- 0
Ankapur for Chicken Curry: చికెన్ కర్రీకి పెట్టింది పేరు ఆ గ్రామం.. ఒక్కసారి రుచి చేస్తే ఫిదా అయిపోతారు..
-
Similar Content
-
- 0 answers
- 14 views
-
- 2 answers
- 44 views
-
- 2 comments
- 83 views
-
- 0 answers
- 20 views
-
Sweet Corn benefits: స్వీట్ కార్న్ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!!
By Vijay,
- 0 answers
- 11 views
-
Raw Banana Health Benefits: పచ్చి అరటికాయతో పుట్టెడు లాభాలు.. తెలిస్తే తొక్క కూడా వదిలిపెట్టరు..!
By Vijay,
- 0 answers
- 26 views
-
- 1 answer
- 37 views
-
- 1 comment
- 90 views
-
ARTICLE: The Multifaceted Benefits and Medicinal Values of Pineapple: A Nutritional Powerhouse! 🍍
By Madhuri,
- 0 answers
- 25 views
-
The Multifaceted Benefits and Medicinal Values of Pineapple: A Nutritional Powerhouse! 🍍
By Madhuri,
- 0 comments
- 54 views
-
-
Now Playing
-
A Quiet Place: Day One
-
Akademia Pana Kleksa
-
Despicable Me 4
-
Sous la Seine
-
Civil War
-
The Cult
-
Furiosa: A Mad Max Saga
-
Les Infaillibles
-
IF
-
Ultraman: Rising
-
The Garfield Movie
-
Inside Out 2
-
No Time to Spy: A Loud House Movie
-
Tarot
-
A Family Affair
-
In a Violent Nature
-
Bad Boys: Ride or Die
-
Håndtering av udøde
-
Question
TELUGU
అంకాపూర్ పేరు చెప్పగానే చాలామందికి చికెన్ కర్రీ గుర్తొస్తుంది. అసలు కొంతమందికి అంకాపూర్ అనేది ఒక ఊరు పేరు అనికూడా చాలా మందికి తెలియదు. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్‌లో మొదలైన ఈ చికెన్ స్టోరీ ఇప్పుడు హైదరాబాద్ కూడా దాటి దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. అమెరికా, కెనడాల కూడా అంకాపూర్ గుమగుమల వాసనలు తాకాయి. ఇంతలా ఈ అంకాపూర్ చికెన్ కర్రీ లో ఏముంది అని తెలుసుకునే ముందు ఆ విలేజ్ స్టోరీ తెలుసుకుందాం.
అంకాపూర్ పేరు చెప్పగానే చాలామందికి చికెన్ కర్రీ గుర్తొస్తుంది. అసలు కొంతమందికి అంకాపూర్ అనేది ఒక ఊరు పేరు అనికూడా చాలా మందికి తెలియదు. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్‌లో మొదలైన ఈ చికెన్ స్టోరీ ఇప్పుడు హైదరాబాద్ కూడా దాటి దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. అమెరికా, కెనడాల కూడా అంకాపూర్ గుమగుమల వాసనలు తాకాయి. ఇంతలా ఈ అంకాపూర్ చికెన్ కర్రీ లో ఏముంది అని తెలుసుకునే ముందు ఆ విలేజ్ స్టోరీ తెలుసుకుందాం.
ఒకప్పుడు అభివృద్ధికి చాలా దూరంలో ఉన్న అంకాపూర్ ఇప్పుడు ఆదర్శ గ్రామం. గ్రామమంతా ఒక మాట మీద నిలబడి అభివృద్ధికి సహకరించారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో ఇప్పుడు అంకాపూర్ ఒక రిచ్ విలేజ్. అభివృద్ధి చెందుతున్న క్రమంలోనే అక్కడ కోళ్ల పెంపకం చేపట్టారు. కేవలం కోళ్లను అమ్మడమే కాకుండా ఇంకా వెరైటీగా ఏమైనా చేయాలని ఆలోచించిన కొంతమంది నాటుకోడి కర్రీ చేయడం మొదలుపెట్టారు.
నిజామాబాద్ నుంచి ఆర్మూర్ హైవేలో ఈ అంకాపూర్ ఉండడంతో చాలామంది ఆ నాటుకోడి కర్రీ కోసం వచ్చేవాళ్ళు. అక్కడ మొక్కజొన్నలు కూడా ఎక్కువగా పండిస్తారు దీంతో అంకాపూర్ చికెన్ కర్రీ విత్ మొక్క జొన్న గారెలు వెరీ ఫేమస్. ఇక అంత టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ మేకింగ్‌లో ప్రత్యేకత ఏంటంటే.. ఆ నాటుకోడి కూరల వాడే దాదాపు ఇంగ్రిడియంట్స్ అప్పటికప్పుడే తయారు చేయడం.. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాల పౌడర్, ధనియాల పొడి ఇలా ఇవన్నీ అప్పటికప్పుడే తయారుచేసి కర్రీలో వేస్తారు.
దీంతోపాటు అంకాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే మిర్చితో కారంపొడి తయారు చేస్తారు. ఈ కారంపొడి నాటుకోడి కూర మంచి స్పైసీగా ఉండేలా చేస్తుంది. వీటన్నిటితో పాటు ఈ నాటుకోడి కూర వండే విధానం కూడా మరో ప్రత్యేకత. మామూలు చికెన్ కర్రీ లాగా కాకుండా... భిన్నంగా దీన్ని వండుతారు. నాటుకోడైనప్పటికీ కుక్కర్లో వేయకుండా కట్టెల పొయ్యి మీద వండడం దీని టెస్ట్‌కు మరొక ప్లస్ పాయింట్. ఒరిజినల్ అంకాపూర్ చికెన్ కోసం హైదరాబాదు నుంచి వెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. అంకాపూర్ చికెన్ కర్రీ లో ఫ్రై, నాటుకోడి పులుసు ఇలా రెండు రకాలుగా మాత్రమే లభిస్తుంది.
అంతేకాదు ఈ అంకాపూర్ కోడికూర కేవలం నాటుకోడితో చేస్తేనే ఆ రుచి. అంకాపూర్ గ్రామంలో రోడ్డు వెంట అటు ఇటు 15, 20 హోటల్స్ కేవలం అంకాపూర్ చికెన్ మాత్రమే వండిస్తాయి. ఇక నిజామాబాద్‌లో కూడా కొన్ని హోటల్స్ ఈ అంకాపూర్ చికెన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాయి. దశాబ్దం క్రితం నుంచి ఉన్న అంకాపూర్ చికెన్ ఇప్పుడు హైదరాబాద్‌కు తాకింది. ఇప్పుడు దేశం దాటి విదేశాల్లోనూ అంకాపూర్ హవా చాటుతోంది.
అయితే ఎక్కడ అంకాపూర్ చికెన్ తిన్న అంకాపూర్ గ్రామానికి వెళ్లి తింటే ఆ కిక్కే వేరు. వేడివేడిగా వడ్డించే చికెన్‌తో పాటు మొక్క జొన్న గారెలు, జొన్న రొట్టెలు, ఆ తర్వాత వైట్ రైస్ ఇది కాంబినేషన్. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ అంకాపూర్ చికెన్ వండుతున్న కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే అంకాపూర్ చికెన్ కర్రీ ఎక్కడ కూడా ఫుల్, హాఫ్ అంటూ ప్లేట్ల లెక్కన అమ్మరు. కోడికి కోడి కట్ చేసి దాంతో వచ్చిన కర్రీ మొత్తాన్ని ఒక ప్యాకేజీగా అమ్మేస్తారు. ఇది కేవలం అంకాపూర్ గ్రామంలోనే కాదు ఈ నాటుకోడి కర్రీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా ఇదే సిస్టం.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.