Jump to content
  • 1

Sweet Corn benefits: స్వీట్ కార్న్ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!!


Vijay

Question

స్వీట్ కార్న్..! కాలాల‌తో సంబంధం లేకుండా ఇది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. వీటిని ప‌చ్చివిగా తిన్నా, ఉడ‌కబెట్టుకుని తిన్నా లేదంటే వేయించి తిన్నా కూడా రుచిగా ఉంటాయి. రుచికి మాత్రమే కాదు, ఈ మొక్కజొన్నల‌తో తయారు చేసుకునే అన్ని ప‌దార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మీ డైట్‌లో స్వీట్‌ కార్న్‌ ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇలా ఈ మొక్కజొన్న తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

sweet-corn-1-1.jpg?w=1280&enlarge=true

స్వీట్‌కార్న్‌ అంటేనే ఫైబర్‌కు చిరునామాగా చెబుతారు. మలబద్ధకం, పైల్స్‌తో బాధపడుతున్న వారికి ఈ స్వీట్‌కార్న్ మంచి ప‌రిష్కార‌ం లభిస్తుంది. తియ్యటి మొక్కజొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్‌లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్‌, లివర్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీల‌క పాత్ర పోషిస్తాయి. స్వీట్ కార్న్ తింటే ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా నయమవుతాయి. 

sweet-corn-2.jpg

స్వీట్ కార్న్‌లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. స్వీట్‌కార్న్‌ల‌లో ఉండే విటమిన్‌-సి, కెరోటినాయిడ్స్‌, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. స్వీట్ కార్న్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే‌ విటమిన్ బి-12, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్ పెడుతుంది. అదేవిధంగా తియ్యటి మ‌క్కజొన్నల్లోని ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మ్యాంగనీస్‌, ఐరన్‌, కాపర్‌, జింక్‌ వంటి ఖ‌నిజాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుప‌డేలా చేస్తాయి.

sweet-corn-3.jpg

నిత్యం ఒత్తిళ్లతో ప‌నిచేసే వారికి స్వీట్‌ కార్న్‌ మంచి మందులా పనిచేస్తుంది. అందులో ఉండే ఫినోలిక్‌ ఫైటో కెమికల్స్‌ హైపర్‌ టెన్షన్‌ను తగ్గిండచంలో బాగా పనిచేస్తాయి. స్వీట్‌ కార్న్‌లు‌ చాలా వేగంగా జీర్ణమ‌వుతాయి. అందువ‌ల్ల శరీరానికి త‌క్షణ‌మే కావాల్సినంత‌ శక్తి వస్తుంది. అందువ‌ల్ల స్వీట్‌కార్న్‌ను ప్రతిరోజూ కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం ఆహ్లాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

sweet-corn-4.jpg

స్వీట్ కార్న్‌లో కెరోటినాయిడ్స్, లుటిన్ ఉంటాయి. దీని వల్ల కంటిశుక్లం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్వీట్ కార్న్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ కణాల నష్టం, క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్వీట్ కార్న్‌లో విటమిన్ బి1 పుష్కలంగా ఉంటుంది, ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది

sweet-corn-5.jpg

మొక్కజొన్న తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, ఖచ్చితంగా తినండి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. స్వీట్ కార్న్ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. స్వీట్ కార్న్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

Link to comment
Share on other sites

0 answers to this question

Recommended Posts

There have been no answers to this question yet

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...