Jump to content
  • 0

Horoscope: Rasi Phalalu రాశిఫలాలు


Sanjiv

Question

వారికి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 26, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పొదుపు పాటించి జాగ్రత్త పడతారు. మిథున రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today 26th June 2024

Horoscope Today

దిన ఫలాలు (జూన్ 26, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పొదుపు పాటించి జాగ్రత్త పడతారు. మిథున రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభ పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ద పెట్డం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ మిత్రుల సహాయంతో స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పొదుపు పాటించి జాగ్రత్త పడతారు. వాహన యోగం పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో సహోద్యోగులతో మాట పట్టిం పులు తలెత్తుతాయి. వృత్తి జీవితంలో శ్రమాధిక్యతతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా మారుతుంది. ముఖ్య మైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేసి ఆర్థికంగా లాభం పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటిగా సాగిపోతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నం విషయంలో బంధు వుల నుంచి సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగు లకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ఇష్టమైన మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు వ్యాపారాల్లో కూడా శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలు ఆశించిన స్థాయిలో లాభి స్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను గట్టి ప్రయత్నంతో పూర్తి చేస్తారు. బంధువుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ ఎక్కడా హామీలు ఉండవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శుభ గ్రహాల అనుకూలతలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఉద్యో గంలో మాటకు, చేతకు తిరుగుండదు. హోదా పెరగడానికి అవకాశముంది. శత్రువులు మిత్రు లుగా మారే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలు పండిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గు తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఆర్థిక వ్యవ హారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఖర్చుల్ని తగ్గిం చుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు అభి వృద్ధి బాట పడతాయి. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. కొందరు బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

మంచి పరిచయాలు ఏర్పడతాయి. రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ఆదాయ వృద్ధికి అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగు తాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మకరం (ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 1,2)

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొందరు మిత్రుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి కానీ, వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నిదానంగా సాగిపోతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. కుటుంబ అవస రాల మీద ఖర్చులు పెరుగుతాయి. కొందరు మిత్రులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.

Link to comment
Share on other sites

14 answers to this question

Recommended Posts

  • 0

Horoscope Today: ఆ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.. 12 రాశులవారి గురువారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దిన ఫలాలు (జూన్ 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేపడతారు. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు, నిరు ద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలసి వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం కూడా చాలావరకు సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది..

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటుంది. ఆదాయం బాగా పెరగడంతో పాటు, రావలసిన సొమ్ము కూడా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు బాగా ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. దగ్గర బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ఇంటా బయటా మాటకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంటా బయటా అను కూలతలుంటాయి. వ్యక్తిగత సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వచ్చే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశముంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. కుటుంబం పరిస్థితి ఉత్సాహం కలిగిస్తుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త లక్ష్యాలను చేపట్టడం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇంటా బయటా శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. వ్యాపార కార్యకలాపాలు చురుకుగా సాగుతాయి. లాభాలు పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. సొంత పనుల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల ఆఫర్లు అందే అవకాశం ఉంది. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధి స్తారు. ఉద్యోగంలో ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. మొండి బాకీలను వసూలు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆస్తి సమస్య చాలావరకు పరిష్కారం అవుతుంది. విలువైన ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడతారు. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యో గంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా అనుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రాద నుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. జీవిత భాగ స్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతి ఫలం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపో తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక సంబంధమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరులు తమ స్వార్థానికి ఎక్కువగా ఉపయోగించు కునే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల్ని పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవు తాయి. బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా సానుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవు తుంది. కొద్ది శ్రమతో ప్రతి వ్యవహారమూ విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబపరంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపో తాయి. ఉద్యోగం జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

Link to comment
Share on other sites

  • 0

Best Life Partners: ఈ రాశులకు చెందిన జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలతలే..!

ఏ రాశికి చెందిన జీవిత భాగస్వామి విధేయంగా ఉంటారు? ఎవరితో జీవితం పంచుకుంటే సుఖపడతారు? సాధారణంగా వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశుల వారితో జీవితం ప్రేమలోనైనా, పెళ్లిలోనైనా సవ్యంగా, హ్యాపీగా, సాఫీగా సాగిపోతుందని జ్యోతిష గ్రంథాలు చెబుతు న్నాయి. విధేయత, అణకువ, అన్యోన్యత వంటి లక్షణాలకు వచ్చేసరికి ఈ రాశుల వారిని గొప్పగా చెప్పుకుంటారు.

love-marriage-astrology1.jpg?w=1280

ఏ రాశికి చెందిన జీవిత భాగస్వామి విధేయంగా ఉంటారు? ఎవరితో జీవితం పంచుకుంటే సుఖపడతారు? సాధారణంగా వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశుల వారితో జీవితం ప్రేమలోనైనా, పెళ్లిలోనైనా సవ్యంగా, హ్యాపీగా, సాఫీగా సాగిపోతుందని జ్యోతిష గ్రంథాలు చెబుతు న్నాయి. విధేయత, అణకువ, అన్యోన్యత వంటి లక్షణాలకు వచ్చేసరికి ఈ రాశుల వారిని గొప్పగా చెప్పుకుంటారు. సంబంధ బాంధవ్యాలు, స్నేహాలు, కుటుంబ బంధాలు వంటి విషయాల్లో ఈ రాశుల వారు ముందు వరుసలో ఉంటారు. వీరు ఒకసారి ‘బంధం’లో పడితే కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా నిలబడతారు. ఈ రాశుల వారి ప్రేమ, వివాహ బంధాలు ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతున్నదీ పరిశీలిద్దాం.

వృషభం: విధేయత, అణకువ, అన్యోన్యతల విషయంలో వీరు ఇతర రాశుల వారి కంటే ముందు వరుసలో ఉంటారు. ఈ రాశ్యధిపతి శుక్రుడు ప్రేమకు, అందానికి, అనుబంధాలకు కారకుడు. వృషభ రాశి మహిళ ఎవరినైనా ప్రేమించినా, పెళ్లాడినా ఆ జీవితానికి, ఆ వ్యక్తికి పూర్తిగా, మనస్ఫూర్తిగా కట్టు బడి ఉంటుంది. ఈ రాశికి చెందిన యువతులు ఎక్కువగా స్థిరత్వాన్ని, భద్రతను కోరుకుంటారు. ఈ ఏడాది వృషభ రాశి యువతుల నుంచి మరింత ప్రేమానురాగాలు లభిస్తాయని చెప్పవచ్చు.

కర్కాటకం: ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల్లోనూ, అనుబంధాల్లోనూ భావోద్వేగపరమైన సంబంధాలు ఏర్ప రచుకుంటారు. ఈ రాశికి చంద్రుడు అధిపతి అయినందువల్ల ఈ రాశివారు ఎవరు ఎటువంటి వ్యక్తి అన్నది తేలికగా గ్రహిస్తారు. సాధారణంగా జీవిత భాగస్వామి అభిరుచులకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. నిస్వార్థంగా ప్రేమించడం, వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి నుంచి ప్రేమ తప్ప మరేమీ ఆశించకపోవడం జరుగుతుంది. ఈ ఏడాది వీరి మానసిక బంధం మరింత పటిష్ఠం అవుతుంది.

కన్య: ఈ రాశికి బుధుడు అధిపతి అయినందువల్ల ఈ రాశివారు ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవ హరిస్తారు. ఎంతో దూరం ఆలోచించి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం జరుగుతుంది. ఒకసారి జీవిత భాగస్వామిని ఎంచుకున్న తర్వాత అతనికే కట్టుబడి ఉండడం జరుగుతుంది. జీవిత భాగ స్వామిని ఒక స్నేహితుడిగా పరిగణించడం జరుగుతుంది. ఈ ఏడాదంతా బుధుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల వీరు జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకునే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి గురువు అధిపతి అయినందువల్ల ఈ రాశివారిలో ఆదర్శవంతమైన జీవితం గడపాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకూ అన్యోన్యంగా జీవితం గడపడానికే ప్రాధాన్యం ఇస్తారు. వీరి ప్రేమలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉండదు. వీరిలోని ప్రేమలు, అనుబం ధాలు లోతుగా ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా భరించే శక్తి కూడా ఉంటుంది. ప్రస్తుతం గురు గ్రహం వృషభ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల వీరి ప్రేమ బంధం మరింత పటిష్ఠం అవుతుంది.

మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు నీతి నిజాయతీలను గౌరవించే గ్రహం. ఎవరితోనైనా ప్రేమలో పడినా, పెళ్లి అయినా జీవితాంతం ఆ వ్యక్తికే కట్టుబడి ఉండడం అనేది వీరి సహజ లక్ష ణం. వీరిలోని ప్రేమ, అనుబంధం చెక్కు చెదరదు. జీవిత భాగస్వామిని అత్యధికంగా ప్రేమించడంతో పాటు, అత్యధికంగా గౌరవించడం జరుగుతుంది. కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతుంది. ఈ ఏడాది వీరు బంధాన్ని మరింత దృఢపరచుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది.

మీనం: ఈ రాశికి అధిపతి అయిన గురువు సంప్రదాయాలను గౌరవించే గ్రహం. ఆచార సంప్రదాయాలకు పూర్తిగా కట్టుబడి ఉండే తత్వం అయినందువల్ల ప్రేమ వ్యవహారాలను, వైవాహిక బంధాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తారు. సాధారణంగా వీరి బంధం భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. బాగా సున్నిత మనస్కులు అయినందువల్ల జీవిత భాగస్వామిని కష్టపెట్టడం జరగదు. ఈ ఏడా దంతా గురువు స్థిర రాశిలో సంచారం చేస్తున్నందువల్ల వీరి ప్రేమలు మరింత స్థిరంగా కొనసాగుతాయి.

Link to comment
Share on other sites

  • 0

Lord Shani Dev: వక్ర శనితో ఆ రాశుల వారు జాగ్రత్త.. ఆర్థిక నష్టాలకు అవకాశం..!

ఈ నెల 29వ తేదీ రాత్రి నుంచి కుంభ రాశిలో వక్రిస్తున్న శనీశ్వరుడు నవంబర్ 15 వరకూ, అంటే 135 రోజుల పాటు వక్రగతిలో కొనసాగుతాడు. శని వక్రించినప్పుడు తన వెనుక ఉన్న మకర రాశి ఫలితాలనివ్వడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి కొన్ని రకాల కష్టనష్టాలు తప్పక పోవచ్చు.ప్రతి పనీ పెండింగులో పడడం, ఏ ప్రయత్నమూ నెరవేరకపోవడం, తప్పటడుగులు వేయడం, తప్పుడు ఆలోచనలు చేయడం, ఆర్థికంగా నష్టపోవడం, అధికారుల ఆగ్రహానికి గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది.

Lord Shani Dev

lord-shanidev11.jpg?w=1280

ఈ నెల 29వ తేదీ రాత్రి నుంచి కుంభ రాశిలో వక్రిస్తున్న శనీశ్వరుడు నవంబర్ 15 వరకూ, అంటే 135 రోజుల పాటు వక్రగతిలో కొనసాగుతాడు. శని వక్రించినప్పుడు తన వెనుక ఉన్న మకర రాశి ఫలితాలనివ్వడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి కొన్ని రకాల కష్టనష్టాలు తప్పక పోవచ్చు. మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ప్రతి పనీ పెండింగులో పడడం, ఏ ప్రయత్నమూ నెరవేరకపోవడం, తప్పటడుగులు వేయడం, తప్పుడు ఆలోచనలు చేయడం, ఆర్థికంగా నష్టపోవడం, అధికారుల ఆగ్రహానికి గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారు వీలైనప్పుడల్లా శివాలయంలో అర్చన చేయించడం వల్ల, శని విగ్రహం ముందు దీపం వెలిగించడం వల్ల ఈ కష్టనష్టాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.

మిథునం: ప్రస్తుతం భాగ్య స్థానంలో ఉన్న శనీశ్వరుడు వక్రించడం వల్ల అష్టమ శని ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. దీనివల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ పెండింగులో పడే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నమూ కలిసి రాక ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆర్థికంగా చిక్కులు, సమ స్యలు తలెత్తుతాయి. స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. శుభ కార్యాలు ఆగి పోతాయి. అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. తిప్పట, శ్రమ కాస్తంత ఎక్కువగా ఉంటాయి.

కర్కాటకం: ఈ రాశికి ప్రస్తుతం అష్టమ శని ఫలితాలు ఇస్తున్న శని సప్తమ స్థానాన్ని ప్రభావితం చేస్తుండ డంతో, వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, కుటుంబపరంగా కూడా కొన్ని కష్టనష్టాలను భరించాల్సి వస్తుంది. మీ పనితీరుతో ఎవరికీ సంతృప్తి చెందరు. కుటుంబంలో తీవ్రస్థాయి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆస్తి ఒప్పందాలు కుదర్చుకోకపోవడం మంచిది. గృహ, వాహనాల కొనుగోలు కూడా కొద్దిపాటి ఇబ్బందులకు దారితీస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది.

కన్య: ప్రస్తుతం ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న శని ఇక అయిదవ స్థాన ఫలితాలనివ్వడం జరుగు తుంది. దీనివల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా బెడిసికొట్టడం జరుగుతుంది. పిల్లల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఆలో చనలు కలిసి రావు. ఒప్పందాల మీద సంతకాలు చేయడానికి సమయం అనుకూలంగా ఉండదు. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మిత్రుల వల్ల మోసపోతారు.

తుల: శని వక్రించడం వల్ల ఈ రాశివారు అర్ధాష్టమ శని ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. గృహ, వాహన సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. అద్దె ఇంటిలో ఉన్నవారు ఇల్లు మారాల్సి వస్తుంది. ఇరుగుపొరుగుతో సమస్యలు తలెత్తుతాయి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఆగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలపరంగా స్తబ్ధత ఏర్పడుతుంది.

ధనుస్సు: ఈ రాశివారికి ద్వితీయ స్థానం మీద వక్ర శని ప్రభావం పడుతున్నందువల్ల ఏలిన్నాటి శని ఫలి తాలు మళ్లీ అనుభవానికి వస్తాయి. ఆదాయంలో ఎదుగూ బొదుగూ ఉండదు. ఆర్థిక అవసరా లకు తగ్గ ఆదాయం లభించే అవకాశం ఉండదు. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకుం టాయి. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరగక పోవచ్చు. కుటుంబంలో చికాకులు తలెత్తవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శని వక్రించి మకర రాశిని ప్రభావితం చేస్తున్నందువల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ప్రయాణాల మీద డబ్బు అనవసరంగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారం లోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పటడుగులు వేయడానికి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశముంది.

Link to comment
Share on other sites

  • 0

Horoscope Today: ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 29, 2024): మేష రాశి వారికి వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దిన ఫలాలు (జూన్ 29, 2024): మేష రాశి వారికి వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రాశ్యధిపతి కుజుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వాతావరణం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునేవారు శుభవార్త వింటారు. నిరు ద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడు ధన స్థానంలో ధనాధిపతి బుధుడితో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పరి స్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూ లవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కుటుంబంలో సుఖసంతోషాలకు లోటుండదు. మాటకు విలువ పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశ్యధిపతి బుధుడు, శుక్రుడితో కలిసి ఇదే రాశిలో ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాలు హ్యాపీ సాగిపోతాయి. కుటుంబ జీవితంలో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

దశమంలో కుజుడు, లాభ స్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందు తుంది. ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా విజయవంతం అవుతుంది. సొంత పనులు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రాశ్యధిపతి రవి లాభ స్థానంలో బుధ, శుక్రులతో కలిసి ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక విధాలుగా ధన లాభం ఉంటుంది. ముఖ్యమైన పనులు సునా యాసంగా పూర్తవుతాయి. కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆదాయానికి లోటుండదు. కొద్ది శ్రమతో అధిక లాభం పొందు తారు. విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రాశ్యధిపతి బుధుడు దశమ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగపరమైన అనుకూల తలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడ తాయి. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడితో కలిసి ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసు కుపోతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం అను కూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందు తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

రాశ్యధిపతి కుజుడు షష్ట స్థానంలో ఉండడం, సప్తమంలో గురువు ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడం, సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందడం, మంచి పరిచయాలు ఏర్ప డడం వంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గిపోవడం జరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశ్యధిపతి గురువు షష్ట స్థానంలో, శని తృతీయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం దిన దినాభి వృద్ది చెందుతూ, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నపాటి సమస్యలున్నా తేలికగా అధిగమిస్తారు. కుటుంబపరంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది. పిల్లలు ఆశించినంతగా వృద్ధిలోకి వస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

రాశ్యధిపతి శని ధన స్థానంలో, పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా కలిసి వస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా కొనసాగుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

నాలుగవ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల రోజంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపా రాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ధన స్థానంలో ధన స్థానాధిపతి కుజ సంచారం ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అనుకోని శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది.

Link to comment
Share on other sites

  • 0

జులై నెల ఈ రాశులకు బాగా కలిసివస్తుంది

జ్యోతిష్యం ప్రకారం వచ్చే నెల ఏడోతేదీన శుక్రుడు కర్కాటక రాశిలోకి, కుజుడు వచ్చేనెల 12వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తారు. అలాగే జులై 16వ తేదీన సూర్యుడు కర్కాటకంలోకి, 19వ తేదీన బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తారు. ఈ నాలుగు ప్రధాన గ్రహాల సంచారం కొన్ని రాశులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. వృత్తిలో గొప్ప విజయాన్ని అందుకుంటారు. అన్ని పనుల్లో ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి.

కన్య రాశి

జులై నెల వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సూర్యుడు, బుధుడి సంచారం వీరి జీవితంలో సానుకూల మార్పులకు కారణమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ప్రేమ సంబంధాల్లో మాధుర్యాన్ని చవిచూస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవడంతోపాటు ప్రేమ ఎంతో గాఢంగా ఉంటుంది. వృత్తిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను ఈ సమయంలో చాలా సులువుగా పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాలున్నాయి. వ్యక్తిగత జీవితం ఆనందంగా గడుస్తుంది. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుంటుంది.

జులై నెలలో శుక్ర సంచారం.. ఈ రాశులవారు విలాసాల్లో మునిగితేలుతారు!!

horoscope15-1719493010.jpg

ధనుస్సు రాశి

కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. శుభవార్తలను అందుకుంటారు. సంపద పెరుగుతుంది. లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రేరణను పొందుతారు. పనులన్నీ ఆటంకాల్లేకుండా పూర్తవుతాయి. చదువుకు సంబంధించి సౌకర్యాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. బంధువులు, మిత్రుల సహాయంతో ధనలాభం పొందుతారు.

మీన రాశి

అదృష్టం తోడుంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రతి పని మంచి ఫలితాన్ని అందిస్తుంది. మనసు ఆనందంగా మారుతుంది. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

Link to comment
Share on other sites

  • 0

Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (జూన్ 30 నుంచి జూలై 6, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆదాయం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. వృషభ రాశి వారికి సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిథున రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope 30th June to 06th July 2024

వార ఫలాలు (జూన్ 30 నుంచి జూలై 6, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆదాయం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. వృషభ రాశి వారికి సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిథున రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

లాభ స్థానంలో శనీశ్వరుడు, ధన స్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ఆదాయం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయ గలిగిన స్థితిలో ఉంటారు. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అనవసర ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. వృత్తి జీవితంలో పోటీ ఎక్కువగా ఉన్నా రాబడికి లోటుండదు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ అవసరం. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. భరణి నక్షత్రం వారికి ఆశించిన శుభవార్తలు అందు తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇదే రాశిలో గురువు, లాభస్థానంలో రాహువు ఆర్థిక విషయాల్లో కొండంత అండగా ఉంటాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభించి ఊరట చెందుతారు. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు క్రమంగా వృద్ధి చెందు తాయి. ధన స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫ లితాలనిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. కృత్తికా నక్షత్రం వారికి ధన యోగం పడుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇదే రాశిలో శుక్రుడు, ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడు, లాభ స్థానంలో కుజుడి సంచారం వల్ల మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో శుభ వార్తలు వింటారు. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాల్ని సందర్శించడం జరుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల్లితండ్రుల నుంచి సంపద దక్కే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పునర్వసు నక్షత్రం వారికి అనుకోని విజయాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

దశమ, లాభ స్థానాల్లో కుజ, గురుల సంచారం వల్ల ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ స్థిరత్వం లభిస్తాయి. ఈ రాశిలో బుధ గ్రహ ప్రవేశంతో సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రెండు రంగాల్లో అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు కొత్త అవకా శాలు అందుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు ఆశించిన విజయాలు సాధిస్తారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి ధన యోగం పడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

భాగ్య, దశమ, లాభ స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల జీవితం అభివృద్ధి బాట పడుతుంది. ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం జరుగుతుంది. దశమ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి జీవితంలో కూడా బాగా డిమాండ్ పెరుగు తుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన సమా చారం అందుతుంది. ఇష్టమైన పెళ్లి సంబంధం కుదరవచ్చు. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కొద్ది పాటి అనారోగ్య సూచనలున్నాయి. పుబ్బా నక్షత్రంవారికి అనుకోని అదృష్టం పడుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో ప్రవేశించినందువల్ల, శుక్ర, రవులు దశమ స్థానంలో ఉన్నం దువల్ల ఉద్యోగపరంగా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగం రావడానికి, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభి స్తుంది. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్ర త్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సప్తమ స్థానంలో కుజుడు, భాగ్య స్థానంలో శుక్ర, రవుల కారణంగా యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి ఆఫర్లు, అవకాశాలు అందుతాయి. కలలో కూడా ఊహించని శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థి తులు నెలకొంటాయి. పిల్లలకు సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విశాఖ నక్షత్రం వారు పదోన్నతి పొందుతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

సప్తమ స్థానంలో గురువు, లాభ స్థానంలో కేతువు కారణంగా అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అష్టమ స్థానంలో శుక్ర, రవుల వల్ల అనవసర ఖర్చులు, విలాసాలపై ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం ఏదో విధంగా వృథా అవు తుంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగ జీవితంలో ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చ వద్దు. అనూరాధ వారికి ఆశించిన శుభవార్త అందు తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

తృతీయ స్థానంలో శనీశ్వరుడు, పంచమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శుక్రుడు ప్రస్తుతం బాగా అనుకూలంగా ఉన్నాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. హోదా పరంగా, ఆదాయపరంగా తప్పకుండా చెప్పుకోదగ్గ పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో అధికారులకు మీమీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగు తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి ధన యోగం పడుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశినాథుడైన శని ధన స్థానంలో, ధన కారకుడు గురువు పంచమ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కుటుంబంలో కూడా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువుల నుంచి, దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు కూడా బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు అంచనాలకు మించి లాభాలు గడి స్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ధన లాభం పట్టే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో గురువు, పంచమంలో శుక్రుడు సంచారం చేస్తున్నకారణంగా సానుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. అయితే, రాశ్యధిపతి శని వక్రించడం వల్ల ఆదాయం పెరగడానికి ఆటంకాలు కలుగుతాయి. రావ లసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అతిగా ఆధారపడడం వల్ల పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. వృత్తి జీవితంలో ఉన్న వారికి యాక్టివిటీ పెరగడంతో పాటు రాబడి వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు కొద్దిగా ఆశాభంగం తప్పకపోవచ్చు. ఆరోగ్యానికి ఏ విధంగానూ లోటు ఉండదు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ధన స్థానంలో ఉన్న ధనాధిపతి కుజుడి వల్ల ఆదాయానికి లోటుండదు. చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల విలాసాల మీద, కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అనుకోకుండా చిన్నపాటి ధన యోగం పట్టే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆదరాభిమానాలకు లోటుండదు. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలతలు కనిపిస్తాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మంచి అదృష్టం పడుతుంది.

Link to comment
Share on other sites

  • 0

Monthly Horoscope July 2024: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు

మాస ఫలాలు (జూలై 1 నుంచి జూలై 31, 2024 వరకు): మేష రాశి వారు ఈ నెలలో శుభ వార్తలు ఎక్కువగా అందుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. మిథున రాశి వారికి కొన్ని కష్టనష్టాలు, సమస్యల నుంచి బయటపడి మానసికంగా ఊరట చెందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

horoscope.jpg

మాస ఫలాలు (జూలై 1 నుంచి జూలై 31, 2024 వరకు): మేష రాశి వారు ఈ నెలలో శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. మిథున రాశి వారికి కొన్ని కష్టనష్టాలు, సమస్యల నుంచి బయటపడి మానసికంగా ఊరట చెందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1-mesham.jpg

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ నెలంతా శని, గురు, రవులు బాగా అనుకూలంగా ఉండబోతున్నాయి. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. కొత్త నిర్ణ యాలు, కొత్త ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. ఒకటి రెండు ధన యోగాలు పట్ట డానికి అవకాశం ఉంది. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరగడం, అనవసర ఖర్చులు బాగా తగ్గడం వంటివి జరుగుతాయి. పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహా రాలను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవడం వల్ల అనుకూలతలు మరింతగా పెరుగుతాయి.

2-vrushabham.jpg

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు, ధనాధిపతి బుధుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంది. ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది. మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభి స్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనుల్ని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టపోతారు. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో సాన్ని హిత్యం పెరుగుతుంది. సుందరకాండ పారాయణం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

3-mithunam.jpg

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా ఉత్సాహంగా సాగిపోతుంది. కుజ, శుక్ర, బుధుల బలం అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని కష్టనష్టాలు, సమస్యల నుంచి బయటపడి మానసికంగా ఊరట చెందుతారు. ఆదాయం పెరగడమే కానీ తగ్గడం ఉండదు. ఒకటి రెండు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఇంటా బయటా అంతా సానుకూలంగానే సాగిపోతుంది. ఉద్యో గంలో ప్రతిభా పాటవాలు, శక్తిసామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు కొద్ది లాభాలతో ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబం మీద ఖర్చు పెరు గుతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహా రాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల శత్రు జయం ఉంటుంది.

4-karkatakam.jpg

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): దశమ స్థానంలో కుజుడు, లాభ స్థానంలో గురువు ఉండడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి, శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆదాయం క్రమంగా పెరుగు తుంది. ఆర్థిక అవసరాలు చాలావరకు తీరిపోతాయి. ఉద్యోగంలో పని భారం లేదా బరువు బాధ్య తలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో విముక్తి లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. గణపతి స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి.

5-simham.jpg

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశివారికి దశమ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో కుజుడు ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో గుర్తింపు లభించి బిజీ అయిపోతాయి. కుటుంబ వాతావరణం కూడా చాలావరకు ప్రశాంతంగా, సానుకూలంగా సాగి పోతుంది. ఆస్తి వ్యవహారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తరచూ శివార్చన చేయడం వల్ల శని ప్రభావం బాగా తగ్గుతుంది.

6-kanya.jpg

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో ఉండడం, భాగ్య స్థానంలో గురువు ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. కొందరు సన్నిహితుల సహాయంతో వ్యక్తిగత, కుటుంబ సమస్యల్ని చాలావరకు చక్కబెడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. బంధువుల వల్ల చిన్నా చితకా సమస్యలు ఉండవచ్చు. ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల శత్రు, రోగ, రుణ బాధలు తగ్గుతాయి.

6-thula.jpg

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఉద్యోగపరంగా అనేక శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కలలో కూడా ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. రావలసిన డబ్బు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అంది ఆర్థిక బలం పెరుగుతుంది. ఈ నెలంతా గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. కొద్దిపాటి శ్రమ ఉన్నా ఆదాయ ప్రయత్నాలను విరమించే అవ కాశం ఉండకపోవచ్చు. కొందరు బంధుమిత్రులకు వీలైనంతగా ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఆశించిన ఫలి తాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విష్ణు సహస్ర నామం పఠించడం మంచిది.

7-vruchikam.jpg

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): లాభ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అనేక విధాలుగా ఆర్థిక పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. అష్టమ స్థానంలో శుక్ర, రవుల సంచారం వల్ల చేతిలో డబ్బు నిలిచే అవకాశం ఉండదు. ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని గ్రహించాలి. రాశ్యధిపతి కుజుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల ప్రతి వ్యవహారం శ్రమ, తిప్పటతో గానీ పూర్తి కాదు. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొందరు బంధువుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకో కపోవడం మంచిది. విదేశాల ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం మంచిది.

8-dhanussu.jpg

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శని, కుజ, శుక్ర గ్రహాల అనుకూల సంచారం కారణంగా జీవితాన్ని మలుపు తిప్పగల శుభ పరిణామాలు ఒకటి రెండు చోటు చేసుకుంటాయి. సంపద దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అయి విలువైన ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు చాలావరకు కుదుటపడతాయి. కుటుంబపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పనులు, ప్రయత్నాలు, వ్యవహారాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలు అధికారులకు ఉపయోగపడతాయి. ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడు తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. సుందరకాండ పారాయణం మంచిది.

9-makaram.jpg

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రవి, రాహు, శని, గురువుల అనుకూలతల వల్ల నెలంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచి పో తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే అవకాశం ఉంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. శని వక్రగతి ప్రభావం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆశించిన ప్రతిఫలం కూడా ఉంటుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు సాగిస్తారు. జీతభత్యాల విషయంలో కొద్దిపాటు అనుకూలతలు చోటు చేసుకుంటాయి. సహా యాలు, దానధర్మాల వల్ల ఆదాయం తగ్గే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయ త్నాలు సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు కొద్ది శ్రమతో నెరవేరు తాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు కొద్దిగా మాత్రమే పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తరచూ శివార్చన చేయడం వల్ల శీఘ్ర పురోగతి ఉంటుంది.

11-kumbham.jpg

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశిలో రాశినాథుడు శని వక్రించడం వల్ల అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దా నాలూ చేయవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఎవరితోనూ ఎటువంటి ఒప్పందాలూ కుదర్చుకోవద్దు. కొద్ది కాలం పాటు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తప్పక పోవచ్చు. కొందరు తమ స్వార్థానికి మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆదిత్య హృదయం పఠనం వల్ల శుభ యోగాలు పడతాయి.

12-meenam.jpg

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ధన స్థానంలో కుజుడు, నాలుగు, అయిదు స్థానాల్లో బుధ, శుక్రుల సంచారం వల్ల ధనాదాయానికి లోటుండదు. ఆర్థికంగా ఒక విధమైన స్థిరత్వం లభిస్తుంది. ఖర్చులు బాగా తగ్గుముఖం పడ తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. నెలంతా వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు లోటుండదు. అయితే, ఎవరితోనూ ఆర్థిక లావా దేవీలు పెట్టుకోకపోవడం మంచిది. దేనిలోనూ పెట్టుబడులు పెట్టవద్దు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు పడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు రాణిస్తాయి. వ్యాపారంలో లాభాలు పరవాలేదనిపి స్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. దత్తాత్రేయ స్తోత్ర పఠనం మంచిది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Lucky Horosocope: వచ్చే 6 నెలలు ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. అందులో మీ రాశి ఉందా?

జూన్ నెలతో ఈ ఏడాది మొదటి భాగం గడిచిపోయినందువల్ల జూలై నుంచి మిగిలిన ఆరు నెలల కాలంలో ఎలా ఉండబోతోందన్నది పరిశీలించాల్సిన విషయం. శని, రాహు, కేతు, గురు గ్రహాలు ఈ ఏడాదంతో వారు ప్రస్తుతం ఉన్న రాశుల్లోనే సంచారం చేస్తుండడం వల్ల ఫలితాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కానీ, జూలైలో రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాల రాశి మార్పుల కారణంగా కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకోవచ్చు.

Half Yearly 2024 Horoscope

జూన్ నెలతో ఈ ఏడాది మొదటి భాగం గడిచిపోయినందువల్ల జూలై నుంచి మిగిలిన ఆరు నెలల కాలంలో ఎలా ఉండబోతోందన్నది పరిశీలించాల్సిన విషయం. శని, రాహు, కేతు, గురు గ్రహాలు ఈ ఏడాదంతో వారు ప్రస్తుతం ఉన్న రాశుల్లోనే సంచారం చేస్తుండడం వల్ల ఫలితాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కానీ, జూలైలో రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాల రాశి మార్పుల కారణంగా కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకోవచ్చు. మొత్తం మీద మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్పు, మకర రాశుల వారికి మాత్రం మిగిలిన ఆరు నెలల కాలం గడచిన ఆరు నెలల కంటే అదృష్టవంతంగా ఉండబోతోంది.

మేషం: ఈ రాశివారికి గురు, శనులతో పాటు రాశ్యధిపతి కుజుడి సంచారం కూడా ఈ ఏడాది చివరి వరకూ బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఉద్యోగంలో ప్రాభవం మరింతగా పెరగడం, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ కావడం, హోదాలు పెరగడం వంటివి తప్పకుండా చోటు చేసుకుం టాయి. లాభ స్థానంలో శని, ధన స్థానంలో గురువు వల్ల ఆదాయం వృద్ధి చెందడమే కానీ, తగ్గడం ఉండదు. విదేశీయానానికి, విదేశాల్లో సంపాదనకు కూడా అవకాశాలు బాగా పెరుగుతాయి.

కర్కాటకం: ఈ రాశికి గురువు లాభస్థానంలో బాగా అనుకూలంగా ఉండడం, ఏడాది చివరి వరకూ రాహు కేతువులు, జూలై నుంచి బుధ, రవి, శుక్రులు కూడా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఆశయ సిద్ధికి, ఆదాయ వృద్ధికి బాగా అవకాశాలున్నాయి. ఏ పని తలపెట్టినా తప్పకుండా విజ యవంతం అవుతుంది. ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా మారుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.

కన్య: ఈ రాశివారికి శని ఆరవ స్థానంలో ఉండడం ఒక విశేషం కాగా, భాగ్య స్థానంలో గురు సంచారం మరొక విశేషం. వీటితో పాటు బుధ, శుక్రులు కూడా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగ జీవితంలో కూడా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అంది వస్తాయి. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. విదేశీయాన యోగం పడుతుంది. ఆరోగ్య భాగ్యం కూడా పడుతుంది.

వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు సంచారం కొండంత బలం ఇస్తుంది. రాహు కేతువులతో పాటు శుక్ర, రవులు కూడా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఉద్యోగంలో ప్రాభవం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంటుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. సంతృప్తికరమైన జీవితం గడపడం జరుగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో శనీశ్వరుడు అనేక విధాలుగా పురోగతినిస్తాడు. రాశ్యధిపతి గురువు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల శత్రు, రోగ, రుణ బాధలను దగ్గరకు రానివ్వడు. మొత్తం మీద వచ్చే ఆరు నెలల కాలం మొదటి ఆరు నెలల కంటే మరింత యోగదాయకంగా నడిచిపోతుంది. విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.

మకరం: ఈ రాశికి ఈ సంవత్సరమంతా శని, రాహు, కేతువు, గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రాజపూజ్యాలకు లోటుండదు. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆస్తి వివాదం పరి ష్కారం అయి, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

Link to comment
Share on other sites

  • 0

Horoscope Today: వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం..12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 2, 2024): మేష రాశి వారికి ఈ రోజు అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. వృషభ రాశి వారి కష్టార్జితంలో ఎక్కువ భాగం ఖర్చులకే సరిపోతుంది. మిథున రాశికి చెందిన వారికి వ్యాపారాల్లో లాభాలపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today 02nd July 2024

దిన ఫలాలు (జూలై 2, 2024): మేష రాశి వారికి ఈ రోజు అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. వృషభ రాశి వారి కష్టార్జితంలో ఎక్కువ భాగం ఖర్చులకే సరిపోతుంది. మిథున రాశికి చెందిన వారికి వ్యాపారాల్లో లాభాలపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ బాగా పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఇష్టమైన దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రు లతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశ ముంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబ బాధ్యతల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. కష్టార్జితంలో ఎక్కువ భాగం ఖర్చులకే సరిపోతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనాలుంటాయి. వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు బాధ్యతల మార్పునకు అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించినంతగా ప్రయో జనం ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని మార్పులు, చేర్పులు తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో కూడా లాభాలపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా, ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతాయి. వాహన యోగం పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. సాధారణంగా లాభాలకు లోటుండదు. ఉద్యోగ జీవితం కూడా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం వృద్ధి చెందు తుంది. ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆస్తి సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ శ్రమ అధికంగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అదనపు రాబడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపా రాల్లో కూడా లాభాలకు లోటుండదు. బంధువుల తోడ్పాటుతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్టమైన బంధువులను శుభకార్యంలో కలుసుకునే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందజేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లభించడం కష్ట మవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి పనిలోనూ తిప్పట, శ్రమ ఉంటాయి. అనేక విధాలుగా ఖర్చులు పెరుగుతాయి. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందు తుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించిన గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆస్తి వివాదంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. పెండింగ్ పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేపడతారు. ఆదాయానికి, రాబడికి లోటుండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు ఎట్టకేలకు చేతికి అందుతాయి. ప్రతి వ్యవహారంలోనూ విజయం సాధిస్తారు. తల్లితండ్రుల నుంచి ఆస్తిపరంగా సానుకూల సమాచారం అందుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతాయి. బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రోజంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా తగ్గుతుంది. వ్యాపా రాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అనుకోకుండా బంధు వుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు పురోభివృద్ధి చెందుతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో పని భారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరి ణామాలు చోటుచేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలపరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపో తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల నుంచి ఒక దుర్వార్త వినే అవకాశ ముంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. అధికారులతో చిన్నా చితకా అపార్థాలు తొలగిపో తాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపో తుంది. తల్లితండ్రుల కారణంగా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా విహార యాత్రకు బయలుదేరే సూచనలున్నాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. ముఖ్య మైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యం పరవా లేదు.

Link to comment
Share on other sites

  • 0

Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 4, 2024): మేష రాశి వారి కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిథున రాశికి చెందిన వారికి ఉద్యోగంలో ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today 04th July 2024

దిన ఫలాలు (జూలై 4, 2024): మేష రాశి వారి కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిథున రాశికి చెందిన వారికి ఉద్యోగంలో ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా సాదా సీదాగా గడిచిపోతుంది. ఉద్యోగంలో ఆదరణతో పాటు పని భారం కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవి తంలో ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆస్తి వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆస్తి వివాదం పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం వంటివి జరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొంటారు. వ్యాపారాల్లో కార్యకలాపాలు ఊపందుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పెండింగ్ పనులు, ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది వ్యయప్రయాసలతో సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం అన్యోన్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనుల్లో శ్రమ, తిప్పట, ఒత్తిడి వంటివి ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో సమస్యలుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పురోగతి చెందుతాయి. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రుల నుంచి సహాయం లభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచి పోతుంది. బంధువుల రాకపోకలుంటాయి. మిత్రుల వల్ల కొన్ని వ్యవహారాలు చక్కబడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవు తుంది. చిన్నా చితకా వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సంద ర్శిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. బాధ్యతలు మారిపోవడం జరుగుతుంది. అధికారులు మీ మీద బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడిస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. కొందరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. విహార యాత్రకు బయలుదేరే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి. విశ్రాంతి ఉండకపోవచ్చు. ఉద్యోగంలో కూడా కొద్దిపాటి శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. కుటుంబ పరిస్థితి ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యయ ప్రయాసలతో గానీ వ్యవహారాలు పూర్తి కాకపోవచ్చు. కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. తలపెట్టిన వ్యవహా రాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరగడానికి అవ కాశం ఉంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్ప డుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలు అంచనాల్ని మించుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అదనపు ఆదాయ మార్గాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వాహన యోగం పడుతుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. వృత్తి జీవితంలో తీరిక లభిం చదు. వ్యాపారాలు లాభసాగిగా సాగుతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగు తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి కష్టనష్టాలుంటాయి. ఉచిత సహాయాలు, దానధర్మాల వల్ల ఇబ్బం దులు పడతారు. కుటుంబ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు ఆశించినంతగా పురో గతి సాధిస్తారు. ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు, ఒత్తిడి తప్పకపోవచ్చు. అధి కారులతో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా ఒత్తిడి పెరిగే సూచనలు న్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Link to comment
Share on other sites

  • 0

Zodiac Signs: రాశి మారనున్న 4 గ్రహాలు.. ఆ రాశుల వారి జీవితాల్లో అనుకూల మార్పులు..!

ఈ నెలలో ఏకంగా నాలుగు గ్రహాలు రాశులు మారుతున్నాయి. బుధ, శుక్ర, రవి, కుజులు రాశులు మారుతుండడం వల్ల వివిధ రాశుల వారి జీవితాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నెల మాత్రం ఈ నాలుగు గ్రహాల రాశి మార్పు ఆరు రాశుల వారికి దాదాపు కొత్త జీవితాన్ని ప్రసాదించడం జరుగుతుంది.

Zodiac Signs

zodiac-signs1111-111-511.jpg?w=1280

ఈ నెలలో ఏకంగా నాలుగు గ్రహాలు రాశులు మారుతున్నాయి. బుధ, శుక్ర, రవి, కుజులు రాశులు మారుతుండడం వల్ల వివిధ రాశుల వారి జీవితాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నెల మాత్రం ఈ నాలుగు గ్రహాల రాశి మార్పు మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి దాదాపు కొత్త జీవితాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో అందలాలు ఎక్కడం, ఆరోగ్యం మెరుగుపడడం, వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పట్టడం, కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి.

మేషం: రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాలు రాశులు మారడం ఈ రాశివారి జీవితంలో కొన్ని శుభ పరిణామాలకు కారణం అవుతుంది. ఉద్యోగంలో మంచి జీతభత్యాలతో కూడిన స్థిరత్వం లభి స్తుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. మంచి ఉద్యోగంలోకి మారే ప్రయత్నాలు ఫలి స్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. గృహ, వాహన ప్రయత్నాలు విజ యవంతం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం: ఈ రాశి మీదుగా శుభ గ్రహాలు సంచారం చేయడంతో పాటు దశమ, లాభ స్థానాలు పటిష్ఠం అవు తున్నందువల్ల ఉద్యోగ జీవితం అనేక విధాలుగా కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగపరంగా స్థిరమైన, ఆశావహమైన జీవితం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. విదేశీయానానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.

కన్య: ఈ రాశికి నవమ, దశమ స్థానాల్లో గ్రహాల రాశి మార్పు జరుగుతున్నందువల్ల వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో అధికా రులు ఎంతో నమ్మకంతో బరువు బాధ్యతలు పెంచడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఆక స్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

తుల: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో గ్రహాలు రాశి మారుతున్నందువల్ల ఉద్యోగపరంగా జీతభత్యాలు పెరగడం, అదనపు రాబడికి అవకాశాలు వృద్ధి చెందడం, మంచి పరిచయాలు ఏర్పడడం, లాభ సాటి ఒప్పందాలు కుదరడం వంటివి జరుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రయత్నపూర్వక లాభాలతో పాటు, అప్రయత్న ధనలాభం కూడా ఉంటుంది. పిత్రా ర్జితం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

మకరం: ఈ రాశికి సప్తమంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉండబోతున్నందువల్ల, వృత్తి, వ్యాపారాల్లో నిమిషం కూడా తీరిక, విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు తగ్గట్టుగానే రాబడి, లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం: ఈ రాశికి నాలుగు, అయిదు స్థానాలలో గ్రహాల రాశి మార్పు జరుగుతున్నందువల్ల ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆస్తిపరంగా అనుకూలతలు బాగా పెరుగుతాయి. జీవితంలో ఊహించని పరిణా మాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపో తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది.

 

Link to comment
Share on other sites

  • 0

Amavasya Horoscope: అమావాస్య వల్ల ఆ రాశుల వారికి శుభ యోగాలు, ఆర్థిక లాభాలు..!

ఈ నెల 5,6,7 తేదీల్లో మిథున రాశిలో రవి, చంద్రులు కలవడం వల్ల అమావాస్య ఏర్పడుతోంది. అమావాస్య వల్ల కేవలం అవయోగాలు మాత్రమే ఏర్పడతాయని, అన్నీ నష్టాలే జరుగుతాయని భావించడంలో అర్థం లేదు. అమావాస్య రోజుల్లో శుభ కార్యాలు చేపట్టకపోవడం, ప్రయాణాలు చేయకపోవడం మంచిదని మాత్రమే జ్యోతిషశాస్త్రం చెబుతోంది.

Amavasya July 2024

amavasya1.jpg?w=1280

ఈ నెల 5,6,7 తేదీల్లో మిథున రాశిలో రవి, చంద్రులు కలవడం వల్ల అమావాస్య ఏర్పడుతోంది. అమావాస్య వల్ల కేవలం అవయోగాలు మాత్రమే ఏర్పడతాయని, అన్నీ నష్టాలే జరుగుతాయని భావించడంలో అర్థం లేదు. అమావాస్య రోజుల్లో శుభ కార్యాలు చేపట్టకపోవడం, ప్రయాణాలు చేయకపోవడం మంచిదని మాత్రమే జ్యోతిషశాస్త్రం చెబుతోంది. రవి, చంద్రులు రెండూ రాజ గ్రహాలే అయినందువల్ల ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులకు ఎక్కువగా శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, కన్య, మకరం, కుంభ రాశులకు జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి, చంద్రులు కలవడం వల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అయ్యే అవ కాశం ఉంటుంది. ఈ రాశికి ఇది వృద్ధి స్థానం అయినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహిం చని పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. విదేశీయానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. తోబుట్టువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం: ఈ రాశికి ధన స్థానంలో అమావాస్య ఏర్పడడం వల్ల అంచనాలకు మించిన ధన వృద్ధి ఉంటుంది. కుటుంబ సమస్యలు సమసిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అప్రయత్న ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీత భత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలను అనుసరించి అధికారులు ప్రయోజనం పొందుతారు.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో రవి, చంద్రుల కలయిక ఏర్పడడం విపరీత రాజయోగాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది.

కన్య: ఈ రాశివారికి దశమ స్థానంలో అమావాస్య ఏర్పడడం వల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడంతో పాటు ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఉద్యోగావకాశాలు కూడా అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పోటీదార్లు, ప్రత్యర్థుల మీద విజయాలు సాధి స్తారు. గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలో ఈ రెండు రాజగ్రహాల కలయిక జరిగినందువల్ల శత్రు, రోగ, రుణ సమ స్యల నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల వల్ల అనేక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఇష్టమైన సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాలు నష్టాల నుంచి క్రమంగా బయటపడతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగు తుంది. ఉద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది.

కుంభం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఈ రవి చంద్రులు కలవడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను అలవరచుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. విదేశాల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది.

Link to comment
Share on other sites

  • 0

Money Astrology: ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్ష యోగం.. తప్పనిసరిగా సంపద వృద్ధి..!

ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బుధ, శుక్ర గ్రహాలు కర్కాటక రాశిలో కలిసి ఉండబోతున్నాయి. ఈ రెండు శుభ గ్రహాలు ఎప్పుడు ఎక్కడ కలిసి ఉన్నా తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష యోగాన్నిస్తాయి. ధన ధాన్య వృద్ధితో పాటు కుటుంబపరమైన సుఖ సంతోషాలు, దాంపత్య జీవితంలో అన్యోన్యత కూడా ఈ రెండు గ్రహాల యుతి వల్ల అనుభవానికి వస్తాయి.

Lakshmi Kataksha Yoga

lakshmi1.jpg?w=1280

ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బుధ, శుక్ర గ్రహాలు కర్కాటక రాశిలో కలిసి ఉండబోతున్నాయి. ఈ రెండు శుభ గ్రహాలు ఎప్పుడు ఎక్కడ కలిసి ఉన్నా తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష యోగాన్నిస్తాయి. ధన ధాన్య వృద్ధితో పాటు కుటుంబపరమైన సుఖ సంతోషాలు, దాంపత్య జీవితంలో అన్యోన్యత కూడా ఈ రెండు గ్రహాల యుతి వల్ల అనుభవానికి వస్తాయి. భోగభాగ్యాలు పెరిగే అవకాశం ఉన్నందువల్ల విలాస జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది. ప్రస్తుతం 11 రోజుల పాటు ఈ అరుదైన యోగం మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి పట్టే అవకాశం ఉంది.

మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల ధనాదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో సంపద పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది శ్రమతో అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అనూహ్యంగా గృహ, వాహన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశికి ధన స్థానంలో బుధ, శుక్ర గ్రహాలు కలవడం వల్ల కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం వల్ల మనశ్శాంతి ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. నిరుద్యోగులకు అనూహ్యమైన ఆఫర్ అందుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. భారీ జీతభత్యాలతో కూడిన స్థిరత్వం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం: ఈ రాశిలో బుధ, శుక్ర సంచారం ప్రారంభం అవుతున్నందువల్ల వీరికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి పనీ లాభదాయకమవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార, ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధి స్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.

కన్య: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, శుక్రుల సంచారం జరగబోతున్నందువల్ల ప్రతి పనీ కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి కోలుకోవడం జరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఒకటి రెండు అతి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి కలిసి వస్తుంది.

తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల యుతి వల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలు, దూర ప్రాంతాలు వెళ్లవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల సమాజంలో ఒక ప్రముఖుడుగా చెలామణీ అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు.

Link to comment
Share on other sites

  • 0

Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 5, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. మిథున రాశి వారు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today 05th July 2024

దిన ఫలాలు (జూలై 5, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. మిథున రాశి వారు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో బాధ్యతలు పెంచుతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ప్రేమ జీవితం హ్యాపీగా సాగి పోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబం మీద మీద ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థికంగా కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. ప్రభుత్వో ద్యోగులకు రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధు మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం కూడా సంభవిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాల నిస్తాయి. కొందరు చిన్ననాటి మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవ హారాలు, పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాతో పాటు జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు, సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల కారణంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. తోబుట్టు వుల నుంచి సహకారం లభిస్తుంది. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఒకరి ద్దరు బంధువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలు లాభి స్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశముంది. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అధికారులు, సహోద్యోగుల నుంచి సహ కారం లభిస్తుంది. కుటుంబంలో సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. మానసిక ప్రశాం తతకు లోటుండదు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపా రాల్లో శ్రమాధిక్యత ఉన్నా లాభాలకు కొరత ఉండదు. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. అయితే, అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఇష్టమైన బంధువులకు, మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. పుణ్య క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభ వార్త అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా ఊపందుకుంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును జాగ్రత్తపరచుకోవడం మంచిది. ఉచిత సహాయాల మీద వృథా చేయవద్దు. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలక డగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలకు వెడతారు. పిల్లలు పురోగతి సాధి స్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశముంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కొందరు బంధువుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

పుణ్యక్షేత్ర సందర్శనలకు అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఇత రుల మీద ఆధారపడకపోవడం మంచిది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లల చదువులు, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అధికారులు అత్య ధిక ప్రాధాన్యం ఇస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు కొత్త పుంతలు తొక్కుతాయి. లాభాలు అంచనా లను మించుతాయి. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా గడచిపోతుంది. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఓర్పుగా వ్యవహరించి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్క రించుకుంటారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ప్రస్తుతానికి ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపో వడం మంచిది. వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం సంభవిస్తుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...