Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 3

Good Cars, EVs, CNGs, Scooters and Bikes in India


TELUGU

Question

Electric Scooters: మార్కెట్లో బెస్ట్ ఈ-స్కూటర్లు ఇవే.. ఆ రెండు స్కూటర్లలో ప్రత్యేకతలు ఇవిగో..

Ather Rizta Z vs Ola S1 Pro: ప్రజల ఆదరణకు అనుగుణంగా వివిధ కంపెనీలు ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. వీటిలో ఫీచర్ల కూడా అత్యద్భుతంగా ఉంటున్నాయి. ఈ వాహనాలలో ఏది ఎంపిక చేసుకోవాలో కొనుగోలుదారులకు కొంచెం కష్టమే. అయితే ఫీచర్ల ను ఒకదానితో ఒకటి పోల్చి చూసినప్పుడు మనకు కొంత అవగాహన కలుగుతుంది. ఇప్పుడు ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్ 1 ప్రో వాహనాల ప్రత్యేకతలు, ధరలు, ఫీచర్లను తెలుసుకుందాం.

ather-rizta-z-vs-ola-s1-pro-1.jpg?w=1280

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్ ఫుల్ స్పీడ్ లో సాగుతున్నాయి. ఈ విభాగంలో వాహనాలకు ప్రజల ఆదరణ పెరిగింది. పెట్రోలు, డీజిల్ వాహనాలతో పోల్చితే వీటిలో అనేక సౌకర్యాలున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు కూడా ఇవి ఉపయోగపడతాయి. వీటికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండడంతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు బాగా ఎక్కువయ్యాయి.

ప్రజల ఆదరణ..

ప్రజల ఆదరణకు అనుగుణంగా వివిధ కంపెనీలు ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. వీటిలో ఫీచర్ల కూడా అత్యద్భుతంగా ఉంటున్నాయి. ఈ వాహనాలలో ఏది ఎంపిక చేసుకోవాలో కొనుగోలుదారులకు కొంచెం కష్టమే. అయితే ఫీచర్ల ను ఒకదానితో ఒకటి పోల్చి చూసినప్పుడు మనకు కొంత అవగాహన కలుగుతుంది. ఇప్పుడు ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్ 1 ప్రో వాహనాల ప్రత్యేకతలు, ధరలు, ఫీచర్లను తెలుసుకుందాం.

బెస్ట్ మోడల్స్ ఇవే..

ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో ఏథర్ రిజ్టా జెడ్ ఒక సంచలనం అని చెప్పవచ్చు. అయితే మార్కెట్‌లో దీనికి పోటీగా మరికొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. వాటిలో ఓలా ఎస్ 1 ప్రో ఒకటి. ఈ రెండు వాహనాలలో ఏది మంచిదో చెప్పడం చాలా కష్టం. కానీ ఫీచర్లను తెలుసుకోవడం ద్వారా ఒక అంచనాకు రావొచ్చు.

డిజైన్..

ముందుగా ఈ రెండు స్కూటర్ల డిజైన్ ను పరిశీలిద్దాం. ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఏథర్ రిజ్టా జెడ్ వాహనం బాక్స్ బాడీ వర్క్ తో ఉంది. అలాగే ఆకారంలో పెద్దదిగా కనిపిస్తుంది.

మరోవైపు ఓలా ఎస్ 1 ప్రో వాహనానికి కర్వీ బాడీ వర్క్ చేశారు. ఆకారం కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే ఈ రెండు ఈవీల డిజైన్లు కచ్చితంగా కొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి.

ఫీచర్లు..

ఏథర్ రిజ్టా జెడ్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్, ఎకో, జిప్, ట్రాక్షన్ కంట్రోల్, మొబైల్ చార్జింగ్, ఆటో హోల్డ్, రివర్స్ మోడ్‌తో సహా అనేక ఫీచర్లతో అందుబాటులో ఉంది. స్కూటర్ లోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ద్వారా వీటని టోగుల్ చేయవచ్చు. నియంత్రించవచ్చు. గూగుల్ మ్యాప్స్ కోసం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని సౌలభ్యం ఉంది. లైవ్ ట్రాఫిక్ డేటా, కాల్స్ కు ఆటో రిప్లయ్, వాట్సాప్ ప్రివ్యూ కు అనుమతి ఉంది.

ఓలా ఎస్ 1 ప్రో విషయానికి వస్తే ఎకో, నార్మల్, స్పోర్ట్, హైపర్ అనే నాలుగు మోడ్ లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రైడ్ మూడ్స్, సంగీతం, కాల్స్, ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్లు, వైఫై కనెక్టివిటీ, రిమోట్ బూట్ యాక్సెస్, రిమోట్ లాక్/అన్‌లాక్, హిల్ హోల్డ్, మూడు స్థాయిల బ్రేకింగ్ వ్యవస్థ తదితర ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్ 1 ప్రో వాహనాల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉంటాయి.

హార్డ్ వేర్..

రెండు ఎలక్ట్రిక్ వాహనాల హార్డ్ వేర్ వ్యవస్థ ఒకేలా ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ , సింగిల్ రియర్ షోక్ ఉంటాయి. సింగిల్ ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ సెటప్ పై బ్రేకింగ్ వ్యవస్థను రూపొందించారు. అయితే ఓలా కంటే ఏథర్ స్కూటర్‌లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉంది.

మోటార్, బ్యాటరీ..

రిజ్టా జెడ్‌లో 4.3కేడబ్ల్యూ మోటార్, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. ఇది సుమారు 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేయవచ్చు.

ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ లో 11కేడబ్ల్యూ (పీక్ పవర్) మోటార్, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్నాయి. దీని రేంజ్ 180 కిలోమీటర్లు, గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోవచ్చు. అంటే ఏథర్ రిజ్టా జెడ్ కంటే ఓలా ఎస్ 1 ప్రోలో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంది.

ధర..

ఏథర్ రిజ్టా జెడ్ ధర రూ. 1.45 లక్షలు, మీరు ప్రో ప్యాక్‌ని ఎంచుకుంటే 1.65 లక్షలకు అందుబాటులో ఉంది. ఓలా ఎస్ 1 ప్రో ధర రూ.1.30 లక్షలు. ఇవి బెంగళూరులో ఎక్స్ షోరూమ్ ధరలు.

ఈ రెండు స్కూటర్లలో ఫీచర్లు, డిజైన్ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ ధరలో మాత్రం వ్యత్యాసం ఉంది. అందుబాటు ధరలో ఉన్న ఓలా ఎస్ 1 ప్రో మంచి డీల్ గా అనిపిస్తుంది. ఏది ఏమైనా మీ అవసరాలు, మీకు నచ్చిన ఫీచర్ల ఆధారంగా స్కూటర్ ను ఎంచుకుంటే మంచిది.

...

Complete article

Link to comment
Share on other sites

  • Answers 38
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • Sanjiv

    16

  • Vijay

    13

  • TELUGU

    10

Top Posters For This Question

Recommended Posts

  • 0

Muvi 125 5G e-bike electric scooter 100 km mileage in single charge: అన్ని అవసరాలకు ఉపయోగపడే ఈ-స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100కిలోమీటర్ల రేంజ్..

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ మేకర్ ఈబైక్‌గో తన కొత్త మువీ 125 5జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది. ఈ కొత్త ఈ-స్కూటర్ ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న 4జీ మోడల్ స్థానాన్ని భర్తీ చేయనుంది. భారతీయ వినియోగదారుల అవసరాలు, వారి కోరుకుంటున్న అంశాలను జోడించి ఈ కొత్త స్కూటర్ తీసుకువచ్చినట్లు ఈబైక్ గో కంపెనీ ప్రకటించింది.

Ebikego Muvi 125 5g

ebikego-muvi-125-5g.jpg?w=1280

మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో అనేక కంపెనీలు తప్ప ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. వాటిల్లో టాప్ బ్రాండ్లు చాలానే ఉన్నాయి. అలాంటి బ్రాండ్లలో ఒకటైన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ మేకర్ ఈబైక్‌గో తన కొత్త మువీ 125 5జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది. ఈ కొత్త ఈ-స్కూటర్ ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న 4జీ మోడల్ స్థానాన్ని భర్తీ చేయనుంది. భారతీయ వినియోగదారుల అవసరాలు, వారి కోరుకుంటున్న అంశాలను జోడించి ఈ కొత్త స్కూటర్ తీసుకువచ్చినట్లు ఈబైక్ గో కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త స్కూటర్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

100 కిలోమీటర్ల రేంజ్..

కొత్త మువీ 125 5జీ ఎలక్ట్రిక్ స్కూటర్ 100కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీనిలో 5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది మూడు గంటల సమయంలోనే సున్నా నుంచి 80 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్ల చార్జింగ్ టైంతో పోల్చితే చాలా తక్కువ సమయం అని కంపెనీ పేర్కొంది.

ఈబైక్ గో మువీ 125 5జీ ఫీచర్స్..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో స్మార్ట్ ఎల్ఈడీ డిజిటల్ డిస్ ప్లే డ్యాష్ బోర్డు ఉంటుంది. మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసిన అనేక ఫీచర్లు ఉంటాయి. ఈ కొత్త స్కూటర్ గురించి ఈబైక్ గో ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మాట్లడుతూ అర్బన్ మొబలిటీలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చేందుకు నడుం బిగించామన్నారు. అందులో భాగంగానే కొత్త రవాణా సాధనాలను పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. వాటిల్లో మువీ 125 5జీ ఈ-స్కూటర్ భారతీయ వినియోగదారులకు సరిగ్గా సరిపోతుందని, వారి అవసరాలకు అనుగుణంగా తయారు చేసినట్లు చెప్పారు.

ఈబైక్ గో భవిష్యత్ ప్రణాళికలు..

ఈబైక్ గో తమ భవిష్యత్ ప్రణాళికలు కూడా ప్రకటించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలోపు తమ ద్విచక్ర వాహనాల శ్రేణిలో ఒక లక్ష ఈవీలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గత మూడేళ్లుగా తమ ఆపరేషన్స్ ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణిలో ఓలా టాప్ సెల్లర్ గా ఉంది. ఆ తర్వాత స్థానంలో ఏథర్, టీవీఎస్, బజాజ్ చేతక్ వంటి ఇతర బ్రాండ్లు ఉన్నాయి. అయితే ఈ స్కూటర్ ఇంటి అవసరాలను తీర్చడంలో బాగా ఉపకరిస్తుంది.

Link to comment
Share on other sites

  • 0

Electric Two-Wheelers exploding batteries: బైకులు, స్కూటర్ల బ్యాటరీలు పేలిపోవడానికి కారణమిదే.. ఇలా చేస్తే మీ ఈ-వాహనాలు సేఫ్‌..

తరచూ ఎలక్ట్రిక్‌ వాహనాల గురించి వస్తున్న వార్తలు, జరుగుతున్న సంఘటనలు వినియోగదారులకు బ్యాక్‌ స్టెప్‌ తీసుకునేలా చేస్తున్నాయి. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు పేలిపోతుండటంతో వాతావరణం వేడిగా ఉన్న పరిస్థితుల్లో వీటి వినియోగం చాలా ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఈ క్రమంలో అసలు ఎలక్ట్రిక్‌ వాహనాలు పేలిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? వాటిని ఎలా నిరోధించాలి? తెలుసుకుందాం రండి.

Electric Scooters On Fire

electric-scooters-on-fire.jpg?w=1280

మన దేశంలోని ఆటోమొబైల్‌ రంగం వేగంగా మారిపోతోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలు వేగంగా పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల స్థానాన్ని ఆక్రమిస్తు‍న్నాయి. ముఖ్యంగా ద్విచక్రవాహనాలు మరింత వేగంగా రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. వినియోగదారులు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. అయితే తరచూ ఎలక్ట్రిక్‌ వాహనాల గురించి వస్తున్న వార్తలు, జరుగుతున్న సంఘటనలు వినియోగదారులకు బ్యాక్‌ స్టెప్‌ తీసుకునేలా చేస్తున్నాయి. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు పేలిపోతుండటంతో వాతావరణం వేడిగా ఉన్న పరిస్థితుల్లో వీటి వినియోగం చాలా ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఈ క్రమంలో అసలు ఎలక్ట్రిక్‌ వాహనాలు పేలిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? వాటిని ఎలా నిరోధించాలి? తెలుసుకుందాం రండి.

షార్ట్ సర్క్యూట్..

ఎలక్ట్రిక్ బైక్లు, స్కూటర్లలో మంటలు రావడానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి షార్ట్ సర్క్యూట్. బ్యాటరీ కనెక్షన్లు సురక్షితంగా లేకుంటే షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు. ఈ వాహనాల్లో తరచుగా ఏడు కిలోవాట్ల వరకు కెపాసిటీ ఉన్న ఛార్జర్లను ఉపయోగిస్తారు. కనెక్షన్లు వదులుగా లేదా సరిగ్గా నిర్వహించకపోతే షార్ట్ సర్క్యూట్ల ప్రమాదం పెరుగుతుంది.

బ్యాటరీ వేడెక్కడం..

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, తీవ్రమైన వేడి అనేది ఒక సాధారణ సమస్య. అధిక ఉష్ణోగ్రతలు విద్యుత్ ద్విచక్ర వాహనాల పనితీరును గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, బ్యాటరీ వేడెక్కుతుంది. ఇది సంభావ్య అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వేసవి నెలల్లో యజమానులు ఈ ప్రమాదం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

సరిపోని ఛార్జర్ వాడకం..

తప్పు ఛార్జర్లను ఉపయోగించడం మరో కీలకమైన అంశం. ప్రతి ఎలక్ట్రిక్ వాహనం నిర్దిష్ట రకం బ్యాటరీ, అనుకూల ఛార్జర్తో రూపొంది ఉంటుంది. వేరొక మోడల్ లేదా బ్యాటరీ రకానికి ఉద్దేశించిన ఛార్జర్‌ని ఉపయోగించడం వల్ల విద్యుత్ పరిమితులు సరిపోలలేదు. వేడెక్కడం, మంటలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

బ్యాటరీ కవర్ లేకపోవడం..

ఉపయోగంలో ఉన్నప్పుడు బ్యాటరీలు గణనీయమైన స్థాయిలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ వేడిని నిర్వహించడానికి, బ్యాటరీ కవర్లు, హీట్ సింక్లు అవసరం. దురదృష్టవశాత్తూ, కొంతమంది తయారీదారులు బ్యాటరీ, మొత్తం బరువును తగ్గించడానికి ఈ భాగాలను పెద్దగా పట్టించుకోరు. తద్వారా రవాణా చేయడం సులభం అవుతుంది. అయితే ఇది సరిగ్గా చల్లబడకపోతే అగ్ని ప్రమాదం సంభవిస్తుంది.

అధిక ఉష్ణోగ్రతలు..

ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణంగా లిథియం బ్యాటరీలు, కొన్నిసార్లు గ్యాసోలిన్తో పనిచేస్తాయి. గ్యాసోలిన్ 210 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిగా ఉంటే మండుతుంది. లిథియం బ్యాటరీలు 135 డిగ్రీల సెల్సియస్ వద్దే మంటలు అంటుకుంటాయి. దీనిని నివారించడానికి, ఎండాకాలంలో ఎలక్ట్రిక్ బైక్లు, స్కూటర్లను నీడ లేదా చల్లని ప్రదేశాలలో పార్క్ చేయడం మంచిది.

Link to comment
Share on other sites

  • 0

EV Scooter Tips in rainy season: వర్షాకాలంలో ఈవీ స్కూటర్లకు గడ్డు కాలం.. ఈ టిప్స్ పాటిస్తే సమస్యలు దూరం

ప్రస్తుతం భారతదేశంలో వర్షాలు దంచికొడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వరుణుడు డైలీ పలుకరిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో ఈవీ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ఈ వర్షాకాలంలో ఈవీ వాహనాలను సరైన విధంగా భద్రపర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాలంలో చేసే చిన్నచిన్న తప్పులు స్కూటర్ విషయంలో చాలా పెద్దవిగా మారతాయి. ఈ నేపథ్యంలో ఈ వర్షాల సీజన్‌లో మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రక్షించడానికి, నిర్వహించడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

ev-scooters.jpg

ఎల్లప్పుడూ మీ స్కూటర్‌ను వర్షం నుంచి దూరంగా ఉంచడానికిప్రయత్నించాలి. ముఖ్యంగా వర్షంలో ప్రయాణాన్ని నివారించడండి. అలాగే వర్షం నుండి రక్షించడానికి మీ స్కూటర్‌ను మంచి ప్రదేశంలో పార్క్ చేయాలి.

వర్షం పడిన తర్వాత మీ స్కూటర్‌ను పూర్తిగా శుభ్రం చేసి ఆరబెట్టాలి. బ్రేకులు, విద్యుత్ కనెక్షన్లను పొడిగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నీరు, ధూళి పేరుకుపోకుండా మడ్‌గార్డ్‌లు, టైర్లను శుభ్రం చేయాలి.

తప్పనిసరి పరిస్థితుల్లో వర్షంలో ప్రయాణించాల్సి వస్తే మీ స్కూటర్ల టైర్లు సరిగ్గా ఉన్నాయో? లేదో? తనిఖీ చేయాలి. బ్రేకులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి తరచుగా వాటిని తనిఖీ చేయాలి. ఎందుకంటే వర్షం వల్ల బ్రేక్ సిస్టమ్‌లోకి ధూళి, నీరు వెళ్తే అది వాహన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఈవీ స్కూటర్ బ్యాటరీ, మోటార్ వాటర్‌ప్రూఫ్ చేయడానికి సరైన కవరింగ్‌లు, సీలింగ్‌ని ఉపయోగించాలి. బ్యాటరీ కంపార్ట్‌మెంట్ పొడిగా, సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.

వర్షం సమయంలో విజిబిలిటీ తరచుగా తగ్గిపోతుంది. కాబట్టి మీ స్కూటర్‌లోని అన్ని లైట్లు, సిగ్నల్‌లు సరిగ్గా పని చేస్తున్నాయని ధ్రువీకరించుకోవాలి. ముఖ్యంగా వర్షంలో నెమ్మదిగా డ్రైవ్ చేయాలి. ఆకస్మిక బ్రేకింగ్‌ను నివారించారు. జారే రోడ్లపై జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీటితో నిండిన ప్రాంతాలను నివారించడం ఉత్తమం.

Link to comment
Share on other sites

  • 0

Ather Rizta: ఆ నగరాల్లోని ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ ఏథర్ స్కూటర్ డెలివరీలు షురూ..

తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ అయిన ఏథర్ ఎనర్జీ తన కొత్త రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా ఈ మేరు తన ఎక్స్‌లో ఈ అప్‌డేట్ ఇచ్చారు. అయితే దేశంలోని కొన్ని నగరాల్లో ముందుగా ఈ స్కూటర్ డెలివరీలను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఏథర్ రిజ్టా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేశారు.

Ather Rizta

ather-rizta.jpg?w=1280

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల దగ్గర స్టార్టప్ కంపెనీల వరకూ ప్రతి కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌లో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ అయిన ఏథర్ ఎనర్జీ తన కొత్త రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా ఈ మేరు తన ఎక్స్‌లో ఈ అప్‌డేట్ ఇచ్చారు. అయితే దేశంలోని కొన్ని నగరాల్లో ముందుగా ఈ స్కూటర్ డెలివరీలను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఏథర్ రిజ్టా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేశారు. ఈ స్కూటర్ ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.45 లక్షల వరకు ఉంటుంది. ఈ స్కూటర్‌ను మొదటగా అహ్మదాబాద్, పూణే, ఢిల్లీ, లక్నో, ఆగ్రా, జైపూర్, నాగ్ పూర్, ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న నగరాల్లో డెలివరీలు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఏథర్ రిజ్టా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఏథర్ రిజ్టా  450 ఎక్స్‌లా ప్రధాన ఫ్రేమ్ అలాగే ఉన్నప్పటికీ తక్కువ సీటు ఎత్తుతో వచ్చే సబ్ ఫ్రేమ్ ఆకట్టకుంటుంది. పీఎంఎస్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వచ్చే ఈ స్కూటర్ 80 కిలో మీటర్ల గరిష్ట వేగంతో 3.7 సెకన్లలో 0-40 కిలో మీటర్లను అందుకుంటుంది. రిజ్టా 2.9 కేడబ్ల్యూహెచ్ యూనిట్‌తో 123 కిమీ పరిధిని అందిస్తుంది. అలాగే 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే వేరియంట్ ఓ సారి ఛార్జ్ చేస్తే 159 కిమీ పరిధితో వస్తుంది.  ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు ఒకే షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ పవర్ విషయానికి వస్తే ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్ నుండి వస్తుంది.

ఏథర్ రిజ్టా స్కూటర్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో ఆకట్టుకుంటుంది. జెడ్ వేరియంట్లు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌తో టీఎఫ్‌టీ స్క్రీన్‌తో వస్తాయి. ట్రిమ్ కూడా ప్రామాణిక సీటును పొందుతుంది. అయితే జెడ్ ట్రిమ్ దానిని ప్రీమియం సీటుతో పాటు స్టాండర్డ్ పొందుతుంది. 2.9 కేడబ్ల్యూహెచ్ వెర్షన్లలో ఛార్జింగ్ సమయం 5 గంటల 45 నిమిషాలు ఉంటుంది. అయితే 3.7 కేడబ్ల్యూహెచ్ వెర్షన్ వేగంగా ఛార్జింగ్ అవుతుంది మరియు 4 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఏథర్ రిజ్టా ఎస్ ధర రూ. 1.10 లక్షల నుంచింది. అయితే ఫ్యాన్సీయర్ ఫీచర్లతో కూడిన ప్రో ప్యాక్ ఎక్స్-షోరూమ్ ధర కంటే 13,000, అంతకంటే ఎక్కువ ప్రీమియంతో వస్తుంది . రిజ్టా జెడ్ వేరయంట్ 2.9  కేడబ్ల్యూహెచ్ ధర రూ.1.25 లక్షలు, రిజ్జా జెడ్ 3.7 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ.1.45 లక్షలుగా ఉంటుంది.

Link to comment
Share on other sites

  • 0

CNG Cars SUV for under 10 lakhs: మీరు సీఎన్‌జీ ఎస్‌యూవీ కొంటున్నారా? రూ.10 లక్షల కంటే తక్కువ ధరల్లో బెస్ట్‌ కార్లు

మీరు పెట్రోల్-డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా చౌకైన ఇంధనంతో కారు కోసం చూస్తున్నారా? మీరు సీఎన్‌జీ లేదా ఎలక్ట్రిక్ మధ్య ఎంచుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ కంటే కొంచెం ఖరీదైనవి. అటువంటి పరిస్థితిలో చాలా మందికి సీఎన్‌జీ మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ 10 లక్షల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం...

CNG Cars

cng-cars.jpg?w=1280

మీరు పెట్రోల్-డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా చౌకైన ఇంధనంతో కారు కోసం చూస్తున్నారా? మీరు సీఎన్‌జీ లేదా ఎలక్ట్రిక్ మధ్య ఎంచుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ కంటే కొంచెం ఖరీదైనవి. అటువంటి పరిస్థితిలో చాలా మందికి సీఎన్‌జీ మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ 10 లక్షల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.

టాటా పంచ్ సీఎన్‌జీ: గత కొన్ని సంవత్సరాలుగా టాటా CNG వాహనాలపై దృష్టి పెట్టింది. టాటా పంచ్ SUV సెగ్మెంట్లో అత్యంత చౌకైన కారు. ఇది ప్యూర్, అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ డీజిల్ మొత్తం 5 వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారులో 1.2 లీటర్ ఇంజన్ ఉంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 72.5bhp, 103Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. SUV 60 లీటర్ల సామర్థ్యంతో ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. దీని సామర్థ్యం 210 లీటర్లు. పంచ్ CNG ఎక్స్-షోరూమ్ ధర రూ.7.23 లక్షల నుండి రూ.9.85 లక్షల మధ్య ఉంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG: హ్యుందాయ్ Xeter CNG S, SX అనే రెండు వేరియంట్లలో వస్తుంది. ఎక్సెటర్ బేస్ మోడల్ కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. యాంటీ-లాక్ బ్రేకింగ్, EBD, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి భద్రతా ఫీచర్లు ఈ కారులో అందించింది కంపెనీ. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. దీనితో పాటు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. ఎస్‌యూవీలో 60 లీటర్ సీఎన్‌జీ ట్యాంక్ ఉంది. దీని ధర రూ. 8.43 లక్షల నుండి రూ. 9.16 లక్షల వరకు, ఎక్స్-షోరూమ్.

మారుతీ ఫ్రాంక్స్ సీఎన్‌జీ: Frontex CNG రెండు వేరియంట్ ఎంపికలలో వస్తుంది. సిగ్మా, డెల్టా. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు CNG 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది జీఎన్‌జీ మోడ్‌లో 76bhp, 98.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని CNG ట్యాంక్ 55 లీటర్లు. ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.46 లక్షల నుంచి రూ.9.32 లక్షల మధ్య ఉంది.

మారుతీ బ్రెజ్జా సీఎన్‌జీ: Brezza CNG మూడు వేరియంట్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. LXI, VXI, ZXI. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 99bhp పవర్, 136Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 55-లీటర్ CNG ట్యాంక్‌తో వస్తుంది. ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.29 లక్షల నుండి రూ. 12.10 లక్షల వరకు ఉంది.

Link to comment
Share on other sites

  • 0

World's first CNB Bike from Bajaj Freedom 125: ప్రపంచంలో తొలి CNG బైక్‌ వచ్చేసింది.. కిలో మీటర్‌కు రూపాయి కంటే తక్కువ

సీటు కింద సీఎన్‌జీ ట్యాంకును అమర్చారు. ఈ బైక్‌ సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఒక చిన్న బటన్‌ సహాయంతో ఫ్యూయల్‌ ఏది కావాలనేదాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు. హ్యాండిల్‌ వద్ద ఈ స్విచ్‌ను అందించారు. దీంతో సులభంగా సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌కు, పెట్రోల్‌ నుంచి సీఎన్‌జీకి మారొచ్చు. ఇక ఈ బైక్‌ ఇంజన్‌ గరిష్టంగా...

Bajaj CNG bike

bajaj-cng.jpg?w=1280

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ వచ్చేస్తోంది. ఎన్నో రోజుల ఎదురు చూపులకు చెక్‌ పెడుతూ బజాజ్‌ ఫ్రీడమ్ 125 పేరుతో కొత్త బైక్‌ను శుక్రవారం లాంచ్‌ చేశారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ తొలి సీఎన్‌జీ బైక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇప్పటి వరకు సీఎన్‌జీ కార్లు, ఆటోలు మాత్రమే అందులోబాటులో ఉండగా తొలిసారి బైక్‌ వచ్చింది.

ఈ బైక్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ డ్రమ్ రూ. 95,000కాగా డ్రమ్‌ ఎల్‌ఈడీ ధర రూ. 1.05 లక్షలు, డ్రమ్‌ ఎల్ఈడీ డిస్క్‌ ధర రూ. 1.10 లక్షల ఎక్స్ షోరూమ్‌ ప్రైజ్‌గా నిర్ణయించారు. బుకింగ్స్ ప్రారంభంకాగా ప్రస్తుతానికి మాత్రం మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ బైక్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు.

సీటు కింద సీఎన్‌జీ ట్యాంకును అమర్చారు. ఈ బైక్‌ సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఒక చిన్న బటన్‌ సహాయంతో ఫ్యూయల్‌ ఏది కావాలనేదాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు. హ్యాండిల్‌ వద్ద ఈ స్విచ్‌ను అందించారు. దీంతో సులభంగా సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌కు, పెట్రోల్‌ నుంచి సీఎన్‌జీకి మారొచ్చు. ఇక ఈ బైక్‌ ఇంజన్‌ గరిష్టంగా 9.5bhp పవర్, 9.7nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇక మైలేజ్‌ విషయానికొస్తే ఈ బైక్‌ సీఎన్‌జీతో కిలోకు 102 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ప్రస్తుతం కిలో సీఎన్‌జీ ధర రూ. 92 ఉంది. దీంతో ఈ బైక్‌తో సుమారు రూపాయికి ఒక లీటర్‌ ప్రయాణించవచ్చన్నమాట. ఇక పెట్రోల్ విషయానికొస్తే 64 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఫ్రీడమ్‌ 125లో DRLతో కూడిన రౌండ్ హెడ్‌ల్యాంప్‌ను అందించారు.

11 రకాల సేఫ్టీ టెస్టింగ్‌లను నిర్వహించిన తర్వాత ఈ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. అన్ని టెస్ట్‌ల్లోనూ సీఎన్‌జీ కిట్‌ చెక్కు చెదరకపోవడం విశేషం. ఈజిప్టు, టాంజానియా, పెరూ, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాలకు కూడా ఈ బైక్‌ను ఎగుమతి చేయనున్నారు. కొత్త సీఎన్‌జీ బైక్‌ ఒక గేమ్‌ ఛేంజర్‌ బైక్‌గా బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ అభివర్ణించారు. ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సాహించాలని ఆయన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 బైక్‌ను విడుదల చేసింది. సిఎన్‌జితో నడిచే ప్రపంచంలోనే తొలి బైక్ ఇదే. ఈ సీఎన్‌జీ బైక్ ధర 95,000 రూపాయల నుండి 1.10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ బైక్‌ ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ వాహనాన్ని తయారు చేసేందుకు బజాజ్ చేసిన R&D ప్రయత్నాన్ని ఆయన అభినందించారు.

ఖరీదు కిలోమీటరుకు రూ.1 మాత్రమే:

బజాజ్ సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ 125 ఆచరణలో ఎంత డబ్బు ఆదా చేయగలదో నితిన్ గడ్కరీ ఒక ఉదాహరణ ఇచ్చారు. ప్రస్తుత ధరల ప్రకారం.. పెట్రోల్ ద్విచక్రవాహనం ధర కిలోమీటరుకు రూ.2.25గా ఉంది. అయితే, సీఎన్‌జీ బైక్‌ ధర కిలోమీటరుకు ఒక్క రూపాయి మాత్రమే. ద్విచక్ర వాహనాల ఎగుమతిలో మేం నంబర్‌వన్‌. పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే సీఎన్‌జీ బైక్‌లకు ఎక్కువ మార్కెట్ లభిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని నితిన్ గడ్కరీ అన్నారు.

బైక్‌లో పెట్రోల్, సీఎన్‌జీ ట్యాంకులు

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్‌లో డ్యూయల్ ట్యాంక్ ఉంది. సీటు కింద రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్, రెండు కిలోల సీఎన్‌జీ ట్యాంక్ ఉన్నాయి. కిలో సీఎన్‌జీ ధర రూ.60. ఒక కిలో సిఎన్‌జితో ఈ బైక్ 106 కి.మీల దూరం నడపగలదని బజాజ్ కంపెనీ పేర్కొంది. పెట్రోల్ ట్యాంకుల స్థానంలో ఇథనాల్ ట్యాంకులను పెట్టాలని బజాజ్ ఆటోకు నితిన్ గడ్కరీ సూచించారు. పెట్రోల్ కంటే ఇథనాల్ పర్యావరణ అనుకూలమని వారు భావిస్తున్నారు. సిఎన్‌జి పెట్రోలియం ఉత్పత్తి అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే పర్యావరణానికి తక్కువ హానికరం.

Link to comment
Share on other sites

  • 0

Zelio Ebikes: నయా మేడ్‌ ఇన్‌ ఇండియా ఈ-స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై 100కి.మీ. రయ్ రయ్

ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీ సం‍స్థ అయిన జీలియో ఈబైక్స్‌ ఈ జూలై నెలలోనే కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి వస్తున్న 14వ మోడల్‌ ఇది. ఈ కొత్త స్కూటర్‌ పూర్తిగా మేడ్‌ ఇన్‌ ఇండియా అని జీలియో పేర్కొంది. దీనికి సంబంధించిన టీజర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన ధరలు కంపెనీ ప్రకటించలేదు.

Zelio E Scooter

zelio-e-scooter.jpg?w=1280

మన దేశంలో విద్యుత్‌ శ్రేణి వాహనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పర్యావరణ హితంతో పాటు సులభమైన మెయింటెనెన్స్‌ ఉండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్‌ ధరలు కూడా ప్రజలు వీటి వైపు చూసేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాల కొనుగోళ్లు అధికంగా ఉన్నాయి. దీంతో కంపెనీల మధ్య చాలా పోటీ వాతావరణం నెలకొంటోంది. దిగ్గజ కంపెనీలతో పాటు స్టార్టప్‌లు, కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీ సం‍స్థ అయిన జీలియో ఈబైక్స్‌ ఈ జూలై నెలలోనే కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి వస్తున్న 14వ మోడల్‌ ఇది. ఈ కొత్త స్కూటర్‌ పూర్తిగా మేడ్‌ ఇన్‌ ఇండియా అని జీలియో పేర్కొంది. దీనికి సంబంధించిన టీజర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన ధరలు కంపెనీ విడుదల చేయలేదు. స్కూటర్‌ ఆవిష్కరణ రోజే ధర కూడా వెల్లడిస్తామని చెప్పారు. కంపెనీ ప్రకటించిన ప్రధాన అంశాలలో దీని రేంజ్‌ ఒకటి. ఇది సింగిల్‌ చార్జ్‌ పై 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. స్కూటర్‌ లోడ్‌ సామర్థ్యం 180కిలోలు ఉంటుందని జీలియో పేర్కొంది.

జీలియో ఈబైక్స్‌ లో స్పీడ్‌ పైనే ఫోకస్‌..

ఈవీ టూ-వీలర్ బ్రాండ్ ఇటీవల గ్రేసీ సిరీస్ స్కూటర్లను ప్రారంభించడంతో తక్కువ-వేగవంతమైన ఉత్పత్తి పోర్ట్ఫోలియోను విస్తరించింది. ఇందులో గ్రేసీ(Gracyi), గ్రేసీ ప్రో(Gracy Pro) వంటి మోడళ్లు ఉన్నాయి. వీటి ధర రూ.59,273 నుంచి రూ. 83,073 మధ్య ఉంది. దీని తర్వాత రూ. 64,543 నుంచి రూ. 87,573 ఎక్స్-షోరూమ్ వరకు ఎక్స్‌-మెన్ స్కూటర్లను పరిచయం చేసింది. లెజెండర్, ఈవా, లాజిక్స్, మిస్టరీ వంటి ఇతర శ్రేణి స్కూటర్లు ఆఫర్లో ఉన్నాయి.

జీలియో ఈబైక్స్‌ సహ-వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య మాట్లాడుతూ, తమ తక్కువ-స్పీడ్ స్కూటర్ల విజయాన్ని ఆధారం చేసుకొని, తమ పోర్ట్‌ ఫోలియోలో మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ మార్కెట్‌కు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కొత్త హై-స్పీడ్ స్కూటర్ అధునాతన సాంకేతికతను సొగసైన డిజైన్‌ మిళితం చేస్తుందని చెప్పారు. దాని అద్భుతమైన శ్రేణి, పనితీరుతో సాటిలేని రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. నేటి పట్టణ ప్రయాణికుల అంచనాలు, ఈ ఉత్పత్తి ఆవిష్కరణ, సుస్థిరత, మేక్ ఇన్ ఇండియా చొరవ తమ నిబద్ధతను తెలుపుతుందన్నారు. తమ కొత్త స్కూటర్‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను తీసుకొస్తుంది గట్టిగా చెప్పారు.

Link to comment
Share on other sites

  • 0

VLF EV Scooter: భారత ఈవీ మార్కెట్‌లో ఇటాలియన్ బ్రాండ్ గ్రాండ్ ఎంట్రీ.. కొల్హాపూర్‌లో మ్యానుఫాక్చరింగ్ హబ్..!

వీఎల్ఎఫ్ తయారీ, పంపిణీని నిర్వహించడానికి కేఏడబ్ల్యూ వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జట్టుకట్టింది. అత్యాధునిక తయారీ సౌకర్యం ఈ ప్రాంతంలో కేఏడబ్ల్యూ గ్రూప్‌నకు సంబంధించిన విస్తృతమైన ఆరు దశాబ్దాల తయారీ అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది. వీఎల్ఎఫ్ దాని ఐకానిక్‌ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ సంవత్సరం పండుగల సీజన్ నాటికి ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

vlf-ev-scooter.jpg?w=1280

ఇటాలియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ వీఎల్ఎఫ్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో తయారీ హబ్‌ను ఏర్పాటు చేయాలనే యోచనతో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. వీఎల్ఎఫ్ తయారీ, పంపిణీని నిర్వహించడానికి కేఏడబ్ల్యూ వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జట్టుకట్టింది. అత్యాధునిక తయారీ సౌకర్యం ఈ ప్రాంతంలో కేఏడబ్ల్యూ గ్రూప్‌నకు సంబంధించిన విస్తృతమైన ఆరు దశాబ్దాల తయారీ అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది. వీఎల్ఎఫ్ దాని ఐకానిక్‌ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ సంవత్సరం పండుగల సీజన్ నాటికి ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సరసమైన ధరలో ప్రీమియం రైడింగ్ అనుభవాన్నిచ్చేలా ఈ స్కూటర్ రూపొందించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌లో వీఎల్ఎఫ్ ఈవీ లాంచ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1993లో ప్రఖ్యాత డిజైనర్ అలెశాండ్రో టార్టరిని స్థాపించారు. వీఎల్ఎఫ్ ఉత్పత్తులు వారి బలమైన వ్యక్తిత్వం, ప్రత్యేకమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందాయి. అత్యంత పోటీ, నిరంతరం అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో, మేము స్టైలిష్, బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండే ఉత్పత్తులను సృష్టిస్తామని అలెశాండ్రో టార్టరిని తెలిపారు. సాంప్రదాయ గ్యాసోలిన్-ఆధారిత డిజైన్‌ల నుంచి విడిపోయి సరసమైన, స్టైలిష్ ప్రత్యామ్నాయాలను అందించే ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందించడమే వీఎల్ఎఫ్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ వినియోగదారులలో అవగాహన కల్పించడానికి, ఆసక్తిని పెంపొందించడానికి వీఎల్ఎఫ్ విస్తృతమైన మార్కెటింగ్ ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఇది 2024 పండుగ సీజన్‌లో అధికారిక బ్రాండ్ లాంచ్‌తో ముగుస్తుంది. ప్రచారంలో మార్కెటింగ్ కార్యకలాపాలు, రోడ్‌షోలు, ఆటో ఎక్స్‌పోస్‌లో పాల్గొనడం భారతదేశంలో వీఎల్ఎఫ్ ఉనికిని దృఢంగా స్థాపించడం వంటివి ఉన్నాయి.

వీఎల్ఎఫ్ కంపెనీ ప్రధానంగా టైర్-I, టైర్-II నగరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం అంతటా ఒక బలమైన డీలర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 2024 చివరి నాటికి 15 డీలర్‌షిప్‌లు పని చేయాలని, అలాగే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 50 డీలర్‌షిప్‌లను పెంచాలని లక్షంగా పెట్టుకుంది. కేఏడబ్ల్యూ వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ షెల్కే మాట్లాడుతూ వీఎల్ఎఫ్ భారతీయ వినియోగదారులకు డిజైన్, పనితీరులో రాణించేలా ఈవీ స్కూటర్ల శ్రేణిని అందించాలనుకుంటున్నామని తెలిపారు. ప్రతి వీఎల్ఎఫ్ ఉత్పత్తికి ప్రత్యేకత ఉండేలా డిజైన్ చేస్తున్నామని పేర్కొన్నారు. 

Link to comment
Share on other sites

  • 0

Discounts on Maruti Suzuki up to 2.5 lakhs: మారుతి సుజుకీ బంపర్‌ ఆఫర్‌.. ఈ మోడళ్లపై రూ. 2.5 లక్షల వరకు తగ్గింపు!

Maruti Suzuki Cars: మీరు మారుతి సుజుకి నుండి కొత్త కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, చౌక ధరలో కారును కొనుగోలు చేయడానికి మీకు గొప్ప అవకాశం ఉంది. ఫ్రాంక్‌ల నుండి జిమ్నీ వరకు ఈ నెలలో ఏయే మోడల్‌లు డిస్కౌంట్‌లను పొందుతున్నాయో తెలుసుకుందాం..

maruti-suzuki1-1.jpg?w=1280&enlarge=true

మారుతి సుజుకి ఫ్రాంక్స్: ఈ కారు జూలైలో రూ. 35,000 వరకు తగ్గింపు, మీరు ఏఎంటీ మోడల్‌ను కొనుగోలు చేస్తే అదనంగా రూ. 5,000 తగ్గింపును పొందువచ్చని కంపెనీ చెబుతోంది. ఈ కారు ధర రూ.7,51,500 (ఎక్స్-షోరూమ్) నుండి రూ.12,87,500 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

maruti-suzuki2.jpg

మారుతి సుజుకి గ్రాండ్ విటారా: మారుతి సుజుకి రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపుతో పాటు రూ. 55,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ కారు ధర రూ.10,99,000 (ఎక్స్-షోరూమ్) నుండి రూ.19,93,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

maruti-suzuki3.jpg

మారుతి సుజుకి జిమ్నీ: మారుతి నుండి ఈ కారు భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ కారు ధర రూ. 1 లక్ష నుండి రూ. 2.5 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది. కానీ తగ్గింపు ప్రయోజనం మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్‌కు పరిమితం చేయబడింది. ఈ కారు ధర రూ. 12,74,000 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 14,79,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

maruti-suzuki4.jpg

మారుతి సుజుకి బాలెనో: మారుతి సుజుకి నుండి వచ్చిన ఈ ప్రసిద్ధ కారు ఏఏంజీ వేరియంట్‌పై రూ. 45,000 వరకు, మాన్యువల్ వేరియంట్‌పై రూ. 40,000 వరకు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 20,000 వరకు తగ్గింపును పొందుతుంది. ఈ కారు ధర రూ.6,66,000 (ఎక్స్-షోరూమ్) నుండి రూ.9,83,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

maruti-suzuki5.jpg

గమనిక: డిస్కౌంట్ మొత్తం నగరం నుండి నగరానికి మారవచ్చు. ఆఫర్‌లపై మరిన్ని వివరాల కోసం సమీపంలోని డీలర్‌ను సంప్రదించండి. ఈ ఆఫర్లలో మార్పులు చేర్పులు ఉంటాయని గమనించండి. కొన్ని సమయాల్లో కొన్ని వేరియంట్లపై మార్పులు ఉండవచ్చు.

Link to comment
Share on other sites

  • 0

iVOOMi S1 Lite Electric Scooter: భారత్‌లో మరో సరసమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదల..మూడు గంటల్లోనే పూర్తి ఛార్జింగ్‌

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ iVOOMi భారతదేశపు అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన S1 లైట్‌ని విడుదల చేసింది. ఇది పెరల్ వైట్, మూన్ గ్రే, స్కార్లెట్ రెడ్, మిడ్‌నైట్ బ్లూ, ట్రూ రెడ్ మరియు పీకాక్ బ్లూ అనే 6 కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది..

ev-scooter1.jpg?w=1280&enlarge=true

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ iVOOMi భారతదేశపు అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన S1 లైట్‌ని విడుదల చేసింది. ఇది పెరల్ వైట్, మూన్ గ్రే, స్కార్లెట్ రెడ్, మిడ్‌నైట్ బ్లూ, ట్రూ రెడ్ మరియు పీకాక్ బ్లూ అనే 6 కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది.

ev-scooter2.jpg

ఈ స్కూటర్‌లో గ్రాఫేన్ అయాన్, లిథియం అయాన్ రెండు బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. గ్రాఫేన్ అయాన్ వేరియంట్ ధర రూ.54,999, లిథియం అయాన్ ధర రూ.64,999.

ev-scooter3.jpg

గ్రాఫేన్ అయాన్ ఒకే ఛార్జ్‌పై 75 కి.మీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. లిథియం అయాన్ ఒకే ఛార్జ్‌పై 85 కి.మీ కంటే ఎక్కువ మైలేజీ అందిస్తుంది.

ev-scooter4.jpg

ఈ ఇ-స్కూటర్ స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఇది ERW 1 గ్రేడ్ ఛాసిస్‌తో రూపొందించారు. ఈ ఇ-స్కూటర్లలో మొబైల్ ఛార్జింగ్, ఎల్‌ఈడీ డిస్‌ప్లే స్పీడోమీటర్ కోసం యూఎస్‌బీ పోర్ట్ (5V, 1A) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 7 స్థాయి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

ev-scooter5.jpg

iVOOMi S1 Lite ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన బ్యాటరీ సాంకేతికతను అందిస్తుంది. గ్రాఫేన్ వేరియంట్ గరిష్ట వేగం 45 kmph, లిథియం వేరియంట్ 55 kmph. గ్రాఫేన్ వేరియంట్ 3 గంటల్లో 50 శాతానికి, లిథియం వేరియంట్ కేవలం 1.5 గంటల్లో 50 శాతానికి, 3 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది.

Link to comment
Share on other sites

  • 0

PMV EV Car for only Rs. 4 lakhs: రూ.4 లక్షలకే ఈవీ కారు రిలీజ్.. టియాగో.. కామెట్ ఈవీ కార్లకు ఇక గట్టిపోటీ

భారతదేశంలో సొంత కారు అనేది ప్రతి కుటుంబానికి స్టేటస్ సింబల్‌లా మారింది. అయితే పెరుగుతున్న ధరల దెబ్బకు మధ్యతరగతి ప్రజలు కారు కొనాలనే ఆలోచనను విరమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈవీ కార్లు ఇబ్బడిముబ్బడిగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ కార్లల్లో టాప్ కంపెనీల కార్లనే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఈవీ కార్ల ధరలు కూడా అధికంగా ఉండడంతో వాటి వైపు చూడడానికి మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు.

pmv-ev-car.jpg?w=1280

భారతదేశంలో సొంత కారు అనేది ప్రతి కుటుంబానికి స్టేటస్ సింబల్‌లా మారింది. అయితే పెరుగుతున్న ధరల దెబ్బకు మధ్యతరగతి ప్రజలు కారు కొనాలనే ఆలోచనను విరమించుకుంpmv-ev-car.jpg?w=1280టున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈవీ కార్లు ఇబ్బడిముబ్బడిగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ కార్లల్లో టాప్ కంపెనీల కార్లనే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఈవీ కార్ల ధరలు కూడా అధికంగా ఉండడంతో వాటి వైపు చూడడానికి మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. అయితే మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలో పీఎంవీ స్టార్టప్ ఈవీ కారును రిలీజ్ చేసింది. కేవలం రూ.4 లక్షలకే ఇది కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. 

 

ముంబైకి చెందిన స్టార్టప్ పర్సనల్ మొబిలిటీ వెహికల్ (పీఎంవీ ఎలక్ట్రిక్) దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. పీఎంవీ ఈఏఎస్-ఈ పేరుతో  లాంచ్ చేసిన ఈ ఈవీ కారు మైక్రో ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పీఎంవీ ఈవీ ధర దాదాపు రూ.4 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ ఈ-కారు పొడవు 2915 మిమీ మాత్రమే ఉంటుంది. ఈ ఈవీ కారును రూ. 2000 చిన్న మొత్తంతో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ  చెబుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారును 15 ఏఎంపీ సాకెట్ నుంచి ఛార్జ్ చేయవచ్చు. ఈ కారును కేవలం దాదాపు 4 గంటల్లో పూర్తిగా చేయవచ్చు. 

పీఎంవీ ఈవీ కారు మార్కెట్‌లో ఉన్న కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కారు టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ కంటే తక్కువ ధరకు అందిస్తున్నారు. ఈ కారును కంపెనీ దీనిని 2022లో ప్రవేశ పెట్టినా డెలివరీ తేదీల గురించి ఇప్పటికీ ఎలాంటి సమాచారం అధికారికంగా పేర్కొనలేదు. అయితే ఈ కారు అందుబాటులోకి వస్తే మాత్రం టాప్ కంపెనీల ఈవీ కార్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Xiaomi SU7 Electric Vehicle EV: భారత్‌లో ఎలక్ట్రిక్‌ కారును ప్రదర్శించిన షావోమీ.. వామ్మో ఏంటీ ఫీచర్స్‌ అసలు..

చైనాకు చెందిన ఈ టెక్‌ దిగ్గజం ఇప్పటికే ఆ దేశంలో తన తొలి ఎలక్ట్రిక్ సెడాన్‌ కారును ఆవిష్కరించింది. ఇంకా అధికారికంగా ఈ కారును లాంచ్‌ చేయకపోయినప్పటికీ కారులో ఉన్న ఫీచర్లను తెలుపుతూ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షావోమీ భారత్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది....

xiaomi-su7.jpg?w=1280

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పర్యావారణ సంరక్షణ విషయంలో ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం, పెట్రోల్‌.. డీజిల్ ధరల నుంచి ఉపశమనం లభించడం వంటి చర్యల ద్వారా విద్యుత్ వాహనలకు గిరాకీ ఎక్కువుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని దిగ్గజ ఆటో మొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రాకిన్‌ దిగ్గజం షావోమీ సైతం ఓ ఎలక్ట్రిక్‌ కారును తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

చైనాకు చెందిన ఈ టెక్‌ దిగ్గజం ఇప్పటికే ఆ దేశంలో తన తొలి ఎలక్ట్రిక్ సెడాన్‌ కారును ఆవిష్కరించింది. ఇంకా అధికారికంగా ఈ కారును లాంచ్‌ చేయకపోయినప్పటికీ కారులో ఉన్న ఫీచర్లను తెలుపుతూ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షావోమీ భారత్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది. అధునాతన ఫీచర్లుతో కూడిన ఈ కారు యూజర్లను ఆకట్టుకుంటోంది. ఫీచర్లతో పాటు లుక్‌ కూడా ఔరా అనిపించేలా ఉంది. ఇంతకి ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

షావోమీ ఈ కారును పూర్తి స్థాయి హై పెర్ఫార్మెన్స్ ఎకో సిస్టమ్ సెడాన్‌గా డెవలప్‌ చేసింది. ఈ కారులో ఇ మోటార్, సీటీబీ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ, షియోమి డై కాస్టింగ్, షియోమి పైలట్ అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ క్యాబిన్ వంటివి ప్రత్యేకంగా డెవలప్‌ చేశారు. ఇందులో భాగంగా కంపెనీకి చెంది సుమారు 3400 మంది ఇంజనీర్లు, 1000 మంది టెక్నికల్ సిబ్బంది కృషి చేశారు. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఈ కారు గరిష్టంగా 673 హెచ్‌పి పవర్, 838 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.

ఈ కారు కేవలం 2.78 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. షావోమీ కారు గరిష్టంగా 265 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక ఈ కారును ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే ఏకంగా 800 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు. ఈ కారులో 56 ఇంచెస్ హెడ్ అప్ డిస్‌ప్లే, రొటేటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 16.1 ఇంచెస్ 3కే అల్ట్రా క్లియర్ కంట్రోల్ స్క్రీన్, మూవింగ్ డ్యాష్‌బోర్డ్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.

Xiaomi Automobile Super Factory, Producing One SU7 Every 76 Seconds

 

Link to comment
Share on other sites

  • 0

Ola EV Bike: త్వరలోనే మార్కెట్‌లోకి ఓలా ఈవీ బైక్.. నయా లుక్ అదిరిందిగా..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇటీవల ఈవీ రంగంలో స్కూటర్లు హవా చూపుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యులు ఈవీలను ఆశ్రయిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతదేశంలోని ఈవీ ప్రియులను ఓలా స్కూటర్లు అమితంగా ఆకట్టుకున్నాయి.

ola-ev-bike.jpg?w=1280

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇటీవల ఈవీ రంగంలో స్కూటర్లు హవా చూపుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యులు ఈవీలను ఆశ్రయిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతదేశంలోని ఈవీ ప్రియులను ఓలా స్కూటర్లు అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని షేర్ చేయడంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ వచ్చే ఓలా బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

గతేడాది ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ నాలుగు ఫ్యూచరిస్టిక్ ఇ-మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌లను ఆవిష్కరించింది. ఈ డిజైన్‌లు అప్పట్లో ఈవీ ప్రియులను అమితంగా ఆకట్టకున్నాయి. అయితే అప్పడు డిస్‌ప్లే చేసిన డిజైన్‌లకు సంబంధం లేకుండా మరింత కొత్తగా ఈవీ బైక్‌ను ఓలా లాంచ్ చేస్తున్నట్లు ఆ చిత్రాలను చూస్తుంటే అర్థం అవుతుంది. ఓలా కంపెనీ ఇటీవల మూడు కొత్త ఈ-బైక్ డిజైన్‌లను పేటెంట్ చేసింది. ఇవి ప్రాక్టికాలిటీలో మరింత ఆకట్టుకుంటాయని కంపెనీల ప్రతినిధులు చెబతున్నారు. భవిష్ అగర్వాల్ షేర్ చేసిన ఫొటో ప్రకారం ఈవీ బైక్ సాధారణంగా ఉండే వాటి కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని అర్థం అవుతుంది. ఫ్రంట్ స్ప్రాకెట్, చైన్ ఫైనల్ డ్రైవ్, ఫుట్‌పెగ్ వంటి అధునాత ఫీచర్లతో ఈ బైక్‌ను లాంచ్ చేయనున్నారు.

ఓలాకు సంబంధించిన రాబోయే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అల్ట్రావయోలెట్  ఎఫ్ 77 మ్యాక్ 2, మేటర్ ఎరా వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఓలా ఈవీ బైక్ లాంచ్ చేస్తే భారతదేశ ఆటోమొబైల్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓలా ఇప్పటికే లాంచ్ చేసిన ఎస్-1 ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ముందువరుసలో ఉంది. సాధారణంగా ఓలా ప్రతి ఆగస్టు 15న, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తూ ఉంటుంది. బహుశా ఆ రోజునే ఈవీ బైక్ గురించి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

Link to comment
Share on other sites

  • 0

Hero Xtreme 160R: మార్కెట్‌లోకి హీరో ఎక్స్‌ట్రీమ్ నయా వెర్షన్.. ధరెంతో తెలిస్తే షాక్..!

భారతదేశంలో యువత ఇటీవల కాలంలో సూపర్ స్పీడ్‌తో రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లే బైక్స్ అంటే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో దేశంలో ఏళ్లుగా హీరో కంపెనీ బైక్స్ అంటే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరో కంపెనీకు సంబంధించి ఎక్స్‌ట్రీమ్ బైక్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 4కు సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను హీరో కంపెనీ ఇటీవల లాంచ్ చేసింది.

Hero Xtreme 160R

hero-xtreme-160r.jpg?w=1280

భారతదేశంలో యువత ఇటీవల కాలంలో సూపర్ స్పీడ్‌తో రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లే బైక్స్ అంటే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో దేశంలో ఏళ్లుగా హీరో కంపెనీ బైక్స్ అంటే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరో కంపెనీకు సంబంధించి ఎక్స్‌ట్రీమ్ బైక్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 4కు సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను హీరో కంపెనీ ఇటీవల లాంచ్ చేసింది. రూ. 1,38,500 ధరతో డిజైన్, మెకానిక్స్, ఫీచర్లతో సహా ఇతర అప్‌డేట్స్‌ వినియోగదారులను ఆకట్టుకుంటాయని హీరో ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో ఎక్స్‌ట్రీమ్ 16 ఆర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ నయా వెర్షన్ బ్లాక్ కలర్, బ్రాంజ్ గ్రాఫిక్స్ కలయికతో కొత్త పెయింట్ స్కీమ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా సింగిల్ పీస్ సీట్ సిట్-సీట్ డిజైన్‌లో ఆకట్టుకుంటుంది.  డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌కు సపోర్ట్ చేసే ఈ బైక్ డ్రాగ్ రేస్ టైమర్‌తో బైకర్స్‌ను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పానిక్ బ్రేకింగ్ అలర్ట్ ఫీచర్‌తో పాటు దీని వలన టెయిల్ ల్యాంప్ ఈ బైక్‌కు సరికొత్త లుక్‌ను తీసుకువచ్చింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 4వీ బైక్ పవర్ ట్రెయిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని హీరో కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నరు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 4వీ 163.2 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్/ ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 16.6 బీహెచ్‌పీ శక్తిని, 14.6 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. అలాగే సస్పెన్షన్ అప్డ్-డౌన్ ఫోర్క్స్, ప్రీలోడ్ సర్దుబాటుతో కూడిన మోనోషాక్ ద్వారా వస్తాయి. ఈ నేపథ్యంలో నయా వెర్షన్ హీరో బైక్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, హెూండా ఎస్‌పీ 160, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ, యమహా ఎఫ్‌జెడ్ఎస్ ఎఫ్ఐ వీ 4 బైక్స్‌కు గట్టి పోటినిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Link to comment
Share on other sites

  • 0

Cars Waiting Period: ఈ 5 కార్లకు భారీ డిమాండ్‌.. కొనాలంటే వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా?

ఈ టయోటా వాహనానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. నివేదికల ప్రకారం, ఈ హైబ్రిడ్ కారు వెయిటింగ్ పీరియడ్ 13 నెలలకు చేరుకుంది. అంటే మీరు ఈ కారును ఈరోజే బుక్ చేసుకుంటే, 1 సంవత్సరం తర్వాత ఈ కారు డెలివరీ అవుతుంది.టయోటా ఇన్నోవా క్రిస్టా వెయిటింగ్ పీరియడ్: నివేదికల ప్రకారం.. మీరు ఈరోజే టొయోటా ఇన్నోవా క్రిస్టాను బుక్..

cars-waiting-period1-1.jpg?w=1280&enlarg

ఈ టయోటా వాహనానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. నివేదికల ప్రకారం, ఈ హైబ్రిడ్ కారు వెయిటింగ్ పీరియడ్ 13 నెలలకు చేరుకుంది. అంటే మీరు ఈ కారును ఈరోజే బుక్ చేసుకుంటే, 1 సంవత్సరం తర్వాత ఈ కారు డెలివరీ అవుతుంది.

cars-waiting-period2.jpg

టయోటా ఇన్నోవా క్రిస్టా వెయిటింగ్ పీరియడ్: నివేదికల ప్రకారం.. మీరు ఈరోజే టొయోటా ఇన్నోవా క్రిస్టాను బుక్ చేసుకుంటే, మీరు ఐదు నెలల వరకు వేచి ఉండాల్సి రావచ్చు.

cars-waiting-period3.jpg

టాటా పంచ్ వెయిటింగ్ పీరియడ్: టాటా మోటార్స్ ఈ SUVకి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. నివేదికల ప్రకారం.. ఈ SUV కోసం 2 నుండి 3 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది.

cars-waiting-period4.jpg

హ్యుందాయ్ ఆరా వెయిటింగ్ పీరియడ్: హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఈ కారు కస్టమర్లకు కూడా బాగా నచ్చుతోంది. మీరు ఈ కారును ఈరోజే బుక్ చేసుకుంటే మీరు 6 నుండి 8 వారాలు (పెట్రోల్ ఆటో) వేచి ఉండవలసి ఉంటుంది. పెట్రోల్ (MT) మరియు CNG వేరియంట్‌ల కోసం, మీరు 1 నుండి 2 వారాల వరకు వేచి ఉండాలి.

cars-waiting-period5.jpg

హ్యుందాయ్ క్రెటా వెయిటింగ్ పీరియడ్: పెట్రోల్-డీజిల్ (MT), ఆటో (CVT) వేరియంట్‌లకు 4 నుండి 6 వారాలు, టర్బో ఇంజిన్ పెట్రోల్-ఆటో (DCT) వేరియంట్‌లకు 8 నుండి 10 వారాలు. క్రెటా ఎన్ లైన్ యొక్క పెట్రోల్ (MT), ఆటో (DCT) వేరియంట్‌ల కోసం 8 నుండి 10 వారాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...