Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 3

Good Cars, EVs, CNGs, Scooters and Bikes in India


TELUGU

Question

Electric Scooters: మార్కెట్లో బెస్ట్ ఈ-స్కూటర్లు ఇవే.. ఆ రెండు స్కూటర్లలో ప్రత్యేకతలు ఇవిగో..

Ather Rizta Z vs Ola S1 Pro: ప్రజల ఆదరణకు అనుగుణంగా వివిధ కంపెనీలు ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. వీటిలో ఫీచర్ల కూడా అత్యద్భుతంగా ఉంటున్నాయి. ఈ వాహనాలలో ఏది ఎంపిక చేసుకోవాలో కొనుగోలుదారులకు కొంచెం కష్టమే. అయితే ఫీచర్ల ను ఒకదానితో ఒకటి పోల్చి చూసినప్పుడు మనకు కొంత అవగాహన కలుగుతుంది. ఇప్పుడు ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్ 1 ప్రో వాహనాల ప్రత్యేకతలు, ధరలు, ఫీచర్లను తెలుసుకుందాం.

ather-rizta-z-vs-ola-s1-pro-1.jpg?w=1280

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్ ఫుల్ స్పీడ్ లో సాగుతున్నాయి. ఈ విభాగంలో వాహనాలకు ప్రజల ఆదరణ పెరిగింది. పెట్రోలు, డీజిల్ వాహనాలతో పోల్చితే వీటిలో అనేక సౌకర్యాలున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు కూడా ఇవి ఉపయోగపడతాయి. వీటికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండడంతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు బాగా ఎక్కువయ్యాయి.

ప్రజల ఆదరణ..

ప్రజల ఆదరణకు అనుగుణంగా వివిధ కంపెనీలు ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. వీటిలో ఫీచర్ల కూడా అత్యద్భుతంగా ఉంటున్నాయి. ఈ వాహనాలలో ఏది ఎంపిక చేసుకోవాలో కొనుగోలుదారులకు కొంచెం కష్టమే. అయితే ఫీచర్ల ను ఒకదానితో ఒకటి పోల్చి చూసినప్పుడు మనకు కొంత అవగాహన కలుగుతుంది. ఇప్పుడు ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్ 1 ప్రో వాహనాల ప్రత్యేకతలు, ధరలు, ఫీచర్లను తెలుసుకుందాం.

బెస్ట్ మోడల్స్ ఇవే..

ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో ఏథర్ రిజ్టా జెడ్ ఒక సంచలనం అని చెప్పవచ్చు. అయితే మార్కెట్‌లో దీనికి పోటీగా మరికొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. వాటిలో ఓలా ఎస్ 1 ప్రో ఒకటి. ఈ రెండు వాహనాలలో ఏది మంచిదో చెప్పడం చాలా కష్టం. కానీ ఫీచర్లను తెలుసుకోవడం ద్వారా ఒక అంచనాకు రావొచ్చు.

డిజైన్..

ముందుగా ఈ రెండు స్కూటర్ల డిజైన్ ను పరిశీలిద్దాం. ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఏథర్ రిజ్టా జెడ్ వాహనం బాక్స్ బాడీ వర్క్ తో ఉంది. అలాగే ఆకారంలో పెద్దదిగా కనిపిస్తుంది.

మరోవైపు ఓలా ఎస్ 1 ప్రో వాహనానికి కర్వీ బాడీ వర్క్ చేశారు. ఆకారం కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే ఈ రెండు ఈవీల డిజైన్లు కచ్చితంగా కొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి.

ఫీచర్లు..

ఏథర్ రిజ్టా జెడ్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్, ఎకో, జిప్, ట్రాక్షన్ కంట్రోల్, మొబైల్ చార్జింగ్, ఆటో హోల్డ్, రివర్స్ మోడ్‌తో సహా అనేక ఫీచర్లతో అందుబాటులో ఉంది. స్కూటర్ లోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ద్వారా వీటని టోగుల్ చేయవచ్చు. నియంత్రించవచ్చు. గూగుల్ మ్యాప్స్ కోసం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని సౌలభ్యం ఉంది. లైవ్ ట్రాఫిక్ డేటా, కాల్స్ కు ఆటో రిప్లయ్, వాట్సాప్ ప్రివ్యూ కు అనుమతి ఉంది.

ఓలా ఎస్ 1 ప్రో విషయానికి వస్తే ఎకో, నార్మల్, స్పోర్ట్, హైపర్ అనే నాలుగు మోడ్ లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రైడ్ మూడ్స్, సంగీతం, కాల్స్, ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్లు, వైఫై కనెక్టివిటీ, రిమోట్ బూట్ యాక్సెస్, రిమోట్ లాక్/అన్‌లాక్, హిల్ హోల్డ్, మూడు స్థాయిల బ్రేకింగ్ వ్యవస్థ తదితర ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్ 1 ప్రో వాహనాల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉంటాయి.

హార్డ్ వేర్..

రెండు ఎలక్ట్రిక్ వాహనాల హార్డ్ వేర్ వ్యవస్థ ఒకేలా ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ , సింగిల్ రియర్ షోక్ ఉంటాయి. సింగిల్ ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ సెటప్ పై బ్రేకింగ్ వ్యవస్థను రూపొందించారు. అయితే ఓలా కంటే ఏథర్ స్కూటర్‌లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉంది.

మోటార్, బ్యాటరీ..

రిజ్టా జెడ్‌లో 4.3కేడబ్ల్యూ మోటార్, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. ఇది సుమారు 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేయవచ్చు.

ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ లో 11కేడబ్ల్యూ (పీక్ పవర్) మోటార్, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్నాయి. దీని రేంజ్ 180 కిలోమీటర్లు, గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోవచ్చు. అంటే ఏథర్ రిజ్టా జెడ్ కంటే ఓలా ఎస్ 1 ప్రోలో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంది.

ధర..

ఏథర్ రిజ్టా జెడ్ ధర రూ. 1.45 లక్షలు, మీరు ప్రో ప్యాక్‌ని ఎంచుకుంటే 1.65 లక్షలకు అందుబాటులో ఉంది. ఓలా ఎస్ 1 ప్రో ధర రూ.1.30 లక్షలు. ఇవి బెంగళూరులో ఎక్స్ షోరూమ్ ధరలు.

ఈ రెండు స్కూటర్లలో ఫీచర్లు, డిజైన్ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ ధరలో మాత్రం వ్యత్యాసం ఉంది. అందుబాటు ధరలో ఉన్న ఓలా ఎస్ 1 ప్రో మంచి డీల్ గా అనిపిస్తుంది. ఏది ఏమైనా మీ అవసరాలు, మీకు నచ్చిన ఫీచర్ల ఆధారంగా స్కూటర్ ను ఎంచుకుంటే మంచిది.

...

Complete article

Link to comment
Share on other sites

  • Answers 38
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • Sanjiv

    16

  • Vijay

    13

  • TELUGU

    10

Top Posters For This Question

Recommended Posts

  • 0

Eblu FEO X: మార్కెట్‌లో తక్కువ ధరలోనే క్యూటెస్ట్ ఈవీ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు ఏంటంటే..?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యులు ఈవీలను ఆశ్రయిస్తుంటే, ప్రభుత్వాలు కూడా కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు చాలా కంపెనీలు మార్కెట్‌లో ఈవీ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలనే టార్గెట్ చేస్తూ స్టార్టప్ ఈవీ కంపెనీలు సూపర్ ఫీచర్లతో తక్కువ ధరలోనే ఈవీలనను అందుబాటులోకి తెస్తున్నాయి.

Eblu Feo X

eblu-feo-x.jpg?w=1280

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యులు ఈవీలను ఆశ్రయిస్తుంటే, ప్రభుత్వాలు కూడా కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు చాలా కంపెనీలు మార్కెట్‌లో ఈవీ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలనే టార్గెట్ చేస్తూ స్టార్టప్ ఈవీ కంపెనీలు సూపర్ ఫీచర్లతో తక్కువ ధరలోనే ఈవీలనను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ గోదావరి ఎలక్ట్రిక్ మోటర్స్ ఫ్యామిలీ ఈ-స్కూటర్‌కు సంబంధించిన కొత్త వేరియంట్ అయిన ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. కేవలం రూ.99,999 ఎక్స్-షోరూమ్ ధరతో రిలీజ్ చేసిన ఈ స్కూటర్ కచ్చితంగా మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్ గోదావరి ఎలక్ట్రిక్ మోటర్స్‌కు సంబంధించి రెండో మోడల్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్ మోడల్ స్కూటర్‌ను మొదటి సారిగా భారత్ గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పో 2024 లో ఆవిష్కరించార. ఈ స్కూటర్‌లో 28 లీటర్ల స్టోరేజ్ స్పేస్తో పాటు 2.36 కేడబ్ల్యూ బ్యాటరీతో 110 కిమీ పరిధిని అందిస్తుంది. ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్ స్కూటర్ కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా రిలీజ్ చేశామని గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ సీఈఓ హైదర్ ఖాన్ తెలిపారు. ఈ స్కూటర్ రైడర్లకు అత్యుత్తమ సౌకర్యాన్ని అందిస్తుందని వివరిస్తున్నారు. ఈ స్కూటర్‌ను భారతదేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. 

భారతదేశంలో ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్ స్కూటర్‌కు సంబంధించిన ప్రీ ఆర్డర్లు తీసుకుంటున్నామని వివరించారు. ముఖ్యంగా గోదావరి ఎలక్ట్రిక్ మోటర్స్ కంపెనీ తన డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రణాళికలను రచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా 74 డీలర్షిప్లను 100 డీలర్లకు పెంచాలని యోచిస్తోంది. గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ప్రస్తుతం ఇబ్లూ ఎఫ్ఈఓ (ఈ2డబ్ల్యూ), ఇబ్లూ రోజ్ (ఈ3డబ్ల్యూ- ఎల్5ఎం), ఇబ్లూ స్పిన్, ఇబ్లూ థ్రిల్ వంటి ఈ-సైకిళ్లతో సహా అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మకాలు సాగిస్తుంది. 

Link to comment
Share on other sites

  • 0

Best Electric Cars: మార్కెట్లో నాలుగు టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. వాటిల్లో ఏది బెస్ట్? మీరే తెలుసుకోండి..

Tata Curvv EV vs MG ZS EV vs Mahindra XUV 400 vs Tata Nexon EV: ఈ కారు నేరుగా ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎంజీ జెడ్ఎస్, మహీంద్రా ఎక్స్ యూవీ400లతో పోటీ పడనుంది. అంతేకాక అదే టాటా కంపెనీకి చెందిన టాటా నెక్సాన్ ఈవీతో కూడా టాటా కర్వ్ ఈవీ పోటీని ఎదుర్కోనుంది. ఈ క్రమంలో ఈ నాలుగింటిలో ఏది బెస్ట్? ఎక్కువ పరిధి ఏది ఇస్తుంది? దేనిలో ఎక్కువ కంఫర్ట్ వస్తుంది? దేనిలో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి?

Tata Curvv Ev Vs Mg Zs Ev Vs Mahindra Xuv 400 Vs Tata Nexon Ev

tata-curvv-ev-vs-mg-zs-ev-vs-mahindra-xu

టాటా కంపెనీ ఇటీవలే కర్వ్ ఈవీని ఆవిష్కరించింది. కూపే ఎస్ యూవీ గా మార్కెట్లోకి వచ్చిన ఈ టాటా ఉత్పత్తిపై అనేక అంచనాలు ఉన్నాయి. పైగా ఈ కారు నేరుగా ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎంజీ జెడ్ఎస్, మహీంద్రా ఎక్స్ యూవీ400లతో పోటీ పడనుంది. అంతేకాక అదే టాటా కంపెనీకి చెందిన టాటా నెక్సాన్ ఈవీతో కూడా టాటా కర్వ్ ఈవీ పోటీని ఎదుర్కోనుంది. ఈ క్రమంలో ఈ నాలుగింటిలో ఏది బెస్ట్? ఎక్కువ పరిధి ఏది ఇస్తుంది? దేనిలో ఎక్కువ కంఫర్ట్ వస్తుంది? దేనిలో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి? తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి..

స్పెసిఫికేషన్లు..

టాటా కర్వ్ ఈవీ.. ఈ కొత్త ఈవీలో 45కేడబ్ల్యూహెచ్, 55కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. 45డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 502కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే 55డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 585 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. రెండు వేరియంట్‌లు ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌లను కలిగి ఉన్నాయి. అయితే చిన్న బ్యాటరీ ప్యాక్ 150పీఎస్ ఉత్పత్తి చేస్తుంది, పెద్దది 167పీఎస్ చేస్తుంది. రెండు వేరియంట్లు ఒకే 215ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ.. దీనిలో 177పీఎస్, 280ఎన్ఎం టార్క్‌ను అందించే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేసిన 50.3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 461కిమీల రేంజ్ ను ఇస్తుంది.

ఈసీ ప్రో 34.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే ఈఎల్ ప్రో 39.4డబ్ల్యూహెచ్ యూనిట్ తో వస్తుంది. సింగిల్ చార్జ్ పై 375కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే రెండోది 456కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. రెండు బ్యాటరీ ప్యాక్‌లతో జత చేసిన ఎలక్ట్రిక్ మోటార్ అదే 150పీఎస్, 310ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్.. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది: 30కేడబ్ల్యూహెచ్, 40.5కేడబ్ల్యూహెచ్, వరుసగా 325కిలోమీటర్లు, 465కిలోమీటర్ల పరిధిని అందిస్తోంది. మధ్య-శ్రేణి వెర్షన్ 129పీఎస్, 215ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే రెండవ-తరం ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. అయితే దీర్ఘ-శ్రేణి వెర్షన్ 145పీఎస్, 215ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

నాలుగు కార్లలో ఫీచర్లు..

కర్వ్ ఈవీ.. దీనిలో వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్ట్ చేసిన కార్ టెక్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 320వాట్ల 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, స్టార్ట్-స్టాప్ బటన్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఉన్నాయి. డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పనోరమిక్ సన్‌రూఫ్, మోటరైజ్డ్ టెయిల్‌గేట్ అదనపు సౌకర్యాలలో ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్ ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హోల్డ్‌తో కూడిన ఆటోమేటెడ్ పార్కింగ్ బ్రేక్, లెవెల్-2 అడాస్ భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ.. ఈ కారులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవ్ మోడ్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో వస్తుంది. వెనుక ఏసీ వెంట్లు, సిక్స్ వే విద్యుత్-సర్దుబాటు డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జింగ్. 75 కనెక్ట్ చేసిన కార్ ఫీచర్లు కూడా ఆఫర్‌లో ఉంటాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ400.. దీనిలో10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అడ్రోనోక్స్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రెండు యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్లు, పుష్ స్టార్ట్/స్టాప్ స్విచ్, ఓటీఏ అప్‌డేట్‌లు, వెనుక ఎయిర్ వెంట్‌లను పొందుతుంది. ఓసీపీఐ(ఓపెన్ ఛార్జ్ పాయింట్ ఇంటర్‌ఫేస్) హబ్ ఇంటిగ్రేషన్, ఇన్-బిల్ట్ అమెజాన్ అలెక్సా అసిస్టెంట్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫాగ్ లైట్లు ఉంటాయి. అడ్రెనోక్స్ పరిచయంతో 55కి పైగా కనెక్ట్ చేసిన కార్ ఫీచర్లను అందిస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ.. క్యాబిన్‌కు సరికొత్త రూపాన్ని అందించారు. అలాగే ఆల్-ఎల్ఈడీ లైటింగ్, రెండు చివర్లలో ఫుల్-లెంగ్త్ లైట్ బార్‌లు, ఓటీటీ యాప్, గేమ్ సపోర్ట్‌తో కూడిన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, తొమ్మిది-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, “హే టాటా” వాయిస్ అసిస్టెంట్ (అలెక్సా, గూగుల్ , సిరిలకు అనుకూలమైనది), టెలిమాటిక్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, అప్‌గ్రేడ్ చేసిన జెడ్ కనెక్ట్ యాప్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధరలు..

టాటా కర్వ్ ఈవీ ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్). టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షలు నుంచి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది. అలాగే మహీంద్రా ఎక్స్‌యూవీ400 రూ. 14.49 లక్షల నుంచి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ రూ. 18.98 లక్షల నుంచి రూ. 25.44 లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Best two wheelers: లక్ష రూపాయల్లో లక్షణమైన టూవీలర్స్.. సామాన్యుల బెస్ట్ చాయిస్ ఇదే..!

ద్విచక్ర వాహనం అనేది నేడు ప్రతి ఒక్కరికీ కనీసం అవసరంగా మారింది. చదువు, వ్యాపారం, ఉద్యోగ అవసరాల కోసం అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో బస్సులు,ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణాలు చేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో సొంత వాహనాలను వినియోగిస్తున్నారు. పెరిగిన జనాభా కారణంగా నగరాలు బాగా విస్తరించాయి.

Affordable Bikes

affordable-bikes.jpg?w=1280

ద్విచక్ర వాహనం అనేది నేడు ప్రతి ఒక్కరికీ కనీసం అవసరంగా మారింది. చదువు, వ్యాపారం, ఉద్యోగ అవసరాల కోసం అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో బస్సులు,ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణాలు చేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో సొంత వాహనాలను వినియోగిస్తున్నారు. పెరిగిన జనాభా కారణంగా నగరాలు బాగా విస్తరించాయి. శివారు ప్రాంతాలలో ఆవాసాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సొంత వాహనాల అవసరం కూడా ఎక్కువైంది. దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. వీరి ఆదాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో తమకు అనుకూలమైన ధరలో ఉంటే వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. దాదాపు రూ,లక్ష లోపు వాహనాలను కొనడానికి ఆసక్తి చూపుతారు. దానికి అనుగుణంగా వివిధ కంపెనీలు ఆ ధరలో తమ వాహనాలను విడుదల చేస్తున్నాయి. సామాన్యులకు అందుబాటు ధరలో ఉన్న ప్రముఖ కంపెనీ బెస్ట్ ద్విచక్ర వాహనాలను తెలుసుకుందాం.

టీవీఎస్ జూపిటర్ 110

ప్రముఖ కంపెనీ టీవీఎస్ నుంచి విడుదలైన జుపీటర్ 110 ద్విచక్ర వాహనం ఆకట్టుకుంటోంది. దీనితో ఆ కంపెనీ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను నవీకరించింది. ఈ వాహనం బేస్ మోడల్ రూ.73,700కు అందుబాటులో ఉంది. టాప్-స్పెక్ ట్రిమ్ కోసం 87,250 వెచ్చించాలి. ఇవి రెండు ఢిల్లీలోని ఎక్స్ షోరూమ్ ధరలు.

హోండా యాక్టివా 6జీ

టీవీఎస్ జుపీటర్ 110 స్కూటర్ తర్వాత రెండో ప్రత్యామ్నాయంగా హోండా యాక్టివా 6జీని చెప్పవచ్చు. దీని టాప్-స్పెక్ హెచ్ స్మార్ట్ వేరియంట్ 82,684 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)కు అందుబాటులో ఉంది. దీనిలో 109 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ 7.73 బీహెచ్ పీ, 8.90 ఎన్ఎమ్ ను ఉత్పత్తి చేస్తుంది. అదనంగా ఎల్ఈడీ హెడ్‌లైట్, సైలెంట్ స్టార్టర్, సీటును తెరవడానికి డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, పెట్రోల్ క్యాప్, కీలెస్ ఆపరేషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

హీరో స్ప్లెండర్ ప్లస్

హీరో కంపెనీ నుంచి విడుదలైన స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనానికి ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. ద్విచక్ర వాహనాల మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బండి అని చెప్పవచ్చు. స్ప్లెండర్ ప్లస్ 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ తో వస్తోంది. 8,000 ఆర్ పీఎం వద్ద 7.91 బీహెచ్పీ, 6,000 ఆర్ఫీఎం వద్ద 8.05 ఎన్ఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కు నాలుగు స్పీడ్ గేర్‌ బాక్స్‌తో అనుసంధానం చేశారు. ఈ బండి రూ. 78,286 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు అందుబాటులో ఉంది.

హోండా షైన్

సామాన్యులకు అందుబాటులో ఉన్న మరో మోటారు సైకిల్ హోండా షైన్. దీనిలోని 123cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ ఏర్పాటు చేశారు. దీని నుంచి 10.59 బీహెచ్ పీ, 11 ఎన్ ఎమ్ ఉత్తత్తి చేస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ స్ప్రింగ్‌ల కారణంగా ప్రయాణం చాలా సులువుగా ఉంటుంది. బ్రేకింగ్ హార్డ్‌వేర్ ఫ్రంట్, రియర్ డ్రమ్, రియర్ డ్రమ్ బ్రేక్ సెటప్‌తో ఆకట్టుకుంటుంది. హోండా షైన్ డిస్క్ వాహనం రూ.84,250కు లభిస్తుంది.

హోండా యాక్టివా 125

పైన తెలిపిన వాహనాలతో పాటు హోండా యాక్టివా 125కూ ఈ జాబితాలో చేరింది. ఈ బండి రూ. 89,429 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కు అందుబాటులో ఉంది. దీనిలోని టాప్ స్పెక్ హెచ్ స్మార్ట్ మోడల్ లో సైలెంట్ స్టార్ట్‌, కీలెస్ ఆపరేషన్ ఫీచర్‌ ఉన్నాయి. 124 సీసీ సింగిల్ సిలిండర్ మోటారు 8.19 బీహెచ్‌పీ, 10.4 ఎన్ఎమ్‌ విడుదల చేస్తుంది.

యమహా ఫాసినో 125

యమహా ఫాసినో 125 కూడా సామాన్యులకు అందుబాటులో ఉన్న మరో వాహనం. దీని స్పెషల్ ఎడిషన్ మోడల్ 94,830 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు లభిస్తుంది. దీనిలో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, ఎల్ఈడీ ఇల్యూమినేషన్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. 125 సీసీ ఎయిర్ కూల్డ్ మోటార్ 8.04 బీహెచ్ పీ, 10.03 ఎన్ఎమ్ ను విడుదల చేస్తుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Budget Cars: బడ్జెట్ కార్లల్లో టాప్ అవే.. మైలేజ్‌ విషయంలో వీటికి ఏ కారు సాటిరాదంతే..!

భారతదేశంలో బడ్జెట్ పద్మనాభాలు ఎక్కువగా ఉంటారు. ఏ పని చేయాలన్నా బడ్జెట్ అంచనా మేరకే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది కార్ల కొనుగోలుదారులైతే కచ్చితంగా బడ్జెట్‌లోనే మంచి ఫీచర్స్‌తో పాటు సూపర్ మైలేజ్‌ను ఇచ్చే కార్ల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే మారుతున్న టెక్నాలజీ కారణంగా అధిక ఫీచర్స్‌తో వచ్చే కార్లు ఉంటున్నాయి.

 
Budget Cars: బడ్జెట్ కార్లల్లో టాప్ అవే.. మైలేజ్‌ విషయంలో వీటికి ఏ కారు సాటిరాదంతే..!
Budget Cars

కానీ మైలేజ్ విషయంలో గతంలో వచ్చే కార్లల్లా ఉండడం లేదు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ కార్లు మైలేజ్, ఫీచర్ల పరంగా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఆ కార్లు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం. 

హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్

హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్ కారు రూ.9.99 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ఒక లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. సూపర్ ఫీచర్స్‌తో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీసీటీతో అందుబాటులో ఉంటుంది. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ 118 బీహెచ్‌పీ పవర్, 172 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా ఆల్టోజ్ రేసర్

టాటా ఆల్టోజ్ రేసర్ రూ.9.49 లక్షల ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ కారు హ్యూందాయ్ ఐ 20 ఎన్ లైన్‌తో పోలిస్తే ఫీచర్ల పరంగా ఆకట్టుకుంటుంది. ఆల్టోజ్ రేసర్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో 1.2 లీటర్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు 118 బీహెచ్‌పీ పవర్ 170 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మారుతీ సుజుకి ఫ్రాంక్స్

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రస్తుత భద్రతా మార్కెటింగ్ కారణంగా కాస్త వెనుకబడి ఉంది. అయితే ఈ కారు 1.0 లీటర్ బూస్టర్ జెట్ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే ఈ కారు 99 బీహెచ్‌పీ పవర్, 148 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టర్బో ఇంజిన్‌తో వచ్చే మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ధర రూ.9.72 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 

సిట్రోయెన్ సీ3

షైన్ ట్రిమ్‌లోని సిట్రోయెన్ సీ3 ప్రారంభ ధర రూ.8.09 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ప్యూర్ టెక్ 110 ఇంజన్ షైన్ ట్రిమ్ స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్యూరెటెక్ 110 ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌లో 108 బిహెచ్‌పీ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు రెండు ట్రాన్స్ మిషన్ ఎంపికలు 6 గేర్‌లతో వస్తాయి. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Most Expensive Motorcycles in India in 2024: దేశంలోని అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే.. ధర ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు..

సాధారణంగా మోటారు సైకిళ్లను కొనుగోలు చేయడానికి మనం ఎంత బడ్జెట్ కేటాయిస్తాం. సామాన్యులు అయితే రూ. ఒక లక్ష, కొంచెం ఉన్నత కుటుంబాల వారు దాదాపు రూ.2 లక్షల వరకూ ఖర్చుపెడతారు. కానీ కార్ల కంటే ఖరీదైన మోటారు సైకిళ్ల మార్కెట్ లో లభిస్తున్నాయి. వీటికి పెట్టే డబ్బులతో నాలుగైదు కార్లు కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి హై ఎండ్ మోడళ్లకు డిమాండ్ కూడా బాగా ఎక్కువగా ఉండడం విశేషం. వాటి ధరకు అనుగుణంగానే వీటిలో సూపర్ పనితీరు, టెక్నాలజీ, వేగం, నాణ్యత ఉంటాయి. ప్రయాణంలో అత్యధ్బుత అనుభవాన్ని కలిగిస్తాయి. భారతీయ మార్కెట్ లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మోటారు సైకిళ్లు ఇవే..

కవాసకి నింజా హెచ్2ఆర్.. కవాసకి నింజా హెచ్2ఆర్ అనేది ట్రాక్-ఓన్లీ మోటార్‌సైకిల్. దీన్ని పబ్లిక్ రోడ్లపై ఉపయోగించకూడదు. దీనిలోని 998 సీసీ ఇంజిన్‌తో వాహనం వాయువేగంతో పరుగులు తీస్తుంది. 17 లీటర్ ఇంధన ట్యాంక్, 830 మిమీ ఎత్తయిన సీటు దీనికి అదనపు ఆకర్షణ, ట్రాక్ అభిమానుల కోసం రూపొందించిన కవాసకి నింజా హెచ్2ఆర్ మోటారు సైకిల్ ధర రూ.79,90,000
 

కవాసకి నింజా హెచ్2ఆర్.. కవాసకి నింజా హెచ్2ఆర్ అనేది ట్రాక్-ఓన్లీ మోటార్‌సైకిల్. దీన్ని పబ్లిక్ రోడ్లపై ఉపయోగించకూడదు. దీనిలోని 998 సీసీ ఇంజిన్‌తో వాహనం వాయువేగంతో పరుగులు తీస్తుంది. 17 లీటర్ ఇంధన ట్యాంక్, 830 మిమీ ఎత్తయిన సీటు దీనికి అదనపు ఆకర్షణ, ట్రాక్ అభిమానుల కోసం రూపొందించిన కవాసకి నింజా హెచ్2ఆర్ మోటారు సైకిల్ ధర రూ.79,90,000

డుకాటి పానిగేల్ వీ4 ఆర్.. వేగంతో పాటు స్టైలిష్ గా ఉంటే మోటారు సైకిల్ కోరుకునే వారికి ఇది బాగా నప్పుతుంది. 193.5 కిలోల బరువైన ఈ మోటారు సైకిల్ లో 998 సీసీ ఇంజిన్‌, 17 లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్, సౌకర్యవంతమైన సీటు ఏర్పాటు చేశారు. మంచి ఇంజినీరింగ్ పనితీరు, ఇటాలియన్ లుక్ తో ఆకట్టుకునే డుకాటి పానిగేల్ వీ4 ఆర్ మోటారు సైకిల్ ధర రూ.69,99,000.
 

డుకాటి పానిగేల్ వీ4 ఆర్.. వేగంతో పాటు స్టైలిష్ గా ఉంటే మోటారు సైకిల్ కోరుకునే వారికి ఇది బాగా నప్పుతుంది. 193.5 కిలోల బరువైన ఈ మోటారు సైకిల్ లో 998 సీసీ ఇంజిన్‌, 17 లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్, సౌకర్యవంతమైన సీటు ఏర్పాటు చేశారు. మంచి ఇంజినీరింగ్ పనితీరు, ఇటాలియన్ లుక్ తో ఆకట్టుకునే డుకాటి పానిగేల్ వీ4 ఆర్ మోటారు సైకిల్ ధర రూ.69,99,000.

బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్.. ఈ మోటార్‌సైకిల్ బరువు 192 కిలోలు. దీనిలో 16.5 లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్‌, 832 మి.మీ ఎత్తయిన సౌకర్యవంతమైన సీటు ఉన్నాయి. ప్రయాణంలో దూసుకుపోయేందుకు 999 సీసీ ఇంజిన్ ఎంతో సాయపడుతుంది. మంచి పనితీరు, నాణ్యత కలిగిన బండి కోసం చూసేవారికి చక్కని ఎంపిక. బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్ మోటారుసైకిల్ ధర రూ.49 లక్షలు.
 

బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్.. ఈ మోటార్‌సైకిల్ బరువు 192 కిలోలు. దీనిలో 16.5 లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్‌, 832 మి.మీ ఎత్తయిన సౌకర్యవంతమైన సీటు ఉన్నాయి. ప్రయాణంలో దూసుకుపోయేందుకు 999 సీసీ ఇంజిన్ ఎంతో సాయపడుతుంది. మంచి పనితీరు, నాణ్యత కలిగిన బండి కోసం చూసేవారికి చక్కని ఎంపిక. బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్ మోటారుసైకిల్ ధర రూ.49 లక్షలు.

హార్లే - డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్.. విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దీనిలో 1,868 సీజీ ఇంజిన్‌, 22.7-లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్‌, సౌకర్యవంతమైన సీటు ఉన్నాయి. ప్రత్యేకమైన సౌండ్ తో ఆకట్టుకునే ఈ మోటారు సైకిల్ బరువు 387 కేజీలు. వేగం, సౌకర్యం రెండింటినీ అందించే హార్లే - డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్ మోటార్ సైకిల్ ధర రూ.41,78,915.
 

హార్లే - డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్.. విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దీనిలో 1,868 సీజీ ఇంజిన్‌, 22.7-లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్‌, సౌకర్యవంతమైన సీటు ఉన్నాయి. ప్రత్యేకమైన సౌండ్ తో ఆకట్టుకునే ఈ మోటారు సైకిల్ బరువు 387 కేజీలు. వేగం, సౌకర్యం రెండింటినీ అందించే హార్లే - డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్ మోటార్ సైకిల్ ధర రూ.41,78,915.

హోండా గోల్డ్‌వింగ్ టూర్.. సుదూర ప్రాంతాల ప్రయాణానికి అనుకూలంగా ఉండే హోండా గోల్డ్ వింగ్ టూర్ మోటారు సైకిల్ లో 1,833 సీసీ ఇంజిన్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఏర్పాటు చేశారు. 390 కిలోల కర్బ్ బరువు, 21.1 లీటర్ల ఇంధన ట్యాంక్ పరిమాణం, సౌకర్యవంతమైన సీటు అదనపు ప్రత్యేకతలు. పవర్ మరియు కంఫర్ట్ రెండింటినీ అందించే ఈ మోటారు సైకిల్ ధర రూ.39,77,923.
 

హోండా గోల్డ్‌వింగ్ టూర్.. సుదూర ప్రాంతాల ప్రయాణానికి అనుకూలంగా ఉండే హోండా గోల్డ్ వింగ్ టూర్ మోటారు సైకిల్ లో 1,833 సీసీ ఇంజిన్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఏర్పాటు చేశారు. 390 కిలోల కర్బ్ బరువు, 21.1 లీటర్ల ఇంధన ట్యాంక్ పరిమాణం, సౌకర్యవంతమైన సీటు అదనపు ప్రత్యేకతలు. పవర్ మరియు కంఫర్ట్ రెండింటినీ అందించే ఈ మోటారు సైకిల్ ధర రూ.39,77,923.

Link to comment
Share on other sites

  • 0

Top 5 SUV’s in India with super smart features for under Rs.10 lakhs: సూపర్ స్మార్ట్ ఫీచర్స్‌తో ఆకర్షిస్తున్న ఎస్‌యూవీలు.. పది లక్షల్లో పొందికైన కార్లు ఇవే..!

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇటీవల కాలంలో కార్ల అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా తక్కువ ధరల్లోనే సన్‌రూఫ్ ఉండే కార్లను యువత అమితంగా ఇష్టపడుతున్నారు. లాంగ్ డ్రైవ్స్ చేసే సమయంలో, అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టూర్స్ వెళ్లే సమయంలో సన్‌రూఫ్ కార్స్‌తో ఉండే ఎంజాయ్‌మెంట్ వేరని ఫీలవుతున్నారు. ఆకట్టుకునే ఫీచర్స్‌తో పాటు సన్‌రూఫ్ ఉన్న కార్ల అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తక్కువ ధరల్లోనే సూపర్ ఫీచర్స్‌తో సన్‌రూఫ్ కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో మార్కెట్‌లో అందుబాటులో టాప్ ఎస్‌యూవీల గురించి ఓ సారి తెలుసుకుందాం.

హ్యుందాయ్ 2023లో ఎక్స్‌టర్‌తో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ మైక్రో ఎస్‌యూవీ భారతీయ మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న వాహనాలలో ఒకటిగా ఉంది. ఎక్స్‌టర్ ఎస్‌ఎక్స్ వేరియంట్ నుంచి సన్‌రూఫ్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 8.23 లక్షలు. ఎస్ఎక్స్ నైట్, ఎస్ఎక్స్(ఓ), ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్, ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్ నైట్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్‌టర్ 82 బీహెచ్‌పీ, 113.8 ఎన్ఎమ్ అవుట్‌పుట్‌తో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.
 

హ్యుందాయ్ 2023లో ఎక్స్‌టర్‌తో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ మైక్రో ఎస్‌యూవీ భారతీయ మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న వాహనాలలో ఒకటిగా ఉంది. ఎక్స్‌టర్ ఎస్‌ఎక్స్ వేరియంట్ నుంచి సన్‌రూఫ్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 8.23 లక్షలు. ఎస్ఎక్స్ నైట్, ఎస్ఎక్స్(ఓ), ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్, ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్ నైట్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్‌టర్ 82 బీహెచ్‌పీ, 113.8 ఎన్ఎమ్ అవుట్‌పుట్‌తో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

1 / 5
కియా సోనెట్  సన్‌రూఫ్ వేరియంట్స్ హెచ్‌టీఈ(ఓ) మోడల్‌తో అందుబాటులో ఉంటాయి. ఈ కారు ధర రూ. 8.29 లక్షలుగా ఉంది. ఈ కారు 1.2 లీటర్  పెట్రోల్ ఇంజన్ 82 బీహెచ్‌పీ, 115 ఎన్ఎం  టార్క్‌ను అందిస్తుంది. ప్రత్యేకంగా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఈ కారు ప్రత్యేకతగా ఉంది.
 

కియా సోనెట్ సన్‌రూఫ్ వేరియంట్స్ హెచ్‌టీఈ(ఓ) మోడల్‌తో అందుబాటులో ఉంటాయి. ఈ కారు ధర రూ. 8.29 లక్షలుగా ఉంది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 82 బీహెచ్‌పీ, 115 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ప్రత్యేకంగా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఈ కారు ప్రత్యేకతగా ఉంది.

2 / 5
టాటా పంచ్ సన్‌రూఫ్ వేరియంట్‌ రూ. 8.35 లక్షల ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఎంపికను కలిగి ఉన్న ఇతర వేరియంట్‌లలో అకాంప్లిష్డ్ డాజిల్ సన్‌రూఫ్, క్రియేటివ్ డీటీ ఎస్ఆర్ క్రియేటివ్ ఫ్లాగ్‌షిప్ డీటీ ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ. 8.75 లక్షలు, రూ. 9.30 లక్షలు, రూ. 9.60 లక్షలుగా ఉన్నాయి. ఈ కారు 86.5 బీహెచ్‌పీ, 115 ఎన్ఎం టార్క్‌ను అందించే 1.2 లీటర్ ఇంజన్‌తో  వస్తుంది. పంచ్ రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్‌తో పాటు ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
 

టాటా పంచ్ సన్‌రూఫ్ వేరియంట్‌ రూ. 8.35 లక్షల ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఎంపికను కలిగి ఉన్న ఇతర వేరియంట్‌లలో అకాంప్లిష్డ్ డాజిల్ సన్‌రూఫ్, క్రియేటివ్ డీటీ ఎస్ఆర్ క్రియేటివ్ ఫ్లాగ్‌షిప్ డీటీ ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ. 8.75 లక్షలు, రూ. 9.30 లక్షలు, రూ. 9.60 లక్షలుగా ఉన్నాయి. ఈ కారు 86.5 బీహెచ్‌పీ, 115 ఎన్ఎం టార్క్‌ను అందించే 1.2 లీటర్ ఇంజన్‌తో వస్తుంది. పంచ్ రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్‌తో పాటు ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

3 / 5
మహీంద్రా 3ఎక్స్ఓ టాప్ టైర్ మోడళ్లకు ప్రత్యేకమైన సింగిల్ ప్యానెల్, పనోరమిక్ సన్‌రూఫ్‌‌తో వస్తుంది. అలాగే ఎంఎక్స్ 2 ప్రో సింగిల్-ప్యానెల్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. ఈ కారు ధర రూ.8.99 లక్షలుగా ఉంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కారు 80 బీహెచ్‌పీ 1.2 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.
 

మహీంద్రా 3ఎక్స్ఓ టాప్ టైర్ మోడళ్లకు ప్రత్యేకమైన సింగిల్ ప్యానెల్, పనోరమిక్ సన్‌రూఫ్‌‌తో వస్తుంది. అలాగే ఎంఎక్స్ 2 ప్రో సింగిల్-ప్యానెల్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. ఈ కారు ధర రూ.8.99 లక్షలుగా ఉంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కారు 80 బీహెచ్‌పీ 1.2 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.

4 / 5
హ్యుందాయ్ వెన్యూ సన్‌రూఫ్‌తో కూడిన రెండు వేరియంట్‌లను అందిస్తుంది. ఎకనామిక్ ఎస్+ మోడల్ ధర రూ. 9.36 లక్షలు, ఎస్(ఓ)+ వేరియంట్ రూ. 9.99 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ రెండు ట్రిమ్‌లు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే 82 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం టార్క్‌ను అందించే 1.2 లీటర్ ఇంజన్‌తో వస్తాయి.
 

హ్యుందాయ్ వెన్యూ సన్‌రూఫ్‌తో కూడిన రెండు వేరియంట్‌లను అందిస్తుంది. ఎకనామిక్ ఎస్+ మోడల్ ధర రూ. 9.36 లక్షలు, ఎస్(ఓ)+ వేరియంట్ రూ. 9.99 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ రెండు ట్రిమ్‌లు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే 82 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం టార్క్‌ను అందించే 1.2 లీటర్ ఇంజన్‌తో వస్తాయి.

 
Link to comment
Share on other sites

  • 0

Hero Destini 125 vs TVS Jupiter 125 scooters: ఆ రెండు స్కూటర్ల మధ్య గట్టి పోటీ.. ఏది బెస్ట్‌ అంటే..

2024 Hero Destini 125 vs TVS Jupiter 125: ఇటీవలే హీరో నుంచి ఓ స్కూటర్‌ మార్కెట్లోకి లాంచ్‌ అయ్యింది. డెస్టినీ స్కూటర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ 2024 హీరో డెస్టినీ 125గా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనికి మార్కెట్లో గట్టి పోటీ ఎదురవుతోంది. పోటీదారుల్లో టీవీఎస్‌ జుపిటర్‌ 125 కూడా ఒకటి. ఈ రెండూ ఒకే రకమైన బడ్జెట్లో లభిస్తుండటమే కాకుండా.. మైలేజీ కూడా అధికంగా ఇచ్చే స్కూటర్లు కావడంతో వినియోగదారులు వీటి వైపు చూస్తున్నారు. 

 
ఆ రెండు స్కూటర్ల మధ్య గట్టి పోటీ.. ఏది బెస్ట్‌ అంటే..

భారతీయ ఆటో మార్కెట్లో ద్విచక్రవాహనాలకు డిమాండ్‌ ఎక్కువే. ముఖ్యంగా స్కూటర్లకు. ఈ సెగ్మెంట్లు కంపెనీలు పోటీపడి మరీ ఉత్పత్తులను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే హీరో నుంచి ఓ స్కూటర్‌ మార్కెట్లోకి లాంచ్‌ అయ్యింది. డెస్టినీ స్కూటర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ 2024 హీరో డెస్టినీ 125గా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనికి మార్కెట్లో గట్టి పోటీ ఎదురవుతోంది. పోటీదారుల్లో టీవీఎస్‌ జుపిటర్‌ 125 కూడా ఒకటి. ఈ రెండూ ఒకే రకమైన బడ్జెట్లో లభిస్తుండటమే కాకుండా.. మైలేజీ కూడా అధికంగా ఇచ్చే స్కూటర్లు కావడంతో వినియోగదారులు వీటి వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 హీరో డెస్టినీ 125, టీవీఎస్‌ జుపిటర్‌ 125 మధ్య ప్రధాన తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం..

2024 హీరో డెస్టినీ 125 వర్సెస్‌ టీవీఎస్‌ జూపిటర్ 125..

ఇంజిన్ పనితీరు.. హీరో డెస్టినీ 125 స్కూటర్లో 124.6 సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 7,000 ఆర్పీఎం వద్ద 9 బీహెచ్‌పీ, 5,500 ఆర్పీఎం వద్ద 10.4ఎన్‌ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అదేసమయంలో టీవీఎస్‌ జూపిటర్ 125 కూడా 124.8 సీసీ, సింగిల్-సిలిండర్ యూనిట్‌తోనే వస్తుంది. ఇది 6,500 ఆర్‌పీఎం వద్ద 8 బీహెచ్‌పీ, 4,500 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 10.5ఎన్‌ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగితంపై పోల్చినప్పుడు డెస్టినీ 125 కొంచెం మెరుగైన శక్తి గణాంకాలను చూపిస్తోంది.

ఇంధన సామర్థ్యం.. డెస్టినీ 125 సుమారుగా లీటర్‌ పెట్రోల్‌పై 59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది నగర ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది. మరోవైపు జూపిటర్ 125, ఒక లీటర్‌ పెట్రల్‌పై 57 కిలోమీటర్లను ఇస్తుంది.

ఫీచర్లు.. కొత్త హీరో డెస్టినీ 125 ఐ3S (ఇడల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్), బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డీఆర్‌ఎల్‌లతో కూడిన ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్యాంప్ సెటప్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి కొత్త ఫీచర్లను హైలైట్ చేస్తుంది. టీవీఎస్‌ జూపిటర్ 125 ఫుల్‌ LED హెడ్‌ ల్యాంప్, ఇంటెల్లిగో, సౌకర్యవంతమైన రీఫ్యూయలింగ్ కోసం ఫ్రంట్ ఫ్యూయల్ ట్యాంక్, వాయిస్-సహాయక నావిగేషన్‌తో కూడిన డిజిటల్-అనలాగ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 32 లీటర్ల విశాలమైన అండర్-సీట్ స్టోరేజ్ తో వస్తుంది.

సౌకర్యం.. సౌలభ్యం.. రెండు స్కూటర్లు ముందు టెలిస్కోపిక్ షాక్‌ అబ్జర్బర్‌, వెనుకవైపు అడ్జస్టబుల్‌ షాకఅబ్జర్బర్స్‌ ఇస్తారు. డెస్టినీ 125 మునుపటి కంటే పెద్ద సీటును అందిస్తుంది. జూపిటర్ 125 మెరుగైన లెడ్రూమ్, ముందు భాగంలో ఉన్న ఇంధన ట్యాంక్ సౌకర్యాన్ని అందిస్తోంది.

Link to comment
Share on other sites

  • 0

 

Maruti WagonR Waltz Edition: వావ్ అనేలా వ్యాగన్ఆర్ కొత్త ఎడిషన్.. అంతలా ఆ కారులో ఏముందంటే..

చిన్న పరిమాణంలో ఉండటం, అనువైన బడ్జెట్లో కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో మన మార్కెట్లో ఈ కారుకు అధిక డిమాండ్ ఉంటోంది. ఇప్పుడు దీనికి అప్ గ్రేడెడ్ వెర్షన్ ను లిమిటెడ్ ఎడిషన్ గా మారుతీ సుజుకీ లాంచ్ చేసింది. కొత్త వ్యాగన్ ఆర్ పేరు వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్. ఫెస్టివల్ సీజన్లో పరిమిత సంఖ్యలోనే ఈ కారు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

 
Maruti WagonR Waltz Edition: వావ్ అనేలా వ్యాగన్ఆర్ కొత్త ఎడిషన్.. అంతలా ఆ కారులో ఏముందంటే..

మన దేశంలో అత్యధిక అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ ఒకటి. చిన్న పరిమాణంలో ఉండటం, అనువైన బడ్జెట్లో కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో మన మార్కెట్లో ఈ కారుకు అధిక డిమాండ్ ఉంటోంది. ఇప్పుడు దీనికి అప్ గ్రేడెడ్ వెర్షన్ ను లిమిటెడ్ ఎడిషన్ గా మారుతీ సుజుకీ లాంచ్ చేసింది. కొత్త వ్యాగన్ ఆర్ పేరు వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్. ఫెస్టివల్ సీజన్లో పరిమిత సంఖ్యలోనే ఈ కారు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ కారు వ్యాగన్ ఆర్ లోనే అన్ని ట్రిమ్స్ అంటే ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు రూ. 5.64లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు దగ్గరలోని డీలర్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవాలని కంపెనీ కోరింది. డెలివరీలు త్వరలో మొదలవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్..

ఈ కొత్త ఎడిషన్ కారు చూడటానికి స్టాండర్డ్ మోడల్ వ్యాగన్ఆర్ మాదిరిగానే ఉంటుంది. అయితే దీనిలో కొత్తగా ఫాగ్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, ముందు వైపు క్రోమ్ గ్రిల్, విండో వైజర్, ఇంకా కొన్ని అదనపు ఆకర్షణ తెచ్చే మార్పులను కంపెనీ చేసింది.

ఎక్స్‌టీరియర్ ఇలా..

ఈ కారు ఎక్స్‌టీరియర్ గురించి మాట్లాడితే 14 అంగుళాల స్టీల్ చక్రాలు, రిఫ్లెక్టివ్ హాలోజెన్ హెడ్ లైట్లు, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్, ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉంటాయి.

ఇంటీరియర్ ఇలా..

కారు లోపల విషయానికి వస్తే లే అవుట్ మొత్తం స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే డిజైనర్ సీట్ కవర్, 6.2 అంగుళాల పయోనీర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, బ్లూ టూత్ కనెక్టివిటీ, రివర్స్ కెమెరా, ఆడియో కంట్రోల్ తో కూడిన 3 స్పోక్ స్టీరింగ్ వీల్, సెమీ డిజిటల్ క్లస్టర్, నాలుగు పవర్ విండోలు, 14 ప్లస్ అదనపు యాక్సెసరీలు ఉంటాయి. భద్రత విషయానికి వస్తే ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్సీ, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఈ కారులో ఇచ్చారు.

ఇంజిన్ సామర్థ్యం..

ఈ కొత్త వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్లో రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఒకటి 1.0 లీటర్, 3 సిలిండర్, ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. 67 హెచ్పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.2 లీటర్, 4 సిలిండర్, ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 90హెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండింటీకీ 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ఆప్షన్లు ఉంటాయి.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...