Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

World Biryani Day: Types of Biryanis


Vijay

Question

World Biryani Day 2024: నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. దేశంలో ప్రసిద్ధి చెందిన బిర్యానీలు ఇవే.. !

భారతదేశం ఆహారం, ప్రత్యేక రుచి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అనేక రకాల వంటకాలు ప్రపంచవ్యాప్తంగా భోజన ప్రియులను ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ ప్రసిద్ధ వంటకాల్లో బిర్యానీ ఒకటి. ఇది అందరికీ నచ్చే వంటకం. బిర్యానీ అనేది ఒక వంటకం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలతో పంచుకునే భావోద్వేగం.

Biryani

biryani.jpg?w=1280

భారతదేశం ఆహారం, ప్రత్యేక రుచి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అనేక రకాల వంటకాలు ప్రపంచవ్యాప్తంగా భోజన ప్రియులను ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ ప్రసిద్ధ వంటకాల్లో బిర్యానీ ఒకటి. ఇది అందరికీ నచ్చే వంటకం. బిర్యానీ అనేది ఒక వంటకం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలతో పంచుకునే భావోద్వేగం. జులై నెలలోని మొదటి ఆదివారాన్ని ప్రపంచ బిర్యానీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2022 నుంచి ప్రారంభం అయిన ఈ బిర్యానీ దినోత్సవం.. ఇప్పుడు మూడవ ఏడాదిలోకి వచ్చింది. దావత్ బాస్మతి రైస్ ఆధ్వర్యంలో దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. 2024 అంటే ఈ సంవత్సరం మాత్రం జూలై 7వ తేదీన బిర్యానీ దినోత్సవం వచ్చింది. ఈ రోజు ఆదివారంగా ఉంది. సో.. ఆదివారం బిర్యానీ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా బిర్యానీ ప్రేమికులు.. దీన్ని ఆస్వాదించటానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఈ రోజు మనం భారతదేశంలో దొరికే 5 బిర్యానీల గురించి తెలుసుకుందాం. ఆ బిర్యానీలు రుచిపరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ

హైదరాబాదీ బిర్యానీ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ, ఐకానిక్ బిర్యానీలలో ఒకటి. ఇది అద్భుతమైన రుచిని కలిగి, పొడవైన బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాల సంపూర్ణ సమ్మేళనానికి ప్రసిద్ధి చెందింది. ఇది సాంప్రదాయకంగా చికెన్ లేదా మటన్‌తో తయారు చేస్తారు. వేయించిన ఉల్లిపాయలు, ఉడికించిన గుడ్లతో ఈ బిర్యానీ అలంకరిస్తుంది. ఈ బిర్యానీని రుచి చూడడానికి ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు.

Lucknow Biryani: లక్నో బిర్యానీ

దీనిని అవధి బిర్యానీ అని కూడా పిలుస్తారు. లక్నో బిర్యానీ ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఉద్భవించింది. ఇది అద్భుతమైన రుచికి ప్రసిద్ధి చెందింది. ఈ బిర్యానీని తయారు చేసేందుకు కుంకుమపువ్వు-రోజ్ వాటర్ వంటి సుగంధ ద్రవ్యాల వాడకం ద్వారా తయారు చేయడం జరుగుతుంది. లక్నో బిర్యానీ సాధారణంగా బాస్మతి బియ్యం, చికెన్ లేదా మటన్‌తో తయారు చేస్తారు.

Kolkatta Biryani: కోల్‌కతా బిర్యానీ

కోల్‌కతా బిర్యానీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇది అవధి, మొఘలాయ్ వంటకాలచే ప్రభావితమవుతుంది. ఇది సుగంధ బాస్మతి బియ్యం, మాంసం (సాధారణంగా చికెన్ లేదా మటన్), సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేస్తారు. బంగాళదుంపలు, దాల్చిన చెక్క జాజికాయ వంటి సుగంధ సుగంధాలను ఉపయోగించడం వల్ల కోల్‌కతా బిర్యానీ రుచి ఎంతో బాగుంటుంది.

Malabar Biryani: మలబార్ బిర్యానీ

కేరళలోని మలబార్ ప్రాంతంలో మలబార్ బిర్యానీ ప్రత్యేకత. సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి, చిన్న గింజలతో కూడిన జీరకసాల బియ్యంతో తయారు చేసే ఈ బిర్యానీ, ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి చెందింది. మలబార్ బిర్యానీని సాధారణంగా చికెన్, మటన్ లేదా చేపలతో తయారుచేస్తారు. తరచుగా రైతా లేదా ఊరగాయతో వడ్డిస్తారు.

Sindhi Biryani: సింధీ బిర్యానీ

సింధీ బిర్యానీ అనేది సింధ్ ప్రాంతం (ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగం) నుండి వచ్చిన సింధీ వంటకాల ప్రత్యేక వైవిధ్యం. ఇది సుగంధ ద్రవ్యాలు, బాస్మతి బియ్యం, మాంసం (సాధారణంగా మటన్ లేదా చికెన్)తో తయారు చేసిన రుచికరమైన, స్పైసీ బిర్యానీ. బంగాళదుంపలను ఈ బిర్యానీలో వాడడం వల్ల సింధీ బిర్యానీ రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రత్యేకమైన రుచి కోసం ఎండిన రేగు, వేయించిన ఉల్లిపాయలను ఉపయోగిస్తారు.

బిర్యానీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలలో పిస్తా హౌస్ హైదరాబాద్ స్పెషల్ డిష్ బిర్యానీని అందుబాటులోకి తీసుకువచ్చింది. బిర్యానీ క్రేజీ పెరగడంతో హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో గల్లీ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ దాకా బిర్యానీ అమ్మకాలు అమ్మంతంగా పెరిగిపోయాయి అంటున్నారు చిన్న వ్యాపారస్తులు. నిజాం నవాబుల కాలం తర్వాత హైదరాబాద్ నుంచి అనేక దేశాలలో బిర్యానీ ప్రచారంలోకి తీసుకొచ్చింది. హైదరాబాదులో ఎన్ని వంటకాలు ఉన్నప్పటికీ బిర్యానీ రోజు రోజుకు పెరుగుతుందని హోటల్ యజమాన్యాలు చెప్తున్నారు. అనేక రకాలైన బిర్యానీల కోసం కస్టమర్లు సైతం క్యూ కడుతున్నారు.

Link to comment
Share on other sites

2 answers to this question

Recommended Posts

  • 0

World Biryani Day: Hyderabad, the Biryani Capital of India, మన భాగ్యనగరం…బిర్యానీ కేపిటల్ ఆఫ్‌ ఇండియా..!

హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు ఎవరు వచ్చినా హైదరాబాద్ బిర్యానీ రుచి చూడకుండా వెళ్లరు. సరైన రీతిలో చేసి, మితంగా తింటే బిర్యానీతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని డైటీషియన్లు చెబుతున్నారు.

Hyderabad Biryani

hyderabad-biryani.jpg?w=1280

ఘుమఘుమలాడే హైదరాబాద్‌ బిర్యానీ వాసన గుప్పుమని తగిలితే.. రాహుల్‌ గాంధీ రాజకీయాలు మరిచిపోతారు. కింగ్‌ కోహ్లీ బ్యాటింగ్‌ మర్చిపోయి ఈటింగ్‌ కోసం పరుగులు పెడతాడు. హైదరాబాద్‌ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. బిర్యానీకి ఉండే క్రేజు, మోజు నెక్ట్స్‌ లెవెల్‌. అది రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఇండియన్‌ ఈట్‌ స్ట్రీట్‌లో హైదరాబాద్‌ బిర్యానీ… రారాజుగా వెలుగుతోంది. బిర్యానీ డే సందర్భంగా…ప్రపంచానికే నోరూరించే మన భాగ్యనగరం బిర్యానీ కహానీని లొట్టలేస్తూ తెలుసుకుందాం పదండి…

దేశంలో అత్యధికంగా ఆస్వాదిస్తోన్న ఆహారంలో ఫస్ట్‌ ప్లేస్‌ బిర్యానీదే. ఇక దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తున్న ప్రతి ఐదు బిర్యానీల్లో ఒకటి మన హైదరాబాద్‌దేనట. అంటే మన భాగ్యనగరాన్ని…బిర్యానీ కేపిటల్ ఆఫ్‌ ఇండియా అనొచ్చు. గత ఏడాది నగరంలో 13 మిలియన్ల బిర్యానీలు…అంటే కోటి 30 లక్షల బిర్యానీలను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశారు. ఇక భాగ్యనగరంలో అమ్ముడయ్యే బిర్యానీల్లో తొలి స్థానం చికెన్‌ బిర్యానీది కాగా, రెండో స్థానం వెజ్‌ బిర్యానీది కావడం మరో విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్‌ దమ్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీలు ఉన్నాయి. బిర్యానీ అనే పదం పర్షియన్‌ భాషలోని బిరింజ్‌ నుంచి పుట్టింది. దీని అర్థం రైస్‌. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయం అయ్యిందట. హైదరాబాద్‌ నిజామ్స్, లక్నో నవాబులు బిరియానీ అంటే లొట్టలేసేవారట. మొఘలుల కాలంలో తరచూ యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం చేసిన ప్రత్యేక వంటకం ఇదని చెబుతారు.

ఇక మన హైదరాబాదీ బిర్యానీ…దేశంలోని అత్యంత ప్రసిద్ధ, ఐకానిక్ బిర్యానీల్లో ఒకటి. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. పొడవైన బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాల సంపూర్ణ సమ్మేళనంతో తయారయ్యే హైదరాబాద్‌ బిర్యానీ వరల్డ్‌ ఫేమస్‌గా మారింది. హైదరాబాద్‌ బిర్యానీని చికెన్ లేదా మటన్‌తో తయారు చేస్తారు. వేయించిన ఉల్లిపాయలు, ఉడికించిన గుడ్లతో బిర్యానీని తయారుచేస్తారు. ఈ బిర్యానీ రుచి చూడడానికి ఆహార ప్రియులు లొట్టలేస్తారు.

ఇక లక్నో బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, మలబార్ బిర్యానీ, సింధీ బిర్యానీ లాంటివి దేశంలో చాలా ఉన్నా…బిర్యానీల్లో కింగు, టేస్టులో బెస్టు మాత్రం మన హైదరాబాద్‌దే అంటారు ఫుడ్‌ లవర్స్‌. ఇక బిర్యానీ డే సందర్భంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో స్పెషల్ డిష్‌ బిర్యానీని పేదలకు ఉచితంగా అందించాయి కొన్ని హోటల్స్‌. ఈ డిష్‌కు క్రేజ్‌ పెరగడంతో గల్లీ హోటల్స్‌ నుంచి ఫైవ్‌ స్టార్‌ రెస్టారెంట్స్‌ వరకు బిర్యానీ అమ్మకాలు అమాంతంగా పెరిగిపోయాయంటున్నారు వ్యాపారులు. అనేక రకాల బిర్యానీలను జనం టేస్టుకు తగ్గట్లు తీసుకొస్తున్నామంటున్నారు పిస్తా హౌస్‌ ఓనర్‌ మహ్మద్ అబ్దుల్‌ మజీద్‌.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...