Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

Koratala Siva: 'శ్రీమంతుడు' వివాదం.. దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ


TELUGU

Question

'శ్రీమంతుడు' కథను కాపీ కొట్టారంటూ రచయిత శరత్ చంద్ర పిటిషన్

కొరటాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నాంపల్లి కోర్టు

నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనన్న సుప్రీంకోర్టు

cr-20240129tn65b78971e56c2.jpg

సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే... మహేశ్ బాబుతో కొరటాల శివ తెరకెక్కించిన 'శ్రీమంతుడు' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే స్వాతి పత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో, నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టును కొరటాల శివ ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా కథను కాపీ కొట్టారనేందుకు ఉన్న ఆధారాలను హైకోర్టుకు శరత్ చంద్ర అందజేశారు. శరత్ చంద్ర ఆధారాలను సమర్థిస్తూ రచయితల సంఘం కూడా హైకోర్టుకు నివేదికను ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో, కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

కొరటాల పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్ రాయ్ ల ధర్మాసనం... ఆయన పిటిషన్ ను కొట్టివేసింది.

...

Read full article...

Link to comment
Share on other sites

3 answers to this question

Recommended Posts

  • 0

Srimanthudu: 'శ్రీమంతుడు' స్టోరీ వివాదంపై చిత్రబృందం స్పందన

మహేశ్ బాబు-కొరటాల శివ కాంబోలో శ్రీమంతుడు చిత్రం

ఈ సినిమా కథ తనదేనంటూ కోర్టును ఆశ్రయించిన రచయిత శరత్ చంద్ర

మీడియా అప్పుడే ఓ అంచనాకు రావొద్దంటూ శ్రీమంతుడు టీమ్ విజ్ఞప్తి

ప్రస్తుతం న్యాయ పరిశీలన ప్రక్రియ జరుగుతోందని వెల్లడి

cr-20240201tn65bbcba564db6.jpg

'శ్రీమంతుడు' సినిమా కథ తనదేనంటూ రచయిత శరత్ చంద్ర పేర్కొంటుండగా, ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చింది. 

తాజాగా శరత్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను రాసిన 'చచ్చేంత ప్రేమ' నవలనే 'శ్రీమంతుడు' సినిమాగా తీశారని వెల్లడించారు. గతంలో ఈ సినిమా స్టోరీ వివాదంలో సినీ పెద్దలు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారని తెలిపారు. రూ.15 లక్షలు ఇస్తామని అన్నారని శరత్ చంద్ర వివరించారు. 

ఈ నేపథ్యంలో, శ్రీమంతుడు టీమ్ స్పందించింది. "శ్రీమంతుడు, చచ్చేంత ప్రేమ... ఈ రెండు కథాంశాలు పరస్పరం పూర్తిగా విభిన్నం అని స్పష్టం చేసింది. శ్రీమంతుడు సినిమా, చచ్చేంత ప్రేమ నవలలు రెండు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పుస్తకం చదవండి, సినిమా చూడండి... వాస్తవం ఏంటో అర్థమవుతుంది. ఇక ఈ వ్యవహారం న్యాయ పరిశీలనలో ఉంది కాబట్టి, ఇప్పుడే ఒక అంచనాకు రావొద్దని మీడియాను కోరుతున్నాం. చట్టంపై మాకు నమ్మకం ఉంది. దయచేసి ఓపిక వహించండి" అంటూ ఓ ప్రకటనలో పేర్కొంది.

...

Read full article

Link to comment
Share on other sites

  • 0

Srimanthudu: నేను డబ్బు అడగలేదు.. నేను అడిగింది ఆ ఒకటే!

మహేష్‌ (Mahesh) హీరోగా కొరటాల శివ (Koratala siva) దర్శకత్వం వహించిన ‘శ్రీమంతుడు’ (Srimanthudu copyright issues) కాపీ రైట్‌ వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన కథను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ సినిమా తెరకెక్కించారని రచయిత శరత్‌ చంద్ర ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాజాగా రచయిత స్పందిస్తూ తనకు నష్టపరిహారం ఇవ్వమని కోరడం లేదన్నారు.

Srimanthuu_eb24f7b059_V_jpeg--799x414-4g

తాజాగా ఆయన ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘2012లో నేను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవల ఓ మాసపత్రికలో  ప్రచురితమైంది. ఆ కథతో ఒక సినిమా చేస్తే బాగుంటుందని దర్శకుడు సముద్రను కలిశా. మేం ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాలనుకున్న సమయంలో ‘శ్రీమంతుడు’ విడుదలైంది. అది చూసిన మిత్రులు అది నా కథేనన్నారు. దాంతో నేనూ ఆ సినిమా చూశా. నా కథలో ఉన్నది ఉన్నట్లు స్ర్కీన్‌పై చూసి షాకయ్యా. దర్శకుడితో మాట్లాడా. ఇది నా కథేనని చెప్పా. దానికి ఆయన అంగీకరించలేదు. సినీ పెద్దలు కొందరు రాజీ చేయాలని చూశారు. రూ.15 లక్షలు ఆశ చూపించారు. కానీ నాకు రచయితల సంఘం ఎంతో సాయం చేసింది. వాళ్ల సహకారంతోనే కోర్టును ఆశ్రయించా. ఈ  స్క్రిప్ట్ నాదేనని  అంగీకరించమని కోరుతున్నా’’ అని శరత్‌ చంద్ర అన్నారు. (copyright issues)

...

Read full article

Link to comment
Share on other sites

  • 0

Mahesh Babu: శ్రీమంతుడు వివాదం: మహేశ్ బాబుపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానంటున్న శరత్ చంద్ర

తన కథను కాపీ కొట్టి శ్రీమంతుడు చిత్రాన్ని తీశారంటున్న రచయిత శరత్ చంద్ర

కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు

మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ పై కేసు వేసేందుకు సిద్ధమవుతున్న శరత్ చంద్ర

cr-20240202tn65bc95e9c602c.jpg

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మహేశ్ సరసన శ్రుతిహాసన్ నటించింది. అయితే, ఈ చిత్రం ఇప్పడు వివాదంలో కూరుకుపోయింది. తాను రచించిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల నుంచి ఈ సినిమా కథను మక్కీకి మక్కీ దించేశారని రచయిన శరత్ చంద్ర కోర్టుకెక్కారు. సుప్రీంకోర్టు సైతం కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది. 

ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేశ్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. రచయిత శరత్ చంద్ర మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

...

Read full article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...