Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Indian tycoon Ratan Tata dies at 86


Sanjiv

Recommended Posts

Ratan Tata Death: Simi Garewal - Ratan Tata - రతన్‌టాటా మరణం.. “వీడ్కోలు స్నేహితుడా” అంటూ ఆయన మాజీ ప్రేయసి పోస్ట్

Ratan Tata Death : నిరంతర స్వాప్నికుడు, అలుపెరుగని శ్రామికుడు, భావితరాలకు మార్గదర్శకుడు అయిన రతన్‌టాటా తుదిశ్వాస విడిచారు. గొప్ప మానవతావాది కన్నుమూశారు. ఈ దేశం గర్వంగా చెప్పుకునే వ్యాపార సంస్థను నడిపించిన ఈ నాయకుడు, ఇక సెలవంటూ వెళ్లిపోయారు.

 
Ratan Tata Death: రతన్‌టాటా మరణం.. వీడ్కోలు స్నేహితుడా అంటూ ఆయన మాజీ ప్రేయసి పోస్ట్

వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్‌ టాటాది కూడా ఎంతోమందిలా ఓ లవ్‌ ఫెయిల్యూరే. 1962లో భారత్‌, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్‌ టాటా ప్రేమ విఫలం కావడానికి కారణమైంది. రతన్‌ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో ఓ ఆర్కిటెక్చర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ యువతితో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఏడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మతో కొద్ది రోజులు గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. తన కోసం తన ప్రేయసి కూడా భారత్‌ వస్తుందని ఆశించారు. కానీ, భారత్‌– చైనా యుద్ధంతో ఆ మహిళ తల్లిదండ్రులు ఆమె భారత్‌ వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో వారి ప్రేమకథ ముగిసింది. ఈ తొలి ప్రేమ ఆయనకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన ప్రేమకథను పలుమార్లు బయటపెట్టిన రతన్‌ టాటా ఆ మహిళ ఎవరనేది ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970ల్లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమీ గరేవాల్‌కు రతన్‌ దగ్గరయ్యారు. వారి అనుబంధం పెళ్లిపీటల వరకు వెళుతుందని ఆశించినా అది జరగలేదు. సిమీ మరొకరిని పెళ్లాడగా రతన్‌ టాటా ఒంటరయ్యారు. ఇలా మొత్తం నాలుగు సందర్భాల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనా వేర్వేరు కారణాలతో అవేవి జరగక ఆజన్మబ్రహ్మచారిగానే ఉండిపోయారు.

అలనాటి సినీ నటి, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అయిన సిమి గరేవాల్‌- రతన్‌టాటా మరణంపై స్పందించారు. “వాళ్లు నువ్వు వెళ్లిపోయావని అంటారు.. నువ్వు లేవని అనుకోవడమే కష్టంగా ఉంది. నా మిత్రుడా.. నీకు వీడ్కోలు” అంటూ సిమి గరేవాల్‌ ట్వీట్‌ చేశారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. కొంతకాలం డేటింగ్‌ కూడా చేశారట. రతన్‌టాటా తన స్నేహితుడనీ 2011లో సిమి గరేవాల్‌ చెప్పారు.

They say you have gone .. It's too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata

Simi Garewal

 

Link to comment
Share on other sites

Ratan Tata: Nano Car for Rs. 1 lakh for middle class - మధ్యతరగతి వారి కోసం నష్టాలు ఎదురైనా వెరవకుండా లక్షకే నానో కార్..

ఈ దేశం- ఒక నేషనల్‌ ఐకాన్‌ని కోల్పోయింది. రతన్‌టాటా ఈరోజు మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త. అంతకుమించిన మహా మనీషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ కార్పొరేట్లకు అంతనంత ఎత్తులో ఉండే వ్యక్తి రతన్‌టాటా. మనదేశంలో చూస్తున్న స్టార్టప్‌ విప్లవానికి ఆయన ప్రేరణగా నిలిచే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ దేశం నివాళులు అర్పిస్తోంది.

 
Ratan Tata Death: మధ్యతరగతి వారి కోసం నష్టాలు ఎదురైనా వెరవకుండా లక్షకే నానో కార్..

రతన్‌టాటా అనగానే సగటు భారతీయుడికి ఠక్కున గుర్తొచ్చేది నానో కారు. నానో కారు.. కార్ల ప్రపంచంలో ఓ అద్భుత ఆవిష్కరణ. లక్ష రూపాయలకే ప్రతి ఇంటికి కారు అందిస్తానని హామీ ఇచ్చిన రతన్‌టాటా అలాగే ప్రారంభించారు. ఈ నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బైక్‌ ధరలకే కారు అందుబాటులో ఉండటం ఎంత సాహసం? అదే టాటా పరిచయం చేసిన ‘టాటా నానో’ కారు.  ఈ కారు మధ్యతరగతి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది.

ప్రతి ఇంటికి కారు అందిస్తానన్న ఈ దిగ్గజ కల నెరవేరడానికి టాటా గ్రూప్ భారీ నష్టాలను చవిచూసింది. అయినా ఇచ్చిన హామీ మేరకు నానో కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టారు రతన్‌టాటా. టాటా నానో కార్ ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో లక్ష రూపాయలకే కారు అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే.. నానో కారును రతన్ టాటా కలల కారుగా చెప్పుకుంటారు.  ముంబైలో ఓ ఫ్యామిలీ అంతా ద్విచక్ర వాహనంపై వెళ్తుండటం చూసిన రతన్ టాటా మధ్యతరగతి వారి కోసం నానో కారు తీసుకురావాలని నిర్ణయించుకుని.. ఆ దిశగా ముందడుగు వేశారట. మార్కెట్‌లోకి వచ్చిన తొలి ఏడాది ఇండియన్‌ కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును నానో దక్కించుకుంది.  ఆ తర్వాత విడి భాగాల రేట్లు విపరీతంగా పెరగడంతో కారును రూ.లక్షకే అందివ్వడం కష్టతరంగా మారింది. ఇక ధరలు స్వల్పంగా పెంచాల్సి వచ్చింది.

1937 డిసెంబర్‌ 28న ముంబయిలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్‌ టాటా.. కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్‌ టాటా.. 1962లో టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించింది.

The most enduring memory of having read and watched Mr @RNTata2000

through media over the years is when he said “A promise is a promise” at the launch of Tata Nano while sticking to a ₹1 lakh car for Indian middle class despite costs going up significantly after the original announcement.

Aashish P Sommaiayaa

 

 

Link to comment
Share on other sites

Ratan Tata’s business expansion in 110 countries: 110 దేశాల్లో విస్తరించిన ‘టాటా’ సామ్రాజ్యం.. అంచెలంచెలుగా ఎదిగిన వ్యాపార దిగ్గజం

నిరంతర స్వాప్నికుడు, అలుపెరుగని శ్రామికుడు, భావితరాలకు మార్గదర్శకుడు అయిన రతన్‌టాటా తుదిశ్వాస విడిచారు. గొప్ప మానవతావాది కన్నుమూశారు. ఈ దేశం గర్వంగా చెప్పుకునే వ్యాపార సంస్థను నడిపించిన ఈ నాయకుడు, ఇక సెలవంటూ వెళ్లిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని..

 
Ratan Tata's Journey: 110 దేశాల్లో విస్తరించిన 'టాటా' సామ్రాజ్యం.. అంచెలంచెలుగా ఎదిగిన వ్యాపార దిగ్గజం

ముంబై, అక్టోబర్ 10: నిరంతర స్వాప్నికుడు, అలుపెరుగని శ్రామికుడు, భావితరాలకు మార్గదర్శకుడు అయిన రతన్‌టాటా తుదిశ్వాస విడిచారు. గొప్ప మానవతావాది కన్నుమూశారు. ఈ దేశం గర్వంగా చెప్పుకునే వ్యాపార సంస్థను నడిపించిన ఈ నాయకుడు, ఇక సెలవంటూ వెళ్లిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ధ్రువీకరించారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్‌ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రికి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వెళ్లారు. రతన్‌ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

సోమవారం రతన్‌ టాటా ఆస్పత్రికి వెళ్లడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన ఆయన.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన రెండ్రోజులకే ఆయన దివంగతులయ్యారు.

1937 డిసెంబర్‌ 28న ముంబయిలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్‌ టాటా.. కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్‌ టాటా.. 1962లో టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. దేశ పారిశ్రామిక, వాణిజ్యరంగ పురోగతిలో కీలకపాత్ర పోషించిన రతన్‌ టాటా దిగ్గజ వ్యాపారవేత్తగా, గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. టాటా గ్రూప్స్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో వ్యాపార సంస్థలు ఉన్నాయి.

Link to comment
Share on other sites

Tata Nano - The one lakh rupee car of India | Gone But Not Forgotten - Episode 9 | 2022 | evo India

 

Link to comment
Share on other sites

Ratan Tata: TATA products we use everyday - ఉదయం నుండి రాత్రి వరకు వాడే టాటా ఉత్పత్తులు ఇవే..

టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా అందరికీ వీడ్కోలు పలికి వెళ్లిపోయారు. ఆయన మరణానికి సంబంధించిన మొదటి సమాచారాన్ని పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా బుధవారం రాత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఇచ్చారు. అప్పటి నుంచి ప్రజలు ఆయనకు తమదైన రీతిలో నివాళులర్పిస్తున్నారు. 1991లో రతన్ టాటాకు..

 
Ratan TATA: ఉదయం నుండి రాత్రి వరకు వాడే టాటా ఉత్పత్తులు ఇవే..

టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా అందరికీ వీడ్కోలు పలికి వెళ్లిపోయారు. ఆయన మరణానికి సంబంధించిన మొదటి సమాచారాన్ని పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా బుధవారం రాత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఇచ్చారు. అప్పటి నుంచి ప్రజలు ఆయనకు తమదైన రీతిలో నివాళులర్పిస్తున్నారు. 1991లో రతన్ టాటాకు టాటా సన్స్ కమాండ్ వచ్చింది. అంతకు ముందు టాటా సన్స్ పరిమిత ప్రాంతంలో మాత్రమే వ్యాపారం చేసేది.

రతన్ టాటా టాటా సన్స్‌కు నాయకత్వం వహించిన వెంటనే, అతను తన దూరదృష్టితో ముందుకు సాగారు. అలాగే ఆటోమొబైల్, రసాయన, వినియోగదారు ఉత్పత్తులు, ఇంధనం, ఇంజనీరింగ్, ఆర్థిక సేవలు, సమాచార వ్యవస్థలు, మెటీరియల్, టెలికమ్యూనికేషన్ రంగాలలో టాటా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాడు. టాటా ఈ అన్ని రంగాలలో అనేక ఉత్పత్తులను ప్రారంభించింది. వీటిని మనం రోజువారీ జీవితంలో ఉపయోగిస్తున్నాము.

టాటా ప్రజల జీవితాలలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతి వ్యక్తి ప్రతిరోజూ టాటా ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాడు. దీనిలో వోల్టాస్ AC నుంచి టైటాన్ వాచ్‌, వెస్ట్‌సైడ్, జారా, జూడియో, టీ లేదా కాఫీ తాగినప్పుడల్లా, టెట్లీ లేదా స్టార్ బక్స్, టాటా మోటార్స్ కారు, అలాగే విస్తారా, ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఎన్నో ఉన్నాయి.

ఇంటి రేషన్ విషయానికి వస్తే, చాలా మంది కిరాణా, పండ్లు, కూరగాయలు, పాలు, ఇతర ఆహార పదార్థాలను బిగ్ బాస్కెట్ ద్వారా ఆర్డర్ చేస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి క్రోమా నమ్మదగినదిగా మారింది. మీరు వినోదాన్ని పొందాలనుకుంటే, టాటా ప్లే బీయింగ్ మీకు మెరుగైన ఎంపికలను అందిస్తాయి. ఇంటి బయట లంచ్, డిన్నర్ కోసం తాజ్ హోటల్‌లు, సాఫ్ట్‌వేర్ సేవల కోసం టీసీఎస్‌ సేవలు కూడా టాటా ఖాతాలోనే ఉన్నాయి. ఇవే కాకుండా రోజు వారి ఉత్పత్తులు కూడా ఎన్నో ఉన్నాయి.

Link to comment
Share on other sites

 

Ratan Tata Car Collection: ఈ 2 కార్లు రతన్ టాటా ఎంతో ఇష్టం.. గ్యారేజీలో ఖరీదైన కార్లు!

Ratan Tata Car Collection: టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) మరణించారు. రతన్ టాటా టాటా మోటార్స్‌తో సహా అనేక ఇతర కంపెనీలను ఎంతో ఎత్తులకు తీసుకెళ్లారు. ఈ రోజు భద్రత విషయానికి వస్తే మొదట గుర్తుకు వచ్చే పేరు టాటా మోటార్స్. భారత మార్కెట్లో చాలా బలమైన పట్టును కలిగి ఉంది..

 
Ratan Tata Car Collection: ఈ 2 కార్లు రతన్ టాటా ఎంతో ఇష్టం.. గ్యారేజీలో ఖరీదైన కార్లు!

Ratan Tata Car Collection: టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) మరణించారు. రతన్ టాటా టాటా మోటార్స్‌తో సహా అనేక ఇతర కంపెనీలను ఎంతో ఎత్తులకు తీసుకెళ్లారు. ఈ రోజు భద్రత విషయానికి వస్తే మొదట గుర్తుకు వచ్చే పేరు టాటా మోటార్స్. భారత మార్కెట్లో చాలా బలమైన పట్టును కలిగి ఉంది. ఎన్నో కంపెనీలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కార్ల సేకరణలో ఏ వాహనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. రతన్ టాటా ఇంతకుముందు హోండా సివిక్‌లో ప్రయాణించేవారుజ అయితే హోండా సివిక్ తర్వాత, రతన్ టాటా టాటా గ్రూప్‌కు చెందిన టాటా నెక్సాన్ ఈవీలో ప్రయాణించడం ప్రారంభించారు. ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో ఎక్కువ ఆధిపత్యాన్ని కలిగి ఉంది. రతన్ టాటా గ్యారేజీలో ఏ వాహనాలు ఉన్నాయో తెలుసుకుందాం?

రతన్ టాటా కార్ కలెక్షన్:

రతన్ టాటా కార్ల సేకరణలో ఒకటి కాదు, చాలా విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వాటిలో అతని హృదయానికి చాలా దగ్గరగా ఉండే అలాంటి కారు ఒకటి ఉంది. టాటా నానోను టాటా మోటార్స్ ఉత్పత్తి శ్రేణి నుండి తొలగించారు. నివేదికల ప్రకారం, రతన్ టాటా తన గ్యారేజీలో టాటా నానో కూడా ఉంది. టాటా నానో అతని డ్రీమ్ ప్రాజెక్ట్. దీని కారణంగా లక్ష రూపాయల ధరతో విడుదల చేసిన ఈ చిన్న కారు అతని హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

టాటా నానో మాత్రమే కాదు, 2023లో టాటా ఇండికా 25వ వార్షికోత్సవం జరిగినప్పుడు, ఈ ప్రత్యేక సందర్భంలో రతన్ టాటా ఒక పోస్ట్‌ను షేర్ చేసి, టాటా ఇండికా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కారు అని పోస్టులో పేర్కొన్నారు. దీనితో పాటు, ఈ కారు తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని కూడా చెప్పాడు.

టాటా నానో, టాటా ఇండికాతో పాటు, టాటా మోటార్స్ అత్యంత ప్రజాదరణ పొందిన, సురక్షితమైన వాహనం టాటా నెక్సాన్ కూడా రతన్ టాటా కార్ కలెక్షన్‌లో ఉంది. ఈ వాహనాలతో పాటు, రతన్ టాటా వద్ద మెర్సిడెస్-బెంజ్ SL500, మసెరటి క్వాట్రోపోర్టే, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, కాడిలాక్ XLR, హోండా సివిక్ వంటి వాహనాలు కూడా ఉన్నాయి.

Link to comment
Share on other sites

 

Ratan Tata Last Rites: అధికారిక లాంఛనాలతో ముగిసిన రతన్‌ టాటా అంత్యక్రియలు

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా అంత్యక్రియలు ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో ముగిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించింది. మహారాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్‌ షా హాజరయ్యారు...

 
Ratan Tata: అధికారిక లాంఛనాలతో ముగిసిన రతన్‌ టాటా అంత్యక్రియలు

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా అంత్యక్రియలు ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో ముగిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించింది. మహారాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్‌ షా హాజరయ్యారు.

రతన్‌ టాటా అంతర్జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పించి, తన సంపాదనలో 60 శాతానికిపైగా పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టారు. రెండు దశాబ్దాలకు పైగా టాటా గ్రూప్‌నకు అధిపతిగా ఉన్న రతన్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రతన్ టాటా, ఆయన తమ్ముడు జిమ్మీ ముంబయి డౌన్‌టౌన్‌లో నివసించే అమ్మమ్మ నవాజ్‌బాయి దగ్గర పెరిగారు. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వేల సంఖ్యలో నేతలు, ప్రముఖులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ప్రముఖుల రాజకీయ నేతలు, అధికారులు కడసారిగా నివాళులు అర్పించారు.

రతన్ టాటా కన్నుమూత LIVE | Ratan Tata Passes Away - TV9

రతన్ టాటా అంత్యక్రియలు LIVE | Ratan Tata Last Rites Live | NTV

Ratan Tata Funeral: Ratan Tata's Beloved Dog Goa Mourns His Master's Passing | India Today

 

Link to comment
Share on other sites

Ratan Tata Salary: రతన్‌ టాటా వేతనం ఎంతో తెలుసా..? ఆశ్చర్యపర్చే నిజాలు!

రతన్ టాటా టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్, దేశీయ పారిశ్రామికవేత్త నుండి ప్రపంచ స్థాయికి ఎదిగారు. అతను తన దాతృత్వానికి, వినయానికి అలాగే అతని వ్యాపార చతురతకు ప్రసిద్ధి చెందారు. రతన్‌ టాటా అంటేనే మానవత్వానికి మారుపేరు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడంతో బాధాకరం. రతన్‌ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే..

 
Ratan Tata Salary: రతన్‌ టాటా వేతనం ఎంతో తెలుసా..? ఆశ్చర్యపర్చే నిజాలు!

రతన్ టాటా టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్, దేశీయ పారిశ్రామికవేత్త నుండి ప్రపంచ స్థాయికి ఎదిగారు. అతను తన దాతృత్వానికి, వినయానికి అలాగే అతని వ్యాపార చతురతకు ప్రసిద్ధి చెందారు. రతన్‌ టాటా అంటేనే మానవత్వానికి మారుపేరు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడంతో బాధాకరం. రతన్‌ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేసిన కృషి, సేవలు వెలకట్టలేనివి. రతన్ టాటా 1991–2012 వరకు టాటా గ్రూప్, టాటా సన్స్‌కు చైర్మన్‌గా పనిచేశారు. పదవీ విరమణకు ముందు అక్టోబర్ 2016–జనవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్‌గా పనిచేశారు. టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా ఎంత జీతం పొందారు?

రతన్ టాటా జీతం

వివిధ నివేదికల ప్రకారం, రతన్ టాటా టాటా గ్రూప్, టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రూ.2.5 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. అంటే, వ్యాపారవేత్త నెలకు దాదాపు రూ. 20.83 లక్షలు. రోజుకు రూ. 70,000.. గంటకు దాదాపు రూ.2,900.. నిమిషానికి దాదాపు రూ. 48-49. గౌతమ్ అదానీ వంటి ఇతర బిలియనీర్ల కంటే చాలా తక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ నిమిషానికి రూ.3.09 లక్షలు సంపాదిస్తారు. అంటే సెకనుకు దాదాపు రూ. 51,250, రతన్ టాటా ఒక రోజులో సంపాదిస్తారు.

రతన్ టాటా జీతం ఎందుకు తక్కువ?

రతన్ టాటా ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపార రంగాలలో ఒకదానికి అధిపతిగా, యజమానిగా ఉన్నప్పటికీ ఇతర ఉన్నత-మధ్య-స్థాయి కార్పొరేట్ ఉద్యోగి కంటే తక్కువ వేతనం ఎందుకు పొందారని అనుకోవచ్చు.

రతన్ టాటా భారీ వ్యక్తిగత సంపదను కూడగట్టుకునే బదులు జంతువుల కోసం అనేక స్వచ్ఛంద సంస్థలను నిర్వహించడమే కాకుండా వైద్యం, విద్య, పరిశోధన రంగాలలో దాతృత్వ వెంచర్‌ల కోసం తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని వెచ్చించేరని నివేదికలు సూచిస్తున్నాయి. రతన్‌ టాటా జీతం ఎంత తీసుకున్నా.. అందులో దాదాపు 60 నుంచి 65 శాతం వరకు పేదలకు విరాళాలు, స్వచ్చంధ సంస్థలకు ఇచ్చేవారట. అందుకే రతన్‌ టాటా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

రతన్ టాటా నికర ఆదాయం:

తన జీతం కాకుండా, రతన్ టాటా తన స్మార్ట్ పెట్టుబడులు, షేర్లతో సహా అనేక ఇతర వనరుల నుండి అదనపు ఆదాయాన్ని పొందారు. అయినప్పటికీ వారి ఉమ్మడి ఆదాయం ఖచ్చితమైన సంఖ్య బహిరంగంగా అందుబాటులో లేదు. ఇటీవలి నివేదికల ప్రకారం, రతన్ టాటా నికర విలువ రూ.3,800 కోట్లుగా అంచనా.

Link to comment
Share on other sites

I wonder if he was married with a family, kids.. he may not have been so successful as that would have chewed up his time from building so many businesses.

This is really insane! He was grinding it like rinse and repeat...

GZeqt9KWkAAAt9s?format=jpg&name=small

  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...