అందించగలగుతుంది. మొత్తం మీద ఒకే ఛార్జ్‌పై 1.5 నుంచి 2 రోజుల బ్యాటరీ జీవితాన్ని సులభంగా అందిస్తుంది. రివర్స్ వైర్డు ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది

బెస్ట్ డిస్ ప్లే..

ఇంతకు ముందు మోడల్ నోర్డ్ సీఈ3 లైట్ ఎల్సీడీ డిస్ ప్లే ను కలిగి ఉండగా.. ఇప్పుడు లాంచ్ అయిన వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్ 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తుంది. హై-బ్రైట్‌నెస్ మోడ్‌లో 1,200నిట్స్ ను అందిస్తుంది. ఓఎల్ఈడీ ప్యానెల్ ఫోన్ అద్భుతమైన రంగులను చూపుతుంది. సోషల్ మీడియా ద్వారా అనంతంగా స్క్రోలింగ్ చేసినా లేదా ఓటీటీలో మీకు ఇష్టమైన షోను వీక్షించినా మిమ్మల్ని ఇది నిరాశపర్చదు.

ఆక్వా టచ్ ఫంక్షనాలిటీ..

ఈ ఫోన్లో ఆక్వా టచ్ ఫంక్షనాలిటీని అదనంగా జోడంచారు. డిస్ప్లే లేదా మీ తడి వేళ్లపై నీటి బిందువులను గుర్తించడానికి ఆక్వా టచ్ తెలివైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. ఇది తేమను గుర్తించిన తర్వాత, దానికి అనుగుణంగా టచ్ సెన్సిటివిటీని సర్దుబాటు చేస్తుంది. ఇది తెరవెనుక, మిల్లీసెకన్ల వ్యవధిలో జరుగుతుంది. ఫలితం? మీ వేళ్లు తడిగా ఉన్నప్పుడు లేదా స్క్రీన్‌పై చుక్కలు ఉన్నప్పుడు కూడా 95 శాతం టచ్‌లతో పాటు స్వైప్‌లు సమర్థంగా పనిచేస్తాయి.

అదరగొట్టే కెమెరా సిస్టమ్..

ఈ ఫోన్ వెనుక భాగంలో ప్రైమరీ కెమెరాగా 50ఎంసీ సోనీ సెన్సార్‌ ఉంటుంది. ఇది తక్కువ వెలుతురులో కూడా సమర్థంగా ఫోటోలు, వీడియోలు తీయగలదు.

సమర్థవంతమైన పనితీరు..

వన్ ప్లస్ కొత్త ఫోన్ 8జీబీ ర్యామ్,128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ 14 సాఫ్ట్‌వేర్‌తో జత చేసి ఉంటుంది. ఇది మృదువైన, వేగవంతమైన పనితీరును అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వన్ ప్లస్ తమ సొంత ర్యామ్ విటా, రోమ్ విటా టెక్నాలజీ సహాయంతో ఇది సాధ్యమవుతుంది. ఈ ఫోన్ ఏకకాలంలో 26 అప్లికేషన్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివ్‌గా ఉంచుతుంది.

Link to comment
Share on other sites

  • 0

Vivo T3 Lite 5G for under Rs. 10,000: రూ. 10 వేలలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. మార్కెట్లోకి వివో కొత్త ఫోన్‌

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ తరుణంలోనే స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు 5జీ ఫోన్‌లను పెద్ద ఎత్తు తీసుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా కంపెనీల మధ్య నెలకొన్న పోటీ క్రమంలో తక్కువ ధరలో 5జీ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం...

Vivo T3 Lite 5g

vivo-t3-lite-5g-1.jpg?w=1280

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ తరుణంలోనే స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు 5జీ ఫోన్‌లను పెద్ద ఎత్తు తీసుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా కంపెనీల మధ్య నెలకొన్న పోటీ క్రమంలో తక్కువ ధరలో 5జీ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో టీ3 లైట్‌ పేరుతో ఈ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నియ.? ధర ఎంత లాంటి వివరాలు ఇప్పుడు తెలుుకుందాం.

వివో టీ3 5జీ ఫోన్‌కు కొనసాగింపుగా టీ3 లైట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. గురువారం ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించారు. అయితే యూజర్లకు ఈ ఫోన్‌ జూలై 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివో ఇండియా వెబ్‌సైట్, కొన్ని ఎంపిక చేసిన స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది.

ధర విషయానికొస్తే వివో 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర ర. 10,499కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 11499గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫరలో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్ఆనరు. ఈ లెక్కన ఈ 5జీ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ను రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చన్నమాట.

ఇక వివో టీ3 లైట్‌ 5జీ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 656 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 840 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌ 6ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా చూస్తే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఐపీ64 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌ను ఇచ్చారు.

Link to comment
Share on other sites

  • 0

Recharge plan price increase: మొబైల్‌ యూజర్లకు షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన ఛార్జీలు..

ప్రముఖ టెలికం సంస్థ జియో తమ యూజర్లకు షాకింగ్ న్యూస్‌ చెప్పింది. రీఛార్జ్‌ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ ధరలు జులై 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. జియో ప్లాన్స్‌పై ఏకంగా రూ.40కిపైగా పెరగడం గమనార్హం. నెల, రెండు, మూలు నెలలు, ఏడాది ప్లాన్స్‌పై ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ జియో పెంచిన రీఛార్జ్‌ ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు...

Recharge plans

mobile-recharge-2.jpg?w=1280

ప్రముఖ టెలికం సంస్థ జియో తమ యూజర్లకు షాకింగ్ న్యూస్‌ చెప్పింది. రీఛార్జ్‌ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ ధరలు జులై 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. జియో ప్లాన్స్‌పై ఏకంగా రూ.40కిపైగా పెరగడం గమనార్హం. నెల, రెండు, మూలు నెలలు, ఏడాది ప్లాన్స్‌పై ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ జియో పెంచిన రీఛార్జ్‌ ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 155 రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ. 189కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది.
  • రూ. 209 రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ. 249కి పెంచారు. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా లభించనుంది.
  • రూ. 239 రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ. 299కి పెంచారు. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్‌తో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది.
  • రూ. 299 రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ.349కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది.
  • రూ. 399 రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ. 449కి పెంచారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది.
  • ఇక రూ. 479 ప్లాన్‌ను రూ. 579కి పెంచారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది.
  • రూ. 533 ప్లాన్‌ను రూ. 629కి పెంచారు. ఈ ప్లానతో రీఛార్జ్‌ చేసుకుంటే 56రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.
  • రూ. 395 ప్లాన్‌ను రూ. 479కి పెంచారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీతో 6 జీబీ డేటా లభిస్తుంది.
  • రూ.666 ప్లాన్‌ను రూ. 799కి పెంచారు. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది.
  • రూ. 719 ప్లాన్‌ను రూ. 859కి పెంచారు. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.
  • రూ. 999 ప్లాన్‌ను రూ. 1199కి పెంచారు. ఈ ప్లాన్‌ను రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది.

డేటా యాడ్‌ ఆన్‌ ఛార్జీలు సైతం..

  • రూ.15గా ఉన్న రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ. 19కి పెంచారు. దీంతో 1జీబీ డేటా లభిస్తుంది.
  • రూ. 25గా ఉన్న ప్లాన్‌ను రూ. 29కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్లాన్‌లో 2 జీబీ డేటా లభిస్తోంది.
  • రూ. 61గా ఉన్న ప్లాన్‌ను రూ. 69కి పెంచారు. దీంతో 6 జీబీ డేటా లభిస్తుంది.
Link to comment
Share on other sites

  • 0

ZTE Voyage 3D: మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్‌ ఇదే

మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతోంది. రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో సందడి చేస్తోంది. అధునాతన సాంకేతికతతో కూడిన ఫోన్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీ జెట్‌టీఈ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ZTE Voyage 3D పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు..

zte.jpg?w=1280&enlarge=true

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ZTE మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ZTE Voyage 3D పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ప్రపంచంలోనే తొలి ఏఐ నేక్‌డ్‌ ఐ 3డీ మొబైల్‌ ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోది. అంటే ఈ ఫోన్‌ డిస్‌ప్లే అచ్చంగా 3డీ డిస్‌ప్లేలాగా పనిచేస్తుందన్నమాట.

zte-phone.jpg

ఒక్క క్లిక్‌తో 2డీ స్క్రీన్‌ను 3డీ లోకి మార్చుకునే అవకాశం కల్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. వాయిస్‌ ట్రాన్స్‌లేషన్, ఏఐ ఇంటెలిజెంట్‌ వాయిస్‌ అసిస్టెంట్‌, చాట్ డైలాగ్‌ వంటి అధునాతన ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం.

zte-smrt-phone.jpg

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.58 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ 3డీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ ఫోన్‌ అక్టా కోర్‌ యూనిసోక్‌ టీ760 6ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు.

zte-voyage-3d-features.jpg

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను సైడ్‌కు అందించారు.

zte-voyage-3d-price.jpg

ఇక ఈ ఫోన్‌లో 33 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, వైఫై 802.11ac, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్‌ సీ వంటి ఫీచర్లను అందించారు. అయితే ఇన్ని ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి ధర ఎక్కువేమో అనుకుంటే పొరబడినట్లే ఎందుకంటే ఈ ఫోన్‌ ధర రూ. 17,225గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 0

USB Socket: Charge your phone without an adapter: అడాప్టర్‌ అవసరం లేకుండానే ఫోన్‌ ఛార్జింగ్‌ చేయవచ్చు.. ఈ సాకెట్‌తో ఎన్ని మొబైల్స్‌ అయినా ఒకేసారి ఛార్జ్‌

చాలా సార్లు ఛార్జింగ్ కోసం ఇంట్లో ఒకే ఒక అడాప్టర్ ఉన్నందున ఫోన్‌ ఛార్జింగ్‌ కోసం ఇబ్బంది పడవచ్చు. ఒకేసారి ఒక ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో అనేక సదుపాయాలు వచ్చేశాయి. ఇప్పుడు మీరు ఒకటి కాదు అనేక ఫోన్‌లను ఏకకాలంలో ఛార్జ్ చేయవచ్చు. దీని కోసం ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి అడాప్టర్ అవసరం లేదు. అయితే ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకుందాం. మీరు అడాప్టర్ లేకుండా మీ ఫోన్‌ను ఎలా ఛార్జ్ చేయవచ్చో తెలుసుకుందాం.

Usb Socket

usb-socket.jpg?w=1280

దీని కోసం మీరు మీ ఇంట్లో USB సాకెట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ సాకెట్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. ఈ సాకెట్లలో మీరు ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌లను ఛార్జ్ చేసే అవకాశాన్ని పొందుతారు. దీని కోసం మీకు ఛార్జింగ్ కేబుల్ అవసరం.

Wayona 18W డ్యూయల్ USB సాకెట్

ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ సాకెట్‌లో మీరు ఒకేసారి రెండు ఫోన్‌లను ఛార్జ్ చేయవచ్చు. డాంగిల్ కనెక్ట్ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు యూఎస్‌బీ మద్దతుతో ఏదైనా పరికరాన్ని కనెక్ట్ చేయవచ్చు. అలాగే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ డ్యూయల్ యూఎస్‌బీ సాకెట్ అసలు ధర రూ.1,499 అయినప్పటికీ, మీరు దీన్ని 67 శాతం తగ్గింపుతో కేవలం రూ. 489కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఇక్కడ మరిన్ని యూఎస్‌బీ సాకెట్‌లతో కూడిన ఎంపికలను కూడా పొందుతారు. మీరు మీ అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు.

మీకు ఛార్జింగ్ కేబుల్ అవసరం..అడాప్టర్ కాదు..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ఫోన్‌లను ఛార్జ్‌ చేసేందుకు అడాప్టర్‌ అవసరం లేదు. కేవలం కేబుల్‌ మాత్రమే అవసరం ఉంటుంది. ఈ సాకెట్ సహాయంతో మీరు ఛార్జింగ్ కేబుల్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. కేబుల్ ఛార్జింగ్ లేకుండా మీరు ఫోన్‌ను ఛార్జ్ చేయలేరని గుర్తించుకోండి. అమెజాన్ కాకుండా, మీరు ఫ్లిప్‌కార్ట్, మీషో మొదలైన ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ సాకెట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఈ సాకెట్‌లను కనుగొంటారు.

ఇది ప్రయోజనకరంగా ఉంటుందా లేదా హానికరంగా ఉంటుందా?

అయితే, మీరు ఎల్లప్పుడూ కంపెనీ ఒరిజినల్ ఛార్జర్‌తో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయాలి. కానీ ఇప్పటికీ మీకు అడాప్టర్ లేకపోతే, మీరు USB కేబుల్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు. అడాప్టర్‌తో ఛార్జింగ్ చేయడం వల్ల మీ ఫోన్‌కు ఏదైనా నష్టం జరిగే అవకాశాలు తగ్గుతాయి. కానీ అత్యవసర పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా ఈ సాకెట్ సహాయం తీసుకోవచ్చు.

Link to comment
Share on other sites

  • 0

Nokia Feature Phone: అతి తక్కువ ధరకే నోకియా ఫీచర్ ఫోన్లు.. యూట్యూబ్, యూపీఐ పేమెంట్ ఆప్షన్లతో..

ఇప్పటికే ఉన్న మోడళ్లకు తోడు రెండు కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. హెచ్ఎండీ నోకియా 220 4జీ, నోకియా 235 4జీ పేర్లతో కొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్‌లు క్లాసిక్ స్నేక్ గేమ్, యూట్యూబ్ షార్ట్ యాప్, సులభ లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా ప్రీలోడ్ చేసిన యూపీఐ చెల్లింపులు చేసుకునేలా తీసుకొచ్చింది.

Nokia 235 And Nokia 220 4g

nokia-235-and-nokia-220-4g.jpg?w=1280

స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఎంతలా అందుబాటులోకి వస్తున్నా.. బేసిక్ ఫీచర్ ఫోన్లను కూడా వాడేవారు అధికంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో 4జీ వేరియంట్ లో స్మార్ట్ ఫోన్ కి దీటుగా కీప్యాడ్ ఫోన్లను లాంచ్ చేసింది. సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే ట్రెండ్ ను హెచ్ఎండీ గ్లోబల్ ఆధ్వర్యంలోని నోకియా కూడా మొదలు పెట్టింది. ఇప్పటికే ఉన్న మోడళ్లకు తోడు రెండు కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. హెచ్ఎండీ నోకియా 220 4జీ, నోకియా 235 4జీ పేర్లతో కొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్‌లు క్లాసిక్ స్నేక్ గేమ్, యూట్యూబ్ షార్ట్ యాప్, సులభ లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా ప్రీలోడ్ చేసిన యూపీఐ చెల్లింపులు చేసుకునేలా తీసుకొచ్చింది. దీనిక సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

నోకియా 235 4జీ, 220 4జీ ధర..

నోకియా 235 4జీ మూడు రంగులలో వస్తుంది. నీలం, నలుపు, ఊదా రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 3,749. నోకియా 220 4జీ ఫోన్ పీచ్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. దీని ధర రూ.3,249. రెండు పరికరాలు హెచ్ఎండీ.కామ్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్, నోకియా రిటైల్ అవుట్‌లెట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

నోకియా 235 (2024), నోకియా 220 4జీ ఫీచర్లు..

నోకియా 235 4జీ ఫీచర్ ఫోన్ 2.8-అంగుళాల డిస్ ప్లే, 2ఎంపీ వెనుక కెమెరాతో వస్తుంది. అలాగే ఇది యూనీసోక్ టీ107 ప్రాసెసర్, ఎస్30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుంది. 64ఎంబీ ర్యామ్, 128ఎంబీ స్టోరేజ్ తో వస్తుంది. దీనిని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 32జీబీవరకు విస్తరించవచ్చు. పరికరం 1450ఎంఏహెచ్ తొలగించగల బ్యాటరీతో వస్తుంది. ఇది 9.8 గంటల మాట్లాడే సమయాన్ని అందిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లలో ఛార్జింగ్ కోసం యూఎస్బీ-సీ టైప్, బ్లూటూత్ వీ5.0, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఎఫ్ఎం రేడియో, క్లౌడ్ యాప్‌లకు మద్దతునిస్తుంది. వార్తలు, వాతావరణ అప్‌డేట్‌లు, ఎంపీ3 ప్లేయర్, క్లాసిక్ స్నేక్ గేమ్, యూట్యూబ్ షార్ట్‌లు, స్కాన్ చేసి యూపీఐ చెల్లింపు యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

నోకియా 220 4జీ ఫీచర్ ఫోన్ కూడా 2.8-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. యూనిసోక్ టీ107 ప్రాసెసర్, ఎస్30ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సులభమైన లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా ప్రీలోడ్ చేసి, ఆమోదించబడిన యూపీఐ అప్లికేషన్‌లకు ఇది మద్దతు ఇస్తుంది. 2ఎంపీ వెనుక కెమెరా మినహా, నోకియా 235 4జీ మోడల్‌లో ఉన్న అన్ని ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇది క్లాసిక్ స్నేక్ గేమ్‌తో కూడా వస్తుంది. స్మార్ట్‌ఫోన్ లేకుండానే యూపీఐ లావాదేవీలను యాక్సెస్ చేయాలనుకునే వ్యక్తులకు ఈ పరికరాలు మంచి ఎంపిక.

Link to comment
Share on other sites

  • 0

OnePlus Watch 2: వన్‌ప్లస్‌ నుంచి eSIM సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ వాచ్‌.. తొలిసారిగా విడుదల.. ధర ఎంతో తెలుసా?

చైనీస్ పరికరాల తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ ఏడాది ప్రారంభంలో వాచ్ 2ను భారతదేశంలో విడుదల చేసింది. డిజైన్, eSIM కనెక్టివిటీలో కొన్ని మార్పులతో ఈ స్మార్ట్ వాచ్ చైనాలో ప్రవేశపెట్టబడింది. ఇది 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది BES2700 చిప్‌తో స్నాప్‌డ్రాగన్ W5 Gen 1 చిప్‌సెట్‌లో నడుస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర CNY 1,799 (భారత్‌ కరెన్సీలో సుమారు రూ. 20,650). ఇది..

Oneplus

oneplus-4.jpg?w=1280

చైనీస్ పరికరాల తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ ఏడాది ప్రారంభంలో వాచ్ 2ను భారతదేశంలో విడుదల చేసింది. డిజైన్, eSIM కనెక్టివిటీలో కొన్ని మార్పులతో ఈ స్మార్ట్ వాచ్ చైనాలో ప్రవేశపెట్టబడింది. ఇది 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది BES2700 చిప్‌తో స్నాప్‌డ్రాగన్ W5 Gen 1 చిప్‌సెట్‌లో నడుస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర CNY 1,799 (భారత్‌ కరెన్సీలో సుమారు రూ. 20,650). ఇది నెబ్యులా గ్రీన్, టోరైట్ బ్లాక్ రంగులలో అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం చైనాలోని కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఈ స్మార్ట్ వాచ్ రేడియంట్ స్టీల్, బ్లాక్ స్టీల్ రంగులలో ప్రారంభించింది కంపెనీ. దేశంలో దీని ధర రూ.24,999 ఉండే అవకాశం ఉంది.

OnePlus వాచ్ 2 ఫీచర్స్‌:

ఈ చైనీస్ వేరియంట్ 1.43-అంగుళాల (466×466 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే, 1,000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ స్థాయిని కలిగి ఉంది. ఇది ColorOS వాచ్ 6.0పై రన్ అవుతుంది. అలాగే Android 8.0 లేదా ఆ తర్వాతి ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తున్న పరికరాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ 2 GB RAM+32 GB స్టోరేజ్ కలిగి ఉంది. ఇది బ్లూటూత్ కాలింగ్‌తో పాటు eSIMకి కూడా మద్దతుతో వస్తుంది. దీనితో, వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ లేకుండా నేరుగా ఫోన్ కాల్‌లను స్వీకరించవచ్చు. ఇది కనెక్టివిటీ కోసం బ్లూటూత్, బీడౌ, GPS, QZSS, Wi-Fi, ఎన్‌ఎఫ్‌సీ ఆప్షన్‌లను కలిగి ఉంది.

ఈ స్మార్ట్ వాచ్ SpO2 పర్యవేక్షణ, హృదయ స్పందన ట్రాకింగ్ వంటి ఆరోగ్య-కేంద్రీకృత ఫీచర్లతో వస్తుంది. OnePlus Watch 2 యొక్క 500 mAh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 రోజుల వరకు ఉంటుంది. దీని బరువు దాదాపు 59 గ్రాములు. ఇటీవల వన్‌ప్లస్ కొత్త గ్లేసియర్ వైట్ కలర్‌లో వన్‌ప్లస్ 12ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 12 GB + 256 GB వేరియంట్ ధర రూ. 64,999. దీనిని ఇ-కామర్స్ సైట్ అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్, కంపెనీ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. డ్యూయల్ సిమ్ (నానో) కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 14తో రన్ అవుతుంది. ఇది 6.82-అంగుళాల క్వాడ్ HD+ (1,440 x 3,168 పిక్సెల్స్) LTPO 4.0 AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ హాసెల్‌బ్లాడ్ ద్వారా ట్యూన్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సోనీ LYT-808 సెన్సార్, f/1.6 ఎపర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది కాకుండా, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అందించింది.

Link to comment
Share on other sites

  • 0

Best 5G Phones Under 35K: మిడ్ రేంజ్లో టాప్ 5జీ ఫోన్లు ఇవే.. బెస్ట్ బ్రాండ్లు.. టాప్ ఫీచర్లు..

నేడు ప్రతి చిన్న పనికీ స్మార్ట్ ఫోన్ చాలా అవసరం. ఆ పని వేగంగా, సజావుగా పూర్తవ్వడం కూడా ముఖ్యమే. అందుకే మనం ఎంపిక చేసుకునే ఫోన్లు మన్నికతో పాటు వేగంగా పనిచేసేలా చూసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్లు సందడి చేస్తున్నాయి. కొత్తగా ఫోన్ కొనుగోలు చేసేవారితో పాటు 4జీ వినియోగదారులు కూడా వీటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ.35 వేల లోపు 5జీ స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా లేటెస్ట్ ఫీచర్లు, మంచి నాణ్యత, వేగవంతమైన పనితీరుతో ఆకట్టుకుంటున్నాయి. డిస్ ప్లే, ప్రాసెసర్, కెమెరా, పనితీరు ఇలా ప్రతి విషయంలో బెస్ట్ గా నిలుస్తున్నాయి. ఫోన్ కోసం మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికీ తగిన విధంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తాయి. అమెజాన్ లో అందుబాటులో ఉన్న వివిధ బ్రాండ్ల 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే.

redmi-note-12-pro.jpg?w=1280&enlarge=tru

రెడ్ మీ నోట్ 13 ప్రోప్లస్(Redmi Note 12 Pro +).. ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ చాలా అద్భుతంగా ఉంటుంది. 200 ఎంపీ ప్రధాన కెమెరాతో ఫొటోలను చక్కగా తీసుకోవచ్చు. ఇది యాంటీ-షేకింగ్ పనితీరుతో ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ లో 6.67 అంగుళాల క్రిస్టల్ రీస్ అమోలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 700 అల్ట్రా ప్రాసెసర్, ఎమ్ఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ, 12 జీబీ ర్యామ్, అలాగే 256 జీబీ, 512 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 120 డబ్ల్యూ హైపర్ చార్జింగ్ కి సపోర్టు చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 200 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ రీర్ కెమెరా, 16 ఎంపీ బ్యాక్ కెమెరాతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ధర రూ.30,999.

samsung-galaxy-s21-fe-5g.jpg

సామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ(Samsung Galaxy S21 FE 5G).. కొత్తగా 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి సామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ మంచి ఎంపిక. దీనిలోని 6.4 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కారణంగా విజువల్ చాలా స్పష్టంగా చూడవచ్చు. 12 ఎంపీ ప్రధాన, 12 ఎంపీ అల్ట్రావైడ్, 8 ఎంపీ టెలిఫోటో కెమెరాలతో అద్భుతమైన చిత్రాలను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కెమెరా సెటప్ 30ఎక్స్ స్పేస్ జూమ్‌ను అందిస్తుంది. ఇక సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఎక్సినోస్ 2100 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12.0 ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.31,398.

oneplus-11r-5g-1.jpg

వన్ ప్లస్ 11ఆర్ 5జీ(OnePlus 11R 5G).. ఈ ఫోన్ లోని 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్థమ్ తో స్పష్టమైన ఫొటోలను తీసుకోవచ్చు. దీనిలోని డైనమో కెమెరా సిస్టమ్ మంచి పనితీరును కనబరుస్తుంది. 6.7 అంగుళాల డిస్ ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. రీర్ కెమెరాలో 50 ఎంపీ ప్రధాన, 8 ఎంపీ ఆల్ట్రావైడ్, మైక్రో లెన్స్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ రూ.27,999కు అందుబాటులో ఉంది.

realme-gt-6t-5g-1.jpg

రియల్ మీ జీటీ 6టీ 5జీ(realme GT 6T 5G).. ఫోన్ ను బాగా ఎక్కువగా ఉపయోగించేవారికి రియల్ మీ జీటీ 6టీ 5జీ మంచి ఎంపిక. దీనిలో మల్టిపుల్ టాస్క్ లు, హెవీ సాఫ్ట్ వేర్ లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేట్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ కు హయ్యెస్ట్ స్టాండర్డ్ గేమింగ్ ఫెర్ఫార్మెన్స్ ఉంది. 6.78 అంగుళాల డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పని చేస్తుంది. 8 జీబీ, 12 జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ స్టోరేజీతో అందుబాటులో లభిస్తుంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ ఇబ్బందులు ఉండవు. 50 ఎంపీ+ 8ఎంపీ+ 2 ఎంపీ రీర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఫొటోలను చక్కగా తీసుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ.32,999

iqoo-neo9-pro-5g.jpg

ఐక్యూ నియో9 ప్రో 5జీ(IQOO Neo9 pro 5G).. ఈ ఫోన్ పనితీరు చాలా వేగవంతంగా ఉంటుంది. 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే తో విజువల్ స్పష్టంగా చూడవచ్చు. స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 మొబైల్ ప్లాట్ ఫాం ప్రోసెసర్, ఆండ్రాయిడ్ 14 బేస్ డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 5040 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ అయిపోతుందనే సమస్య ఉండదు. ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు ఫ్రంట్ 50 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ 34,998కి అందుబాటులో ఉంది.

Link to comment
Share on other sites

  • 0

Precautions to take before buying a smartphone: కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

మార్కెట్లో వందల రకాల ఫోన్‌లు, కంపెనీలు ఉండగా ఏ ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన వేధిస్తూనే ఉంటుంది. అయితే మీ బడ్జెట్‌పైనే మీ ఫోన్‌ ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో...

Smartphones

smartphone-29.jpg?w=1280

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. కచ్చతంగా ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండే పరిస్థితి వచ్చేసింది. ప్రతీ చిన్న పనికి స్మార్ట్‌ ఫోన్‌ అవసరం వస్తోంది. దీంతో ఫోన్‌లను కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో చాలా కన్ఫ్యూజ్‌కు గురవుతుంటారు.

మార్కెట్లో వందల రకాల ఫోన్‌లు, కంపెనీలు ఉండగా ఏ ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన వేధిస్తూనే ఉంటుంది. అయితే మీ బడ్జెట్‌పైనే మీ ఫోన్‌ ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో ఎలాంటివి చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  • ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణాలకు 5జీ విస్తరించనుంది. ఇక 5జీ టెక్నాలజీతో ఎన్నో మార్పులు జరగనున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రస్తుతం 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయడం బెటర్‌.
     
  • ఎక్కువగా వీడియోలు చూడడానికి ఆసక్తి చూపించే వారు స్క్రీన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి వారు అమోలెడ్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ స్పీకర్స్‌, 3.5 ఎమ్‌ఎమ్‌ జాక్‌ వంటి ఫీచర్లు ఉన్న ఫోన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
     
  • ఇక మీరు గేమింగ్ లవర్స్‌ అయితే 90 హెర్జ్‌ లేదా 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తోపాటు 240 హెర్జ్‌ ఆపై టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ కలిగిన మోడల్స్‌ను ఎంచుకోవడం బెటర్‌. అలాగే ప్రాసెసర్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెసర్‌ వేగంగా ఉంటేనే గేమ్స్ తేలకగా ఆడుకోవచ్చు.
     
  • కెమెరాకు ప్రాధాన్యత ఇచ్చ వేరు ఎక్కువ మెగాపిక్సెల్స్‌ ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ను ఎంచుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలో కూడా మంచి కెమెరా క్లారిటీతో ఉన్న ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.
     
  • ఇక స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో చూడాల్సిన మరో అంశం ఆపరేటింగ్ సిస్టమ్‌. వీలైనంత వరకు లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి. దీనివల్ల అన్ని రకాల లేటెస్ట్‌ ఫీచర్లను పొందొచ్చు.
     
  • అలాగే స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన మరో అంశం సర్వీస్‌ ఎలా ఉంటుంది. మీకు దగ్గర్లో సర్వీస్ ఉందా.? లేదా.? అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
     
  • కొన్ని స్మార్ట్‌ ఫోన్‌లు యూజర్లకు ఎక్కువ కాలం ఉచితంగా అప్‌డేట్స్‌ను అందిస్తుంటాయి. కాబట్టి ఎక్కువగా అప్‌డేట్స్‌ను అందించే ఫోన్‌లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపాలి.
Link to comment
Share on other sites

  • 0

BSNL: పెరిగిన రీఛార్జ్‌ ధరలతో భయపడుతున్నారా.? అదిరిపోయే ప్లాన్‌..

దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జూల్‌ 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో మొబైల్ ఫోన్‌ యూజర్లపై భారీగా భారం పడడం ఖాయంగా కనిపిస్తోంది. టెలికం కంపెనీలు ఏకంగా 26 శాతం వరకు...

BSNL

bsnl.jpg?w=1280

దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జూల్‌ 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో మొబైల్ ఫోన్‌ యూజర్లపై భారీగా భారం పడడం ఖాయంగా కనిపిస్తోంది. టెలికం కంపెనీలు ఏకంగా 26 శాతం వరకు ధరలను పెంచేసింది. అయితే ఇదే సమయంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది.

తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్‌తో కూడిన ఓ రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొత్తగా రూ. 249 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్‌ పొందొచ్చు. లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కి అయినా అన్‌లిమిటెడ్ కాల్స్‌ చేసుకోవచ్చు. 45 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ చొప్పున మొత్తం 90 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి.

ఇదిలా ఉంటే ఇదే రీఛార్జ్‌ ప్లాన్‌ ఎయిర్‌టెల్‌లో కూడా అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్‌లో ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా వ్యాలిడిటీ మాత్రం 28 రోజులు మాత్రమే ఉంటుంది. ఎయిర్‌టెల్‌తో పోల్చితే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లో మరో 17 రోజులు అదనంగా లభిస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇతర టెలికం కంపెనీలు భారీగా ధరలను పెంచిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ యూజర్లను ఆకర్షిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌లో ఉన్న యూజర్లను కాపాడుతూనే కొత్త వారికి అట్రాక్ట్‌ చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Link to comment
Share on other sites

  • 0

Vivo Pad 3: వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..

ప్రస్తుతం మార్కెట్లో ట్యాబ్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఓటీటీ వీడియోలు స్ట్రీమింగ్‌, గేమింగ్‌తో పాటు ఎడ్యుకేషన్‌ పరంగా ట్యాబ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో మార్కెట్లోకి కొంగొత్త ట్యాబ్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వివో కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. వివో ప్యాడ్‌ 3 పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. ఈ ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

vivo.jpg?w=1280&enlarge=true

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చారు. వివో ప్యాడ్ 3 టాబ్లెట్ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను చైనా మార్కెట్‌లో లాంచ్‌ చేశారు. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ట్యాబ్‌ను తీసుకురానున్నారు.

vivo-pad-3.jpg

ఈ ట్యాబ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జనరేషన్‌ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 12.1 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇచ్చారు. 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 600నిట్స్ బ్రైట్‌నెస్‌ని ఇచ్చారు.

vivo-pad-3-features.jpg

ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ పనిచేస్తుంది. ఇందులో 44 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 10,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 28,700, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 35 వేలకిపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

vivo-pad-3-price.jpg

కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ ట్యాబ్‌ బరువు 589.2 గ్రాములుగా ఉంది.

vivo-tablet.jpg

కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వై-ఫై 6, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. యూఎస్‌బీ 3.2 జనరేషన్ 1 టైప్-సి పోర్ట్‌ను అందించారు.

Link to comment
Share on other sites

  • 0

Samsung Galaxy F54: సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే..

సౌత్‌ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ప్రీమియం సెగ్మెంట్‌తో పాటు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది సామ్‌సంగ్‌. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌54 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు...

samsung-galaxy-f54.jpg?w=1280

సౌత్‌ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ప్రీమియం సెగ్మెంట్‌తో పాటు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది సామ్‌సంగ్‌. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌54 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్‌54 స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ ఎక్సినోస్‌ 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ స్కానర్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇక ఈ సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌54లో బ్యాటరీకి పెద్ద పీట వేశారు. ఇందులో ఏకంగా 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వడం విశేషం. ఈ ఫోన్‌ కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇక ఫోన్‌ను ఎంత నాన్‌ స్టాప్‌గా ఉపయోగించినా 8 గంటల బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుంది.

8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం. కెమెరాకు కూడా ఇందులో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కెమెరా క్లారిటీ విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో మంచి టచ్‌ అనుభూతి కోసం సూపర్‌ స్మూత్ అనుభూతితో పాటు శక్తివంతమైన టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను తీసుకొచ్చారు. ఈ కెమెరాతో 4కే రిజల్యూషన్‌ వీడియోను చిత్రీకరించవచ్చు. ఇక ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24000గా నిర్ణయించారు. ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.

Link to comment
Share on other sites

  • 0

Flipkart Sale on Smart Phones: ఫ్లిప్‌కార్ట్‌లో ఊహకందని ఆఫర్స్‌.. స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బచాత్‌ డేస్‌ సేల్‌ పేరుతో మంచి సేల్‌ను అందిస్తోంది. జూల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సేల్‌ 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌ భాగంగా స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు. అన్ని రకాల స్మార్ట్ ఫోన్‌ల ధరలను తగ్గించారు. అలాగే తక్కువ మొత్తంలో నెలవారీ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను అందించారు...

flipkart-sale.jpg?w=1280

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బచాత్‌ డేస్‌ సేల్‌ పేరుతో మంచి సేల్‌ను అందిస్తోంది. జూల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సేల్‌ 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌ భాగంగా స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు. అన్ని రకాల స్మార్ట్ ఫోన్‌ల ధరలను తగ్గించారు. అలాగే తక్కువ మొత్తంలో నెలవారీ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను అందించారు. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా ఏయే స్మార్ట్‌ ఫోన్స్‌పై డిస్కౌంట్స్‌ లభించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* వివో టీ3ఎక్స్‌ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా వివో టీ3ఎక్స్‌ ఫోన్‌పై డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఈ 5జీ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 13,499కాగా, ఆఫర్‌లో భాగంగా రూ. 1000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. దీంతో పాటు నెలకు కేవలం రూ. 836 ఈఎమ్‌ఐ చెల్లింపుతో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

* మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ ఫోన్‌పై భారీ ఆఫర్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2000 డిస్కౌంట్‌ పొందొచ్చు. అలాగే నో కాస్ట్‌ ఈఎమ్‌ఐని సైతం అందిస్తున్నారు. ఇక ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం కూడా ఇందులో 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

* షావోమీ 14 సివి స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 42,999కాగా హెచ్‌డీఎఫ్‌ బ్యాంకుకు చెందిన క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 3000 డిస్కౌంట్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను కూడా అందించారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.55 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎస్‌ జెన్‌ 3 ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 50 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

Link to comment
Share on other sites

  • 0

Recharge plan: మొబైల్ యూజర్లకు బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌.. ధరలు పెరిగినా..

ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కంపెనీలు ఏకంగా 10 నుంచి 25 శాతం వరకు ధరలను పెంచాయి. దీంతో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న వారిపై భారీగా భారం పడింది. జియో మొదలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వరకు అన్ని సంస్థలు టారిఫ్‌లను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి...

Recharge Plans

jio.jpg

ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కంపెనీలు ఏకంగా 10 నుంచి 25 శాతం వరకు ధరలను పెంచాయి. దీంతో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న వారిపై భారీగా భారం పడింది. జియో మొదలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వరకు అన్ని సంస్థలు టారిఫ్‌లను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే ధరలు పెరిగిన తర్వాత కూడా ప్రముఖ టెలికాం దిగ్గజం జియో కొన్ని మంచి ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. ఇతర కంపెనీలతో పోల్చితే జియో అందిస్తున్న కొన్ని రీఛార్జ్‌ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి..

* జియో అందిస్తున్న బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌లో రూ. 249 ఒకటి. ఈ ప్లాన్‌తో రోజుకు 1 జీబీ డేటాతో పాటు అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. అయితే ఇతర సంస్థలతో పోల్చితే జియోలోనే ఈ ప్లాన్‌ తక్కువ ధరకు లభిస్తోంది.

* రూ. 299తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ లభిస్తాయి. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర కంపెనీల్లో రూ. 349 ప్లాన్‌ అమల్లో ఉంది.

* ఇక జియో అందిస్తున్న మరో బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌లో రూ. 349 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌ పొందొచ్చు. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర టెలికాం సంస్థల్లో అదనంగా రూ. 50 చెల్లించాల్సిందే.

* మూడు నెలల ప్లాన్‌ కోసం చూస్తున్న వారికి రూ. 479 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో యూజర్లకు 6 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర టెలికాం సంస్థల్లో రూ. 509 వరకు ఉన్నాయి.

* ఏడాది ప్లాన్‌ విషయానికొస్తే.. రూ. 1899 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. 24 జీబీ డేటా లభిస్తుంది. ఇదే ప్లాన్‌ ఇతర సంస్థల్లో 5 శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 0

Recharge Plans: మూడు నెలల రీచార్జ్‌పై ముచ్చటైన ఆఫర్లు.. ఏ కంపెనీ యూజరైనా ఆసక్తి చూపాల్సిందే..!

ఇటీవల కాలంలో టెలికాం కంపెనీలు యూజర్లకు షాక్ ఇస్తూ రీచార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచాయి. అయితే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అగ్ర ప్రొవైడర్ల నుంచి 84 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌లు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందాయి. ప్రతి కంపెనీ డేటా, కాలింగ్ ఫీచర్‌లు, అదనపు పెర్క్‌లతో ప్రత్యేకమైన ప్యాకేజీలను అందిస్తుంది.

Calls Talking

calls-talking.jpg?w=1280

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు ఫోన్లు ఉంటున్నాయంటే ఫోన్ల వాడకం ఏ స్థాయిలో ఉందో? అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో టెలికాం కంపెనీలు యూజర్లకు షాక్ ఇస్తూ రీచార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచాయి. అయితే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అగ్ర ప్రొవైడర్ల నుంచి 84 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌లు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందాయి. ప్రతి కంపెనీ డేటా, కాలింగ్ ఫీచర్‌లు, అదనపు పెర్క్‌లతో ప్రత్యేకమైన ప్యాకేజీలను అందిస్తుంది. వినియోగదారులకు వారి నిర్దిష్ట అవసరాలు, రోజువారీ అవసరాల ఆధారంగా సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ నేపథ్యంలో 84 రోజుల రీచార్జ్ ప్లాన్‌లపై ఏయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం. 

జియో రూ. 719  ప్లాన్

రిలయన్స్ జియోకు సంబంధించిన రూ.719 ప్లాన్ 84 రోజుల పాటు గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందవచ్చు. అంటే మొత్తం ప్లాన్ వ్యవధిలో 168 జీబీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ ప్లాన్ ద్వారా ట్రూ 5జీ డేటా యొక్క ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. బోనస్‌గా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. 

ఎయిర్‌టెల్ రూ. 719 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.719 ప్లాన్ 84 రోజుల సర్వీస్, అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను వస్తుంది. అలాగే ఏదైనా పాటను మీ హలో ట్యూన్‌గా ఉచితంగా సెట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ డేటా వాడేవారితో పాటు మెసేజింగ్ అనువైనదిగా ఉంటుంది. 

వొడాఫోన్ ఐడియా రూ. 459 ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా 6 జీబీ డేటా, 1000 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. మీరు అపరిమిత స్థానిక, జాతీయ వాయిస్ కాల్‌లను ఆస్వాదించవచ్చు. డేటా కోటా ముగిసిన తర్వాత అదనపు డేటా కోసం మీకు ఎంబీకి 50 పైసలు ఛార్జ్ చేస్తారు. ఎస్ఎంఎస్‌ను కోటాను ఉపయోగించిన తర్వాత ప్రతి స్థానిక SMSకి రూ 1, ప్రతి ఎస్ఎంఎస్‌కు రూ. 1.5 ఖర్చవుతుంది. ఈ ప్లాన్ మంచి డేటా, మెసేజింగ్, కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. 

Link to comment
Share on other sites

  • 0

Lava Blaze X 5G: లావా నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ ఫోన్‌.. ప్రీమియం లుక్స్‌తో..

లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జులై 10వ తేదీన ఈ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేయనుంది. ఇక జుల్‌ 20వ తేదీన అమెజాన్‌ అందించనున్న అమెజాన ప్రైమ్‌ డే సేల్ 2024లో భాగంగా ఈ ఫోన్‌ మొదటి సేల్‌ ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.?

Lava Blaze X 5G phone

lava.jpg?w=1280

ప్రముఖ భారతీయ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకురావడంతో ఎప్పుడూ ముందుంటుందీ సంస్థ. బడ్జెట్‌ ధరలో ప్రీమియం లుక్స్‌, స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్న లావా తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది.

లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జులై 10వ తేదీన ఈ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేయనుంది. ఇక జుల్‌ 20వ తేదీన అమెజాన్‌ అందించనున్న అమెజాన ప్రైమ్‌ డే సేల్ 2024లో భాగంగా ఈ ఫోన్‌ మొదటి సేల్‌ ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లావా బ్లేజ్‌ ఎక్స్‌ 5జీ ఫోన్‌ను మొత్తం మూడు వేరియంట్సలో లాంచ్‌ చేయనున్నారు. వీటిలో 4 జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌, 8 జీబీ ర్యామ్‌ ఉన్నాయి. ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందించనున్నారు. స్క్రీన్‌ పరంగా చూస్తే ఇందులో అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌తో అందుబాటులోకి తెస్తున్నారు.

ఇందులో USB టైప్ C పోర్ట్, స్పీకర్ గ్రిల్ వంటి ఫీచర్స్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఫోన్‌కు కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్స్‌ ఉండనున్నాయి. లుక్స్‌ పరంగా ఫోన్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా బ్లేజ్‌ లెస్‌ స్క్రీన్‌, పంచ్‌ హోల్‌ కెమెరాను ఇవ్వనున్నారు. దీంతో ఫోన్‌ను రిచ్‌ లుక్‌ వచ్చింది. ధర విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోయినా ఫోన్‌ రూ. 20 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Xhilarating. Xtreme. #BlazeX - Launching on 10.07.24, 12 PM #LavaMobiles #ProudlyIndian

 

Link to comment
Share on other sites

  • 0

how to beat the plan price increases?

జులై 3 నుంచి జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. - TV9

 

Link to comment
Share on other sites

  • 0

Motorola: మోటోరోలా నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. ధర అక్షరాల రూ. లక్ష..

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా క్వాల్‌కామ్‌ కొత్త స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో మెయిన్‌ స్క్రీన్‌ను ఫుల్‌హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ ని అందించారు. 165Hz రీఫ్రెష్‌ రేట్‌, 6.9 ఇంచెస్‌తో కూడిన మెయిన్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇక బయటి స్క్రీన్‌ 4 ఇంచెస్‌తో కూడిన ఎల్‌టీపీఓ,ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌, 165Hz రీఫ్రెష్ రేట్‌...

Motorola Razr 50 Ultra

motorola-razr-50-ultra.jpg?w=1280

ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. దాదాపు అన్ని స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీలు మడతపెట్టే ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఇప్పటికే మార్కెట్లోకి లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ జులై 20వ తేదీ నుంచి ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌తో పాటు, రిలయన్స్‌ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ధర విషయానికొస్తే మోటోరాల రేజర్‌ 50 అల్ట్రా 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 99,999గా నిర్ణయించారు. అయితే లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 5000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు. అలాగే ఎంపిక చేసిన కొన్ని బ్యాంకు కార్డులపై అదనంగా మరో రూ. 5000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 89,999కే సొంతం చేసుకోవచ్చు. జులై 10వ తేదీ నుంచి బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫోన్‌ను మిడ్‌ నైట్ బ్లూ, , స్ప్రింగ్‌ గ్రీన్‌, పీచ్‌ ఫజ్‌ వంటి కలర్స్‌లో తీసుకొస్తున్నారు.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా క్వాల్‌కామ్‌ కొత్త స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో మెయిన్‌ స్క్రీన్‌ను ఫుల్‌హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ ని అందించారు. 165Hz రీఫ్రెష్‌ రేట్‌, 6.9 ఇంచెస్‌తో కూడిన మెయిన్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇక బయటి స్క్రీన్‌ 4 ఇంచెస్‌తో కూడిన ఎల్‌టీపీఓ,ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌, 165Hz రీఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. ఫోన్‌ను ఫోల్డ్‌ చేసినప్పుడు వీడియోలు, నావిగేషన్‌ వివరాలు, సెల్ఫీలు వంటివి ఈ స్క్రీన్‌తో చేసుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈస్మార్ట్‌ ఫోఒన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. 30X ఏఐ సూపర్‌ జూమ్‌, ఏఐ యాక్షన్‌ షాట్‌, ఏఐ అడాప్టివ్‌ స్టెబిలైజేషన్‌, ఇంటెలిజెంట్‌ ఆటో ఫోకస్‌ ట్రాకింగ్‌ వంటి ఏఐ ఫీచర్లను కెమెరా కోసం ప్రత్యేకంగా అందించారు. ఇక లోపలి డిస్‌ప్లే 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అదించారు. 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఈ ఫోన్‌ 15 వాట్స్‌వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Link to comment
Share on other sites

  • 0

Upcoming Smartphones in July 2024: జూలైలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. జాబితా కొంచెం పెద్దదే..

ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3ప్రో, షావోమీ 14 సివి, రియల్‌మీ జీటీ6, మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా వంటి ఫోన్లు మార్కెట్లోకి వచ్చేందుకు ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశాయి. వీటితో పాటు రెడ్‌మీ 13 5జీ, సీఎంఎఫ్‌ ఫోన్‌1తో పాటు మోటోరోలా, శామ్సంగ్‌ నుంచి ప్రీమియం ఫోల్డబుల్‌ ఫోన్లను కూడా ఈ జూలైలోనే లాంచ్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

Samsung Galaxy Z Fold 6

samsung-galaxy-z-fold-6.jpg?w=1280

జూలై మాసాన్ని అనేక టెక్‌ కంపెనీలు తమ లక్కీ నెలగా మార్చుకుంటున్నాయి. అందుకే వరసపెట్టి స్మార్ట్‌ ఫోన్లను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిల్లో టాప్‌ బ్రాండ్లు అయిన వివో, షావోమీ, రియల్‌మీ, మోటోరోలా వంటివి ఉ‍న్నాయి. వీటిల్లో పలు ప్రీమియం మోడళ్లు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3ప్రో, షావోమీ 14 సివి, రియల్‌మీ జీటీ6, మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా వంటి ఫోన్లు మార్కెట్లోకి వచ్చేందుకు ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశాయి. వీటితో పాటు రెడ్‌మీ 13 5జీ, సీఎంఎఫ్‌ ఫోన్‌1తో పాటు మోటోరోలా, శామ్సంగ్‌ నుంచి ప్రీమియం ఫోల్డబుల్‌ ఫోన్లను కూడా ఈ జూలైలోనే లాంచ్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయా ఫోన్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.

REDMI 13 5G: రెడ్‌మీ 13 5జీ..

రెడ్‌మీ 1350 క్రిస్టల్ గ్లాస్ డిజైన్, 108ఎంపీ ప్రైమరీ కెమెరా, స్నాప్ డ్రాగన్ 4 జెన్‌ 2, చిప్‌సెట్‌, 33వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టు, హైపర్‌ఓఎస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన 5,030ఎంఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌ జూలై 9న భారతదేశంలో లాంచ్ అవుతుంది. దీని రూ.12,000-రూ. 13,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

CMF PHONE 1: సీఎంఎఫ్‌ ఫోన్ 1..

ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 5జీ చిప్ సెట్, సూపర్ అమోల్డ్‌ డిస్ ప్లే వస్తుంది. సీఎంఎఫ్‌ వాచ్ ప్రో 2, బడ్స్ ప్రో 2లతో కలిపి లాంచ్‌ కానున్నాయి. నథింగ్ సబ్-బ్రాండ్‌గా ఈ ఫోన్‌ లాంచ్‌ అవుతోంది. జూలై 8న మార్కెట్లోకి వస్తోంది. దీని ధర రూ. 20,000 లోపు ఉండవచ్చని భావిస్తున్నారు.

MOTOROLA RAZR 50 ULTRA: మోటోరోలా రాజ్‌ఆర్‌ 50 అల్ట్రా..

మోటోరోలా నుంచి ఫ్లాగ్లిప్ క్లామ్ షెల్ స్నాప్ డ్రాగన్ 8ఎస్‌ జెన్‌ 3 చిప్ సెట్, 165హెర్జ్‌ స్క్రీన్, 50ఎంపీ ఓఐఎస్‌ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో సెన్సార్, 45వాట్ల వైర్డ్, 15వాట్ల వైర్ లెస్ ఛార్జింగ్‌తో వస్తుంది. 4,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్‌ జూలై 4న లాంచ్ అవుతోంది. ఈ ఫోల్డబుల్ హ్యాండ్సెట్ ధర రూ. 75,000 ధర బ్రాకెట్లో ఉండవచ్చు.

SAMSUNG GALAXY Z FOLD 6, GALAXY 2 FLIP 6: శామ్సంగ్‌ గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 6, గెలాక్సీ 2 ఫ్లిప్‌ 6..

ఈ రెండు ఫోన్లలో గెలాక్సీ చిప్ సెట్, కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్లల కోసం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 30 చిప్‌ సెట్‌ ఉంటుంది. శామ్సంగ్‌ గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 6 రూ. 1,69,999 గెలాక్సీ 2 ఫ్లిప్‌ 6 రూ. 1,09,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ధరలను శామ్సంగ్‌ ధ్రువీకరించలేదు. ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్లు జూలై 10న గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌-2024 ఈవెంట్లో ప్రారంభించుకునే అవకాశం ఉంది.

మరిన్ని లాంచ్‌ అయ్యే అవకాశం..

ఒప్పో, టెక్‌నో, లావా, హానర్‌ వంటి మరిన్ని బ్రాండ్లు తమ కొత్త స్మార్ట్‌ ఫోన్లను లంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పలు ఆన్‌లైన్‌ నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫినిక్స్‌ ఇటీవల నోట్‌ 40జీ ప్రారంభించింది. దీని తర్వాత నోట్ 408 4జీని తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అలాగే టెక్నో స్పార్క్ 20ని విడుదల చేయనుంది. ఇది డైమెన్సీటీ 6080 చీప్ సెట్, 12042 డిస్ ప్లే, 108 ఎంపీ, ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది రూ. 11,000 ధర బ్రాకెట్లో ఉండే అవకాశం ఉంది. లావా అమెజాన్లో బ్లేజ్ ఎక్స్‌ను లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్ విషయానికొస్తే, వన్ ప్లస్ ఈ నెలలో నోర్డ్ 4ని ఆవిష్కరించే అవకాశం ఉంది. రియల్ మీ 13 ప్రో సిరీస్ 5జీని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒప్పో రెనో 12 సిరీస్ 5జీని జూలై 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. హానర్ 200 5జీ సిరీస్ ను ఇప్పటికే అమెజాన్లో టీజ్ చేసింది. ఇది కూడా ఈ నెలలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...