Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Horoscope: Rasi Phalalu రాశిఫలాలు


Sanjiv

Recommended Posts

Astrology for 2024: ఐదు కీలక గ్రహాల అనుకూలత.. ఇక ఆ రాశుల వారికి అన్నీ విజయాలే!

గురు, శని, రాహు, శుక్ర, కుజుల అనుకూల సంచారాల వల్ల ఆరు రాశుల వారికి ఈ ఏడాదంతా విజయాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా ఈ రాశుల వారిని విజయం వరిస్తుంది. అవి మేషం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశులు. వీరి శక్తి సామర్థ్యాల విషయంలో ఎవరికెన్ని సందేహాలు, అనుమానాలున్నప్పటికీ, వీరిలోని పట్టుదల, ఆత్మ విశ్వాసం వీరిని విజయాల వైపు నడిపిస్తాయి. ఎటువంటి సవాలునైనా అధిగమించడం జరుగుతుంది. ఏడాది గడిచేసరికి వీరు ఎవరూ ఊహించని విజయాలు సాధించే అవకాశం ఉంది.

Success Astrology

success-astrology.jpg?w=1280

మేషం: ఈ రాశికి కుజుడు అధిపతి అయినందువల్ల వీరు ఎటువంటి ప్రతికూలతలనైనా ఎదుర్కోగలుగు తారు. తమ శక్తి సామర్థ్యాలను ఎవరు శంకించినా, అనుమానించినా వీరిలో బలం మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం కుజుడితో పాటు లాభ స్థానంలో ఉన్న శని, ధన స్థానంలో ఉన్న గురువు వల్ల వీరు తమ ప్రయత్నాలను సాధించుకునే వరకూ విశ్రమించరు. కొత్త పరిస్థితులకు, కొత్త పరి ణామాలకు అనుగుణంగా మారిపోయి, అధికారాన్ని, ఆదాయ వృద్ధిని అనుభవించడం జరుగుతుంది.

కర్కాటకం: దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడంలో ముందు వరుసలో ఉండే ఈ రాశివారు ఎవరు ఎన్ని విధాలుగా వీరి శక్తి సామర్థ్యాలను శంకించినప్పటికీ, గట్టి పట్టుదలతో, అంతకు మించిన ఆత్మ విశ్వాసంతో తమ లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. ఈ ఏడాదంతా ఈ రాశివారికి కుజ, గురు, శుక్ర, రవులు బాగా అనుకూలంగా ఉన్నం దువల్ల వీరి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలను సాధిస్తారు. గృహ, వాహనాలతో పాటు, ఆదాయాన్ని పెంచుకుంటారు.

సింహం: ఈ రాశ్యధిపతి రవి ఈ ఏడాదంతా అనుకూలంగా ఉండడంతో పాటు, శని సప్తమంలో శశ మహా పురుష యోగాన్నివ్వడం, గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో తిరుగులేని విజయాలు సాధించడం జరుగుతుంది. నిరుద్యోగులు గట్టి ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం సంపా దించుకోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగులు కూడా తమ నైపుణ్యాలను మరింతగా పెంచుకుని విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరత్వం పొందుతారు.

కన్య: సృజనాత్మకతకు, దీర్ఘకాలిక ప్రణాళికలకు, సానుకూల దృక్పథానికి మారు పేరైన ఈ రాశివారు జీవితంలో అన్ని విధాలుగా పురోగతి చెందడమే ధ్యేయంగా దూసుకుపోతారు. వీరికి ఈ ఏడా దంతా శని, గురువులు అనుకూలంగా ఉండడంతో పాటు, రాశ్యధిపతి బుధుడు కూడా అనుకూ లంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం, ఆర్థికాభివృద్ది చెందడం, వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టడం ఖాయంగా జరుగుతుంది.

వృశ్చికం: ఈ రాశివారు సాధారణంగా ఎంతటి శ్రమకైనా ఓర్చుకుంటారు. ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తారు. ప్రస్తుతం ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడు, సప్తమంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల విపరీతమైన పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ఇతరుల విమర్శలను, సందేహాలను లెక్క చేయకుండా తదేక దీక్షతో వీరు తమ లక్ష్యాల దిశగా దూసుకు పోతారు. ఆదాయాన్ని పెంచుకోవడం, అధికారాన్ని చేజిక్కించుకోవడం వీరికి తప్పకుండా సాధ్యమవుతాయి.

మకరం: గట్టి పట్టుదలకు, అవిశ్రాంత శ్రమకు మారుపేరైన ఈ రాశివారు ఈ ఏడాది ఆదాయపరంగానే కాక, సమస్యలను పరిష్కరించుకోవడంలోనూ, ఉన్నత పదవులను అధిరోహించడంలోనూ తప్పకుండా ముందుకు వెళతారు. ఈ రాశి నాథుడైన శనికి వక్రగతి కారణంగా విశేషమైన బలం పట్టడం వల్ల ఈ రాశివారికి ఎటువంటి సవాలునైనా, సమస్యలనైనా ఎదుర్కోగల సామర్థ్యం ఏర్పడుతుంది. దీర్ఘ కాలిక ప్రణాళికలు, వ్యూహాలతో ఆదాయ వనరులను, నైపుణ్యాలను పెంచుకోవడం జరుగుతుంది.

Link to comment
Share on other sites

  • Replies 17
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Sanjiv

    16

  • ADMINISTRATOR

    1

  • TELUGU

    1

Marriage Astrology: ఆ రాశుల వారికి ప్రేమ, పెళ్లిళ్లకు అనుకూల యోగాలు..!

జ్యోతిషశాస్త్రంలో సప్తమ స్థాన అధిపతిని బట్టి ప్రేమలు, పెళ్లిళ్లు తదితర విషయాలను నిర్ణయించడం జరుగుతుంది. సప్తమాధిపతి అనుకూలంగా ఉన్న పక్షంలో కొద్ది ప్రయత్నాలతో పెళ్లి సంబంధం కుదరడం, వైవాహిక జీవితం అనుకూలంగా, అన్యోన్యంగా సాగిపోవడం వంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలను కూడా సప్తమాధిపతిని బట్టే నిర్ణయించడం జరుగుతుంది.

marriage11.jpg?w=1280

జ్యోతిషశాస్త్రంలో సప్తమ స్థాన అధిపతిని బట్టి ప్రేమలు, పెళ్లిళ్లు తదితర విషయాలను నిర్ణయించడం జరుగుతుంది. సప్తమాధిపతి అనుకూలంగా ఉన్న పక్షంలో కొద్ది ప్రయత్నాలతో పెళ్లి సంబంధం కుదరడం, వైవాహిక జీవితం అనుకూలంగా, అన్యోన్యంగా సాగిపోవడం వంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలను కూడా సప్తమాధిపతిని బట్టే నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఏడాది కొన్ని రాశులకు మాత్రమే సప్తమాధిపతి అనుకూలంగా ఉన్నందువల్ల ప్రేమలు, పెళ్లిళ్లపరంగా యోగదాయక జీవితం ఏర్పడుతుంది. మేషం, వృషభం, సింహం, కన్య, కుంభం, మీన రాశులకు సప్తమాధిపతి శుభ యోగాలను కలిగించే అవకాశం ఉంది.

మేషం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శుక్రుడు అనుకూల రాశుల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు అనుకూలమైన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఈ శుక్రుడు కర్కాటకం, సింహ రాశుల్లో సంచారం చేస్తున్నందువల్ల మంచి వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తి లేదా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సునాయాసంగా విజయం సాధిస్తాయి. బాగా అనుకూలమైన వ్యక్తితోనే పెళ్లయ్యే అవకాశం ఉంది.

వృషభం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం ఇదే రాశిలో సంచారం చేస్తుండడంతో ఈ రాశి వారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి వ్యాపారంలో లేదా స్వతంత్ర జీవ నంలో ఉండే అవకాశం కూడా ఉంది. ప్రేమ వ్యవహారాలు తప్పకుండా పెళ్లికి దారితీస్తాయి. దంప తుల మధ్య అన్యోన్యత చెక్కుచెదరకుండా కొనసాగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా మొదటి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడే అవకాశం ఉంది. అన్యోన్య జీవితం ఏర్పడే సూచనలున్నాయి.

సింహం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శనీశ్వరుడు సప్తమంలోనే ఉన్నందువల్ల కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సాధారణంగా ప్రేమలో పడడానికి, ప్రేమ వివాహానికి అవకాశం ఉండదు. ఎక్కువ సంఖ్యలోనే పెళ్లి ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. అయితే, సరైన ఆదాయం కలిగిన వ్యక్తితో లేదా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవ్యక్తితో సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. దంపతుల మధ్య విడదీయలేని బంధం ఏర్పడుతుంది.

కన్య: ఈ రాశివారికి సప్తమాధిపతి అయిన గురువు భాగ్య స్థానంలో స్థిర రాశిలో ఉన్నందువల్ల, ఈ రాశివారు ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో కలిసి పని చేస్తున్న వ్యక్తితో గానీ, పరిచయస్థులతో గానీ ప్రేమలో పడడం జరుగుతుంది. ఆ వ్యక్తి స్థిరమైన ఉద్యోగంలో ఉండడం, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండడం జరుగుతుంది. విదేశాల్లో స్థిర పడిన వ్యక్తితో పెళ్లి ప్రయత్నాలు చేయడం మంచిది. వివాహ బంధం అన్యోన్యంగా సాగిపోతుంది.

కుంభం: ఈ రాశికి సప్తమాధిపతి రవి అయినందువల్ల ప్రేమలో పడడానికి అవకాశం ఉండకపోవచ్చు. సాధారణంగా పెద్దలు కుదర్చిన సంబంధమే ఖాయం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తితో లేదా దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో కొద్దిగా శ్రమ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ బంధం అనుకూలంగా, అన్యోన్యంగా కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతి త్వరలో పెళ్లయ్యే సూచనలున్నాయి.

మీనం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన బుధుడు ప్రస్తుతం పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వీరు ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తితో గానీ, ఆర్థిక రంగంలో పనిచేస్తున్న వ్యక్తితో గానీ ప్రేమలో పడడం జరుగుతుంది. వీరి ప్రేమ తప్పకుండా పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా వ్యాపారాల్లో ఉన్నవారితో, ఆర్థిక సంస్థల్లో పని చేస్తున్నవారితో పెళ్లయ్యే అవకాశం ఉంది. వీరి వివాహ బంధం తప్పకుండా అన్యోన్యంగా సాగిపోతుంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • Administrators

There is a new, separate section for ALL Horoscope news at the bottom of our Latest News page for a focussed reading.

HTH

--
Administrator
Telugus.com

Telugus.com

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...